logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఎంఎస్సి ఫారంలోని పాఠశాలలో బాల సభ...విద్య బోధన,భద్రత,హక్కుల గురించి అడిగి తెలుసుకున్న సర్పంచ్ జయశ్రీ శ్రీనివాస్ గౌడ్...పోటిల్లో ప్రతిభ కనబర్చిన విజేతలకు బహుమతులు అందజేసిన సర్పంచ్, కార్యదర్శి... ఎడపల్లి,జూలై 29: ఎడపల్లి మండలం ఎంఎస్ సి ఫారం గ్రామంలోని ప్రభుత్వ ప్రైమరి పాఠశాలలో బుధవారం సర్పంచ్ నోముల జయశ్రీ శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన బాల సభ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యా ర్థులతో బాలల హక్కులు,విద్య,ఆరోగ్యం, పరిశుభ్రత, భద్రత అలాగే వారు ఎదుర్కొంటున్న వివిధ సమస్య లపై చర్చించారు.ఈ సందర్బంగా విద్యార్థులు ఎదు ర్కొంటున్న సమస్యలు వారి అభిప్రాయాలను సర్పంచ్ తెలుసుకున్నారు. అనంతరం"సోక్ పిట్"అంశంపై విద్యా ర్థులకు వ్యాసరచన అలాగే డ్రాయింగ్ పోటీలు నిర్వహించటం జరిగింది అని తెలిపారు.ప్రతిభ కనబ రిచిన విద్యార్థులకు ప్రథమ,ద్వితీయ, తృతీయ బహుమతులు సర్పంచ్ నోముల జయశ్రీ శ్రీనివాస్ గౌడ్,పంచాయతి కార్యదర్శి జవాజీ రాజు అందజేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి జవాజీ రాజు,స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నోముల శ్రీనివాస్ గౌడ్,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారదా,ఉపాధ్యా యులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

18 hrs ago
user_K.Ashok.Journalist.
K.Ashok.Journalist.
బోధన్, నిజామాబాద్, తెలంగాణ•
18 hrs ago
0eadd7f3-d476-4264-a038-d830c7cc5a9c

ఎంఎస్సి ఫారంలోని పాఠశాలలో బాల సభ...విద్య బోధన,భద్రత,హక్కుల గురించి అడిగి తెలుసుకున్న సర్పంచ్ జయశ్రీ శ్రీనివాస్ గౌడ్...పోటిల్లో ప్రతిభ కనబర్చిన విజేతలకు బహుమతులు అందజేసిన సర్పంచ్, కార్యదర్శి... ఎడపల్లి,జూలై 29: ఎడపల్లి మండలం ఎంఎస్ సి ఫారం గ్రామంలోని ప్రభుత్వ ప్రైమరి పాఠశాలలో బుధవారం సర్పంచ్ నోముల జయశ్రీ శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన బాల సభ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో విద్యా ర్థులతో బాలల హక్కులు,విద్య,ఆరోగ్యం, పరిశుభ్రత, భద్రత అలాగే వారు ఎదుర్కొంటున్న వివిధ సమస్య లపై చర్చించారు.ఈ సందర్బంగా విద్యార్థులు ఎదు ర్కొంటున్న సమస్యలు వారి అభిప్రాయాలను సర్పంచ్ తెలుసుకున్నారు. అనంతరం"సోక్ పిట్"అంశంపై విద్యా ర్థులకు వ్యాసరచన అలాగే డ్రాయింగ్ పోటీలు నిర్వహించటం జరిగింది అని తెలిపారు.ప్రతిభ కనబ రిచిన విద్యార్థులకు ప్రథమ,ద్వితీయ, తృతీయ బహుమతులు సర్పంచ్ నోముల జయశ్రీ శ్రీనివాస్ గౌడ్,పంచాయతి కార్యదర్శి జవాజీ రాజు అందజేసి అభినందించారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి జవాజీ రాజు,స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నోముల శ్రీనివాస్ గౌడ్,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శారదా,ఉపాధ్యా యులు,సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఎన్నో ఏళ్ల కళ నెరవేరబోతుంది... పట్టాలెక్కనున్న ఆర్మూర్ - ఆదిలాబాద్ రైల్వే లైన్ నిర్మల్ జిల్లా వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్మూర్ - నిర్మల్ - ఆదిలాబాద్ రైల్వే లైన్ ప్రాజెక్టును ఆమోదించాలని తెలంగాణ బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కుమార్ ను కోరారు.రైల్వే లైన్ ప్రాజెక్టు డీపీఆర్ పూర్తయినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి వెల్లడించారు.త్వరలో పనుల అనుమతులకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుందని తనను కలిసిన బీజేపీ బృందానికి కేంద్రమంత్రి చెప్పారు.
