logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తెలంగాణ లో అర్బన్ నక్సల్స్ లేరని తేల్చిచెప్పిన డిజిపి శివధర్ రెడ్డి...రాష్ట్రవ్యాప్తంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడి తెలంగాణలో అర్బన్ నక్సలైట్లు ఎవరు లేరని రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఆర్మ్ డ్ రిజర్వ్ పోలీసు నివాస గృహాలను రాష్ట్ర డిజిపి ప్రారంభించారు. పోలీస్ హౌసింగ్ ఫండ్ 12 కోట్ల 29 లక్షలతో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన 19 నివాస గృహాలకు డిజిపి గృహ ప్రవేశం చేశారు. సందర్భంగా డిజిపి మాట్లాడుతూ సోమవారం నుండి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్థాయి నుండి ప్రజా ప్రతినిధులతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు, ఉద్యోగులను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, మరణాల రేటును తగ్గించేందుకు రోడ్డు భద్రత నియమాలు పాటించేలా ప్రజలను సమాయత్వం చేస్తామని తెలిపారు. డిజిపి వెంట పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి మహేష్ ఎం భగవత్, వరంగల్ రేంజ్ ఐజి చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం, కరీంనగర్ సిపి అంబర్ కిషోర్ ఝ, గౌస్ ఆలం, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

2 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
2 hrs ago

తెలంగాణ లో అర్బన్ నక్సల్స్ లేరని తేల్చిచెప్పిన డిజిపి శివధర్ రెడ్డి...రాష్ట్రవ్యాప్తంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడి తెలంగాణలో అర్బన్ నక్సలైట్లు ఎవరు లేరని రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఆర్మ్ డ్ రిజర్వ్ పోలీసు నివాస గృహాలను రాష్ట్ర డిజిపి ప్రారంభించారు. పోలీస్ హౌసింగ్ ఫండ్ 12 కోట్ల 29 లక్షలతో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన 19 నివాస గృహాలకు డిజిపి గృహ ప్రవేశం చేశారు. సందర్భంగా డిజిపి మాట్లాడుతూ సోమవారం నుండి ప్రజా పాలన ప్రగతి

ప్రణాళిక లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్థాయి నుండి ప్రజా ప్రతినిధులతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు, ఉద్యోగులను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, మరణాల రేటును తగ్గించేందుకు రోడ్డు భద్రత నియమాలు పాటించేలా ప్రజలను సమాయత్వం చేస్తామని తెలిపారు. డిజిపి వెంట పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి మహేష్ ఎం భగవత్, వరంగల్ రేంజ్ ఐజి చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం, కరీంనగర్ సిపి అంబర్ కిషోర్ ఝ, గౌస్ ఆలం, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • రైతులకు కావాల్సిన పనిముట్లు రాయితీపై ఇచ్చేందుకు సిద్దంగా ఉందని రైతులు రాయితీ పనిముట్లు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ చిగురుమామిడి మండల కేంద్రంలో ఉన్నత పాఠశాల ప్రాంగణంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్థల పరిశీలన చేశారు. ప్రభుత్వం అధునాతన సౌకర్యాలతో 4 ఎకరాల విస్తీర్ణంలో 1 నుంచి 12 తరగతి వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ లను తీసుకొస్తుండడంతో చిగురుమామిడిలో స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. పాఠశాల ప్రాంగణంలోనే ప్రైమరీ, హైస్కూల్, జూనియర్ కాలేజీ ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం చిగురుమామిడి రైతు వేదిక వద్ద వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2025-26 SMAM రాయితీ పై వ్యవసాయ పనిముట్లు , యంత్రాలకు రైతులకు పంపిణీ చేశారు. 24 మంది రైతులకు 40 లక్షల 80 వేల రూపాయల విలువైన అధునాతన వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశారు. 15 రోటావేటర్లు ,బెయిలర్లు, పవర్ స్ప్రేయర్లు ,తదితర పనిముట్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, సర్పంచ్ ఆకవరం భవానీ, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఆర్డీవో మహేశ్వర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చాలా సంవత్సరాల తరువాత ప్రజా ప్రభుత్వంలో పనిముట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇంకా ఎవరికైనా అవసరం ఉంటే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చే పనిముట్లను రైతులు సద్వినియోగం చేసుకొని వరికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని కోరారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, ఎక్కడ ఇబ్బందులు లేవని తెలిపారు. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారు ఆయిల్ ఫాం సాగు చేయాలని, తాను కూడా ఆయిల్ ఫామ్ సాగు చేస్తానని తెలిపారు. చిన్న గ్రామాల్లో 50 ఎకరాలు ,పెద్ద గ్రామాల్లో 100 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని, ఆయిల్ ఫాం సాగు వల ప్రకృతి ఇబ్బందులు ,కోతుల ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. నర్మేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని రైతులు విజిట్ చేయాలని సూచించారు. సాగు నీరు కాలువలు పూర్తయ్యేలా కృషి చేస్తున్నామని, గౌరవెల్లి ప్రాజెక్ట్ పై ఇటీవల సమీక్షా నిర్వహించామన్నారు. త్వరలోనే కాలువల పనులు పూర్తి చేస్తామని తెలిపారు. హుస్నాబాద్ మండలం కూచనపల్లి లో 21 లక్షల 30 లక్షల వ్యయంతో మర్రి పంపు చెక్ డ్యాం ఫీడర్ చానెల్ కి శంకుస్థాపన చేశారు. హుస్నాబాద్ కి నలు వైపుల నాలుగు లేన్ రోడ్డు నిర్మాణం జరుగుతుందని, నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు.
