హుస్నాబాద్ నియోజకవర్గంలో రాయితీపై రైతులకు పనిముట్లు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్....ఐదెకరాలకుపైగా భూమి ఉన్న రైతులు ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచన రైతులకు కావాల్సిన పనిముట్లు రాయితీపై ఇచ్చేందుకు సిద్దంగా ఉందని రైతులు రాయితీ పనిముట్లు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ చిగురుమామిడి మండల కేంద్రంలో ఉన్నత పాఠశాల ప్రాంగణంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్థల పరిశీలన చేశారు. ప్రభుత్వం అధునాతన సౌకర్యాలతో 4 ఎకరాల విస్తీర్ణంలో 1 నుంచి 12 తరగతి వరకు తెలంగాణ పబ్లిక్ స్కూల్ లను తీసుకొస్తుండడంతో చిగురుమామిడిలో స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. పాఠశాల ప్రాంగణంలోనే ప్రైమరీ, హైస్కూల్, జూనియర్ కాలేజీ ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం చిగురుమామిడి రైతు వేదిక వద్ద వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2025-26 SMAM రాయితీ పై వ్యవసాయ పనిముట్లు , యంత్రాలకు రైతులకు పంపిణీ చేశారు. 24 మంది రైతులకు 40 లక్షల 80 వేల రూపాయల విలువైన అధునాతన వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశారు. 15 రోటావేటర్లు ,బెయిలర్లు, పవర్ స్ప్రేయర్లు ,తదితర పనిముట్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, సర్పంచ్ ఆకవరం భవానీ, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఆర్డీవో మహేశ్వర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చాలా సంవత్సరాల తరువాత ప్రజా ప్రభుత్వంలో పనిముట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇంకా ఎవరికైనా అవసరం ఉంటే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చే పనిముట్లను రైతులు సద్వినియోగం చేసుకొని వరికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని కోరారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, ఎక్కడ ఇబ్బందులు లేవని తెలిపారు. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారు ఆయిల్ ఫాం సాగు చేయాలని, తాను కూడా ఆయిల్ ఫామ్ సాగు చేస్తానని తెలిపారు. చిన్న గ్రామాల్లో 50 ఎకరాలు ,పెద్ద గ్రామాల్లో 100 ఎకరాలు ఆయిల్ ఫామ్ సాగు చేయాలని, ఆయిల్ ఫాం సాగు వల ప్రకృతి ఇబ్బందులు ,కోతుల ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. నర్మేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని రైతులు విజిట్ చేయాలని సూచించారు. సాగు నీరు కాలువలు పూర్తయ్యేలా కృషి చేస్తున్నామని, గౌరవెల్లి ప్రాజెక్ట్ పై ఇటీవల సమీక్షా నిర్వహించామన్నారు. త్వరలోనే కాలువల పనులు పూర్తి చేస్తామని తెలిపారు. హుస్నాబాద్ మండలం కూచనపల్లి లో 21 లక్షల 30 లక్షల వ్యయంతో మర్రి పంపు చెక్ డ్యాం ఫీడర్ చానెల్ కి శంకుస్థాపన చేశారు. హుస్నాబాద్ కి నలు వైపుల నాలుగు లేన్ రోడ్డు నిర్మాణం జరుగుతుందని, నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో రాయితీపై రైతులకు పనిముట్లు పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్....ఐదెకరాలకుపైగా భూమి ఉన్న రైతులు ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచన రైతులకు కావాల్సిన పనిముట్లు రాయితీపై ఇచ్చేందుకు సిద్దంగా ఉందని రైతులు రాయితీ పనిముట్లు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులు ఆయిల్ పామ్ సాగు చేయాలని సూచించారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ చిగురుమామిడి మండల కేంద్రంలో ఉన్నత పాఠశాల ప్రాంగణంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ స్థల పరిశీలన చేశారు. ప్రభుత్వం అధునాతన సౌకర్యాలతో 4 ఎకరాల విస్తీర్ణంలో 1 నుంచి 12 తరగతి వరకు తెలంగాణ పబ్లిక్