    1
    ఎన్నో ఏళ్ల కళ నెరవేరబోతుంది... పట్టాలెక్కనున్న ఆర్మూర్ - ఆదిలాబాద్ రైల్వే లైన్
నిర్మల్ జిల్లా వాసులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఆర్మూర్ - నిర్మల్ - ఆదిలాబాద్ రైల్వే లైన్ ప్రాజెక్టును ఆమోదించాలని తెలంగాణ బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢిల్లీలో కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కుమార్ ను కోరారు.రైల్వే లైన్ ప్రాజెక్టు డీపీఆర్ పూర్తయినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి వెల్లడించారు.త్వరలో పనుల అనుమతులకు సంబంధించిన ప్రక్రియ ప్రారంభమవుతుందని తనను కలిసిన బీజేపీ బృందానికి కేంద్రమంత్రి చెప్పారు.
    user_Murali
    Murali
    Insurance Agent భైంసా, నిర్మల్, తెలంగాణ•
    22 hrs ago
  • సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ శ్రీనివాస్ ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు శుక్రవారం సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో పోలీసులు విస్తృతంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 51 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు స్వాధీనం చేసుకుని, పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను వసూలు చేశారు. అనంతరం గ్రామస్తులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలు, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుర్రం రాము, సోన్ సీఐ గోవర్ధన్, ఎస్సైలు గోపి, శ్రావణి హన్మండ్లుతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
    1
    సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ శ్రీనివాస్ 
ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు శుక్రవారం సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో పోలీసులు విస్తృతంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 51 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు స్వాధీనం చేసుకుని, పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను వసూలు చేశారు. అనంతరం గ్రామస్తులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలు, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుర్రం రాము, సోన్ సీఐ గోవర్ధన్, ఎస్సైలు గోపి, శ్రావణి హన్మండ్లుతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
    user_SIDDU.ASRC
    SIDDU.ASRC
    నిర్మల్, తెలంగాణ•
    20 hrs ago
  • korutla pattanam lo thrishakthimatha devalayam lo varahi navarathrulu varahi navarathri lo bhakti shradhala tho kalakaladuthunna korutla thrishakthi devalayam
    4
    korutla pattanam lo thrishakthimatha  devalayam lo varahi navarathrulu
varahi navarathri lo bhakti shradhala tho kalakaladuthunna korutla thrishakthi devalayam
    user_Pallikondashivakumar
    Pallikondashivakumar
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    14 hrs ago