    4
    రైతులకు కావాల్సిన పనిముట్లు రాయితీపై ఇచ్చేందుకు సిద్దంగా ఉందని రైతులు రాయితీ పనిముట్లు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ చిగురుమామిడి మండల కేంద్రంలో ఉన్నత పాఠశాల ప్రాంగణంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్థల పరిశీలన చేశారు. ప్రభుత్వం అధునాతన సౌకర్యాలతో 4 ఎకరాల విస్తీర్ణంలో 1 నుంచి 12 తరగతి వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ లను తీసుకొస్తుండడంతో చిగురుమామిడిలో స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. పాఠశాల ప్రాంగణంలోనే ప్రైమరీ, హైస్కూల్, జూనియర్ కాలేజీ ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం చిగురుమామిడి రైతు వేదిక వద్ద వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2025-26 SMAM రాయితీ పై వ్యవసాయ పనిముట్లు , యంత్రాలకు రైతులకు పంపిణీ చేశారు. 24 మంది రైతులకు 40 లక్షల 80 వేల రూపాయల విలువైన అధునాతన వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశారు. 15 రోటావేటర్లు ,బెయిలర్లు, పవర్ స్ప్రేయర్లు ,తదితర పనిముట్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, సర్పంచ్ ఆకవరం భవానీ, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఆర్డీవో మహేశ్వర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చాలా సంవత్సరాల తరువాత ప్రజా ప్రభుత్వంలో పనిముట్లు  పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇంకా ఎవరికైనా అవసరం ఉంటే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చే పనిముట్లను రైతులు సద్వినియోగం చేసుకొని వరికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని కోరారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, ఎక్కడ ఇబ్బందులు లేవని తెలిపారు. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారు ఆయిల్ ఫాం సాగు చేయాలని, తాను కూడా ఆయిల్ ఫామ్ సాగు చేస్తానని తెలిపారు. చిన్న గ్రామాల్లో 50 ఎకరాలు ,పెద్ద గ్రామాల్లో 100 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని, ఆయిల్ ఫాం సాగు వల ప్రకృతి ఇబ్బందులు ,కోతుల ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. నర్మేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని రైతులు విజిట్ చేయాలని సూచించారు.
సాగు నీరు కాలువలు పూర్తయ్యేలా కృషి చేస్తున్నామని,  గౌరవెల్లి ప్రాజెక్ట్ పై ఇటీవల సమీక్షా నిర్వహించామన్నారు. త్వరలోనే కాలువల పనులు పూర్తి చేస్తామని తెలిపారు. హుస్నాబాద్ మండలం కూచనపల్లి లో 21 లక్షల 30 లక్షల వ్యయంతో మర్రి పంపు చెక్ డ్యాం  ఫీడర్ చానెల్ కి శంకుస్థాపన చేశారు. హుస్నాబాద్ కి నలు వైపుల నాలుగు లేన్ రోడ్డు నిర్మాణం జరుగుతుందని, నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
  • హుస్నాబాద్ మండలం పందిల్ల జాతీయ రహదారి గుండ మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్తున్న క్రమంలో తాటి ముంజలు విక్రయిస్తున్న వారి దగ్గరికి వెళ్లి స్వయంగా వారి కోసుకొని తిన్నారు. ఈ క్రమంలో పలువురికి తాటి ముంజలు అందించారు.వేసవికాలం లో చల్లదనంగా ఆరోగ్యానికి ఉపయోగపడే న్యాచురల్ తాటి ముంజలు వేసవి తాపాన్ని తగ్గించి, ఒంటికి చల్లదనాన్ని ఇస్తాయన్నారు.
