logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వెల్దుర్తిలో విద్యుత్ సమస్యలు నెలల తరబడి పరిష్కారం కావడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సమస్యలు నెలల తరబడి పరిష్కారం కావడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలస్థాయి సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ.. అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు మంజూరు చేయడంలో జాప్యం జరుగుతోందని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సకాలంలో స్పందించడం లేదని ఆరోపించారు. మండల విద్యుత్ అధికారి పెంట్యా నాయక్‌ స్పందన సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో విద్యుత్ అంతరాయాలు, స్తంభాల కొరత వంటి సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని కోరారు. ఇకనైనా ఏఈ స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సర్పంచులు డిమాండ్ చేశారు.

57 min ago
user_Sraya
Sraya
నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
57 min ago

వెల్దుర్తిలో విద్యుత్ సమస్యలు నెలల తరబడి పరిష్కారం కావడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సమస్యలు నెలల తరబడి పరిష్కారం కావడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలస్థాయి సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ.. అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు మంజూరు చేయడంలో జాప్యం జరుగుతోందని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సకాలంలో స్పందించడం లేదని ఆరోపించారు. మండల విద్యుత్ అధికారి పెంట్యా నాయక్‌ స్పందన సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో విద్యుత్ అంతరాయాలు, స్తంభాల కొరత వంటి సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని కోరారు. ఇకనైనా ఏఈ స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సర్పంచులు డిమాండ్ చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • జిన్నారం మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం ఉదయం కమ్ముకున్న పొగ మంచు జిన్నారం మున్సిపల్ కేంద్రంలో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో రహదారులపై దృశ్యమానత తగ్గి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. దట్టమైన పొగమంచుతో ఆహ్లాదకరంగా మారిన ప్రకృతి దృశ్యాలను ప్రకృతి ప్రేమికులు సెల్‌ఫోన్లలో బంధించారు.
    1
    జిన్నారం మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం ఉదయం కమ్ముకున్న పొగ మంచు
జిన్నారం మున్సిపల్ కేంద్రంలో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో రహదారులపై దృశ్యమానత తగ్గి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. దట్టమైన పొగమంచుతో ఆహ్లాదకరంగా మారిన ప్రకృతి దృశ్యాలను ప్రకృతి ప్రేమికులు సెల్‌ఫోన్లలో బంధించారు.
    user_SREEYAN
    SREEYAN
    పటాన్‌చెరు, సంగారెడ్డి, తెలంగాణ•
    7 hrs ago
  • షాద్ నగర్ చేరుకున్న బీసీ రాజ్యాధికార యాత్ర............ మల్లన్న వెంట అడుగులో అడుగులు వేస్తూ రాజ్యాధికార పోరాటానికి మద్దతు పలుకుతున్న బీసీలు🚩 #bcrajyadhikarayathra #trp #teenmarmallanna
    1
    షాద్ నగర్ చేరుకున్న బీసీ రాజ్యాధికార యాత్ర............
మల్లన్న వెంట అడుగులో అడుగులు వేస్తూ రాజ్యాధికార పోరాటానికి మద్దతు పలుకుతున్న బీసీలు🚩
#bcrajyadhikarayathra #trp #teenmarmallanna
    user_RACHURI ZAKEER PASHA
    RACHURI ZAKEER PASHA
    Press advisory Sangareddy, Telangana•
    22 hrs ago
  • మెదక్ కోలిగడ్డ నేతాజీ గణేష్ మండలి వద్ద ఆదివారం ప్రత్యేక పూజలు పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ దంపతులు. నేతాజీ గణేష్ మండలికొలిగడ్డ వద్ద మెదక్ జిల్లా కలెక్టర్ దంపతులుఆదివారంజరిగిన ప్రత్యేకపూజలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లా ప్రజలు సుఖశాంతులతో పాడిపంటలతో ఆరోగ్యవంతమైన జీవనం గాడు పాలనికోరారు. జిల్లా అన్నిరంగల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేలా విజ్ఞాలు కలగకుండా చూడాలని కోరారు.
    1
    మెదక్ కోలిగడ్డ నేతాజీ గణేష్ మండలి వద్ద ఆదివారం ప్రత్యేక పూజలు పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ దంపతులు.
నేతాజీ గణేష్ మండలికొలిగడ్డ వద్ద మెదక్ జిల్లా కలెక్టర్ దంపతులుఆదివారంజరిగిన ప్రత్యేకపూజలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లా ప్రజలు సుఖశాంతులతో పాడిపంటలతో ఆరోగ్యవంతమైన జీవనం గాడు పాలనికోరారు. జిల్లా అన్నిరంగల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేలా విజ్ఞాలు కలగకుండా చూడాలని కోరారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    18 hrs ago
  • సదాశివనగర్ మండలం పద్మాజివాడి విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి సదాశివనగర్: విద్యుత్ కోతలకు నిరసనగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను గ్రామస్తులు ముట్టడించారు. ఏఈ, డీఈలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. లైన్మెన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని, తరచూ విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరారు.
    1
    సదాశివనగర్ మండలం పద్మాజివాడి విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి
సదాశివనగర్: విద్యుత్ కోతలకు నిరసనగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను గ్రామస్తులు ముట్టడించారు. ఏఈ, డీఈలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. లైన్మెన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని, తరచూ విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరారు.
    user_Vukkalkar Rajendernath
    Vukkalkar Rajendernath
    ఎల్లారెడ్డి, కామారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా. పోచారంలో మహిళ అనుమానాస్పద మృతి - రెండున్నరేళ్ల కవల పిల్లలకు తల్లి దూరం! - భర్త వేధింపులే కారణమని ఆరోపణలు! ఘట్కేసర్ సర్కిల్, పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గెలాక్సీ టవర్స్ అపార్ట్‌మెంట్‌లో మౌనిక సంతోషి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన మౌనికకు, వైజాగ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి రెండున్నరేళ్ల వయస్సున్న కవలల మగ పిల్లలు ఉన్నారు. కాగా ఆదివారం ఉదయం భార్యాభర్తల మధ్య తీవ్ర గొడవ జరిగినట్లు సమాచారం. అపార్ట్‌మెంట్ తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన పనిమనిషి లోపలికి వెళ్లి చూడగా, మౌనిక ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన జరిగిన సమయంలో భర్త ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. కవల పిల్లల రోదనలు - మిన్నంటిన శోకం మౌనిక మృతికి భర్త వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై అన్
    3
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా.