  • సిరిసిల్ల అరెకటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల పండుగలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సిరిసిల్ల అరెకటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల పండుగలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకొని ఆ అమ్మవారి కృపకు ప్రతి ఒక్కరూ పాత్రలు కావాలని ఆ అమ్మవారి చల్లని ఆశీస్సులతో ప్రజలందరూ వ్యవసాయం వ్యాపారం వారి వారి రంగాలలో వృద్ధిని సాధిస్తూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటూన్నామని అన్నారు. ఆరెకటిక సంఘం సిరిసిల్ల వారిలోని ఐక్యతను తెలియజేసేలా వైభవంగా అమ్మవారికి బోనాలను సమర్పించడానికి అందరూ కలిసి ఊరేగింపుగా బయలుదేరి వెళ్తున్న ఈ దృశ్యం కనుల పండగ ఉందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్న అరేకటిక సంఘం సిరిసిల్ల వారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని ఆ పోచమ్మ తల్లి వారి ఆశీస్సులతో సిరిసిల్ల అరెకటిక సంఘం వారు సమాజంలో ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలవాలని అమ్మవారి ఆశీస్సులు వారిపై వారి కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో అరెకటిక సంఘం రాష్ట్ర నాయకులు గజబింకర్ చందు , సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు గజబింకర్ మహేందర్ , ఉపాధ్యక్షులు గజబింకర్ బాబు ,గజబింకర్ దశరథం , ఇతర కార్యవర్గ సభ్యులు కుల పెద్దలు ఆడపడుచులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    సిరిసిల్ల అరెకటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల పండుగలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
సిరిసిల్ల అరెకటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల పండుగలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకొని ఆ అమ్మవారి కృపకు ప్రతి ఒక్కరూ పాత్రలు కావాలని ఆ అమ్మవారి చల్లని ఆశీస్సులతో ప్రజలందరూ వ్యవసాయం వ్యాపారం వారి వారి రంగాలలో వృద్ధిని సాధిస్తూ సుఖ సంతోషాలతో  జీవించాలని కోరుకుంటూన్నామని అన్నారు. ఆరెకటిక సంఘం సిరిసిల్ల  వారిలోని ఐక్యతను తెలియజేసేలా వైభవంగా అమ్మవారికి బోనాలను సమర్పించడానికి  అందరూ కలిసి ఊరేగింపుగా బయలుదేరి వెళ్తున్న ఈ దృశ్యం కనుల పండగ ఉందని అన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్న అరేకటిక సంఘం సిరిసిల్ల వారికి ఈ సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని ఆ పోచమ్మ తల్లి వారి ఆశీస్సులతో సిరిసిల్ల అరెకటిక సంఘం వారు సమాజంలో ఎంతో మందికి ఆదర్శప్రాయంగా నిలవాలని అమ్మవారి ఆశీస్సులు వారిపై వారి కుటుంబ సభ్యులపై ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము అని అన్నారు.ఈ కార్యక్రమంలో అరెకటిక సంఘం రాష్ట్ర నాయకులు గజబింకర్ చందు , సిరిసిల్ల పట్టణ అధ్యక్షులు గజబింకర్ మహేందర్ , ఉపాధ్యక్షులు గజబింకర్ బాబు ,గజబింకర్ దశరథం , ఇతర కార్యవర్గ సభ్యులు కుల పెద్దలు ఆడపడుచులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    7 hrs ago
  • ఆసుపత్రిలో ఆర్డీఓ ఆకస్మిక తనిఖీ.. రోగులతో నేరుగా ముచ్చట తూప్రాన్ 50 పడకల సామాజిక ఆసుపత్రిని ఆర్డీఓ బావయ్య శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలపై సూపరింటెండెంట్ డాక్టర్ అమర్ సింగ్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వార్డులను పరిశీలించి రోగులతో నేరుగా మాట్లాడి చికిత్స, మందుల లభ్యత, వైద్య సిబ్బంది సేవలపై అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా రోగులకు సమయానికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి రోగితో మానవీయంగా వ్యవహరించి వారికి మనోధైర్యం కల్పించాలని వైద్యులు, సిబ్బందికి ఆర్డీఓ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగేలా సేవలు అందించాలని ఆయన పేర్కొన్నారు.
