logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

మెదక్ కోలిగడ్డ నేతాజీ గణేష్ మండలి వద్ద ఆదివారం ప్రత్యేక పూజలు పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ దంపతులు. నేతాజీ గణేష్ మండలికొలిగడ్డ వద్ద మెదక్ జిల్లా కలెక్టర్ దంపతులుఆదివారంజరిగిన ప్రత్యేకపూజలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లా ప్రజలు సుఖశాంతులతో పాడిపంటలతో ఆరోగ్యవంతమైన జీవనం గాడు పాలనికోరారు. జిల్లా అన్నిరంగల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేలా విజ్ఞాలు కలగకుండా చూడాలని కోరారు.

17 hrs ago
user_మెదక్ న్యూస్
మెదక్ న్యూస్
Medak, Telangana•
17 hrs ago

మెదక్ కోలిగడ్డ నేతాజీ గణేష్ మండలి వద్ద ఆదివారం ప్రత్యేక పూజలు పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ దంపతులు. నేతాజీ గణేష్ మండలికొలిగడ్డ వద్ద మెదక్ జిల్లా కలెక్టర్ దంపతులుఆదివారంజరిగిన ప్రత్యేకపూజలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లా ప్రజలు సుఖశాంతులతో పాడిపంటలతో ఆరోగ్యవంతమైన జీవనం గాడు పాలనికోరారు. జిల్లా అన్నిరంగల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేలా విజ్ఞాలు కలగకుండా చూడాలని కోరారు.