    1
    హుస్నాబాద్ మండలం పందిల్ల జాతీయ రహదారి గుండ మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్తున్న క్రమంలో  తాటి ముంజలు విక్రయిస్తున్న వారి దగ్గరికి వెళ్లి స్వయంగా వారి కోసుకొని తిన్నారు. ఈ క్రమంలో పలువురికి తాటి ముంజలు అందించారు.వేసవికాలం లో చల్లదనంగా ఆరోగ్యానికి ఉపయోగపడే న్యాచురల్ తాటి ముంజలు వేసవి తాపాన్ని తగ్గించి, ఒంటికి చల్లదనాన్ని ఇస్తాయన్నారు.
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    8 hrs ago
  • కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి గ్రామంలో మండల విద్యాధికారి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో విద్యా వాహిని ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజల్లో విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి ప్రభాకర్ రావు మాట్లాడుతూ, మండలంలోని మొత్తం 33 గ్రామాలలో బడిబాట కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి చిన్నారి తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాలని, చదువు మధ్యలో మానేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలలో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పిల్లల సౌకర్యార్థం ప్రతిరోజూ వాహన సదుపాయం కల్పించి, విద్యార్థులను ఇంటి వద్ద నుంచి పాఠశాలకు తీసుకెళ్లి, పాఠశాల పూర్తయ్యాక మళ్లీ సురక్షితంగా ఇంటికి చేర్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. విద్యార్థుల భద్రత, సౌకర్యాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు. అదేవిధంగా ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, ఎమ్మార్వో, ఎంపీడీవోతో పాటు తాము కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ఈ స్థాయికి చేరుకున్నామని గుర్తుచేస్తూ, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కోరారు
    1
    కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి గ్రామంలో మండల విద్యాధికారి ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో విద్యా వాహిని ప్రత్యేక వాహనాన్ని ఏర్పాటు చేసి బడిబాట కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజల్లో విద్య ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్భంగా మండల విద్యాధికారి ప్రభాకర్ రావు మాట్లాడుతూ, మండలంలోని మొత్తం 33 గ్రామాలలో బడిబాట కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి చిన్నారి తప్పనిసరిగా పాఠశాలకు హాజరు కావాలని, చదువు మధ్యలో మానేసిన విద్యార్థులను తిరిగి పాఠశాలలో చేర్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
పిల్లల సౌకర్యార్థం ప్రతిరోజూ వాహన సదుపాయం కల్పించి, విద్యార్థులను ఇంటి వద్ద నుంచి పాఠశాలకు తీసుకెళ్లి, పాఠశాల పూర్తయ్యాక మళ్లీ సురక్షితంగా ఇంటికి చేర్చే ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. విద్యార్థుల భద్రత, సౌకర్యాల విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని తెలిపారు.
