logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పెద్దమ్మ గుడి నిర్మాణానికి అండగా ఎమ్మెల్యే రోహిత్ రావు ఎం ఎస్ ఎస్ ఓ ద్వారా లక్ష విరాళం పాపన్నపేట మండలం కొడపాక గ్రామంలో పెద్దమ్మ గుడి నిర్మాణానికి అండగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మెదక్ నియోజకవర్గం, పాపన్నపేట మండలం, కొడపాక గ్రామంలో పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తన వంతు సహాయంగా ఎంఎస్ఎస్ఓ ద్వారా రూ. 1,00,000/- ఒక లక్ష రూపాయలు ను ముదిరాజ్ సంఘానికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ... గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం భక్తి భావాన్ని పెంపొందించడమే కాకుండా గ్రామ ఐక్యతకు దోహద పడుతుందని, గుడి నిర్మాణానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు, కుల సంఘాల పెద్దలు మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారు ఇప్పటికే అనేక దేవాలయాలకు, వివిధ కుల సంఘాలకు ఆర్థిక సహాయం అందించారని కొనియాడారు. అమ్మవారి ఆశీస్సులతో ఎమ్మెల్యే గారు ఆయురారోగ్యాలతో బాగుండాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

15 hrs ago
user_మెదక్ న్యూస్
మెదక్ న్యూస్
Medak, Telangana•
15 hrs ago

పెద్దమ్మ గుడి నిర్మాణానికి అండగా ఎమ్మెల్యే రోహిత్ రావు ఎం ఎస్ ఎస్ ఓ ద్వారా లక్ష విరాళం పాపన్నపేట మండలం కొడపాక గ్రామంలో పెద్దమ్మ గుడి నిర్మాణానికి అండగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మెదక్ నియోజకవర్గం, పాపన్నపేట మండలం, కొడపాక గ్రామంలో పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తన వంతు సహాయంగా ఎంఎస్ఎస్ఓ ద్వారా రూ. 1,00,000/- ఒక లక్ష రూపాయలు ను ముదిరాజ్ సంఘానికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ... గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం భక్తి భావాన్ని పెంపొందించడమే కాకుండా గ్రామ ఐక్యతకు దోహద పడుతుందని, గుడి నిర్మాణానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు, కుల సంఘాల పెద్దలు మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారు ఇప్పటికే అనేక దేవాలయాలకు, వివిధ కుల సంఘాలకు ఆర్థిక సహాయం అందించారని కొనియాడారు. అమ్మవారి ఆశీస్సులతో ఎమ్మెల్యే గారు ఆయురారోగ్యాలతో బాగుండాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • పిడుగుపాటు బీభత్సం.. ఇద్దరు రైతులకు గాయాలు సేవాలాల్ ఆలయానికి పాక్షిక నష్టం.. సెల్‌ఫోన్లు పేలడంతో స్పృహ కోల్పోయిన రైతులు కామారెడ్డి: కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో ఆదివారం పిడుగుపాటు తీవ్ర కలకలం రేపింది. గాంధారి దుర్గం రోడ్డు సమీపంలోని సేవాలాల్ ఆలయంపై పిడుగు పడటంతో ఆలయం పాక్షికంగా దెబ్బతింది. ఇదే సమయంలో మండలంలోని బొప్పాజీవాడ శివారులోని పత్తి చేనులో వ్యవసాయ పనులు చేస్తున్న సూర్యకాంత్, శంకర్ వర్షం రావడంతో గొడుగు పట్టుకుని నిల్చున్నారు. అకస్మాత్తుగా పిడుగు పడటంతో వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు పేలినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఇద్దరూ తీవ్ర అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయి కుప్పకూలారు. వెంటనే స్పందించిన స్థానికులు వారిని ఎడ్లబండిపై మెయిన్‌రోడ్డు వరకు తరలించారు. అనంతరం అంబులెన్స్‌లో గాంధారి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితిని పరిశీలించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం వారిని కామారెడ్డి ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఒకే సమయంలో ఆలయంపై పిడుగు పడటం, మరోవైపు ఇద్దరు రైతులు పిడుగుపాటుకు గురికావడంతో బొప్పాజీవాడ పరిసరాల్లో భయాందోళన నెలకొంది.
