logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

గిరిజన పోస్టల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాలి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరణం పరణిత పిలుపు ఘనంగా అఖిల భారత పోస్టల్ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం మెదక్ డివిజన్ తొలి సమావేశం. మెదక్‌: అఖిల భారత పోస్టల్ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం మెదక్ డివిజన్‌ మొదటి సమావేశం ఆదివారం మెదక్‌ పట్టణంలోని హెడ్‌ పోస్ట్‌ ఆఫీస్‌లో ఘనంగా నిర్వహించారు. సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పోస్టల్‌ శాఖలో పనిచేస్తున్న గిరిజన ఉద్యోగులు, సంఘం ప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కరణం పరిణీత, రవి నాయక్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులకు సంఘం నాయకులు, సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోస్టల్‌ శాఖలో విధులు నిర్వహిస్తున్న గిరిజన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సంఘటితంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగుల హక్కులు, సంక్షేమం, సామాజిక భద్రత, ఉద్యోగ పరమైన సమస్యల పరిష్కారం వంటి అంశాలపై సంఘం నిరంతరం కృషి చేయాలని సూచించారు. గిరిజన ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత సంఘంపై ఉందన్నారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు వారి కుటుంబాల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.సంఘం మెదక్‌ డివిజన్‌ తొలి కాన్ఫరెన్స్‌ నిర్వహించడం పట్ల నాయకులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో సంఘాన్ని మరింత బలోపేతం చేసి, పోస్టల్‌ శాఖలో పనిచేస్తున్న గిరిజన ఉద్యోగులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలని ఆకాంక్షించారు.అనంతరం సంఘం భవిష్యత్‌ కార్యాచరణ, ఉద్యోగుల సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలు, సంఘం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కార్యక్రమంలో పోస్టల్‌ ఉద్యోగులు, సంఘం నాయకులు, ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

19 hrs ago
user_మెదక్ న్యూస్
మెదక్ న్యూస్
Medak, Telangana•
19 hrs ago

గిరిజన పోస్టల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాలి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరణం పరణిత పిలుపు ఘనంగా అఖిల భారత పోస్టల్ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం మెదక్ డివిజన్ తొలి సమావేశం. మెదక్‌: అఖిల భారత పోస్టల్ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం మెదక్ డివిజన్‌ మొదటి సమావేశం ఆదివారం మెదక్‌ పట్టణంలోని హెడ్‌ పోస్ట్‌ ఆఫీస్‌లో ఘనంగా నిర్వహించారు. సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పోస్టల్‌ శాఖలో పనిచేస్తున్న గిరిజన ఉద్యోగులు, సంఘం ప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కరణం పరిణీత, రవి నాయక్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులకు సంఘం నాయకులు, సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోస్టల్‌ శాఖలో విధులు నిర్వహిస్తున్న గిరిజన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సంఘటితంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగుల హక్కులు, సంక్షేమం, సామాజిక భద్రత, ఉద్యోగ పరమైన సమస్యల పరిష్కారం వంటి అంశాలపై సంఘం నిరంతరం కృషి చేయాలని సూచించారు. గిరిజన ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత సంఘంపై ఉందన్నారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు వారి కుటుంబాల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.సంఘం మెదక్‌ డివిజన్‌ తొలి కాన్ఫరెన్స్‌ నిర్వహించడం పట్ల నాయకులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో సంఘాన్ని మరింత బలోపేతం చేసి, పోస్టల్‌ శాఖలో పనిచేస్తున్న గిరిజన ఉద్యోగులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలని ఆకాంక్షించారు.అనంతరం సంఘం భవిష్యత్‌ కార్యాచరణ, ఉద్యోగుల సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలు, సంఘం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కార్యక్రమంలో పోస్టల్‌ ఉద్యోగులు, సంఘం నాయకులు, ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

