Shuru
Apke Nagar Ki App…
దాసరి వెంకట నాగేశ్వరరావు గారి కుమార్తె నందిని గారి కళ్యాణ మహోత్సవ కి ముఖ్యఅతిథిగా రేపల్లె నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త పీటా నాగమోహన్ కృష్ణ గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు
Syyed taher
దాసరి వెంకట నాగేశ్వరరావు గారి కుమార్తె నందిని గారి కళ్యాణ మహోత్సవ కి ముఖ్యఅతిథిగా రేపల్లె నియోజకవర్గం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త పీటా నాగమోహన్ కృష్ణ గారు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు
More news from Bapatla and nearby areas
- Post by Syyed taher1
- తాడికొండలో మర్డర్.. తాడికొండ మద్యం దుకాణంలో మరియదాసు అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. మద్యం తాగుతున్న సమయంలో గ్రామానికి చెందిన రమేశ్, మరియదాసు ఇరువురు ఘర్షణ పడ్డారు. విషయంతాడికొండలో మర్డర్.. అసలేం జరిగిందంటే..! తాడికొండ మద్యం దుకాణంలో మరియదాసు అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. మద్యం తాగుతున్న సమయంలో గ్రామానికి చెందిన రమేశ్, మరియదాసు ఇరువురు ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో మరియదాసు రమేశ్ తలపై బీరు బాటిల్తో కొట్టాడు. తీవ్ర గాయాలైన రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న రమేశ్ బంధువులు మద్యం దుకాణంలో ఉన్న మరియదాసును బ్రిక్స్ రాళ్లతో మోది హత మార్చారు. రాళ్లతో మోది హత మార్చారు.1
- అల్లూరి జిల్లా అనంతగిరి మండలం కీవర్ల పంచాయతీ, కొత్తవలస గ్రామంలో ఉపాది హమీ వేతనదారులు ముఖ హాజరు పడక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేసారు.గత మూడు రోజులుగా పనులకు వెళ్లిన ఎవరికి హాజరు పడలేదని, ఒక్కరికి మాత్రమే హాజరు పడిందని వారు వాపోయారు.ప్రభుత్వం, సంబందించిన జిల్లా అధికారులు స్పందించి ఉపాధి హామీని పాత పద్దతిలో కొనసాగించాలని గిరిజనులు విజ్ఞప్తి చేసారు.1
- తక్షణ స్పందన: ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే మున్సిపల్ చైర్‌పర్సన్ రిహన కమల్ పాషా మరియు మున్సిపల్ కమిషనర్ నరసింహారావు ఆసుపత్రికి చేరుకున్నారు. పరామర్శ: రాధ గారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, ఆమెకు ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. న్యాయం చేస్తామని హామీ: ఈ ప్రమాదానికి కారణమైన వారిని పిలిపించి, బాధితురాలికి తగు న్యాయం చేస్తామని మరియు అండగా ఉంటామని చైర్‌పర్సన్ గారు హామీ ఇచ్చారు.1
- మండపేట: కారు అదుపుతప్పి పంట కాలువలో దూసుకు వెళ్లడంతో కారులో వెళుతున్న భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందిన సంఘటన తాపేశ్వరం శివారు పేకెటిపాకలలో చోటుచేసుకుంది. మండపేట రూరల్ సీఐ దొరరాజు తెలిపిన వివరాల ప్రకారం భోగిల్లి వీర వెంకట సతీష్, భార్య భోగిల్లి కిరణ్మయి, తల్లి, తండ్రి, తమ ఇద్దరి పిల్లలతో కలిసి ఈనెల 3వ తారీఖున కాకినాడలో తమ బంధువుల పెళ్లికి హాజరయ్యారు. పెళ్లి అనంతరం అక్కడ పనులు చక్కబెట్టుకొని రాత్రి స్వగ్రామం వెలగతోడు తిరిగి వస్తుండగా తాపేశ్వరం శివారు పేకెటిపాకలు వచ్చేసరికి కారు అదుపుతప్పి పంట కాలువలోకి దూసుకు వెళ్ళిందని ఈ ప్రమాదంలో కారు నడుపుతున్న భర్త ముందు సీట్లో కూర్చున్న భార్య ఇద్దరు మృతి చెందారని సీఐ తెలిపారు. అయితే వెనక సీటులో కూర్చున్న సతీష్ తల్లి, తండ్రి, అదే విధంగా ఇద్దరు చిన్నపిల్లలను స్థానికులు సకాలంలో స్పందించి రక్షించారని సీఐ తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే రూరల్ ఎస్సై కిషోర్ తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో కారును బయటకు తీసి మృతదేహాలను మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.2
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ను ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ (MD) నాగిరెడ్డి ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండ్ ఆవరణను, ప్రయాణికులకు అందుతున్న సౌకర్యాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. ఎండీ పర్యటన సందర్భంగా పలువురు స్థానిక కార్పొరేటర్లు ఆయనను కలిసి బస్టాండ్‌లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం వినతిపత్రం అందజేశారు. బస్టాండ్ ఆవరణలో చుట్టూ పోల్స్ పాతి ఇనప కంచె వేయడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని వివరించారు. ఒక బస్సు లోపలికి వచ్చినప్పుడు మరో బస్సు వెళ్లడానికి కూడా వీలులేనంత ఇరుకుగా మారిందని, దీనివల్ల ప్రయాణికులను దించడానికి, ఎక్కించుకోవడానికి వచ్చే వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో బస్టాండ్ ఆవరణలో వరదనీరు నిలిచిపోవడం పట్ల తీవ్రఇబ్బంది ఎదురుకుంటున్నామని తెలిపారు. పాల్వంచ బస్టాండ్‌ను ఆధునీకరించేందుకు ప్రత్యేక నిధులు కేటాయించి, ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పించాలని వారు కోరారు. బస్టాండ్ పరిసరాలను పరిశీలించిన అనంతరం ఎండీ నాగిరెడ్డి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా శుభ్రత విషయంలో రాజీ పడకూడదని, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆదేశించారు. ట్రాఫిక్ సమస్యపై స్పందిస్తూ, క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పాల్వంచ బస్టాండ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించి, దీనిని మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి ఐపీఎస్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉన్నతాధికారులు, స్థానిక కార్పొరేటర్లు ,పలువురు నేతలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.1
- పార్లమెంటులో అమరావతి బిల్లు ఆమోదంపై హర్షం వ్యక్తం చేస్తూటిడిపి కూటమినేతల సంబరాలు అమరావతిని ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా గుర్తిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదం పొందడంపై కోవూరు నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంది. కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పిలుపు మేరకు విడవలూరు మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మరియు కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. "అమరావతి మన రాజధాని - అమరావతి మన భవిష్యత్తు" అంటూ కార్యకర్తలు చేసిన నినాదాలతో విడవలూరు గ్రామ వీధులు మార్మోగాయి. ఈ సందర్భంగా మండల టీడీపీ నాయకులు మాట్లాడుతూ ఐదు కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించేలా కృషి చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, కేంద్రంలోని కూటమి ప్రభుత్వ పెద్దలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి మన రాష్ట్ర శాశ్వత రాజధాని అని, దీని అభివృద్ధిని అడ్డుకోవడం ఎవరితరం కాదని వారు ధీమా వ్యక్తం చేశారు. ఈ భారీ ర్యాలీలో విడవలూరు మండల స్థాయి ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు మరియు సామాన్య ప్రజలు పాల్గొని తమ మద్దతు తెలిపారు. 4
- Post by Syyed taher1