    1
    ఆసుపత్రిలో ఆర్డీఓ ఆకస్మిక తనిఖీ.. రోగులతో నేరుగా ముచ్చట
తూప్రాన్ 50 పడకల సామాజిక ఆసుపత్రిని ఆర్డీఓ బావయ్య శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, మౌలిక సదుపాయాలపై సూపరింటెండెంట్ డాక్టర్ అమర్ సింగ్‌ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం వార్డులను పరిశీలించి రోగులతో నేరుగా మాట్లాడి చికిత్స, మందుల లభ్యత, వైద్య సిబ్బంది సేవలపై అభిప్రాయాలు సేకరించారు. ఈ సందర్భంగా రోగులకు సమయానికి నాణ్యమైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి రోగితో మానవీయంగా వ్యవహరించి వారికి మనోధైర్యం కల్పించాలని వైద్యులు, సిబ్బందికి ఆర్డీఓ సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం మరింత పెరిగేలా సేవలు అందించాలని ఆయన పేర్కొన్నారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    8 hrs ago
  • రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఘన సన్మానం సేవలను కొనియాడిన ఈవో రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఘనంగా వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు భీమేశ్వర సదన్‌లో టి.ఎన్.జి.ఓస్ స్పెషల్ యూనిట్ మినిస్టీరియల్ & 4వ తరగతి సిబ్బంది యూనియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా కృష్ణ యజుర్వేద పారాయణదార్ సువర్ణ రాధాకృష్ణ శర్మ, సేవాదార్ వేముల లక్ష్మీనారాయణలను దేవస్థానం తరఫున ఘనంగా సత్కరించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి ఈవో రమాదేవి వారికి స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటాన్ని అందజేసి సన్మానించారు.ఈ సందర్భంగా ఈవో రమాదేవి మాట్లాడుతూ, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు దేవస్థాన అభివృద్ధికి, భక్తుల సేవకు ఎన్నో సంవత్సరాల పాటు విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. ఉద్యోగ విరమణ అనేది సేవకు ముగింపు కాదని, రాజన్న–భీమన్నల సేవలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు ఎప్పుడైనా ఆలయానికి వచ్చి సేవలందించవచ్చని తెలిపారు. పదవీ విరమణ అనంతరం వారికి రావలసిన అన్ని పదవీ విరమణ ప్రయోజనాలను (రిటైర్మెంట్ బెనిఫిట్స్) నిబంధనల ప్రకారం అందజేస్తామని హామీ ఇచ్చారు.పదవీ విరమణ పొందిన ఉద్యోగులు మాట్లాడుతూ, దేవస్థానంలో పనిచేసిన కాలాన్ని తమ జీవితంలో చిరస్మరణీయమైన ఘట్టంగా అభివర్ణించారు. సహోద్యోగులు, అధికారులు అందరూ కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి పనిచేశారని, అందరి సహకారం ఎప్పటికీ మరువలేమని భావోద్వేగంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, ఆలయ అర్చకులు, వేద పండితులు, ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, యూనియన్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమానికి టి.ఎన్.జి.ఓస్ స్పెషల్ యూనిట్ మినిస్టీరియల్ & 4వ తరగతి సిబ్బంది యూనియన్ అధ్యక్షుడు కూరగాయల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వంశీమోహన్ అధ్యక్షత వహించి సమన్వయం చేశారు.