More news from Telangana and nearby areas
  • పెద్దమ్మ గుడి నిర్మాణానికి అండగా ఎమ్మెల్యే రోహిత్ రావు ఎం ఎస్ ఎస్ ఓ ద్వారా లక్ష విరాళం పాపన్నపేట మండలం కొడపాక గ్రామంలో పెద్దమ్మ గుడి నిర్మాణానికి అండగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మెదక్ నియోజకవర్గం, పాపన్నపేట మండలం, కొడపాక గ్రామంలో పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తన వంతు సహాయంగా ఎంఎస్ఎస్ఓ ద్వారా రూ. 1,00,000/- ఒక లక్ష రూపాయలు ను ముదిరాజ్ సంఘానికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ... గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం భక్తి భావాన్ని పెంపొందించడమే కాకుండా గ్రామ ఐక్యతకు దోహద పడుతుందని, గుడి నిర్మాణానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు, కుల సంఘాల పెద్దలు మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారు ఇప్పటికే అనేక దేవాలయాలకు, వివిధ కుల సంఘాలకు ఆర్థిక సహాయం అందించారని కొనియాడారు. అమ్మవారి ఆశీస్సులతో ఎమ్మెల్యే గారు ఆయురారోగ్యాలతో బాగుండాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    1
    పెద్దమ్మ గుడి నిర్మాణానికి అండగా ఎమ్మెల్యే రోహిత్ రావు ఎం ఎస్ ఎస్ ఓ ద్వారా  లక్ష విరాళం 
పాపన్నపేట మండలం కొడపాక గ్రామంలో పెద్దమ్మ గుడి నిర్మాణానికి అండగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు
మెదక్ నియోజకవర్గం, పాపన్నపేట మండలం, కొడపాక గ్రామంలో పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తన వంతు సహాయంగా  ఎంఎస్ఎస్ఓ ద్వారా రూ. 1,00,000/- ఒక లక్ష రూపాయలు ను ముదిరాజ్ సంఘానికి అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ... గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం భక్తి భావాన్ని పెంపొందించడమే కాకుండా గ్రామ ఐక్యతకు దోహద పడుతుందని, గుడి నిర్మాణానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు, కుల సంఘాల పెద్దలు మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారు ఇప్పటికే అనేక దేవాలయాలకు, వివిధ కుల సంఘాలకు ఆర్థిక సహాయం అందించారని కొనియాడారు. అమ్మవారి ఆశీస్సులతో ఎమ్మెల్యే గారు ఆయురారోగ్యాలతో బాగుండాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    16 hrs ago
  • సదాశివనగర్ మండలం పద్మాజివాడి విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి సదాశివనగర్: విద్యుత్ కోతలకు నిరసనగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను గ్రామస్తులు ముట్టడించారు. ఏఈ, డీఈలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. లైన్మెన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని, తరచూ విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరారు.
    1
    సదాశివనగర్ మండలం పద్మాజివాడి విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి
సదాశివనగర్: విద్యుత్ కోతలకు నిరసనగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను గ్రామస్తులు ముట్టడించారు. ఏఈ, డీఈలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. లైన్మెన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని, తరచూ విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరారు.
    user_Vukkalkar Rajendernath
    Vukkalkar Rajendernath
    ఎల్లారెడ్డి, కామారెడ్డి, తెలంగాణ•
    16 min ago
  • ధరిపల్లిలో విషాద ఘటన, ఇల్లు లేక.. శ్మశానవాటికలోనే అంత్యక్రియలు చిన్నశంకరంపేట మండలం ధరిపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంగిరెద్దుల లక్ష్మి (65) అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం మెదక్ ఆస్పత్రిలో మృతిచెందింది. భర్త నర్సింహులు తొమ్మిదేళ్ల క్రితమే మృతిచెందగా.. కుమార్తె పూజతో కలిసి లక్ష్మి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించింది. కుటుంబానికి సొంత ఇల్లు లేకపోవడంతో లక్ష్మి మృతదేహాన్ని శ్మశానవాటికలోనే ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. తమకు ప్రభుత్వం సొంత ఇల్లు మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.
    1
    ధరిపల్లిలో విషాద ఘటన, ఇల్లు లేక.. శ్మశానవాటికలోనే అంత్యక్రియలు
చిన్నశంకరంపేట మండలం ధరిపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంగిరెద్దుల లక్ష్మి (65) అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం మెదక్ ఆస్పత్రిలో మృతిచెందింది. భర్త నర్సింహులు తొమ్మిదేళ్ల క్రితమే మృతిచెందగా.. కుమార్తె పూజతో కలిసి లక్ష్మి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించింది. కుటుంబానికి సొంత ఇల్లు లేకపోవడంతో లక్ష్మి మృతదేహాన్ని శ్మశానవాటికలోనే ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. తమకు ప్రభుత్వం సొంత ఇల్లు మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    1 hr ago
  • శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారదు శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారదు
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    6 hrs ago
  • రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో...జనము గల్ల ఉయ్యాలో జెండాలెత్తి ఉయ్యాలో... #bcrajyadhikarayathra #relareganga #newsong
    1
    రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో...జనము గల్ల ఉయ్యాలో జెండాలెత్తి ఉయ్యాలో...
#bcrajyadhikarayathra #relareganga #newsong
    user_RACHURI ZAKEER PASHA
    RACHURI ZAKEER PASHA
    Press advisory Sangareddy, Telangana•
    16 hrs ago
  • కన్నుల పండుగగా శ్రీనివాస కల్యాణ మహోత్సవం ముఖ్యఅతిథిగా మహిళా కమిషన్ సభ్యురాలు గోక శశికళ యాదవ్‌రెడ్డి అనిరుద్‌రెడ్డి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహణ వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణం భక్తులతో మమేకమైన మహిళా కమిషన్ సభ్యురాలు అమీన్పూర్, శురు ప్రతినిధి సెప్టెంబర్ 20: అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ఓడీఎఫ్ కాలనీలో శ్రీనివాస కల్యాణ మహోత్సవం శనివారం కన్నుల పండుగగా, భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. అమీన్పూర్ మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ యువ నాయకుడు గోక అనిరుద్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించారు. చందానగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయ పురోహితులు సాయి పంతులు ఆధ్వర్యంలో శ్రీనివాస స్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కల్యాణ వేడుకలు వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగింది. కల్యాణ మహోత్సవంలో గోక అనిరుద్‌రెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహిళా కమిషన్ సభ్యురాలు గోక శశికళ యాదవ్‌రెడ్డి హాజరయ్యారు. ఆమె శ్రీనివాస స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలనీవాసులు, భక్తులతో మమేకమై వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకుని ప్రజలతో మాట్లాడారు. భక్తులతో కలిసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పాటలు పాడి అందరిని అలరించారు.  శ్రీనివాస కల్యాణ మహోత్సవం సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సన్మానించారు. ఉత్సవాల నిర్వహణలో వారు చేసిన సేవలను అభినందిస్తూ సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. కాలనీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ప్రజల్లో ఐక్యత, సోదరభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఈ  కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు
    1
    కన్నుల పండుగగా శ్రీనివాస కల్యాణ మహోత్సవం


