Shuru
Apke Nagar Ki App…
ప్రముఖ వ్యాపారవేత్త,బీసీ నాయకుడు, ఐలాపురం హోటల్స్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ కీ.శే. ఐలాపురం వెంకయ్య గారికి సంతాపం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి.
ప్రజాపతి న్యూస్
ప్రముఖ వ్యాపారవేత్త,బీసీ నాయకుడు, ఐలాపురం హోటల్స్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ కీ.శే. ఐలాపురం వెంకయ్య గారికి సంతాపం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి.
More news from Andhra Pradesh and nearby areas
- ప్రముఖ వ్యాపారవేత్త,బీసీ నాయకుడు, ఐలాపురం హోటల్స్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ కీ.శే. ఐలాపురం వెంకయ్య గారికి సంతాపం వ్యక్తం చేసిన ఆంధ్రప్రదేశ్ శాసనమండలి.1
- పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో గురువారం ఖలీల్ సాహెబ్ కు చెందిన రెండు ఎకరాల మామిడి తోటలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 140 మామిడి చెట్లు దగ్ధమయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.1
- Post by మీ శ్రేయోభిలాషి1
- పొన్నూరులో జరిగింది గ్యాంగ్ వార్ కాదు - సీఐ* గుంటూరు జిల్లా న్యూస్.. పొన్నూరు పట్టణంలో బుధవారం రాత్రి జరిగిన ఘర్షణను సోషల్ మీడియాలో గ్యాంగ్ వార్ గా చిత్రీకరించడాన్ని పొన్నూరు అర్బన్ సీఐ వీరా నాయక్ ఖండించారు. గురువారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో.., వెంకటేష్, ప్రతాపరెడ్డి మినీ లారీలో బాపట్లకు వెళ్తుండగా.., పొన్నూరు అంబేద్కర్ సెంటర్ వద్ద ఉదయ్ భాస్కర్, అజయ్ స్కూటీని ఢీకొట్టడంతో ఈ ఘర్షణ జరిగిందని, ఇది గ్యాంగ్ వార్ కాదని స్పష్టం చేశారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు గాయాలయ్యాయని, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.1
- పాములపాడు లో కులాంతర వివాహం చేసిన ఎమ్మార్పీఎస్ మరియు మాల మహానాడు నాయకులు కోటా ప్రభాకర్ మాదిగ, నల్లమల్ల అబ్రహం మాల నంద్యాల జిల్లా ఎమ్ ఎస్ పి అధికార ప్రతినిధి మరియు నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఇన్చార్జి కోట ప్రభాకర్ మాదిగారు మరియు మాల మహానాడు జాతీయ నాయకులు నల్లమల్ల అబ్రహం మాల గార్ల సమక్షంలో పాములపాడు మండల కేంద్రం చౌడమ్మ గుడి దగ్గర ఎరుకల కులానికి చెందిన దినారి రామకృష్ణ కొడుకు వేణుగోపాల్ నందికొట్కూరు మారుతి నగర్ కు చెందినటువంటి ఓనమాల లక్ష్మీదేవి కుమార్తె శ్రావణి ఇద్దరు గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఫిబ్రవరి 13వ తారీకు అబ్బాయి అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పోలీస్ స్టేషన్ కి వెళ్లడంతో ఈ విషయం తెలుసుకున్న పెద్దలు కులాలు వేరు కావడంతో ఇరుకుటుంబంలో కొంతవరకు ఘర్షణ వాతావరణం నెలకొంది. అమ్మాయి అబ్బాయికి కొన్ని రోజులు కౌన్సెలింగ్కు పంపించారు. అయినా మేము ఒకరికి ఒకరు ఇష్టపడ్డాం మేం కలిసే ఉంటాం అని చెప్పడంతో అమ్మాయి అబ్బాయి ఇద్దరు మేజర్లు కావడంతో రెండు కులాల పెద్దల తో మాట్లాడి వారికి కులాంతర వివాహాన్ని జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందికొట్కూరు నియోజకవర్గం ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు , జడల శ్రీనివాసులు మాదిగారు, మిడుతూరు మండల ఇంచార్జ్ భూపనుపాడు సతీష్ మాదిగ గారు, మిడుతూరు మండలం ఎమ్మెస్పీ అధ్యక్షులు గోపాల వెంకటరమణ గారు, పాములపాడు మండలం ఎమ్మార్పీఎస్ ఉపాధ్యక్షులు కనకం మరిస్వామి గారు చవిటి వెంకటరమణ మరియు ఎరుకల సంఘం కుల పెద్దలు ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొనడం జరిగింది.5
- శ్రీశైలం మల్లన్నను టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.మడకశిర నుంచి ఇరుముడితో వెళ్లి శ్రీశైలం మల్లన్నకు మొక్కులు సమర్పించుకున్నారు. అనంతరం స్వామి వారిని కుటుంబ సమేతంగా వేద పండితులచే ఆశీర్వచనాలు అందుకున్నారు.1
- అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శ్రీ సరస్వతి విద్యా మందిరం విద్యార్థులు ప్లాస్టిక్ నిర్మూలనపై చేపట్టిన ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను వీధుల్లో పడేయడం వల్ల పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్లాస్టిక్ కవర్లను బాటిళ్లలో నింపి అందజేయడంతో చెత్త సేకరణ సులభమవుతుందని, పర్యావరణాన్ని కాపాడవచ్చని విద్యార్థులు వివరించారు. ఈ వినూత్న ఆలోచన పట్ల పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేశారు.1
- చంద్రగిరి కోటలో శ్రీకృష్ణదేవరాయలు విగ్రహ ఏర్పాటుకు కృషి చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే పులివర్తి నాని. పెనుగొండ తరువాత చంద్రగిరి కోటను విజయనగర సామ్రాజ్యం వారు ఇక్కడ నుండి పరిపాలించారు.శ్రీకృష్ణదేవరాయలు వారు జనవరి 17వ తేదీన1471 సంవత్సరంలో జన్మించారు.శ్రీకృష్ణదేవరాయలు వారికి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి చాలా అనుబంధం ఉంది. శ్రీకృష్ణదేవరాయలు వారు శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఏడు వారాల నగలు కూడా సమర్పించడం జరిగింది.రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రగిరి కోటలో శ్రీకృష్ణదేవరాయలు ఏర్పాటు చేయాలని కోరిన ఎమ్మెల్యే పులివర్తి నాని. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం శ్రీకృష్ణదేవరాయల జయంతిని ప్రభుత్వం తరఫున చేయవలసిందిగా అసెంబ్లీలో స్పీకర్ ను కోరిన ఎమ్మెల్యే పులివర్తి నాని. శ్రీకృష్ణదేవరాయల విగ్రహ ఏర్పాటుకు మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే పులివర్తి నానికి తెలిపిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు.1