    1
    రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఘన సన్మానం  సేవలను కొనియాడిన ఈవో 
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శుక్రవారం పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు ఘనంగా వీడ్కోలు సమావేశాన్ని నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు భీమేశ్వర సదన్‌లో టి.ఎన్.జి.ఓస్ స్పెషల్ యూనిట్ మినిస్టీరియల్ & 4వ తరగతి సిబ్బంది యూనియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా కృష్ణ యజుర్వేద పారాయణదార్ సువర్ణ రాధాకృష్ణ శర్మ, సేవాదార్ వేముల లక్ష్మీనారాయణలను దేవస్థానం తరఫున ఘనంగా సత్కరించారు. ఆలయ కార్యనిర్వాహణాధికారి ఈవో రమాదేవి వారికి స్వామివారి శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటాన్ని అందజేసి సన్మానించారు.ఈ సందర్భంగా ఈవో రమాదేవి మాట్లాడుతూ, పదవీ విరమణ పొందిన ఉద్యోగులు దేవస్థాన అభివృద్ధికి, భక్తుల సేవకు ఎన్నో సంవత్సరాల పాటు విశిష్ట సేవలు అందించారని కొనియాడారు. ఉద్యోగ విరమణ అనేది సేవకు ముగింపు కాదని, రాజన్న–భీమన్నల సేవలో పాల్గొనాలనే ఆసక్తి ఉన్నవారు ఎప్పుడైనా ఆలయానికి వచ్చి సేవలందించవచ్చని తెలిపారు. పదవీ విరమణ అనంతరం వారికి రావలసిన అన్ని పదవీ విరమణ ప్రయోజనాలను (రిటైర్మెంట్ బెనిఫిట్స్) నిబంధనల ప్రకారం అందజేస్తామని హామీ ఇచ్చారు.పదవీ విరమణ పొందిన ఉద్యోగులు మాట్లాడుతూ, దేవస్థానంలో పనిచేసిన కాలాన్ని తమ జీవితంలో చిరస్మరణీయమైన ఘట్టంగా అభివర్ణించారు. సహోద్యోగులు, అధికారులు అందరూ కుటుంబ సభ్యుల్లా కలిసిమెలిసి పనిచేశారని, అందరి సహకారం ఎప్పటికీ మరువలేమని భావోద్వేగంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, ఆలయ అర్చకులు, వేద పండితులు, ఉద్యోగులు, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, యూనియన్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమానికి టి.ఎన్.జి.ఓస్ స్పెషల్ యూనిట్ మినిస్టీరియల్ & 4వ తరగతి సిబ్బంది యూనియన్ అధ్యక్షుడు కూరగాయల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి వంశీమోహన్ అధ్యక్షత వహించి సమన్వయం చేశారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    12 hrs ago
  • తూప్రాన్ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రెయిన్‌కోట్లు, సేఫ్టీ కిట్లను పంపిణీ తూప్రాన్ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రెయిన్‌కోట్లు, సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చైర్‌పర్సన్ బొంది రజనీ, కమిషనర్ రమేష్ కుమార్ కార్మికులకు కిట్లు అందజేశారు. వర్షాకాలంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ విధులు నిర్వహించే పారిశుధ్య కార్మికులు సురక్షితంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ చర్య చేపట్టినట్లు వారు తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో కార్మికుల సేవలు కీలకమని, వారి సంక్షేమానికి మున్సిపాలిటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
    1
    తూప్రాన్ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రెయిన్‌కోట్లు, సేఫ్టీ కిట్లను పంపిణీ
తూప్రాన్ మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తూ రెయిన్‌కోట్లు, సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో చైర్‌పర్సన్ బొంది రజనీ, కమిషనర్ రమేష్ కుమార్ కార్మికులకు కిట్లు అందజేశారు. వర్షాకాలంలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ విధులు నిర్వహించే పారిశుధ్య కార్మికులు సురక్షితంగా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ చర్య చేపట్టినట్లు వారు తెలిపారు. ప్రజారోగ్య పరిరక్షణలో కార్మికుల సేవలు కీలకమని, వారి సంక్షేమానికి మున్సిపాలిటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