More news from Telangana and nearby areas
  • పెద్దమ్మ గుడి నిర్మాణానికి అండగా ఎమ్మెల్యే రోహిత్ రావు ఎం ఎస్ ఎస్ ఓ ద్వారా లక్ష విరాళం పాపన్నపేట మండలం కొడపాక గ్రామంలో పెద్దమ్మ గుడి నిర్మాణానికి అండగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మెదక్ నియోజకవర్గం, పాపన్నపేట మండలం, కొడపాక గ్రామంలో పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తన వంతు సహాయంగా ఎంఎస్ఎస్ఓ ద్వారా రూ. 1,00,000/- ఒక లక్ష రూపాయలు ను ముదిరాజ్ సంఘానికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ... గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం భక్తి భావాన్ని పెంపొందించడమే కాకుండా గ్రామ ఐక్యతకు దోహద పడుతుందని, గుడి నిర్మాణానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు, కుల సంఘాల పెద్దలు మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారు ఇప్పటికే అనేక దేవాలయాలకు, వివిధ కుల సంఘాలకు ఆర్థిక సహాయం అందించారని కొనియాడారు. అమ్మవారి ఆశీస్సులతో ఎమ్మెల్యే గారు ఆయురారోగ్యాలతో బాగుండాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    1
    పెద్దమ్మ గుడి నిర్మాణానికి అండగా ఎమ్మెల్యే రోహిత్ రావు ఎం ఎస్ ఎస్ ఓ ద్వారా  లక్ష విరాళం 
పాపన్నపేట మండలం కొడపాక గ్రామంలో పెద్దమ్మ గుడి నిర్మాణానికి అండగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు
మెదక్ నియోజకవర్గం, పాపన్నపేట మండలం, కొడపాక గ్రామంలో పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తన వంతు సహాయంగా  ఎంఎస్ఎస్ఓ ద్వారా రూ. 1,00,000/- ఒక లక్ష రూపాయలు ను ముదిరాజ్ సంఘానికి అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ... గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం భక్తి భావాన్ని పెంపొందించడమే కాకుండా గ్రామ ఐక్యతకు దోహద పడుతుందని, గుడి నిర్మాణానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు, కుల సంఘాల పెద్దలు మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారు ఇప్పటికే అనేక దేవాలయాలకు, వివిధ కుల సంఘాలకు ఆర్థిక సహాయం అందించారని కొనియాడారు. అమ్మవారి ఆశీస్సులతో ఎమ్మెల్యే గారు ఆయురారోగ్యాలతో బాగుండాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    16 hrs ago
  • వెల్దుర్తిలో విద్యుత్ సమస్యలు నెలల తరబడి పరిష్కారం కావడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సమస్యలు నెలల తరబడి పరిష్కారం కావడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలస్థాయి సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ.. అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు మంజూరు చేయడంలో జాప్యం జరుగుతోందని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సకాలంలో స్పందించడం లేదని ఆరోపించారు. మండల విద్యుత్ అధికారి పెంట్యా నాయక్‌ స్పందన సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో విద్యుత్ అంతరాయాలు, స్తంభాల కొరత వంటి సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని కోరారు. ఇకనైనా ఏఈ స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సర్పంచులు డిమాండ్ చేశారు.
    1
    వెల్దుర్తిలో విద్యుత్ సమస్యలు నెలల తరబడి పరిష్కారం కావడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం 
వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సమస్యలు నెలల తరబడి పరిష్కారం కావడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలస్థాయి సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ.. అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు మంజూరు చేయడంలో జాప్యం జరుగుతోందని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సకాలంలో స్పందించడం లేదని ఆరోపించారు. మండల విద్యుత్ అధికారి పెంట్యా నాయక్‌ స్పందన సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో విద్యుత్ అంతరాయాలు, స్తంభాల కొరత వంటి సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని కోరారు. ఇకనైనా ఏఈ స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సర్పంచులు డిమాండ్ చేశారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    17 min ago