    1
    పిడుగుపాటు బీభత్సం.. ఇద్దరు రైతులకు గాయాలు
సేవాలాల్ ఆలయానికి పాక్షిక నష్టం.. సెల్‌ఫోన్లు పేలడంతో స్పృహ కోల్పోయిన రైతులు
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో ఆదివారం పిడుగుపాటు తీవ్ర కలకలం రేపింది. గాంధారి దుర్గం రోడ్డు సమీపంలోని సేవాలాల్ ఆలయంపై పిడుగు పడటంతో ఆలయం పాక్షికంగా దెబ్బతింది. ఇదే సమయంలో మండలంలోని బొప్పాజీవాడ శివారులోని పత్తి చేనులో వ్యవసాయ పనులు చేస్తున్న సూర్యకాంత్, శంకర్ వర్షం రావడంతో గొడుగు పట్టుకుని నిల్చున్నారు. అకస్మాత్తుగా పిడుగు పడటంతో వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు పేలినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఇద్దరూ తీవ్ర అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయి కుప్పకూలారు. వెంటనే స్పందించిన స్థానికులు వారిని ఎడ్లబండిపై మెయిన్‌రోడ్డు వరకు తరలించారు. అనంతరం అంబులెన్స్‌లో గాంధారి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితిని పరిశీలించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం వారిని కామారెడ్డి ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం.
ఒకే సమయంలో ఆలయంపై పిడుగు పడటం, మరోవైపు ఇద్దరు రైతులు పిడుగుపాటుకు గురికావడంతో బొప్పాజీవాడ పరిసరాల్లో భయాందోళన నెలకొంది.
    user_Vukkalkar Rajendernath
    Vukkalkar Rajendernath
    ఎల్లారెడ్డి, కామారెడ్డి, తెలంగాణ•
    18 hrs ago
  • జిన్నారం మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం ఉదయం కమ్ముకున్న పొగ మంచు జిన్నారం మున్సిపల్ కేంద్రంలో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో రహదారులపై దృశ్యమానత తగ్గి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. దట్టమైన పొగమంచుతో ఆహ్లాదకరంగా మారిన ప్రకృతి దృశ్యాలను ప్రకృతి ప్రేమికులు సెల్‌ఫోన్లలో బంధించారు.
    1
    జిన్నారం మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం ఉదయం కమ్ముకున్న పొగ మంచు
జిన్నారం మున్సిపల్ కేంద్రంలో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో రహదారులపై దృశ్యమానత తగ్గి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. దట్టమైన పొగమంచుతో ఆహ్లాదకరంగా మారిన ప్రకృతి దృశ్యాలను ప్రకృతి ప్రేమికులు సెల్‌ఫోన్లలో బంధించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    5 hrs ago
  • షాద్ నగర్ చేరుకున్న బీసీ రాజ్యాధికార యాత్ర............ మల్లన్న వెంట అడుగులో అడుగులు వేస్తూ రాజ్యాధికార పోరాటానికి మద్దతు పలుకుతున్న బీసీలు🚩 #bcrajyadhikarayathra #trp #teenmarmallanna
    1
    షాద్ నగర్ చేరుకున్న బీసీ రాజ్యాధికార యాత్ర............
మల్లన్న వెంట అడుగులో అడుగులు వేస్తూ రాజ్యాధికార పోరాటానికి మద్దతు పలుకుతున్న బీసీలు🚩
#bcrajyadhikarayathra #trp #teenmarmallanna
    user_RACHURI ZAKEER PASHA
    RACHURI ZAKEER PASHA
    Press advisory Sangareddy, Telangana•
    20 hrs ago
  • సిరిసిల్లలో చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. సిరిసిల్లలో చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత రంగ అభివృద్ధికి సంఘం మరింత కృషి చేయాలని అన్నారు.
    1
    సిరిసిల్లలో చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం.
సిరిసిల్లలో చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత రంగ అభివృద్ధికి సంఘం మరింత కృషి చేయాలని అన్నారు.