ముఖ్యఅతిథిగా మహిళా కమిషన్ సభ్యురాలు గోక శశికళ యాదవ్‌రెడ్డి


అనిరుద్‌రెడ్డి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహణ


వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణం


భక్తులతో మమేకమైన మహిళా కమిషన్ సభ్యురాలు


అమీన్పూర్, శురు ప్రతినిధి సెప్టెంబర్ 20: అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ఓడీఎఫ్ కాలనీలో శ్రీనివాస కల్యాణ మహోత్సవం శనివారం కన్నుల పండుగగా, భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. అమీన్పూర్ మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ యువ నాయకుడు గోక అనిరుద్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించారు. చందానగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయ పురోహితులు సాయి పంతులు ఆధ్వర్యంలో శ్రీనివాస స్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కల్యాణ వేడుకలు వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగింది.
కల్యాణ మహోత్సవంలో గోక అనిరుద్‌రెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహిళా కమిషన్ సభ్యురాలు గోక శశికళ యాదవ్‌రెడ్డి హాజరయ్యారు. ఆమె శ్రీనివాస స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలనీవాసులు, భక్తులతో మమేకమై వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకుని ప్రజలతో మాట్లాడారు. భక్తులతో కలిసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పాటలు పాడి అందరిని అలరించారు.  శ్రీనివాస కల్యాణ మహోత్సవం సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సన్మానించారు. ఉత్సవాల నిర్వహణలో వారు చేసిన సేవలను అభినందిస్తూ సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. కాలనీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ప్రజల్లో ఐక్యత, సోదరభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఈ  కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు
    user_MUKKAGALLA YADANNA
    MUKKAGALLA YADANNA
    Local News Reporter అమీన్‌పూర్, సంగారెడ్డి, తెలంగాణ•
    18 hrs ago
  • వేములవాడ రాజన్న క్షేత్రంలో వైభవంగా 7వ రోజు గణపతి నవరాత్రులు ఏకాంతంగా మూలవిరాట్‌కు విశేష పూజలు.. భీమేశ్వర ఆలయంలో భక్తులకు సిద్ధిబుద్ధి వినాయకుడి దర్శనం ఘనంగా లక్ష్మీ గణపతికి ఉపనిషత్ పారాయణ అభిషేకాలు, అమ్మవారికి ఉపచార పూజలు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, అనుబంధ ఆలయాలలో గణేశ నవరాత్రి మహోత్సవాలు 7వ రోజు వైభవంగా కొనసాగాయి. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో మూలవిరాట్ ఆంతరంగిక ఆలయంలో అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా విశేష పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల దర్శనార్థం అనుబంధ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ మండపంలో మట్టితో రూపొందించిన సిద్ధిబుద్ధి సమేత వినాయకుడికి నిత్య పూజలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఉదయం ఆంతరంగిక ఆలయంలో మూలవిరాట్ రాజరాజేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఎనిమిది మంది బ్రాహ్మణుల చేత లక్ష్మీ గణపతికి గణేశ ఉపనిషత్ పారాయణంతో విశేష అభిషేకాలు, పార్వతీ రాజరాజేశ్వరి దేవికి ఉపచార పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. అలాగే భీమేశ్వర ఆలయంలో కొలువుదీరిన మట్టి గణపతికి ఉదయం ప్రాతఃకాల పూజలు, సాయంత్రం వేళల్లో షోడశోపచార పూజలు వైభవంగా నిర్వహించారు. స్వామివారికి నైవేద్యాలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారి అంతరాలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, అమ్మవారికి ఉపచార పూజలు ఏకాంతంగా కొనసాగుతాయని తెలిపారు. భీమేశ్వర ఆలయంలోని మట్టి వినాయకుడికి రోజూ షోడశోపచార పూజలు జరుగుతాయని పేర్కొన్నారు. భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు మంత్ర అనుష్ఠానాలతో విశేష హోమం, ద్వాదశి నాడు పూర్ణాహుతి నిర్వహించి స్వామివారి నిమజ్జనం జరుపుతామని వెల్లడించారు. భక్తులు భీమేశ్వర ఆలయంలో కొలువుదీరిన సిద్ధిబుద్ధి సమేత వినాయకుడిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ వేడుకల్లో ఆలయ అధికారులు, అర్చక బృందం, వేద పండితులు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు.