పోచారంలో మహిళ అనుమానాస్పద మృతి

- రెండున్నరేళ్ల కవల పిల్లలకు తల్లి దూరం!

- భర్త వేధింపులే కారణమని ఆరోపణలు!

ఘట్కేసర్ సర్కిల్, పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గెలాక్సీ టవర్స్ అపార్ట్‌మెంట్‌లో మౌనిక సంతోషి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం...
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన మౌనికకు, వైజాగ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి రెండున్నరేళ్ల వయస్సున్న కవలల మగ పిల్లలు ఉన్నారు. కాగా ఆదివారం ఉదయం భార్యాభర్తల మధ్య తీవ్ర గొడవ జరిగినట్లు సమాచారం.
అపార్ట్‌మెంట్ తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన పనిమనిషి లోపలికి వెళ్లి చూడగా, మౌనిక ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన జరిగిన సమయంలో భర్త ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
కవల పిల్లల రోదనలు - మిన్నంటిన శోకం
మౌనిక మృతికి భర్త వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై అన్
    user_Kommidi shiva krishna Reddy
    Kommidi shiva krishna Reddy
    Farmer ఘట్‌కేసర్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    7 hrs ago
  • బంట్వారం మండల కేంద్రంలో పారిశుద్ధ్యం అధ్వానం.. దోమలు, విషపురుగులతో ప్రజలకు ఇబ్బందులు. బంట్వారం మండల కేంద్రంలోని 6వ వార్డులో సరైన మురుగు కాలువలు లేక వాడిన నీరు నిలిచిపోతోంది. దీంతో దోమల బెడదతో పాటు గడ్డి పెరిగి విషపురుగులు సంచరించే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొత్త మురుగు కాలువ నిర్మాణం కోసం కాలువలు తీసినా పనులు ముందుకు సాగలేదని కాలనీవాసులు తెలిపారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని కొత్త మురుగు కాలువ నిర్మించి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
    1
    బంట్వారం మండల కేంద్రంలో పారిశుద్ధ్యం అధ్వానం.. దోమలు, విషపురుగులతో ప్రజలకు ఇబ్బందులు.
బంట్వారం మండల కేంద్రంలోని 6వ వార్డులో సరైన మురుగు కాలువలు లేక వాడిన నీరు నిలిచిపోతోంది. దీంతో దోమల బెడదతో పాటు గడ్డి పెరిగి విషపురుగులు సంచరించే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కొత్త మురుగు కాలువ నిర్మాణం కోసం కాలువలు తీసినా పనులు ముందుకు సాగలేదని కాలనీవాసులు తెలిపారు. సంబంధిత అధికారులు చొరవ తీసుకుని కొత్త మురుగు కాలువ నిర్మించి సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
    user_Bushanagari kumar
    Bushanagari kumar
    బంట్వారం, వికారాబాద్, తెలంగాణ•
    1 hr ago
  • గిరిజన పోస్టల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాలి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరణం పరణిత పిలుపు ఘనంగా అఖిల భారత పోస్టల్ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం మెదక్ డివిజన్ తొలి సమావేశం. మెదక్‌: అఖిల భారత పోస్టల్ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం మెదక్ డివిజన్‌ మొదటి సమావేశం ఆదివారం మెదక్‌ పట్టణంలోని హెడ్‌ పోస్ట్‌ ఆఫీస్‌లో ఘనంగా నిర్వహించారు. సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పోస్టల్‌ శాఖలో పనిచేస్తున్న గిరిజన ఉద్యోగులు, సంఘం ప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కరణం పరిణీత, రవి నాయక్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులకు సంఘం నాయకులు, సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోస్టల్‌ శాఖలో విధులు నిర్వహిస్తున్న గిరిజన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సంఘటితంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగుల హక్కులు, సంక్షేమం, సామాజిక భద్రత, ఉద్యోగ పరమైన సమస్యల పరిష్కారం వంటి అంశాలపై సంఘం నిరంతరం కృషి చేయాలని సూచించారు. గిరిజన ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత సంఘంపై ఉందన్నారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు వారి కుటుంబాల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.