    user_Sircilla jilla updates
    Sircilla jilla updates
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    18 hrs ago
  • భక్తిశ్రద్ధలతో శ్రీ అల్లూరి సీతారామరాజు వినాయక మండలిలో కుంకుమ పూజ రుద్రంగి మండలం మానాల గ్రామంలో శ్రీ అల్లూరి సీతారామరాజు వినాయక మండలి ఆధ్వర్యంలో కుంకుమ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మంగళహారతులతో మండపం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు గణపతి నామస్మరణతో ఉత్సాహంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
    1
    భక్తిశ్రద్ధలతో శ్రీ అల్లూరి సీతారామరాజు వినాయక మండలిలో కుంకుమ పూజ
రుద్రంగి మండలం మానాల గ్రామంలో శ్రీ అల్లూరి సీతారామరాజు వినాయక మండలి ఆధ్వర్యంలో కుంకుమ పూజను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. మంగళహారతులతో మండపం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. భక్తులు గణపతి నామస్మరణతో ఉత్సాహంగా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
    user_Megana valgot
    Megana valgot
    వేములవాడ, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • గిరిజన పోస్టల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాలి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరణం పరణిత పిలుపు ఘనంగా అఖిల భారత పోస్టల్ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం మెదక్ డివిజన్ తొలి సమావేశం. మెదక్‌: అఖిల భారత పోస్టల్ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం మెదక్ డివిజన్‌ మొదటి సమావేశం ఆదివారం మెదక్‌ పట్టణంలోని హెడ్‌ పోస్ట్‌ ఆఫీస్‌లో ఘనంగా నిర్వహించారు. సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పోస్టల్‌ శాఖలో పనిచేస్తున్న గిరిజన ఉద్యోగులు, సంఘం ప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కరణం పరిణీత, రవి నాయక్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులకు సంఘం నాయకులు, సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోస్టల్‌ శాఖలో విధులు నిర్వహిస్తున్న గిరిజన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సంఘటితంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగుల హక్కులు, సంక్షేమం, సామాజిక భద్రత, ఉద్యోగ పరమైన సమస్యల పరిష్కారం వంటి అంశాలపై సంఘం నిరంతరం కృషి చేయాలని సూచించారు. గిరిజన ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత సంఘంపై ఉందన్నారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు వారి కుటుంబాల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.సంఘం మెదక్‌ డివిజన్‌ తొలి కాన్ఫరెన్స్‌ నిర్వహించడం పట్ల నాయకులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో సంఘాన్ని మరింత బలోపేతం చేసి, పోస్టల్‌ శాఖలో పనిచేస్తున్న గిరిజన ఉద్యోగులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలని ఆకాంక్షించారు.అనంతరం సంఘం భవిష్యత్‌ కార్యాచరణ, ఉద్యోగుల సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలు, సంఘం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కార్యక్రమంలో పోస్టల్‌ ఉద్యోగులు, సంఘం నాయకులు, ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
    1
    గిరిజన
 పోస్టల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాలి
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరణం పరణిత పిలుపు
ఘనంగా అఖిల భారత పోస్టల్ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం మెదక్ డివిజన్ తొలి సమావేశం.
మెదక్‌: అఖిల భారత పోస్టల్ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం మెదక్ డివిజన్‌ మొదటి సమావేశం ఆదివారం మెదక్‌ పట్టణంలోని హెడ్‌ పోస్ట్‌ ఆఫీస్‌లో ఘనంగా నిర్వహించారు. సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పోస్టల్‌ శాఖలో పనిచేస్తున్న గిరిజన ఉద్యోగులు, సంఘం ప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కరణం పరిణీత, రవి నాయక్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులకు సంఘం నాయకులు, సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోస్టల్‌ శాఖలో విధులు నిర్వహిస్తున్న గిరిజన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సంఘటితంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగుల హక్కులు, సంక్షేమం, సామాజిక భద్రత, ఉద్యోగ పరమైన సమస్యల పరిష్కారం వంటి అంశాలపై సంఘం నిరంతరం కృషి చేయాలని సూచించారు. గిరిజన ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత సంఘంపై ఉందన్నారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు వారి కుటుంబాల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.సంఘం మెదక్‌ డివిజన్‌ తొలి కాన్ఫరెన్స్‌ నిర్వహించడం పట్ల నాయకులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో సంఘాన్ని మరింత బలోపేతం చేసి, పోస్టల్‌ శాఖలో పనిచేస్తున్న గిరిజన ఉద్యోగులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలని ఆకాంక్షించారు.అనంతరం సంఘం భవిష్యత్‌ కార్యాచరణ, ఉద్యోగుల సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలు, సంఘం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కార్యక్రమంలో పోస్టల్‌ ఉద్యోగులు, సంఘం నాయకులు, ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    18 hrs ago
