Shuru
Apke Nagar Ki App…
తాడికొండలో మర్డర్.. తాడికొండ మద్యం దుకాణంలో మరియదాసు అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. మద్యం తాగుతున్న సమయంలో గ్రామానికి చెందిన రమేశ్, మరియదాసు ఇరువురు ఘర్షణ పడ్డారు. విషయంతాడికొండలో మర్డర్.. అసలేం జరిగిందంటే..! తాడికొండ మద్యం దుకాణంలో మరియదాసు అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. మద్యం తాగుతున్న సమయంలో గ్రామానికి చెందిన రమేశ్, మరియదాసు ఇరువురు ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో మరియదాసు రమేశ్ తలపై బీరు బాటిల్తో కొట్టాడు. తీవ్ర గాయాలైన రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న రమేశ్ బంధువులు మద్యం దుకాణంలో ఉన్న మరియదాసును బ్రిక్స్ రాళ్లతో మోది హత మార్చారు. రాళ్లతో మోది హత మార్చారు.
SHOT NEWS
తాడికొండలో మర్డర్.. తాడికొండ మద్యం దుకాణంలో మరియదాసు అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. మద్యం తాగుతున్న సమయంలో గ్రామానికి చెందిన రమేశ్, మరియదాసు ఇరువురు ఘర్షణ పడ్డారు. విషయంతాడికొండలో మర్డర్.. అసలేం జరిగిందంటే..! తాడికొండ మద్యం దుకాణంలో మరియదాసు అనే వ్యక్తి హత్యకు గురైన విషయం తెలిసిందే. స్థానికుల వివరాల మేరకు.. మద్యం తాగుతున్న సమయంలో గ్రామానికి చెందిన రమేశ్, మరియదాసు ఇరువురు ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో మరియదాసు రమేశ్ తలపై బీరు బాటిల్తో కొట్టాడు. తీవ్ర గాయాలైన రమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. విషయం తెలుసుకున్న రమేశ్ బంధువులు మద్యం దుకాణంలో ఉన్న మరియదాసును బ్రిక్స్ రాళ్లతో మోది హత మార్చారు. రాళ్లతో మోది హత మార్చారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- అల్లూరి జిల్లా, అనంతగిరి మండలం పరిధిలో గల పినకోటకు వెళ్లే ఆర్ అండ్ బి మెయిన్ రోడ్డు నుంచి బల్ల గురువు మీదుగా వాజంగి గ్రామానికి వెళ్లే రోడ్డును మరమ్మత్తులు చేయాలని గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు.15ఏళ్ళ క్రితం గ్రామాలకు రోడ్డు పనులు చేపట్టరన్నారు.అటుగా భారీ వాహనాలు వెళ్లడంతో 10కిలోమీటర్ల తారు రోడ్డు పూర్తిగాపాడైపోయి గోతులు ఏర్పడ్డాయి.తక్షణమే అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తులు పనులను చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ బంగారు జాల కు చెందిన మహిళపై యువకుడు అమానుషంగా ప్రవర్తించాడు. తనతో మాట్లాడుకుందామని చెప్పి కోపంతో ఆమెపై బీరు సీసా, కర్రతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. మున్సిపల్ పరిధిలోని బంగారు జలకకు చెందిన తాటి నికిత (24) ఒక కిరాణా షాపులో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటోంది. మండల పరిధిలోని కరకవాగు ప్రాంతానికి చెందిన వజ్జా పవన్ అనే యువకుడు కొంతకాలంగా ఆమెను వేధిస్తున్నాడు. శనివారం ఉదయం నటరాజ్ సెంటర్ వద్ద ఆమెను అడ్డగించి వేధించడమే కాకుండా, అందరి ముందూ భయభ్రాంతులకు గురిచేశాడు. వేధింపులు భరించలేక బాధితురాలు ఫిర్యాదు చేసేందుకు పట్టణ పోలీస్ స్టేషన్‌కు వెళ్ళింది. ఫిర్యాదు రాసిమ్మని సిబ్బంది చెప్పటంతో స్టేషన్ నుండి బయటకు వస్తున్న క్రమం లో, పవన్ మరో వ్యక్తి (ఆటో డ్రైవర్) కలిసి ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించుకుని కరకవాగు రైల్వే ట్రాక్ ప్రాంతానికి తీసుకువెళ్లాడని యువతి తెలిపింది.. పవన్, అక్కడ యువతిపై అత్యాచారం చేసి,బీరు సీసా, కర్రతో కొట్టడంతో ఆమె తల, చేతులు, మోకాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం బాధితురాలిని ఆటోలోనే ప్రభుత్వ ఆసుపత్రి ముందు పడేసి నిందితుడు పరారయ్యాడని యువతి ఆరోపిస్తుంది... ప్రస్తుతం బాధితురాలు పాల్వంచ ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతోంది. ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాధితురాలి నుంచి వివరాలు సేకరించారు.4
- తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్టు అసోసియేషన్ 2025 ఉత్తమ ఫోటోజర్నలిస్టుల అవార్డు ప్రధాన కార్యక్రమం ఆదివారం హైదరాబాద్, నాంపల్లి, తెలంగాణ మీడియా అకాడమీ కార్యాలయంలో భారత మాజీ ఉప రాష్ట్రపతి శ్రీ ఏం. వెంకయ్య నాయుడు చేతుల మీదుగా నల్గొండ ఫోటో జర్నలిస్ట్ ముచ్చర్ల శ్రీనివాస్ గౌడ్ అవార్డు అందుకున్నరు1
- వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలో రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఏనుగల్లు గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. రైతులు పండించే ప్రతి గింజను కొనుగోలు చేస్తామని, క్వింటాల్ మొక్కజొన్నకు రూ.2400 మద్దతు ధర చెల్లిస్తున్నట్లు తెలిపారు. రైతులకు సరైన ధర కల్పించడం, పంట సేకరణను సులభతరం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.1
- వరంగల్ పెద్దమ్మ గడ్డ లో ఒక యువకుడి (24) పై హత్యాయత్నం ఆర్థిక లావదేవీలు కారణం అంటున్న స్థానికులు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఎంజిఎం ఆసుపత్రికి తరలింపు యువకుని పరిస్థితి విషమం1
- Post by Bondhu Suresh1
- Post by Syyed taher1
- సంఘ సంస్కర్తగా, దళితుల పక్షపాతిగా బాబు జగ్జీవన్ రామ్ అందించిన సేవలు నేటితరానికి ఆదర్శమని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె.సాబీర్ పాషా అన్నారు. భారత తొలి దళిత ఉప ప్రధానమంత్రి, సంఘ సంస్కర్త డాక్టర్ బాబూ జగ్జివన్ రామ్ 119వ జయంతిని ఆదివారం స్థానిక బస్ స్టాండ్ సెంటర్ నందు బాబూ జగ్జివన్ రామ్ విగ్రహ నిర్మాణం కమిటీ, దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సాబీర్ పాషా తొలుత జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ దళితుల అభ్యదయానికి అహర్నిశలు కృషి చేశారని, మహాణీయుల్లో జగ్జీవన్ రామ్ ప్రముఖుడన్నారు. భారతదేశ తొలి ఉప ప్రధాన మంత్రిగా నిస్వార్ధంగా సేవలందించారని, మచ్చలేని నాయకుడిగా పేరు సంపాదించుకున్నాడన్నారు. నాలుగు దశాబ్దాలుగా పార్లమెంటేరియన్ గా ప్రజల పక్షాన వారి గళాన్ని వినిపించి ప్రజలు, నిమ్నజాతి సంక్షేమకోసం అహర్నిషలు కృషి చేశారన్నారు. అసమానతలు లేని సమాజ స్థాపనకోసం జగ్జీవన్ రామ్ పరితపించాడని అన్నారు. అయన అందించిన సేవలకు గుర్తింపుగా దేశ ప్రజలు బాబూజీగా నామకరణం చేశారన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకొని కులరక్కసిని పారద్రోలేందుకు కృషి చేయాలని, రాజ్యంగం కల్పించిన హక్కులను పరిరక్షించుకునేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు.3
- మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని శ్రీ ముసలమ్మ గుంజేడు జాతరకు భక్తులు భారీగా తరలివస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు వినూత్న అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. జాతర మార్గంలోని అటవీ ప్రాంతంలో రోడ్డుకు ఇరువైపులా చిత్రకారుల చేత గీయించిన వన్యప్రాణుల చిత్రాలను ఏర్పాటు చేసి భక్తులకు ప్రకృతి, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు. పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, పక్షులు వంటి జంతువుల చిత్రాలను ప్రదర్శిస్తూ వాటి ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా భక్తుల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం పెరుగుతుందని అధికారులు తెలిపారు.1