ఎల్లమ్మ చెరువులో యువకుడు మృతి సిరికొండలో విషాద ఘటన.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎల్లమ్మ చెరువులో యువకుడి మృతి సిరికొండలో విషాద ఘటన.. కేసు నమోదు చేసి దర్యాప్తు నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 20 సిరికొండ గ్రామానికి చెందిన పారిపల్లి సాయి కుమార్ (32) ఎల్లమ్మ చెరువు వద్ద మృతి చెందిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. సిరికొండ ఎస్సై జె. రామకృష్ణ అందించిన వివరాల ప్రకారం.. సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో సాయి కుమార్ చెరువులోకి వెళ్లినట్లు తెలిపారు. విషయం గమనించిన గ్రామస్తులు వెంటనే స్పందించి ఆయనను బయటకు తీసి ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా, అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిరికొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై జె. రామకృష్ణ తెలిపారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
ఎల్లమ్మ చెరువులో యువకుడు మృతి సిరికొండలో విషాద ఘటన.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎల్లమ్మ చెరువులో యువకుడి మృతి సిరికొండలో విషాద ఘటన.. కేసు నమోదు చేసి దర్యాప్తు నిజామాబాద్ రూరల్, సెప్టెంబర్ 20 సిరికొండ గ్రామానికి చెందిన పారిపల్లి సాయి కుమార్ (32) ఎల్లమ్మ చెరువు వద్ద మృతి చెందిన ఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. సిరికొండ ఎస్సై జె. రామకృష్ణ అందించిన వివరాల ప్రకారం.. సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో సాయి కుమార్ చెరువులోకి వెళ్లినట్లు తెలిపారు. విషయం గమనించిన గ్రామస్తులు వెంటనే స్పందించి ఆయనను బయటకు తీసి ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా, అప్పటికే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిరికొండ పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్సై జె. రామకృష్ణ తెలిపారు. ఘటనకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
- మెదక్ కోలిగడ్డ నేతాజీ గణేష్ మండలి వద్ద ఆదివారం ప్రత్యేక పూజలు పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ దంపతులు. నేతాజీ గణేష్ మండలికొలిగడ్డ వద్ద మెదక్ జిల్లా కలెక్టర్ దంపతులుఆదివారంజరిగిన ప్రత్యేకపూజలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మెదక్ జిల్లా ప్రజలు సుఖశాంతులతో పాడిపంటలతో ఆరోగ్యవంతమైన జీవనం గాడు పాలనికోరారు. జిల్లా అన్నిరంగల్లో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిపేలా విజ్ఞాలు కలగకుండా చూడాలని కోరారు.1
- విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతికోద్యమ ప్రస్థానంపై 50 గంటల ప్రజా కళాజాతర హైదరాబాద్‌లో అరుణోదయ విమలక్క 50 ఏళ్ల ప్రజా సాంస్కృతికోద్యమ ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 26, 27, 28 తేదీల్లో 50 గంటల నిర్విరామ ప్రజా కళాజాతర నిర్వహించనున్నట్లు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పోతుల తెలిపారు. హైదరాబాద్‌లోని ఆర్టీసీ కల్యాణ మండపంలో జరిగే కార్యక్రమాల వివరాలను వెల్లడించేందుకు సెప్టెంబర్ 19న సాయంత్రం 5 గంటలకు నాగోల్ మెయిన్ రోడ్‌లోని సుప్రజ హాస్పిటల్ 5వ అంతస్తులో జర్నలిస్టులతో ముఖాముఖి సమావేశం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కళాకారులు, కవులు, రచయితలు, ప్రజా సాంస్కృతిక కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.1
- ఎల్లారెడ్డిపేట లో దంచి కొట్టిన వాన జలకలను సంతరించుకున్న చెరువులు కుంటలు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో పాటు ఆయా గ్రామాలలో భారీ వర్షం కురిసింది దేనితో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఏకధాటివిగా కురిసిన వర్షాలకు స్థానిక చెరువులు జలకలను సంతరించుకున్నాయి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.1