  • పాపన్నపేట రైతులకు 12 గంటల కరెంట్‌ ఇవ్వాలి : ఎమ్మెల్యే రోహిత్ పాపన్నపేట మండలంలో వ్యవసాయానికి రోజుకు 12 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని ఎమ్మెల్యే రోహిత్‌ TGSPDCL సీఎండీని కోరారు. మండలంలోని రైతులకు ప్రస్తుతం 8–9 గంటల మేరకే విద్యుత్‌ అందుతోందని, దీంతో సాగులో ఉన్న పంటలకు నీరందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా మండలంలో వరి సాగు విస్తీర్ణం అధికంగా ఉన్నందున నిరంతర విద్యుత్‌ సరఫరా ఎంతో అవసరమని తెలిపారు. దీనిపై సీఎండీతో ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే, రైతుల ఇబ్బందులను పరిష్కరించేలా వెంటనే 12 గంటల కరెంట్‌ అందించాలని కోరారు. స్పందించిన సీఎండీ సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
    1
    పాపన్నపేట రైతులకు 12 గంటల కరెంట్‌ ఇవ్వాలి : ఎమ్మెల్యే రోహిత్
పాపన్నపేట మండలంలో వ్యవసాయానికి రోజుకు 12 గంటల విద్యుత్‌ సరఫరా చేయాలని ఎమ్మెల్యే రోహిత్‌ TGSPDCL సీఎండీని కోరారు. మండలంలోని రైతులకు ప్రస్తుతం 8–9 గంటల మేరకే విద్యుత్‌ అందుతోందని, దీంతో సాగులో ఉన్న పంటలకు నీరందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని సీఎండీ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా మండలంలో వరి సాగు విస్తీర్ణం అధికంగా ఉన్నందున నిరంతర విద్యుత్‌ సరఫరా ఎంతో అవసరమని తెలిపారు. దీనిపై సీఎండీతో ఫోన్‌లో మాట్లాడిన ఎమ్మెల్యే, రైతుల ఇబ్బందులను పరిష్కరించేలా వెంటనే 12 గంటల కరెంట్‌ అందించాలని కోరారు. స్పందించిన సీఎండీ సానుకూలంగా స్పందించి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    18 hrs ago
  • ఎల్లారెడ్డిపేట లో దంచి కొట్టిన వాన జలకలను సంతరించుకున్న చెరువులు కుంటలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పాటు ఆయా గ్రామాలలో భారీ వర్షం కురిసింది దేనితో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఏకధాటివిగా కురిసిన వర్షాలకు స్థానిక చెరువులు జలకలను సంతరించుకున్నాయి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
    1
    ఎల్లారెడ్డిపేట లో దంచి కొట్టిన వాన జలకలను సంతరించుకున్న చెరువులు కుంటలు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పాటు ఆయా గ్రామాలలో భారీ వర్షం కురిసింది దేనితో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఏకధాటివిగా కురిసిన వర్షాలకు స్థానిక చెరువులు జలకలను సంతరించుకున్నాయి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
    user_Prime 9
    Prime 9
    Dairy farm ఎల్లారెడ్డిపేట, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    4 hrs ago
  • తృటిలో తప్పిన ప్రమాదం.. బస్సు కిందకు దూసుకెళ్లిన స్కూటీ తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద సోమవారం భారీ ప్రమాదం తృటిలో తప్పింది. గజ్వేల్‌ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు చౌరస్తా వద్ద మలుపు తిరుగుతుండగా.. అదే సమయంలో బస్సు పక్కనుంచి వెళ్తున్న స్కూటీ ఒక్కసారిగా బస్సు కిందకు వెళ్లింది. ప్రమాదాన్ని గుర్తించిన స్కూటీదారుడు వెంటనే వాహనం నుంచి పక్కకు దూకడంతో సురక్షితంగా బయటపడ్డాడు. అనంతరం బస్సును నిలిపివేసి, కొంతసేపు శ్రమించి స్కూటీని బయటకు తీశారు. దీంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు.
    1
    తృటిలో తప్పిన ప్రమాదం.. బస్సు కిందకు దూసుకెళ్లిన స్కూటీ
తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద సోమవారం భారీ ప్రమాదం తృటిలో తప్పింది. గజ్వేల్‌ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు చౌరస్తా వద్ద మలుపు తిరుగుతుండగా.. అదే సమయంలో బస్సు పక్కనుంచి వెళ్తున్న స్కూటీ ఒక్కసారిగా బస్సు కిందకు వెళ్లింది. ప్రమాదాన్ని గుర్తించిన స్కూటీదారుడు వెంటనే వాహనం నుంచి పక్కకు దూకడంతో సురక్షితంగా బయటపడ్డాడు. అనంతరం బస్సును నిలిపివేసి, కొంతసేపు శ్రమించి స్కూటీని బయటకు తీశారు. దీంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.