  • సదాశివనగర్ మండలం పద్మాజివాడి విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి సదాశివనగర్: విద్యుత్ కోతలకు నిరసనగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను గ్రామస్తులు ముట్టడించారు. ఏఈ, డీఈలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. లైన్మెన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని, తరచూ విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరారు.
    1
    సదాశివనగర్ మండలం పద్మాజివాడి విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి
సదాశివనగర్: విద్యుత్ కోతలకు నిరసనగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను గ్రామస్తులు ముట్టడించారు. ఏఈ, డీఈలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. లైన్మెన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని, తరచూ విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరారు.
    user_Vukkalkar Rajendernath
    Vukkalkar Rajendernath
    ఎల్లారెడ్డి, కామారెడ్డి, తెలంగాణ•
    57 min ago
  • శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారదు శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    1
    శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారదు
శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    6 hrs ago
  • రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో...జనము గల్ల ఉయ్యాలో జెండాలెత్తి ఉయ్యాలో... #bcrajyadhikarayathra #relareganga #newsong
    1
    రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో...జనము గల్ల ఉయ్యాలో జెండాలెత్తి ఉయ్యాలో...
#bcrajyadhikarayathra #relareganga #newsong
    user_RACHURI ZAKEER PASHA
    RACHURI ZAKEER PASHA
    Press advisory Sangareddy, Telangana•
    17 hrs ago
  • కన్నుల పండుగగా శ్రీనివాస కల్యాణ మహోత్సవం ముఖ్యఅతిథిగా మహిళా కమిషన్ సభ్యురాలు గోక శశికళ యాదవ్‌రెడ్డి అనిరుద్‌రెడ్డి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహణ వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణం భక్తులతో మమేకమైన మహిళా కమిషన్ సభ్యురాలు అమీన్పూర్, శురు ప్రతినిధి సెప్టెంబర్ 20: అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ఓడీఎఫ్ కాలనీలో శ్రీనివాస కల్యాణ మహోత్సవం శనివారం కన్నుల పండుగగా, భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. అమీన్పూర్ మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ యువ నాయకుడు గోక అనిరుద్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించారు. చందానగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయ పురోహితులు సాయి పంతులు ఆధ్వర్యంలో శ్రీనివాస స్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కల్యాణ వేడుకలు వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగింది. కల్యాణ మహోత్సవంలో గోక అనిరుద్‌రెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహిళా కమిషన్ సభ్యురాలు గోక శశికళ యాదవ్‌రెడ్డి హాజరయ్యారు. ఆమె శ్రీనివాస స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలనీవాసులు, భక్తులతో మమేకమై వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకుని ప్రజలతో మాట్లాడారు. భక్తులతో కలిసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పాటలు పాడి అందరిని అలరించారు.  శ్రీనివాస కల్యాణ మహోత్సవం సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సన్మానించారు. ఉత్సవాల నిర్వహణలో వారు చేసిన సేవలను అభినందిస్తూ సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. కాలనీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ప్రజల్లో ఐక్యత, సోదరభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఈ  కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు
    1
    కన్నుల పండుగగా శ్రీనివాస కల్యాణ మహోత్సవం