- వేములవాడ రాజన్న క్షేత్రంలో వైభవంగా 7వ రోజు గణపతి నవరాత్రులు ఏకాంతంగా మూలవిరాట్‌కు విశేష పూజలు.. భీమేశ్వర ఆలయంలో భక్తులకు సిద్ధిబుద్ధి వినాయకుడి దర్శనం ఘనంగా లక్ష్మీ గణపతికి ఉపనిషత్ పారాయణ అభిషేకాలు, అమ్మవారికి ఉపచార పూజలు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, అనుబంధ ఆలయాలలో గణేశ నవరాత్రి మహోత్సవాలు 7వ రోజు వైభవంగా కొనసాగాయి. ఆలయ అభివృద్ధి పనుల నేపథ్యంలో మూలవిరాట్ ఆంతరంగిక ఆలయంలో అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా విశేష పూజలు నిర్వహిస్తున్నారు. భక్తుల దర్శనార్థం అనుబంధ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయ మండపంలో మట్టితో రూపొందించిన సిద్ధిబుద్ధి సమేత వినాయకుడికి నిత్య పూజలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ఉదయం ఆంతరంగిక ఆలయంలో మూలవిరాట్ రాజరాజేశ్వర స్వామికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం ఎనిమిది మంది బ్రాహ్మణుల చేత లక్ష్మీ గణపతికి గణేశ ఉపనిషత్ పారాయణంతో విశేష అభిషేకాలు, పార్వతీ రాజరాజేశ్వరి దేవికి ఉపచార పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. అలాగే భీమేశ్వర ఆలయంలో కొలువుదీరిన మట్టి గణపతికి ఉదయం ప్రాతఃకాల పూజలు, సాయంత్రం వేళల్లో షోడశోపచార పూజలు వైభవంగా నిర్వహించారు. స్వామివారికి నైవేద్యాలు సమర్పించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు నిత్యం ఉదయం, సాయంత్రం వేళల్లో స్వామివారి అంతరాలయంలో మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, అమ్మవారికి ఉపచార పూజలు ఏకాంతంగా కొనసాగుతాయని తెలిపారు. భీమేశ్వర ఆలయంలోని మట్టి వినాయకుడికి రోజూ షోడశోపచార పూజలు జరుగుతాయని పేర్కొన్నారు. భాద్రపద శుద్ధ ఏకాదశి నాడు మంత్ర అనుష్ఠానాలతో విశేష హోమం, ద్వాదశి నాడు పూర్ణాహుతి నిర్వహించి స్వామివారి నిమజ్జనం జరుపుతామని వెల్లడించారు. భక్తులు భీమేశ్వర ఆలయంలో కొలువుదీరిన సిద్ధిబుద్ధి సమేత వినాయకుడిని దర్శించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ వేడుకల్లో ఆలయ అధికారులు, అర్చక బృందం, వేద పండితులు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది మరియు భక్తులు పాల్గొన్నారు.1
- సిరిసిల్లలో చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం. సిరిసిల్లలో చేనేత వస్త్ర వ్యాపార సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్, ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మహేందర్ రెడ్డి హాజరై నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. చేనేత రంగ అభివృద్ధికి సంఘం మరింత కృషి చేయాలని అన్నారు.1
- వెల్దుర్తిలో విద్యుత్ సమస్యలు నెలల తరబడి పరిష్కారం కావడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం వెల్దుర్తి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సమస్యలు నెలల తరబడి పరిష్కారం కావడం లేదని సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలస్థాయి సమీక్ష సమావేశంలో వారు మాట్లాడుతూ.. అవసరమైన చోట విద్యుత్ స్తంభాలు మంజూరు చేయడంలో జాప్యం జరుగుతోందని, గ్రామాల్లో నెలకొన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సకాలంలో స్పందించడం లేదని ఆరోపించారు. మండల విద్యుత్ అధికారి పెంట్యా నాయక్ స్పందన సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామాల్లో విద్యుత్ అంతరాయాలు, స్తంభాల కొరత వంటి సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించాలని కోరారు. ఇకనైనా ఏఈ స్పందించి క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సర్పంచులు డిమాండ్ చేశారు.1
- పిడుగుపాటు బీభత్సం.. ఇద్దరు రైతులకు గాయాలు సేవాలాల్ ఆలయానికి పాక్షిక నష్టం.. సెల్‌ఫోన్లు పేలడంతో స్పృహ కోల్పోయిన రైతులు కామారెడ్డి: కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో ఆదివారం పిడుగుపాటు తీవ్ర కలకలం రేపింది. గాంధారి దుర్గం రోడ్డు సమీపంలోని సేవాలాల్ ఆలయంపై పిడుగు పడటంతో ఆలయం పాక్షికంగా దెబ్బతింది. ఇదే సమయంలో మండలంలోని బొప్పాజీవాడ శివారులోని పత్తి చేనులో వ్యవసాయ పనులు చేస్తున్న సూర్యకాంత్, శంకర్ వర్షం రావడంతో గొడుగు పట్టుకుని నిల్చున్నారు. అకస్మాత్తుగా పిడుగు పడటంతో వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు పేలినట్లు స్థానికులు తెలిపారు. దీంతో ఇద్దరూ తీవ్ర అస్వస్థతకు గురై స్పృహ కోల్పోయి కుప్పకూలారు. వెంటనే స్పందించిన స్థానికులు వారిని ఎడ్లబండిపై మెయిన్‌రోడ్డు వరకు తరలించారు. అనంతరం అంబులెన్స్‌లో గాంధారి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితిని పరిశీలించిన వైద్యులు మెరుగైన చికిత్స కోసం వారిని కామారెడ్డి ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఒకే సమయంలో ఆలయంపై పిడుగు పడటం, మరోవైపు ఇద్దరు రైతులు పిడుగుపాటుకు గురికావడంతో బొప్పాజీవాడ పరిసరాల్లో భయాందోళన నెలకొంది.1