    1
    వేములవాడ రాజన్న క్షేత్రంలో వైభవంగా 7వ రోజు గణపతి నవరాత్రులు 
ఏకాంతంగా మూలవిరాట్‌కు విశేష పూజలు.. భీమేశ్వర ఆలయంలో భక్తులకు సిద్ధిబుద్ధి వినాయకుడి దర్శనం
ఘనంగా లక్ష్మీ గణపతికి ఉపనిషత్ పారాయణ అభిషేకాలు, అమ్మవారికి ఉపచార పూజలు
దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, అనుబంధ ఆలయాలలో గణేశ నవరాత్రి మహోత్సవాలు 7వ రోజు వైభవంగా కొనసాగాయి. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో మూలవిరాట్ ఆంతరంగిక ఆలయంలో అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా విశేష పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల దర్శనార్థం అనుబంధ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ మండపంలో మట్టితో రూపొందించిన సిద్ధిబుద్ధి సమేత వినాయకుడికి నిత్య పూజలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. 
ఉదయం ఆంతరంగిక ఆలయంలో మూలవిరాట్ రాజరాజేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఎనిమిది మంది బ్రాహ్మణుల చేత లక్ష్మీ గణపతికి గణేశ ఉపనిషత్ పారాయణంతో విశేష అభిషేకాలు, పార్వతీ రాజరాజేశ్వరి దేవికి ఉపచార పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. అలాగే భీమేశ్వర ఆలయంలో కొలువుదీరిన మట్టి గణపతికి ఉదయం ప్రాతఃకాల పూజలు, సాయంత్రం వేళల్లో షోడశోపచార పూజలు వైభవంగా నిర్వహించారు. 
స్వామివారికి నైవేద్యాలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారి అంతరాలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, అమ్మవారికి ఉపచార పూజలు ఏకాంతంగా కొనసాగుతాయని తెలిపారు. భీమేశ్వర ఆలయంలోని మట్టి వినాయకుడికి రోజూ షోడశోపచార పూజలు జరుగుతాయని పేర్కొన్నారు. భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు మంత్ర అనుష్ఠానాలతో విశేష హోమం, ద్వాదశి నాడు పూర్ణాహుతి నిర్వహించి స్వామివారి నిమజ్జనం జరుపుతామని వెల్లడించారు. భక్తులు భీమేశ్వర ఆలయంలో కొలువుదీరిన సిద్ధిబుద్ధి సమేత వినాయకుడిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
ఈ వేడుకల్లో ఆలయ అధికారులు, అర్చక బృందం, వేద పండితులు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    18 hrs ago
  • మెదక్ కోలిగడ్డ నేతాజీ గణేష్ మండలి వద్ద ఆదివారం ప్రత్యేక పూజలు పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ దంపతులు. నేతాజీ గణేష్ మండలికొలిగడ్డ వద్ద మెదక్ జిల్లా కలెక్టర్ దంపతులుఆదివారంజరిగిన ప్రత్యేకపూజలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లా ప్రజలు సుఖశాంతులతో పాడిపంటలతో ఆరోగ్యవంతమైన జీవనం గాడు పాలనికోరారు. జిల్లా అన్నిరంగల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేలా విజ్ఞాలు కలగకుండా చూడాలని కోరారు.
    1
    మెదక్ కోలిగడ్డ నేతాజీ గణేష్ మండలి వద్ద ఆదివారం ప్రత్యేక పూజలు పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ దంపతులు.
నేతాజీ గణేష్ మండలికొలిగడ్డ వద్ద మెదక్ జిల్లా కలెక్టర్ దంపతులుఆదివారంజరిగిన ప్రత్యేకపూజలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లా ప్రజలు సుఖశాంతులతో పాడిపంటలతో ఆరోగ్యవంతమైన జీవనం గాడు పాలనికోరారు. జిల్లా అన్నిరంగల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేలా విజ్ఞాలు కలగకుండా చూడాలని కోరారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.