Shuru
Apke Nagar Ki App…
ఎల్లారెడ్డిలో పూజలందుకుంటున్న స్వర్ణకార సంఘం వారి మట్టి గణపతి..... ఎల్లారెడ్డి: పట్టణంలోని పాత డైలీ మార్కెట్ రోడ్డులో స్వర్ణకార సంఘం వారి మట్టి గణపతి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పూజలందుకుంటుంది. వినాయక చవితి పండుగ రోజున పర్యావరణ హితం కోసం మట్టి గణపతిని ప్రతిష్టించి, స్వర్ణ కార సంఘం వారు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదివారం వినాయక నవరాత్రి ఉత్సవాల్లో బాగంగా 7వ రోజున స్థానిక న్యూ అయ్యప్ప జ్యూయేలర్ షాపు యజమాని ఓర శ్రీనివాస్ దంపతులు పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే పట్టణంలో ప్రతిష్టించిన వివిధ గణేష్ మండపాల వద్ద భక్తులు ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం పూజలు చేయడంతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
Vukkalkar Rajendernath
ఎల్లారెడ్డిలో పూజలందుకుంటున్న స్వర్ణకార సంఘం వారి మట్టి గణపతి..... ఎల్లారెడ్డి: పట్టణంలోని పాత డైలీ మార్కెట్ రోడ్డులో స్వర్ణకార సంఘం వారి మట్టి గణపతి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పూజలందుకుంటుంది. వినాయక చవితి పండుగ రోజున పర్యావరణ హితం కోసం మట్టి గణపతిని ప్రతిష్టించి, స్వర్ణ కార సంఘం వారు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదివారం వినాయక నవరాత్రి ఉత్సవాల్లో బాగంగా 7వ రోజున స్థానిక న్యూ అయ్యప్ప జ్యూయేలర్ షాపు యజమాని ఓర శ్రీనివాస్ దంపతులు పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే పట్టణంలో ప్రతిష్టించిన వివిధ గణేష్ మండపాల వద్ద భక్తులు ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం పూజలు చేయడంతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
More news from తెలంగాణ and nearby areas
- సదాశివనగర్ మండలం పద్మాజివాడి విద్యుత్ సబ్‌స్టేషన్ ముట్టడి సదాశివనగర్: విద్యుత్ కోతలకు నిరసనగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం పద్మాజివాడి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను గ్రామస్తులు ముట్టడించారు. ఏఈ, డీఈలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. లైన్మెన్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని, తరచూ విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరారు.1
- పెద్దమ్మ గుడి నిర్మాణానికి అండగా ఎమ్మెల్యే రోహిత్ రావు ఎం ఎస్ ఎస్ ఓ ద్వారా లక్ష విరాళం పాపన్నపేట మండలం కొడపాక గ్రామంలో పెద్దమ్మ గుడి నిర్మాణానికి అండగా ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు మెదక్ నియోజకవర్గం, పాపన్నపేట మండలం, కొడపాక గ్రామంలో పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు తన వంతు సహాయంగా ఎంఎస్ఎస్ఓ ద్వారా రూ. 1,00,000/- ఒక లక్ష రూపాయలు ను ముదిరాజ్ సంఘానికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రావు మాట్లాడుతూ... గ్రామాల్లో దేవాలయాల నిర్మాణం భక్తి భావాన్ని పెంపొందించడమే కాకుండా గ్రామ ఐక్యతకు దోహద పడుతుందని, గుడి నిర్మాణానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు.ఈ సందర్భంగా ముదిరాజ్ సంఘం నాయకులు, కుల సంఘాల పెద్దలు మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ గారు ఇప్పటికే అనేక దేవాలయాలకు, వివిధ కుల సంఘాలకు ఆర్థిక సహాయం అందించారని కొనియాడారు. అమ్మవారి ఆశీస్సులతో ఎమ్మెల్యే గారు ఆయురారోగ్యాలతో బాగుండాలని, ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.1
- వెల్దుర్తిలో విద్యుత్ సమస్యలు నెలల తరబడి పరిష్కారం కావడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సమస్యలు నెలల తరబడి పరిష్కారం కావడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలస్థాయి సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ.. అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు మంజూరు చేయడంలో జాప్యం జరుగుతోందని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సకాలంలో స్పందించడం లేదని ఆరోపించారు. మండల విద్యుత్ అధికారి పెంట్యా నాయక్ స్పందన సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో విద్యుత్ అంతరాయాలు, స్తంభాల కొరత వంటి సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని కోరారు. ఇకనైనా ఏఈ స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సర్పంచులు డిమాండ్ చేశారు.1
- నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగుల సమస్య అసెంబ్లీలో.. 126 నెలల జీతాల బకాయిలపై గళం వినిపించిన అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా బోధన్, నిజామాబాద్: బోధన్‌లోని నిజాం డెక్కన్ షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్య మరోసారి తెలంగాణ అసెంబ్లీ దృష్టికి వెళ్లింది. మలక్‌పేట్ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా అసెంబ్లీలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగుల జీతాలు, బకాయిల సమస్యను ప్రస్తావించారు. ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఉద్యోగులు, వారి కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఫ్యాక్టరీలో సంవత్సరాలుగా పనిచేసిన ఉద్యోగులకు చాలా కాలంగా జీతాలు, ఇతర బకాయిలు అందలేదని అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా తెలిపారు. ఈ పరిస్థితి కారణంగా 300కు పైగా కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. నిజాం డెక్కన్ షుగర్స్ లిమిటెడ్‌లో తెలంగాణ ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉందని, అయినప్పటికీ ఉద్యోగుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించలేదని ఆయన అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే కమిటీ ఫర్ పిటిషన్స్ అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ.. ఉద్యోగులు సమర్పించిన పిటిషన్‌ను పరిశీలించి, సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో సమస్య ప్రస్తావనతో ఉద్యోగుల్లో హర్షం ఉద్యోగుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించిన అనంతరం బోధన్‌లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగులు అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, బ్యారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలో బ్యారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీ బోధన్ పర్యటనకు వచ్చిన సమయంలో కూడా తమ జీతాలు, బకాయిల సమస్యపై ఉద్యోగులు ఆయనకు వినతిపత్రం అందజేసినట్లు తెలిపారు. అదేవిధంగా బోధన్ మున్సిపల్ వైస్ చైర్మన్ మీర్ ఇలియాస్ అలీని కూడా ఉద్యోగులు కలిసి తమ సమస్యలను పార్టీ నాయకత్వం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరినట్లు చెప్పారు. ఉద్యోగుల సమస్యపై పార్టీ నాయకత్వంతో మాట్లాడి.. తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని మీర్ ఇలియాస్ అలీ హామీ ఇచ్చినట్లు ఉద్యోగులు తెలిపారు. ఉద్యోగుల సమస్యపై జునైద్ అహ్మద్ ఖలీల్ ప్రశ్నలు ఈ సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ బోధన్ సీనియర్ నాయకుడు జునైద్ అహ్మద్ ఖలీల్ కూడా ఉద్యోగులకు మద్దతు తెలిపారు. అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాలా, బ్యారిస్టర్ అసదుద్దీన్ ఒవైసీకి కృతజ్ఞతలు తెలిపారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగుల సమస్యపై బోధన్‌కు చెందిన వివిధ రాజకీయ పార్టీల స్థానిక నాయకులు గతంలో కూడా తమ వంతుగా గళం వినిపించారని జునైద్ అహ్మద్ ఖలీల్ తెలిపారు. ఈ సమస్యను రాజకీయాలకు అతీతంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో నిజాం షుగర్ ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభిస్తామని, ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీలు ఇచ్చారని.. అయితే ఇప్పటికీ ఉద్యోగులు తమ బకాయిల కోసం ఎదురుచూస్తున్నారని జునైద్ అహ్మద్ ఖలీల్ ప్రశ్నించారు. ఫ్యాక్టరీ ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఉద్యోగులకు బకాయిలు ఎప్పుడు అందుతాయి? నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ సమస్య కేవలం ఉద్యోగుల జీతాలకే పరిమితం కాలేదు. బోధన్ ప్రాంతంలోని చెరుకు రైతులు, స్థానిక ఉపాధి, వేలాది కుటుంబాల జీవనోపాధితో కూడా ఈ అంశం ముడిపడి ఉంది. గతంలో తెలంగాణ ప్రభుత్వం మూతపడిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ యూనిట్ల పునరుద్ధరణకు సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు చర్యలు చేపట్టింది. అయితే ఉద్యోగులు, స్థానిక ప్రజలు మాత్రం ఇప్పటికీ కార్యాచరణ కోసం ఎదురుచూస్తున్నారు. మరి ఉద్యోగుల జీతాల బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణపై ప్రభుత్వం ఎప్పుడు తుది నిర్ణయం తీసుకుంటుంది? ఏళ్లుగా తమ హక్కుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులు, వారి కుటుంబాలకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది? ఇప్పుడు బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఉద్యోగుల చూపు ప్రభుత్వ తదుపరి నిర్ణయంపైనే ఉంది.1
- రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో...జనము గల్ల ఉయ్యాలో జెండాలెత్తి ఉయ్యాలో... #bcrajyadhikarayathra #relareganga #newsong1
- శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారదు శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- ఎల్లారెడ్డిలో పూజలందుకుంటున్న స్వర్ణకార సంఘం వారి మట్టి గణపతి..... ఎల్లారెడ్డి: పట్టణంలోని పాత డైలీ మార్కెట్ రోడ్డులో స్వర్ణకార సంఘం వారి మట్టి గణపతి ప్రతి రోజు ఉదయం, సాయంత్రం పూజలందుకుంటుంది. వినాయక చవితి పండుగ రోజున పర్యావరణ హితం కోసం మట్టి గణపతిని ప్రతిష్టించి, స్వర్ణ కార సంఘం వారు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆదివారం వినాయక నవరాత్రి ఉత్సవాల్లో బాగంగా 7వ రోజున స్థానిక న్యూ అయ్యప్ప జ్యూయేలర్ షాపు యజమాని ఓర శ్రీనివాస్ దంపతులు పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అలాగే పట్టణంలో ప్రతిష్టించిన వివిధ గణేష్ మండపాల వద్ద భక్తులు ప్రతి నిత్యం ఉదయం సాయంత్రం పూజలు చేయడంతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.1
- ఎల్లమ్మ చెరువులో యువకుడు మృతి సిరికొండలో విషాద ఘటన.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎల్లమ్మ చెరువులో యువకుడి మృతి సిరికొండలో విషాద ఘటన.. కేసు నమోదు చేసి దర్యాప్తు నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 20 సిరికొండ గ్రామానికి చెందిన పారిపల్లి సాయి కుమార్ (32) ఎల్లమ్మ చెరువు వద్ద మృతి చెందిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. సిరికొండ ఎస్సై జె. రామకృష్ణ అందించిన వివరాల ప్రకారం.. సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో సాయి కుమార్ చెరువులోకి వెళ్లినట్లు తెలిపారు. విషయం గమనించిన గ్రామస్తులు వెంటనే స్పందించి ఆయనను బయటకు తీసి ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా, అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిరికొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై జె. రామకృష్ణ తెలిపారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.1