మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా. పోచారంలో మహిళ అనుమానాస్పద మృతి - రెండున్నరేళ్ల కవల పిల్లలకు తల్లి దూరం! - భర్త వేధింపులే కారణమని ఆరోపణలు! ఘట్కేసర్ సర్కిల్, పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గెలాక్సీ టవర్స్ అపార్ట్‌మెంట్‌లో మౌనిక సంతోషి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన మౌనికకు, వైజాగ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి రెండున్నరేళ్ల వయస్సున్న కవలల మగ పిల్లలు ఉన్నారు. కాగా ఆదివారం ఉదయం భార్యాభర్తల మధ్య తీవ్ర గొడవ జరిగినట్లు సమాచారం. అపార్ట్‌మెంట్ తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన పనిమనిషి లోపలికి వెళ్లి చూడగా, మౌనిక ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన జరిగిన సమయంలో భర్త ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. కవల పిల్లల రోదనలు - మిన్నంటిన శోకం మౌనిక మృతికి భర్త వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై అన్
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా. పోచారంలో మహిళ అనుమానాస్పద మృతి - రెండున్నరేళ్ల కవల పిల్లలకు తల్లి దూరం! - భర్త వేధింపులే కారణమని ఆరోపణలు! ఘట్కేసర్ సర్కిల్, పోచారం ఐటీ కారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని గెలాక్సీ టవర్స్ అపార్ట్‌మెంట్‌లో మౌనిక సంతోషి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం... ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురానికి చెందిన మౌనికకు, వైజాగ్‌కు చెందిన
సాఫ్ట్‌వేర్ ఉద్యోగితో ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ వివాహం జరిగింది. వీరికి రెండున్నరేళ్ల వయస్సున్న కవలల మగ పిల్లలు ఉన్నారు. కాగా ఆదివారం ఉదయం భార్యాభర్తల మధ్య తీవ్ర గొడవ జరిగినట్లు సమాచారం. అపార్ట్‌మెంట్ తలుపులు తెరిచి ఉండటాన్ని గమనించిన పనిమనిషి లోపలికి వెళ్లి చూడగా, మౌనిక ఉరివేసుకున్న స్థితిలో కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె
మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటన జరిగిన సమయంలో భర్త ఇంట్లోనే ఉన్నట్లు తెలుస్తోంది. కవల పిల్లల రోదనలు - మిన్నంటిన శోకం మౌనిక మృతికి భర్త వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై అన్
- కన్నుల పండుగగా శ్రీనివాస కల్యాణ మహోత్సవం ముఖ్యఅతిథిగా మహిళా కమిషన్ సభ్యురాలు గోక శశికళ యాదవ్‌రెడ్డి అనిరుద్‌రెడ్డి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహణ వేద మంత్రోచ్ఛారణల నడుమ శాస్త్రోక్తంగా కల్యాణం భక్తులతో మమేకమైన మహిళా కమిషన్ సభ్యురాలు అమీన్పూర్, శురు ప్రతినిధి సెప్టెంబర్ 20: అమీన్పూర్ డివిజన్ పరిధిలోని ఓడీఎఫ్ కాలనీలో శ్రీనివాస కల్యాణ మహోత్సవం శనివారం కన్నుల పండుగగా, భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. అమీన్పూర్ మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ యువ నాయకుడు గోక అనిరుద్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కాలనీవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించారు. చందానగర్ వెంకటేశ్వర స్వామి దేవాలయ పురోహితులు సాయి పంతులు ఆధ్వర్యంలో శ్రీనివాస స్వామివారి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కల్యాణ వేడుకలు వైభవంగా కొనసాగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల గోవింద నామస్మరణతో మార్మోగింది. కల్యాణ మహోత్సవంలో గోక అనిరుద్‌రెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. కాలనీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మహిళా కమిషన్ సభ్యురాలు గోక శశికళ యాదవ్‌రెడ్డి హాజరయ్యారు. ఆమె శ్రీనివాస స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాలనీవాసులు, భక్తులతో మమేకమై వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలోని సమస్యలను అడిగి తెలుసుకుని ప్రజలతో మాట్లాడారు. భక్తులతో కలిసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం పాటలు పాడి అందరిని అలరించారు. శ్రీనివాస కల్యాణ మహోత్సవం సందర్భంగా గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అతిథులను ఘనంగా సన్మానించారు. ఉత్సవాల నిర్వహణలో వారు చేసిన సేవలను అభినందిస్తూ సత్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. కాలనీలో ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ప్రజల్లో ఐక్యత, సోదరభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, భక్తులు, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు1
- శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ప్రత్యేక మంగళహారదు శ్రీ ఏడుపాయల మండల దుర్గ భవాని అమ్మవారిని సోమవారం ప్రత్యేకంగా అలంకరించారు. మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ఆరుతులను నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనం కల్పించారు.1
- ధరిపల్లిలో విషాద ఘటన, ఇల్లు లేక.. శ్మశానవాటికలోనే అంత్యక్రియలు చిన్నశంకరంపేట మండలం ధరిపల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంగిరెద్దుల లక్ష్మి (65) అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం మెదక్ ఆస్పత్రిలో మృతిచెందింది. భర్త నర్సింహులు తొమ్మిదేళ్ల క్రితమే మృతిచెందగా.. కుమార్తె పూజతో కలిసి లక్ష్మి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించింది. కుటుంబానికి సొంత ఇల్లు లేకపోవడంతో లక్ష్మి మృతదేహాన్ని శ్మశానవాటికలోనే ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. తమకు ప్రభుత్వం సొంత ఇల్లు మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు, స్థానికులు కోరుతున్నారు.1
- రామ రామ ఉయ్యాలో రఘవ రామ ఉయ్యాలో...జనము గల్ల ఉయ్యాలో జెండాలెత్తి ఉయ్యాలో... #bcrajyadhikarayathra #relareganga #newsong1
- కనగల్ లో ఎండిన వరి పొలాలను పరిశీలించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి నల్గొండ జిల్లా కనగల్ మండలం తెలకంటిగూడెంలో ఎండిన వరి పొలాలను మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి పరిశీలించారు. రైతులు భైరగోని పెద్ద లింగయ్య, యాదయ్యలతో కలిసి పొలంలోనే కూర్చొని పంట పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఘోరంగా ఉందని ఆయన మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, రైతులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.1
- రమణేశ్వరంలో భారీ వర్షం.. జలమయమైన ఆలయ పరిసరాలు..........1
- జిన్నారం మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం ఉదయం కమ్ముకున్న పొగ మంచు జిన్నారం మున్సిపల్ కేంద్రంలో సోమవారం ఉదయం దట్టమైన పొగమంచు కమ్ముకుంది. దీంతో రహదారులపై దృశ్యమానత తగ్గి వాహనదారులు, పాదచారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వాహనదారులు హెడ్లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు. దట్టమైన పొగమంచుతో ఆహ్లాదకరంగా మారిన ప్రకృతి దృశ్యాలను ప్రకృతి ప్రేమికులు సెల్‌ఫోన్లలో బంధించారు.1
- యాల యాలాలో మనసుల ప్రాణం ముఖ్యమును రో చట్టాన్ని ఇరకటం పెట్టకురా కన్నతల్లుల బాధ పెట్టకురా యాల యాలాలో మనసుల ప్రాణం ముఖ్యమును రో చట్టాన్ని ఇరకటం పెట్టకురా కన్నతల్లుల బాధ పెట్టకురా1
- మానవత దృక్పథాన్ని చాటుకున్న ఎర్రవల్లి గ్రామ మాజీ సర్పంచ్ జోగుల రవి గారు.. మానవత దృక్పథాన్ని చాటుకున్న ఎర్రవల్లి గ్రామ మాజీ సర్పంచ్ జోగుల రవి గారు.. *_NH-44పై రోడ్డు ప్రమాదం.. మాజీ ఇరిగేషన్ అధికారి బీసన్నకు తీవ్ర గాయాలు..!_* *_ప్రమాద స్థలంలో 108 అందుబాటులో లేకపోవడంతో సొంత వాహనంలో ఆసుపత్రికి తరలింపు..!_* *_బీసన్నకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరిన జోగుల రవి_* _పెబ్బేరు మండలం రంగాపూర్ గ్రామ పరిధిలోని NH-44 జాతీయ రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన గుర్తుతెలియని కారు బైక్‌ను ఢీకొనడంతో ఉండవెల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన మాజీ ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారి బీసన్న తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు బలమైన గాయం అయినట్లు సమాచారం._ _ప్రమాదం జరిగిన సమయంలో సంఘటనా స్థలంలో 108 అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో, అదే మార్గంలో వెళ్తున్న ఎర్రవల్లి గ్రామ మాజీ సర్పంచ్, అలంపూర్ యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు జోగుల రవి స్పందించారు. వెంటనే తన సొంత వాహనంలో గాయపడిన బీసన్నను తీసుకుని పెబ్బేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు._ _అనంతరం ఆసుపత్రి వైద్యులను కలిసి బీసన్న ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జోగుల రవి, బీసన్నకు అవసరమైన వైద్యం తక్షణమే అందించి, మెరుగైన వైద్యం కోసం అవసరమైతే ఉన్నత వైద్య కేంద్రానికి తరలించాలని వైద్యులను కోరారు._ *_ప్రమాద సమయంలో స్పందించి గాయపడిన వ్యక్తిని సకాలంలో ఆసుపత్రికి తరలించిన జోగుల రవి మానవతా దృక్పథాన్ని పలువురు అభినందించారు._*1