ముఖ్యఅతిథిగా మహిళా కమిషన్ సభ్యురాలు గోక శశికళ యాదవ్‌రెడ్డి


అనిరుద్‌రెడ్డి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహణ


వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణం


భక్తులతో మమేకమైన మహిళా కమిషన్ సభ్యురాలు


అమీన్పూర్, శురు ప్రతినిధి సెప్టెంబర్ 20: అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ఓడీఎఫ్ కాలనీలో శ్రీనివాస కల్యాణ మహోత్సవం శనివారం కన్నుల పండుగగా, భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. అమీన్పూర్ మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ యువ నాయకుడు గోక అనిరుద్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించారు. చందానగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయ పురోహితులు సాయి పంతులు ఆధ్వర్యంలో శ్రీనివాస స్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కల్యాణ వేడుకలు వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగింది.
కల్యాణ మహోత్సవంలో గోక అనిరుద్‌రెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహిళా కమిషన్ సభ్యురాలు గోక శశికళ యాదవ్‌రెడ్డి హాజరయ్యారు. ఆమె శ్రీనివాస స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలనీవాసులు, భక్తులతో మమేకమై వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకుని ప్రజలతో మాట్లాడారు. భక్తులతో కలిసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పాటలు పాడి అందరిని అలరించారు.  శ్రీనివాస కల్యాణ మహోత్సవం సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సన్మానించారు. ఉత్సవాల నిర్వహణలో వారు చేసిన సేవలను అభినందిస్తూ సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. కాలనీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ప్రజల్లో ఐక్యత, సోదరభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఈ  కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు
    user_MUKKAGALLA YADANNA
    MUKKAGALLA YADANNA
    Local News Reporter అమీన్‌పూర్, సంగారెడ్డి, తెలంగాణ•
    18 hrs ago
  • ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి సిరిసిల్ల పట్టణంలోని ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించిన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు... ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ నాటి భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారిపై అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం రజాకార్ల పై తిరుగుబాటు చేసిన పోరాట యోధుడు అన్నారు .ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా అమూల్యమైన సేవలను అందిస్తున్న తరుణంలోని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవికి సైతం రాజీనామా చేసిన మొట్ట మొదటి మంత్రి కొండ లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర వహించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి వారి అమూల్యమైన సూచనలు సలహాలు అందిస్తూ మార్గదర్శిగా నిలిచారు అని అన్నారు.అంతేకాకుండా అఖిలభారత పద్మశాలి సంఘం ఏర్పాటులో కీలక పాత్ర పోషించి పద్మశాలీల సమస్యలపై పోరాడుతూ పద్మశాలి కుల బాంధవుల ఐక్యతకై విశేష కృషి చేశారని అన్నారు. వారి ఆశయాలను గౌరవిస్తూ ఆదర్శ ప్రాయులైన కొండ లక్ష్మణ్ బాబూజీ కి వారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగిందని ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను కొనసాగించాలని అన్నారు.ఈనెల 27వ తేదీన ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ప్రజలందరూ ముఖ్యంగా పద్మశాలి కుల బంధువులందరూ పెద్ద ఎత్తున పాల్గొని నిర్వహించుకుందామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ , కౌన్సిలర్ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు,సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు దూడం శంకర్, పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు సబ్బని హరీష్, పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు, యువజన విభాగం కార్యవర్గ సభ్యులు, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు, చేనేత వస్త్ర వ్యాపార సంఘ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు, పద్మశాలి కుల బాంధవులు మరియు పుర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.
    2
    ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి
సిరిసిల్ల పట్టణంలోని ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో   కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించిన మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు... ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ నాటి భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటిష్ వారిపై అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం రజాకార్ల పై తిరుగుబాటు చేసిన పోరాట యోధుడు అన్నారు .ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా అమూల్యమైన సేవలను అందిస్తున్న తరుణంలోని ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవికి సైతం రాజీనామా చేసిన మొట్ట మొదటి మంత్రి కొండ లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తనదైన పాత్ర వహించి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కి వారి అమూల్యమైన సూచనలు సలహాలు అందిస్తూ మార్గదర్శిగా నిలిచారు అని అన్నారు.అంతేకాకుండా అఖిలభారత పద్మశాలి సంఘం ఏర్పాటులో కీలక పాత్ర పోషించి పద్మశాలీల సమస్యలపై పోరాడుతూ పద్మశాలి కుల బాంధవుల ఐక్యతకై విశేష కృషి చేశారని అన్నారు.
వారి ఆశయాలను గౌరవిస్తూ  ఆదర్శ ప్రాయులైన కొండ లక్ష్మణ్ బాబూజీ కి వారి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగిందని ఆచార్యకొండ లక్ష్మణ్ బాపూజీ గారి ఆశయాలను కొనసాగించాలని అన్నారు.ఈనెల 27వ తేదీన ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ప్రజలందరూ ముఖ్యంగా పద్మశాలి కుల బంధువులందరూ పెద్ద ఎత్తున పాల్గొని నిర్వహించుకుందామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు..ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా, మున్సిపల్ వైస్ చైర్మన్ దార్ల సందీప్ , కౌన్సిలర్ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు,సిరిసిల్ల పద్మశాలి సంఘం అధ్యక్షులు దూడం శంకర్,  పద్మశాలి యువజన సంఘం అధ్యక్షులు సబ్బని హరీష్, పద్మశాలి సంఘం కార్యవర్గ సభ్యులు, యువజన విభాగం కార్యవర్గ సభ్యులు, పాలిస్టర్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు, చేనేత వస్త్ర వ్యాపార సంఘ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు, పద్మశాలి కుల బాంధవులు మరియు పుర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    42 min ago
  • మెదక్ కోలిగడ్డ నేతాజీ గణేష్ మండలి వద్ద ఆదివారం ప్రత్యేక పూజలు పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ దంపతులు. నేతాజీ గణేష్ మండలికొలిగడ్డ వద్ద మెదక్ జిల్లా కలెక్టర్ దంపతులుఆదివారంజరిగిన ప్రత్యేకపూజలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లా ప్రజలు సుఖశాంతులతో పాడిపంటలతో ఆరోగ్యవంతమైన జీవనం గాడు పాలనికోరారు. జిల్లా అన్నిరంగల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేలా విజ్ఞాలు కలగకుండా చూడాలని కోరారు.
    1
    మెదక్ కోలిగడ్డ నేతాజీ గణేష్ మండలి వద్ద ఆదివారం ప్రత్యేక పూజలు పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ దంపతులు.
నేతాజీ గణేష్ మండలికొలిగడ్డ వద్ద మెదక్ జిల్లా కలెక్టర్ దంపతులుఆదివారంజరిగిన ప్రత్యేకపూజలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లా ప్రజలు సుఖశాంతులతో పాడిపంటలతో ఆరోగ్యవంతమైన జీవనం గాడు పాలనికోరారు. జిల్లా అన్నిరంగల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేలా విజ్ఞాలు కలగకుండా చూడాలని కోరారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.