- గిరిజన పోస్టల్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్యంగా ఉద్యమించాలి బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కరణం పరణిత పిలుపు ఘనంగా అఖిల భారత పోస్టల్ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం మెదక్ డివిజన్ తొలి సమావేశం. మెదక్: అఖిల భారత పోస్టల్ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం మెదక్ డివిజన్ మొదటి సమావేశం ఆదివారం మెదక్ పట్టణంలోని హెడ్ పోస్ట్ ఆఫీస్‌లో ఘనంగా నిర్వహించారు. సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పోస్టల్ శాఖలో పనిచేస్తున్న గిరిజన ఉద్యోగులు, సంఘం ప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కరణం పరిణీత, రవి నాయక్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులకు సంఘం నాయకులు, సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోస్టల్ శాఖలో విధులు నిర్వహిస్తున్న గిరిజన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు సంఘటితంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగుల హక్కులు, సంక్షేమం, సామాజిక భద్రత, ఉద్యోగ పరమైన సమస్యల పరిష్కారం వంటి అంశాలపై సంఘం నిరంతరం కృషి చేయాలని సూచించారు. గిరిజన ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత సంఘంపై ఉందన్నారు. ఉద్యోగుల సంక్షేమంతో పాటు వారి కుటుంబాల అభివృద్ధికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.సంఘం మెదక్ డివిజన్ తొలి కాన్ఫరెన్స్ నిర్వహించడం పట్ల నాయకులు, ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్‌లో సంఘాన్ని మరింత బలోపేతం చేసి, పోస్టల్ శాఖలో పనిచేస్తున్న గిరిజన ఉద్యోగులందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలని ఆకాంక్షించారు.అనంతరం సంఘం భవిష్యత్ కార్యాచరణ, ఉద్యోగుల సమస్యలు, సంక్షేమ కార్యక్రమాలు, సంఘం బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కార్యక్రమంలో పోస్టల్ ఉద్యోగులు, సంఘం నాయకులు, ప్రతినిధులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.1
- కొండ లక్ష్మణ్ బాపూజీ ఆశయాలే స్ఫూర్తి.. తెలంగాణకు ఆయన సేవలు చిరస్మరణీయం ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని కొండ లక్ష్మణ్ బాపూజీ చౌరస్తాలో మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళ చక్రపాణి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్వాతంత్ర్య ఉద్యమంలో బ్రిటిష్ పాలకులకు, తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన యోధుడు కొండ లక్ష్మణ్ బాపూజీ అని కొనియాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా సేవలందించిన సమయంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన తొలి మంత్రిగా ఆయన చరిత్రలో నిలిచారని తెలిపారు. తెలంగాణ ఉద్యమానికి తనదైన మద్దతు అందిస్తూ, ఉద్యమ నాయకులకు సూచనలు, సలహాలు ఇచ్చి మార్గదర్శిగా నిలిచారని పేర్కొన్నారు. అఖిల భారత పద్మశాలి సంఘం ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, పద్మశాలీల సమస్యల పరిష్కారం, ఐక్యత కోసం విశేష కృషి చేశారని గుర్తుచేశారు. ఆయన ఆశయాలను నేటి తరం కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ నెల 27న జరగనున్న కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను ప్రజలు, ముఖ్యంగా పద్మశాలి కులబాంధవులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదీర్ పాషా, వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, పద్మశాలి సంఘం అధ్యక్షుడు దూడం శంకర్, యువజన సంఘం అధ్యక్షుడు సబ్బని హరీష్, వివిధ సంఘాల ప్రతినిధులు, పద్మశాలి కులబాంధవులు, పుర ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు.1