Shuru
Apke Nagar Ki App…
*కోటి సంతకాలు బహిరంగ సభ విజయవంతం చేయండి యువనాయకులు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు* శ్రీకాకుళం టౌన్ హాల్ ఈరోజు ప్రెస్ మీట్ జరిగిన తర్వాత 15వ తేదీన జరగబోయే ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటీకరణ కోటి సంతకాల వినతి పత్రాలు పంపించే కార్యక్రమం భాగంగా ఈరోజు *మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ గారు* మరియు జిల్లా పరిశీలకులు *శ్రీ కుంభ రవిబాబు గారు* *యువ నాయకులు ధర్మాన రామ్మోహన్ నాయుడు గారు* స్థల పరిశీలన చేయడం జరిగింది. ఆయనతోపాటు స్టేట్ SEC మెంబర్ చల్ల శ్రీనివాసరావు గారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు గారు మామిడి శ్రీకాంత్ గారు పార్టీ ముఖ్య నాయకులు హాజరు అయినారు.
Dr.Gangu Manmadharao
*కోటి సంతకాలు బహిరంగ సభ విజయవంతం చేయండి యువనాయకులు ధర్మాన రామ్ మనోహర్ నాయుడు* శ్రీకాకుళం టౌన్ హాల్ ఈరోజు ప్రెస్ మీట్ జరిగిన తర్వాత 15వ తేదీన జరగబోయే ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటీకరణ కోటి సంతకాల వినతి పత్రాలు పంపించే కార్యక్రమం భాగంగా ఈరోజు *మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ గారు* మరియు జిల్లా పరిశీలకులు *శ్రీ కుంభ రవిబాబు గారు* *యువ నాయకులు ధర్మాన రామ్మోహన్ నాయుడు గారు* స్థల పరిశీలన చేయడం జరిగింది. ఆయనతోపాటు స్టేట్ SEC మెంబర్ చల్ల శ్రీనివాసరావు గారు మాజీ కార్పొరేషన్ చైర్మన్ అందవరపు సూరిబాబు గారు మామిడి శ్రీకాంత్ గారు పార్టీ ముఖ్య నాయకులు హాజరు అయినారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పాలకొండ డివిజన్ హెడ్ క్వార్టర్ లో గ్యాస్ కష్టాలు వినియోగదారులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆన్లైన్ బుకింగ్ లేనప్పుడు డైరెక్ట్ గా బుక్ తీసుకెళ్తే బుక్ చేసే విధానం తీసుకురావాలని విద్యార్థిదారులు కోరుకుంటున్నారు దీనిపై పాలకొండ సబ్ కలెక్టర్ వారు మరియు తాసిల్దార్ వారు దృష్టి సారించవలసిందిగా కోరుకుంటున్నాం1
- శ్రీకాకుళం జిల్లాపోస్టల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ కల్లేపల్లి గణపతి మృతికి పలువురు యూనియన్ నాయకులు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ వారి కుటుంబానికి సానుభూతిని తెలిపారు. గణపతి భౌతిక కాయానికి పూలమాలేసి, జెండాను కప్పి నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గణపతి సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడిగా ఉంటూ కార్మికుల, కార్మికుల ఉద్యోగుల హక్కుల కోసం నిరంతరము పనిచేసిన ఒక గొప్ప వ్యక్తిని కొనియాడారు. కామ్రేడ్ గణపతి మృతి కార్మిక ఉద్యమానికి తీరనిలోటని అన్నారు. కామ్రేడ్ గణపతి భౌతికాయానికి పలు ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గణపతి భౌతికకాయాన్ని పాలకొండ మండలం కొండాపురం లో అంత్యక్రియలు నిర్వహించారు. అలిండియా పోస్టల్ ఎంప్లాయిస్ యూనియన్ గ్రూపు-సి సర్కిల్ కార్యదర్శి బి.శ్రీధర్ బాబు, మాజీ అధ్యక్షులు డి.మోహనరావు, పి.రామానంద్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు బి.కృష్ణమూర్తి, సాహితీస్రవంతి జిల్లా కన్వీనర్ కె.శ్రీనివాస్, ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక జిల్లా కన్వీనర్ కె.అప్పారావు, సిఐటియు నగర కన్వీనర్ ఆర్.ప్రకాశరావు, పోస్టల్ నాయకులు జ్యోతీశ్వరరావు, కె.చంద్రశేఖర్, వీరభద్రరావు, కె.వెంకటరావు, కె.రమణమూర్తి, శంకర్ నాయుడు, బి.ఎస్.ఎన్.ఎల్ జిల్లా అధ్యక్షులు ఎం.గోవర్థనరావు, సిఐటియు జిల్లా కోశాధికారి ఎ.సత్యం, పెన్సనర్స్ యూనియన్ నాయకులు ఎం.ఆదినారాయణమూర్తి, ఎ.సోమశేఖరరావు, టి.బుజ్జిబాబు, మెడికల్స్ రిప్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వాసుదేవరావు, పోస్టల్ సిబ్బంది, వివిధ ప్రజా సంఘాలనాయకులు పాల్గొన్నారు.4
- విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతంలో అక్రమంగా విక్రయిస్తున్న ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లపై పౌరసరఫరాల శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ తనిఖీలు చేపట్టినట్లు ఏఎస్ఓ శ్రీహరి తెలిపారు. యుద్ధ పరిస్థితుల కారణంగా సిలిండర్ల కొరత ఏర్పడటంతో కొంతమంది గృహ వినియోగ సిలిండర్లను అక్రమంగా విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు దాడులు నిర్వహించారు. గాజువాక సర్కిల్–3 పరిధిలోని మల్కాపురం, శీలానగర్ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టగా, గృహ వినియోగానికి ఇచ్చే సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా అధికారులు మొత్తం 17 ఎల్పీజీ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఓ శ్రీహరి తెలిపారు. స్వాధీనం చేసుకున్న సిలిండర్ల కేసును జాయింట్ కలెక్టర్ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. వ్యాపారాలు నిర్వహించే వారు గృహ వినియోగానికి ఇచ్చే సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.4
- దుర్గం గ్రామం లో మౌలిక వసతుల కొరతతో గ్రామస్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జామిగూడా పంచాయతీ పరిధిలో ఉన్న ఈ గ్రామానికి నేటికీ సరైన రోడ్డు సౌకర్యం లేదు. రోడ్డు లేకపోవడం వల్ల గ్రామస్థులు వైద్యం, విద్య, అత్యవసర అవసరాల కోసం సమీప ప్రాంతాలకు వెళ్లడం చాలా కష్టంగా మారింది. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం మరియు సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రోడ్డు నిర్మాణం చేపట్టి గ్రామానికి మౌలిక వసతులు కల్పించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.1
- నటుడు రామ్ చరణ్ కడియం మండలం మాధవరాయుడు పాలెం సర్పంచ్ అన్నందేవుల చంటి మనవరాలు అతిరతో గురువారం దుబాయ్ నుంచి వీడియో కాల్లో ముచ్చటించారు. చంటి తనయుడు మనీంద్ర, చరణ్ మంచి స్నేహితులు. దుబాయ్స్ ఓ కార్యక్రమానికి హాజరైన రామ్ చరణ్.. మనీంద్రను కలిసి అతిర యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిన్నారితో ఫోన్లో మాట్లాడారు. చరణ్ చిన్నారిని పలకరించిన తీరుపై మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శుక్రవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సిద్ధాంత పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా ముగిశాయని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ రోజు నిర్వహించిన కెమిస్ట్రీ పేపర్–II మరియు కామర్స్ పేపర్–II పరీక్షలకు జిల్లాలో ఏర్పాటు చేసిన 37 పరీక్షా కేంద్రాలలో మొత్తం 7,885 మంది అభ్యర్థులు కేటాయించగా, అందులో 7,641 మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపారు. 244 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు . పరీక్షల సందర్భంగా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు నమోదు కాలేదని తెలిపారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు సమగ్రంగా నిర్వహించబడినట్లు చెప్పారు.2
- Post by Naresh Koppula5
- అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు కేంద్రంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 15వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను జరుపుకున్నారు. పార్టీ స్థాపకులు మరియు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సేవలను స్మరించుకుంటూ, పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను కొనియాడారు. ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు మాట్లాడుతూ, ప్రజల సంక్షేమమే లక్ష్యంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.1