స్కూల్ లను తీసుకొస్తుండడంతో చిగురుమామిడిలో స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. పాఠశాల ప్రాంగణంలోనే ప్రైమరీ, హైస్కూల్, జూనియర్ కాలేజీ ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అనంతరం చిగురుమామిడి రైతు వేదిక వద్ద వ్యవసాయ యాంత్రీకరణ పథకం 2025-26 SMAM రాయితీ పై వ్యవసాయ పనిముట్లు , యంత్రాలకు రైతులకు పంపిణీ చేశారు. 24 మంది రైతులకు 40 లక్షల 80 వేల రూపాయల విలువైన అధునాతన వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేశారు. 15 రోటావేటర్లు ,బెయిలర్లు, పవర్ స్ప్రేయర్లు ,తదితర పనిముట్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, సర్పంచ్ ఆకవరం భవానీ, హుస్నాబాద్ మార్కెట్
కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఆర్డీవో మహేశ్వర్ పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో చాలా సంవత్సరాల తరువాత ప్రజా ప్రభుత్వంలో పనిముట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఇంకా ఎవరికైనా అవసరం ఉంటే దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చే పనిముట్లను రైతులు సద్వినియోగం చేసుకొని వరికి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని కోరారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, ఎక్కడ ఇబ్బందులు లేవని తెలిపారు. 5 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న వారు ఆయిల్ ఫాం సాగు చేయాలని, తాను కూడా ఆయిల్ ఫామ్ సాగు చేస్తానని తెలిపారు. చిన్న గ్రామాల్లో 50 ఎకరాలు ,పెద్ద గ్రామాల్లో 100 ఎకరాలు
ఆయిల్ ఫామ్ సాగు చేయాలని, ఆయిల్ ఫాం సాగు వల ప్రకృతి ఇబ్బందులు ,కోతుల ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు. నర్మేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని రైతులు విజిట్ చేయాలని సూచించారు. సాగు నీరు కాలువలు పూర్తయ్యేలా కృషి చేస్తున్నామని, గౌరవెల్లి ప్రాజెక్ట్ పై ఇటీవల సమీక్షా నిర్వహించామన్నారు. త్వరలోనే కాలువల పనులు పూర్తి చేస్తామని తెలిపారు. హుస్నాబాద్ మండలం కూచనపల్లి లో 21 లక్షల 30 లక్షల వ్యయంతో మర్రి పంపు చెక్ డ్యాం ఫీడర్ చానెల్ కి శంకుస్థాపన చేశారు. హుస్నాబాద్ కి నలు వైపుల నాలుగు లేన్ రోడ్డు నిర్మాణం జరుగుతుందని, నియోజకవర్గం రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు.
- తంగళ్ళపల్లి మండలం వేణుగోపాల్ పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమాన్ని నిర్వహించగా కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.1
- ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రాతిశిల విరిగిపడి గాయాలైన సమ్మక్క పూజారి సిద్ధబోయిన రమేష్-స్వప్న దంపతుల కుమారుడు యువాన్ జన్మదినాన్ని ఆదివారం హన్మకొండ నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి సీతక్క కేక్ కట్ చేసి బాలుడికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కుటుంబాన్ని పరామర్శించి, వారికి మనోధైర్యం నింపుతూ అవసరమైన సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.1
- చెన్నారావుపేట మండలం, జల్లి గ్రామానికి చెందిన గందె అభిలాష్, అదే గ్రామానికి చెందిన యువతితో ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీనిపై ఆగ్రహించిన అమ్మాయి బంధువులు అర్ధరాత్రి అభిలాష్ ఇంటికి చేరుకుని అతని సోదరుడిపై దాడి చేశారు. ఇంట్లోని సామాన్లు, బైక్‌ను ధ్వంసం చేశారు. గాయపడిన వ్యక్తిని నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాలు ఎండల తీవ్రతతో నిప్పుల కొలిమిలా మారాయి. తాలూకా పరిధిలోని జన్నారం మండలంలో ఆదివారం మ.3 గంటలకు 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయిందని అధికారులు తెలిపారు. ఎండల తీవ్రతతో పాటు వేడి గాలులు కూడా వీస్తున్నాయి. రాబోయే మూడు రోజులపాటు 43 డిగ్రీల వరకు ఎండల తీవ్రత ఉంటుందని వారు తెలిపారు.1
- కామారెడ్డి జిల్లా జుక్కల్ మండల పరిషత్ కార్యాలయం మీటింగ్ హాల్లో ఆదివారం ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్, సీనియర్ మేట్లకు ఏపీడీ వామన్ రావు సమావేశాన్ని నిర్వహించారు. ఉపాధి పనులకు వచ్చిన కూలీల ఫోటోలు క్యాప్చరింగ్ జాగ్రత్తగా చేయాలని, చేసిన పనికి తగ్గట్లు కూలి పడే విధంగా చూడాలని సూచించారు. తికమక పడితే కూలీలు నష్టపోతారన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ తులసిరాం తదితరులు పాల్గొన్నారు.1
- ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో ఆదివారం ఘనంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇన్ఛార్జ్ శాంతయ్య భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో యేసయ్య ను దర్శించుకునేందుకు భక్తులు విచ్చేయడం జరిగింది. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, తమ మొక్కలను చెల్లించుకున్నారు.1
- కరీంనగర్ రెనే హాస్పిటల్లో ఐదు కోట్ల విలువ చేసే అత్యాధునిక రోబోటిక్ సర్జరీ యంత్రాన్ని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో కలిసి ప్రారంభించారు. ఉత్తర తెలంగాణలోనే తొలి సారిగా రోబోటిక్ మోకాలు కీలుమార్పిడి చికిత్స చేసే సౌకర్యం రేనా హాస్పిటల్ ఏర్పాటు చేయడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. వాలిస్ కంపెనీకి చెందిన సుమారు ఐదు కోట్ల విలువ చేసే అత్యాధునిక రోబోటిక్ సర్జరీ యంత్రమని తెలిపారు. లక్కీ డ్రా ద్వారా 15 మంది ఉచిత కీలు మార్పిడికి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడుతూ ఇలాంటి అత్యాధునిక వైద్య సదుపాయాలను జిల్లా కేంద్రాల్లో అందుబాటులోకి తెచ్చిన రెనే హాస్పిటల్ చైర్మన్ ప్రొఫెసర్ డా.బంగారి స్వామి, డా.రజనీ ప్రియదర్శిని లను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా చైర్మన్ డా.బంగారి స్వామి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం తన తల్లి తండులైన కీర్తి శేషులు బంగారి లక్ష్మి, మైసయ్య పేరుపై ప్రతి సంవత్సరం సుమారు యాభై లక్షల రూపాయల విలువగల సర్జరీలను ఉచితంగా చేయడం జరుగుతుందని అన్నారు. తాను ఈ వైద్య రంగంలో ఉన్నన్ని రోజులు ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తమ కుటుంబం అంతా వైద్య సేవకే అంకితమన్నారు. ఈ ఉచిత లక్కీ డ్రా కార్యక్రమాన్ని యూట్యూబ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా పూర్తి పారదర్శకంగా నిర్వహించామన్నారు. సుమారు 180 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారని వారిలో నుండి 15 మందిని ఎంపిక చేసి వారికి పూర్తి ఉచితంగా మోకాలు కీలు మార్పిడి చికిత్సను రాబోయే నెల రోజుల్లోగా నిర్వహిస్తామన్నారు, మిగతా వారికి అతి తక్కువ ఖర్చులో ఈ ఆపరేషన్ చేస్తామని ఈ సదవకాశాన్ని అందరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సుడా చైర్మన్ జి.వి.రామకృష్ణా రావు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, గ్రంధాలయ సంస్థ మాజీ అధ్యక్షులు పొన్నం అనిల్ గౌడ్, ఏనుగు రవీందర్ రెడ్డి, రఘువీర్ సింగ్, మాజీ మున్సిపల్ మేయర్ రవీందర్ సింగ్ పాల్గొన్నారు.1
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో యువతి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, బంధువులు అంబేడ్కర్ కూడలిలో జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. రాయపర్తి మండలం ఏకే తండాకు చెందిన యువతి మృతితో ఆగ్రహించిన వారు నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వారిని సముదాయించారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా అన్ని కోణాల్లో విచారణ జరుగుతుందని సీఐ శ్రీనివాస్ తెలిపారు.1
- కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన సందర్భంగా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, వరల్డ్ రికార్డ్ హోల్డర్ వేణుగోపాల్ రెడ్డి విద్యార్థులకు, తల్లిదండ్రులకు కీలక సందేశం ఇచ్చారు. పరీక్షల్లో ఆశించిన మార్కులు రాని విద్యార్థులు నిరాశ చెందవద్దని, ఒక పరీక్ష ఫలితం జీవితాన్ని నిర్ణయించలేదని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు అండగా ఉండి ధైర్యం చెప్పాలని, వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు.1