అదేవిధంగా ముఖ్యమంత్రి, జిల్లా కలెక్టర్, ఎమ్మార్వో, ఎంపీడీవోతో పాటు తాము కూడా ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ఈ స్థాయికి చేరుకున్నామని గుర్తుచేస్తూ, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని కోరారు
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    11 hrs ago
  • కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో వీర ధ్యాన ఆంజనేయ స్వామి యంత్ర, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభానికి యంత్ర ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు
    1
    కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో వీర ధ్యాన ఆంజనేయ స్వామి యంత్ర, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభానికి యంత్ర ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు
    user_Vodnala thirupthi
    Vodnala thirupthi
    గన్నేరువరం, కరీంనగర్, తెలంగాణ•
    13 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో 140వ మే డే కరపత్రాన్ని ఏఐఎఫ్టియు న్యూ నాయకులు ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మేడే బహిరంగ సభ అధ్యక్షులు సోమిశెట్టి దశరథం మాట్లాడుతూ 1886 మే 1న ప్రపంచ కార్మిక దినోత్సవం గా జరుపుకొవడం జరుగుతుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి పాత బస్టాండ్,పెద్ద బజార్ మీదుగా శాంతినగర్ చౌరస్తాలోని ఏఐఎఫ్టియు న్యూ జిల్లా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ జరుపుటకు నిర్ణయించడం జరిగిందని ఇట్టి బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ మరియు ఏఐఎఫ్ టి యు న్యూ రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా సైజింగ్ డయింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వొల్లాల కిషోర్ తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి బామాండ్ల రవీందర్,ఎర్ర జెండా బీడీ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ మచ్చ అనసూర్య ఎర్రజెండా పవర్లూమ్ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ గుజ్జ దేవదాస్, పి ఓ డబ్ల్యు రాష్ట్ర నాయకులు పెద్దోళ్ల సంగీత తదితరులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఇట్టి కార్మిక సభను జిల్లాలోని అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వి కిషోర్, భామండ్ల రవీందర్ కూరపాటి సతీష్, గుజ్జ దేవదాస్, వల్లే రవి,ఏ సత్తయ్య, రాంప్రసాద్, సునీల్ పాల్గొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో 140వ మే డే కరపత్రాన్ని ఏఐఎఫ్టియు న్యూ నాయకులు ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మేడే బహిరంగ సభ అధ్యక్షులు సోమిశెట్టి దశరథం మాట్లాడుతూ 1886 మే 1న ప్రపంచ కార్మిక దినోత్సవం గా జరుపుకొవడం జరుగుతుందన్నారు.  రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి పాత బస్టాండ్,పెద్ద బజార్ మీదుగా శాంతినగర్ చౌరస్తాలోని ఏఐఎఫ్టియు న్యూ జిల్లా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ జరుపుటకు నిర్ణయించడం జరిగిందని ఇట్టి బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ మరియు ఏఐఎఫ్ టి యు న్యూ రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా సైజింగ్ డయింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వొల్లాల కిషోర్
తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి బామాండ్ల రవీందర్,ఎర్ర జెండా బీడీ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ మచ్చ అనసూర్య ఎర్రజెండా పవర్లూమ్ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ గుజ్జ దేవదాస్, పి ఓ డబ్ల్యు రాష్ట్ర నాయకులు పెద్దోళ్ల సంగీత తదితరులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఇట్టి కార్మిక సభను జిల్లాలోని అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వి కిషోర్, భామండ్ల రవీందర్ కూరపాటి సతీష్, గుజ్జ దేవదాస్, వల్లే రవి,ఏ సత్తయ్య, రాంప్రసాద్, సునీల్  పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    8 hrs ago
  • వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సంచలన ఘటన చోటుచేసుకుంది. మిల్స్ కాలనీ రాణా పరిధిలో మార్చి 20న అర్ధరాత్రి ఎల్బీనగర్‌కు చెందిన ఓ యువకుడిపై కొంతమంది వ్యక్తులు మద్యం మత్తులో దాడి చేసి రోడ్డు పక్కనున్న మురుగు కాల్వలో పడేసి వెళ్లారు. ఉదయం నగర పాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు యువకుడిని అపస్మారక స్థితిలో గుర్తించి 108కు సమాచారం అందించడంతో అతడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మొదట్లో సాధారణంగా పడిపోయి ఉండవచ్చని భావించిన కుటుంబ సభ్యులు చికిత్స కొనసాగించారు. ఇటీవల దాడి సమయంలో తీసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై వివరాలు సేకరించగా, స్థానిక యువకులే దాడికి పాల్పడినట్లు గుర్తించారు. సమాచారం అందుకున్న మిల్స్ కాలనీ పోలీసులు వైరల్ వీడియోలను పరిశీలించి నిందితులను గుర్తించారు. కేసు నమోదు చేసి వారిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. యువకుడికి, దాడి చేసిన వారికి పాత కక్షలు లేనప్పటికీ ఇలా విచక్షణరహితంగా దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది.
    1
    వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో సంచలన ఘటన చోటుచేసుకుంది. మిల్స్ కాలనీ రాణా పరిధిలో మార్చి 20న అర్ధరాత్రి ఎల్బీనగర్‌కు చెందిన ఓ యువకుడిపై కొంతమంది వ్యక్తులు మద్యం మత్తులో దాడి చేసి రోడ్డు పక్కనున్న మురుగు కాల్వలో పడేసి వెళ్లారు.
ఉదయం నగర పాలక సంస్థ పారిశుద్ధ్య కార్మికులు యువకుడిని అపస్మారక స్థితిలో గుర్తించి 108కు సమాచారం అందించడంతో అతడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మొదట్లో సాధారణంగా పడిపోయి ఉండవచ్చని భావించిన కుటుంబ సభ్యులు చికిత్స కొనసాగించారు.