సంఘం మెదక్‌ డివిజన్‌ తొలి కాన్ఫరెన్స్‌ నిర్వహించడం పట్ల నాయకులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో సంఘాన్ని మరింత బలోపేతం చేసి, పోస్టల్‌ శాఖలో పనిచేస్తున్న గిరిజన ఉద్యోగులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలని ఆకాంక్షించారు.అనంతరం సంఘం భవిష్యత్‌ కార్యాచరణ, ఉద్యోగుల సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలు, సంఘం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కార్యక్రమంలో పోస్టల్‌ ఉద్యోగులు, సంఘం నాయకులు, ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
    1
    గిరిజన
 పోస్టల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాలి
బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరణం పరణిత పిలుపు
ఘనంగా అఖిల భారత పోస్టల్ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం మెదక్ డివిజన్ తొలి సమావేశం.
మెదక్‌: అఖిల భారత పోస్టల్ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం మెదక్ డివిజన్‌ మొదటి సమావేశం ఆదివారం మెదక్‌ పట్టణంలోని హెడ్‌ పోస్ట్‌ ఆఫీస్‌లో ఘనంగా నిర్వహించారు. సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పోస్టల్‌ శాఖలో పనిచేస్తున్న గిరిజన ఉద్యోగులు, సంఘం ప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కరణం పరిణీత, రవి నాయక్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులకు సంఘం నాయకులు, సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోస్టల్‌ శాఖలో విధులు నిర్వహిస్తున్న గిరిజన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సంఘటితంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగుల హక్కులు, సంక్షేమం, సామాజిక భద్రత, ఉద్యోగ పరమైన సమస్యల పరిష్కారం వంటి అంశాలపై సంఘం నిరంతరం కృషి చేయాలని సూచించారు. గిరిజన ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత సంఘంపై ఉందన్నారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు వారి కుటుంబాల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.సంఘం మెదక్‌ డివిజన్‌ తొలి కాన్ఫరెన్స్‌ నిర్వహించడం పట్ల నాయకులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో సంఘాన్ని మరింత బలోపేతం చేసి, పోస్టల్‌ శాఖలో పనిచేస్తున్న గిరిజన ఉద్యోగులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలని ఆకాంక్షించారు.అనంతరం సంఘం భవిష్యత్‌ కార్యాచరణ, ఉద్యోగుల సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలు, సంఘం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కార్యక్రమంలో పోస్టల్‌ ఉద్యోగులు, సంఘం నాయకులు, ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    20 hrs ago
  • ఎల్లారెడ్డిలో పూజలందుకుంటున్న స్వర్ణకార సంఘం వారి మట్టి గణపతి..... ఎల్లారెడ్డి: పట్టణంలోని పాత డైలీ మార్కెట్ రోడ్డులో స్వర్ణకార సంఘం వారి మట్టి గణపతి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పూజలందుకుంటుంది. వినాయక చవితి పండుగ రోజున పర్యావరణ హితం కోసం మట్టి గణపతిని ప్రతిష్టించి, స్వర్ణ కార సంఘం వారు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదివారం వినాయక నవరాత్రి ఉత్సవాల్లో బాగంగా 7వ రోజున స్థానిక న్యూ అయ్యప్ప జ్యూయేలర్ షాపు యజమాని ఓర శ్రీనివాస్ దంపతులు పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే పట్టణంలో ప్రతిష్టించిన వివిధ గణేష్ మండపాల వద్ద భక్తులు ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం పూజలు చేయడంతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    1
    ఎల్లారెడ్డిలో పూజలందుకుంటున్న స్వర్ణకార సంఘం వారి మట్టి గణపతి.....

