Shuru
Apke Nagar Ki App…
వేణుగోపాల్ పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశ కార్యక్రమం తంగళ్ళపల్లి మండలం వేణుగోపాల్ పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమాన్ని నిర్వహించగా కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Satheesh gangu
వేణుగోపాల్ పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశ కార్యక్రమం తంగళ్ళపల్లి మండలం వేణుగోపాల్ పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమాన్ని నిర్వహించగా కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- గన్నేరువరం మండలంలోని కాసింపేట మానసా దేవి ఆలయాలను శ్రీ ఉదయభారతి విద్యాపీఠం నిర్వాహకులు వేద పండితులు వ్యాసోజుల గోపికృష్ణ శర్మ, శ్రీ వీరి వింటి ఫణి శశాంక శర్మ లు శనివారం మానసా దేవి ఆలయాన్ని సందర్శించారు ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజయ మసాలా నిర్వాహకుడు రాజేష్, మానసా దేవి ఆలయ కమిటీ సభ్యులు,అధిక సంఖ్యలో గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు1
- కామారెడ్డి జిల్లా పిట్లం మండలం ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన సందర్భంగా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్, వరల్డ్ రికార్డ్ హోల్డర్ వేణుగోపాల్ రెడ్డి విద్యార్థులకు, తల్లిదండ్రులకు కీలక సందేశం ఇచ్చారు. పరీక్షల్లో ఆశించిన మార్కులు రాని విద్యార్థులు నిరాశ చెందవద్దని, ఒక పరీక్ష ఫలితం జీవితాన్ని నిర్ణయించలేదని ఆయన పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు అండగా ఉండి ధైర్యం చెప్పాలని, వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు.1
- యూనిక్ మర్కంటైల్ ఇండియా లిమిటెడ్ బాధితులు రోడ్డెక్కారు. లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్ ఇలా పలు రకాలుగా పెట్టుబడులను ఆకర్షించిన యూనిక్ మార్కంటైల్ బోర్డు తిప్పేయడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. ఇన్సురెన్స్, రియల్ ఎస్టేట్, హాస్పిటాలిటీ సేవలను అందించేందుకు గుజరాత్ కు చెందిన వ్యక్తి యూనిక్ మర్కంటైల్ ఇండియా లిమిటెడ్ సంస్థను 1996 లో ఏర్పాటు చేశారు. లాభాల ఆశ చూపి తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలో, పట్టణాలలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని పెట్టుబడులను ఆకర్షించింది. పాలసీలపై ఏజెంట్లకు భారీగానే కమీషన్ ఇవ్వడంతో లక్షలాదిమంది కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టారు. కంపేనీ టర్నోవర్ 5వేల కోట్లకు చేరుకుంది. కరోనా సమయంలో లావాదేవీలన్నీ ఆగిపోయాయి. ఆ తర్వాత కంపెనీ పట్టించుకోవడం మానేసింది. పెట్టుబడి పెట్టిన వారి పాలసీల మెచ్యూరిటీ అయిపోవడంతో కార్యాలయాల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో కరీంనగర్ లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో వందలాదిమంది బాధితులు సమావేశమయ్యారు. కంపెనీ చెప్పిన మాటలు నమ్మి మోసపోయామని, కంపెనీ నుంచి రావలసిన డబ్బులు ఇప్పించాలని కోరుతున్నారు. గత కొంత కాలంగా పేరు మార్చి 'లైఫ్ కేర్' రిసార్ట్ ప్యాకేజీల వంటి సేవలను అందించిన యూనిక్ కంపెనీ భారీగానే ఆస్తులు కూడబెట్టిందని, ఆస్తులను విక్రయించి తమ డబ్బు తమకు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. లాభం దేవుడెరుగు కనీసం తాము పెట్టిన పెట్టుబడి అయినా తమకు ఇప్పించాలని కోరుతున్నారు. లాభం వస్తుందని ఉన్న ఇల్లు, మామ రిటైర్మెంట్ అమౌంట్ మొత్తం 84 లక్షలు పెట్టుబడి పెట్టామని ఇప్పటి వరకు రూపాయి రాలేదని చొప్పదండి కి చెందిన బాధితురాలు రేణుక ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ త్వరగా స్పందించి బాధితులకు న్యాయం చేయకుంటే యూనిక్ కంపెనీకి చెందిన ఆస్తులను బాధితులతో కలిసి స్వాధీనం చేసుకుంటామని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ జోజిరెడ్డి, న్యాయవాది రాజిరెడ్డి తెలిపారు.3