ఇటీవల దాడి సమయంలో తీసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో బాధితుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై వివరాలు సేకరించగా, స్థానిక యువకులే దాడికి పాల్పడినట్లు గుర్తించారు.
సమాచారం అందుకున్న మిల్స్ కాలనీ పోలీసులు వైరల్ వీడియోలను పరిశీలించి నిందితులను గుర్తించారు. కేసు నమోదు చేసి వారిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు. యువకుడికి, దాడి చేసిన వారికి పాత కక్షలు లేనప్పటికీ ఇలా విచక్షణరహితంగా దాడి చేయడం స్థానికంగా కలకలం రేపింది.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    10 hrs ago
  • చెన్నారావుపేట మండలం, జల్లి గ్రామానికి చెందిన గందె అభిలాష్, అదే గ్రామానికి చెందిన యువతితో ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీనిపై ఆగ్రహించిన అమ్మాయి బంధువులు అర్ధరాత్రి అభిలాష్ ఇంటికి చేరుకుని అతని సోదరుడిపై దాడి చేశారు. ఇంట్లోని సామాన్లు, బైక్‌ను ధ్వంసం చేశారు. గాయపడిన వ్యక్తిని నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    1
    చెన్నారావుపేట మండలం, జల్లి గ్రామానికి చెందిన గందె అభిలాష్, అదే గ్రామానికి చెందిన యువతితో ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీనిపై ఆగ్రహించిన అమ్మాయి బంధువులు అర్ధరాత్రి అభిలాష్ ఇంటికి చేరుకుని అతని సోదరుడిపై దాడి చేశారు. ఇంట్లోని సామాన్లు, బైక్‌ను ధ్వంసం చేశారు. గాయపడిన వ్యక్తిని నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
    user_Chetty:Ramesh
    Chetty:Ramesh
    నర్సంపేట, వరంగల్, తెలంగాణ•
    12 hrs ago
  • తెలంగాణలో అర్బన్ నక్సలైట్లు ఎవరు లేరని రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఆర్మ్ డ్ రిజర్వ్ పోలీసు నివాస గృహాలను రాష్ట్ర డిజిపి ప్రారంభించారు. పోలీస్ హౌసింగ్ ఫండ్ 12 కోట్ల 29 లక్షలతో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన 19 నివాస గృహాలకు డిజిపి గృహ ప్రవేశం చేశారు. సందర్భంగా డిజిపి మాట్లాడుతూ సోమవారం నుండి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్థాయి నుండి ప్రజా ప్రతినిధులతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు, ఉద్యోగులను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, మరణాల రేటును తగ్గించేందుకు రోడ్డు భద్రత నియమాలు పాటించేలా ప్రజలను సమాయత్వం చేస్తామని తెలిపారు. డిజిపి వెంట పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి మహేష్ ఎం భగవత్, వరంగల్ రేంజ్ ఐజి చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం, కరీంనగర్ సిపి అంబర్ కిషోర్ ఝ, గౌస్ ఆలం, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
    2
    తెలంగాణలో అర్బన్ నక్సలైట్లు ఎవరు లేరని రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఆర్మ్ డ్ రిజర్వ్ పోలీసు నివాస గృహాలను రాష్ట్ర  డిజిపి ప్రారంభించారు. పోలీస్ హౌసింగ్ ఫండ్ 12 కోట్ల 29 లక్షలతో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన 19
నివాస గృహాలకు డిజిపి గృహ ప్రవేశం చేశారు. సందర్భంగా డిజిపి మాట్లాడుతూ సోమవారం నుండి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అరైవ్ అలైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామస్థాయి నుండి ప్రజా ప్రతినిధులతో పాటు అన్ని ప్రభుత్వ విభాగాలకు చెందిన అధికారులు, ఉద్యోగులను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణ, మరణాల రేటును తగ్గించేందుకు రోడ్డు భద్రత నియమాలు పాటించేలా ప్రజలను సమాయత్వం చేస్తామని తెలిపారు.  డిజిపి వెంట పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండి మహేష్ ఎం భగవత్, వరంగల్ రేంజ్ ఐజి చంద్రశేఖర్ రెడ్డి,
రామగుండం, కరీంనగర్ సిపి అంబర్ కిషోర్ ఝ, గౌస్ ఆలం, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.