    user_Priya
    Priya
    నర్సాపూర్, మెదక్, తెలంగాణ•
    8 hrs ago
  • *అధ్వానంగా రత్నాపూర్ రోడ్డు పరిస్థితి * న్యాల్కల్ మండలం రత్నాపూర్ గ్రామ ప్రధాన రహదారి భారీ వర్షాలతో గుంతలమాయమై ప్రజలు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షపు నీరు నిల్వ ఉండడంతో విద్యార్థులు రైతులు వాహనదారులకు రాకపోకల కష్టంగా మారాయి రహదారి దుస్థితితో ప్రమాదాల ముప్పు పెరిగిందని విజయ్ కుమార్ తెలిపారు అధికారులు వెంటనే స్పoదిoచి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ఆయన కోరారు
    1
    *అధ్వానంగా  రత్నాపూర్  రోడ్డు పరిస్థితి 
            *  
న్యాల్కల్ మండలం  రత్నాపూర్ గ్రామ ప్రధాన రహదారి భారీ వర్షాలతో గుంతలమాయమై ప్రజలు త్రీవ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వర్షపు నీరు నిల్వ ఉండడంతో విద్యార్థులు రైతులు వాహనదారులకు రాకపోకల కష్టంగా మారాయి రహదారి దుస్థితితో ప్రమాదాల ముప్పు పెరిగిందని విజయ్ కుమార్ తెలిపారు అధికారులు వెంటనే స్పoదిoచి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ఆయన కోరారు
    user_Reporter MD khaleel
    Reporter MD khaleel
    Local News Reporter జహీరాబాద్, సంగారెడ్డి, తెలంగాణ•
    14 hrs ago
  • ఎర్రపహాడ్ గ్రామంలో ఇంటి ముందున్న గుంతలో పడి రెండేళ్ల చిన్నారి మృతి* తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంటి సమీపంలో తవ్విన పిల్లర్ గుంతలో పడి రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయింది. ఘటన వివరాలు: తల్లి పనుల నిమిత్తం బయటకు వెళ్తున్న సమయంలో, చిన్నారి ఆమెకు తెలియకుండా వెనుకనే బయటకు వచ్చింది. ఈ క్రమంలో సమీపంలోనే ఉన్న పిల్లర్ గుంతలో పడిపోయింది. కొంతసేపటికి పాప కనిపించకపోవడంతో కంగారుపడిన కుటుంబసభ్యులు ఇంటి చుట్టుపక్కల వెతికారు. ప్రయోజనం లేకపోవడంతో ఆ ప్రాంతంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజ్‌ను పరిశీలించారు. పాప తల్లి వెనకాలే వచ్చి గుంతలో పడిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపించడంతో వెంటనే గుంత నుంచి చిన్నారిని బయటకు తీశారు. కానీ, అప్పటికే పాప మృతి చెందింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పసిపాప కళ్లముందే అనంత లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబంలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి.
    1
    ఎర్రపహాడ్ గ్రామంలో ఇంటి ముందున్న గుంతలో పడి రెండేళ్ల చిన్నారి మృతి*
తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇంటి సమీపంలో తవ్విన పిల్లర్ గుంతలో పడి రెండేళ్ల చిన్నారి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయింది.
ఘటన వివరాలు:
తల్లి పనుల నిమిత్తం బయటకు వెళ్తున్న సమయంలో, చిన్నారి ఆమెకు తెలియకుండా వెనుకనే బయటకు వచ్చింది. ఈ క్రమంలో సమీపంలోనే ఉన్న పిల్లర్ గుంతలో పడిపోయింది. కొంతసేపటికి పాప కనిపించకపోవడంతో కంగారుపడిన కుటుంబసభ్యులు ఇంటి చుట్టుపక్కల వెతికారు. ప్రయోజనం లేకపోవడంతో ఆ ప్రాంతంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజ్‌ను పరిశీలించారు.
పాప తల్లి వెనకాలే వచ్చి గుంతలో పడిపోయిన దృశ్యాలు సీసీ కెమెరాలో స్పష్టంగా కనిపించడంతో వెంటనే గుంత నుంచి చిన్నారిని బయటకు తీశారు. కానీ, అప్పటికే పాప మృతి చెందింది. కంటికి రెప్పలా చూసుకోవాల్సిన పసిపాప కళ్లముందే అనంత లోకాలకు వెళ్లడంతో ఆ కుటుంబంలో తీవ్ర శోకఛాయలు అలముకున్నాయి.
    user_Routhu srikanth
    Routhu srikanth
    నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    22 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.