ఎల్లారెడ్డి: పట్టణంలోని పాత డైలీ మార్కెట్ రోడ్డులో స్వర్ణకార సంఘం వారి మట్టి గణపతి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పూజలందుకుంటుంది. వినాయక చవితి పండుగ రోజున పర్యావరణ హితం కోసం మట్టి గణపతిని ప్రతిష్టించి, స్వర్ణ కార సంఘం వారు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదివారం వినాయక నవరాత్రి ఉత్సవాల్లో బాగంగా 7వ రోజున స్థానిక న్యూ అయ్యప్ప   జ్యూయేలర్ షాపు యజమాని ఓర శ్రీనివాస్ దంపతులు పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే పట్టణంలో ప్రతిష్టించిన వివిధ గణేష్ మండపాల వద్ద భక్తులు ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం పూజలు చేయడంతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
    user_Vukkalkar Rajendernath
    Vukkalkar Rajendernath
    ఎల్లారెడ్డి, కామారెడ్డి, తెలంగాణ•
    17 hrs ago
  • తృటిలో తప్పిన ప్రమాదం.. బస్సు కిందకు దూసుకెళ్లిన స్కూటీ తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద సోమవారం భారీ ప్రమాదం తృటిలో తప్పింది. గజ్వేల్‌ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు చౌరస్తా వద్ద మలుపు తిరుగుతుండగా.. అదే సమయంలో బస్సు పక్కనుంచి వెళ్తున్న స్కూటీ ఒక్కసారిగా బస్సు కిందకు వెళ్లింది. ప్రమాదాన్ని గుర్తించిన స్కూటీదారుడు వెంటనే వాహనం నుంచి పక్కకు దూకడంతో సురక్షితంగా బయటపడ్డాడు. అనంతరం బస్సును నిలిపివేసి, కొంతసేపు శ్రమించి స్కూటీని బయటకు తీశారు. దీంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు.
    1
    తృటిలో తప్పిన ప్రమాదం.. బస్సు కిందకు దూసుకెళ్లిన స్కూటీ
తూప్రాన్ పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా వద్ద సోమవారం భారీ ప్రమాదం తృటిలో తప్పింది. గజ్వేల్‌ నుంచి సంగారెడ్డి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు చౌరస్తా వద్ద మలుపు తిరుగుతుండగా.. అదే సమయంలో బస్సు పక్కనుంచి వెళ్తున్న స్కూటీ ఒక్కసారిగా బస్సు కిందకు వెళ్లింది. ప్రమాదాన్ని గుర్తించిన స్కూటీదారుడు వెంటనే వాహనం నుంచి పక్కకు దూకడంతో సురక్షితంగా బయటపడ్డాడు. అనంతరం బస్సును నిలిపివేసి, కొంతసేపు శ్రమించి స్కూటీని బయటకు తీశారు. దీంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు.
    user_Sraya
    Sraya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.