- మెట్ పల్లి, ఏప్రిల్ 11 : మండలంలోని మేడిపల్లి గ్రామానికి చెందిన బిచ్చల అంకిత వివాహం నిశ్చయమైన నేపథ్యంలో, ఆమె కుటుంబ పరిస్థితిని గుర్తించిన స్థానికులు అమ్మా చారిటబుల్ ట్రస్ట్ దృష్టికి తీసుకువచ్చారు. తండ్రిని కోల్పోయి పేదరికంతో ఇబ్బందులు పడుతున్న అంకితకు ట్రస్ట్ సభ్యులు అండగా నిలిచారు.ఈ సందర్భంగా శనివారం సుమారు 120 మందికి సరిపడా బియ్యం, ఇతర ఆహార సామగ్రి అందజేయడంతో పాటు పెళ్లి కూతురికి పట్టు చీరను బహూకరించారు.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షుడు పుల్ల శ్రీనివాస్ గౌడ్, సభ్యులు శ్రీగద్దె రత్నాకర్, తారి రాజశేఖర్, చాకలి శంకర్, తరి లింగం, కుడిక్యాల సతీష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్థులు ట్రస్ట్ సేవలను అభినందించారు.3
- ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ సీఎస్ఐ చర్చ్ మహాదేవాలయంలో ఆదివారం ఘనంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రెస్ బీటర్ ఇన్ఛార్జ్ శాంతయ్య భక్తులకు దైవ సందేశాన్ని అందజేశారు. ఆదివారం సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో యేసయ్య ను దర్శించుకునేందుకు భక్తులు విచ్చేయడం జరిగింది. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని, తమ మొక్కలను చెల్లించుకున్నారు.1
- లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాలు ఎండల తీవ్రతతో నిప్పుల కొలిమిలా మారాయి. తాలూకా పరిధిలోని జన్నారం మండలంలో ఆదివారం మ.3 గంటలకు 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయిందని అధికారులు తెలిపారు. ఎండల తీవ్రతతో పాటు వేడి గాలులు కూడా వీస్తున్నాయి. రాబోయే మూడు రోజులపాటు 43 డిగ్రీల వరకు ఎండల తీవ్రత ఉంటుందని వారు తెలిపారు.1
- తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు దండు వినోద్ సమక్షంలో, బీఎస్పీ సిరిసిల్ల పట్టణ కమిటీలో పనిచేసిన మాజీ అధ్యక్షులు అరుకాల రమేష్, ఉపాధ్యక్షులు గుంటుక రమేష్, శెట్టిపల్లి నరేందర్, ప్రధాన కార్యదర్శి మెరుగు శ్రీనివాస్, ఖజానాదారు కొంపెల్లి తిరుపతి, అలాగే గాలి శ్రీనివాస్, కుసుమ శ్రీనివాస్, గుల్లపల్లి గణేష్ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరారు.తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మల్లన్న మరియు జిల్లా ఇన్‌చార్జ్ రజిని యాదవ్ సూచనల మేరకు, అరుకాల రమేష్ ని తెలంగాణ రాజ్యాధికార పార్టీ సిరిసిల్ల పట్టణ అధ్యక్షులుగా నియమిస్తూ జిల్లా అధ్యక్షులు దండు వినోద్ నిర్ణయం తీసుకున్నారు.బడుగు బలహీన వర్గాల రాజ్యాధికారం కోసం పోరాడుతున్న పార్టీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని, అన్ని పార్టీలలో ఉన్న బీసీ బిడ్డలు ఈ పార్టీలో చేరడం ఆనందకరమని తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఎమ్మడిశెట్టి వినోద్, మెరుగు వేణు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.3
- గన్నేరువరం: మండలంలోని సుప్రసిద్ధ మైలారం మల్లికార్జున స్వామి ఆలయంను శ్రీ ఉదయభారతి విద్యాపీఠం నిర్వాహకులు వేద పండితులు వ్యాసోజుల గోపికృష్ణ శర్మ, శ్రీ వీరి వింటి ఫణి శశాంక శర్మ లు శనివారం సందర్శించారు. మల్లికార్జున స్వామి దేవాలయ ఆవరణలో నిర్వహిస్తున్న శ్రీ వీర ధ్యాన ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో పాల్గొని మైలారం మల్లికార్జున స్వామి గిరి ప్రదక్షణ నిర్వహించి ఆ మార్గంలో నిర్మిస్తున్న ద్వాదశ జ్యోతిర్లింగాల ఆలయాలను దర్శించారు. వీరిని ఆలయ కమిటీ అధ్యక్షులు వరాల పరుశరాములు, ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజయ మసాలా నిర్వాహకుడు రాజేష్, నూకల తిరుపతి, జక్కన్న పెళ్లి సత్తయ్య, బద్ధం శ్రీనివాస్ రెడ్డి అధిక సంఖ్యలో గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు1
- కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో TGNPDCL కార్యాలయం ఎదుట ఆదివారం విద్యుత్ కార్మికులు ఐదో రోజు నిరవధిక సమ్మె కొనసాగిస్తున్నారు. విద్యుత్ కార్మికులు మాట్లాడుతూ.. అన్మ్యాండ్ కార్మికులను ఆర్టిజన్లుగా, అలాగే ఆర్టిజన్లను కన్వర్షన్లుగా చెయ్యాలని డిమాండ్ చేశారు. డిమాండ్లను నెరవేర్చే వరకు సమ్మె కొనసాగిస్తామన్నారు.1