Shuru
Apke Nagar Ki App…
ఎండల తీవ్రతతో నిప్పుల కొలిమిలా మారుతున్న మండలాలు....... లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాలు ఎండల తీవ్రతతో నిప్పుల కొలిమిలా మారాయి. తాలూకా పరిధిలోని జన్నారం మండలంలో ఆదివారం మ.3 గంటలకు 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయిందని అధికారులు తెలిపారు. ఎండల తీవ్రతతో పాటు వేడి గాలులు కూడా వీస్తున్నాయి. రాబోయే మూడు రోజులపాటు 43 డిగ్రీల వరకు ఎండల తీవ్రత ఉంటుందని వారు తెలిపారు.
P.G. Murthy
ఎండల తీవ్రతతో నిప్పుల కొలిమిలా మారుతున్న మండలాలు....... లక్షెట్టిపేట తాలూకా పరిధిలోని వివిధ మండలాలు ఎండల తీవ్రతతో నిప్పుల కొలిమిలా మారాయి. తాలూకా పరిధిలోని జన్నారం మండలంలో ఆదివారం మ.3 గంటలకు 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయింది. అలాగే దండేపల్లి, లక్షెట్టిపేట మండలాల్లో 41 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదయిందని అధికారులు తెలిపారు. ఎండల తీవ్రతతో పాటు వేడి గాలులు కూడా వీస్తున్నాయి. రాబోయే మూడు రోజులపాటు 43 డిగ్రీల వరకు ఎండల తీవ్రత ఉంటుందని వారు తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో జైనూర్ నుంచి ఉట్నూర్ ఎక్స్‌రోడ్ వరకు జిల్లా రహదారి గుంతలతో అధ్వానంగా మారి రాకపోకలు ఇబ్బందిగా మారాయని వామపక్ష నాయకులు తెలిపారు. సిపిఎం నాయకుడు దుర్గం దినకర్ మాట్లాడుతూ తరచూ మంత్రులు సందర్శించినా రోడ్డు పరిస్థితి మారలేదన్నారు. ప్రమాదాలు పెరుగుతున్నాయని, అత్యవసర సేవలు కూడా సకాలంలో అందడం కష్టమవుతోందని పేర్కొన్నారు. వెంటనే రహదారి మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేశారు.1
- जगदेवपेट गाँव में घरेलू विवाद ने एक सनसनीखेज़ रूप ले लिया। पत्नी को ससुराल भेजने से इनकार करने पर नाराज़ दामाद ने अपनी सास की हत्या की कोशिश की। घटना का क्रम - पद्म नामक महिला अपने पति मल्लारेड्डी (48) से लगातार झगड़ों के कारण बच्चों के साथ मायके चली गई। - मल्लारेड्डी ने कई बार पत्नी को वापस भेजने की गुज़ारिश की, लेकिन सास राजव्वा ने साफ़ मना कर दिया। - गुस्से में मल्लारेड्डी ने राजव्वा को मारने की योजना बनाई। उसने राजव्वा के घर के दरवाज़ों पर बिजली की तारें जोड़ दीं ताकि दरवाज़ा छूते ही करंट लगे। - सुबह दरवाज़ा खोलते समय राजव्वा को हल्का झटका लगा। सौभाग्य से बड़ा हादसा टल गया। पुलिस कार्रवाई - राजव्वा ने तुरंत पुलिस में शिकायत दर्ज कराई। - पुलिस ने हत्या के प्रयास का मामला दर्ज कर आरोपी मल्लारेड्डी को गिरफ़्तार कर लिया। - फिलहाल पुलिस मामले की गहराई से जांच कर रही है। स्थानीय प्रतिक्रिया - इस घटना ने गाँव में सनसनी फैला दी है। - लोग घरेलू विवादों से उपजे हिंसक व्यवहार पर चिंता व्यक्त कर रहे हैं। - ग्रामीणों का कहना है कि ऐसे मामलों में संवाद और समझदारी से समाधान निकालना चाहिए, हिंसा से नहीं।1
- నియంత్రణపై నిర్వహించిన వ్యాసరచన, క్విజ్, ఉపన్యాస పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రశంస పత్రాలను, బహుమతులను అందజేసిన జిల్లా కలెక్టర్ రాజర్షిషా. అంతకుముందు రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి డి-అడిక్షన్ సెంటర్ లో అందిస్తున్న చికిత్సలను, వైద్యులను, రోగులను అడిగి వివరాలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ డైరెక్టర్ జై సింగ్ రాథోడ్, జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ శ్రీలత, ఎస్ఐ సందీప్, వైద్యులు, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.4
- రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో 140వ మే డే కరపత్రాన్ని ఏఐఎఫ్టియు న్యూ నాయకులు ఆవిష్కరించారు . ఈ సందర్భంగా ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మేడే బహిరంగ సభ అధ్యక్షులు సోమిశెట్టి దశరథం మాట్లాడుతూ 1886 మే 1న ప్రపంచ కార్మిక దినోత్సవం గా జరుపుకొవడం జరుగుతుందన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి పాత బస్టాండ్,పెద్ద బజార్ మీదుగా శాంతినగర్ చౌరస్తాలోని ఏఐఎఫ్టియు న్యూ జిల్లా కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి బహిరంగ సభ జరుపుటకు నిర్ణయించడం జరిగిందని ఇట్టి బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రసాద్ మరియు ఏఐఎఫ్ టి యు న్యూ రాష్ట్ర కమిటీ సభ్యులు జిల్లా సైజింగ్ డయింగ్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వొల్లాల కిషోర్ తెలంగాణ రైతు కూలీ సంఘం రాష్ట్ర కోశాధికారి బామాండ్ల రవీందర్,ఎర్ర జెండా బీడీ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ మచ్చ అనసూర్య ఎర్రజెండా పవర్లూమ్ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ గుజ్జ దేవదాస్, పి ఓ డబ్ల్యు రాష్ట్ర నాయకులు పెద్దోళ్ల సంగీత తదితరులు పాల్గొననున్నట్లు తెలిపారు. ఇట్టి కార్మిక సభను జిల్లాలోని అన్ని రంగాలలో పనిచేస్తున్న కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వి కిషోర్, భామండ్ల రవీందర్ కూరపాటి సతీష్, గుజ్జ దేవదాస్, వల్లే రవి,ఏ సత్తయ్య, రాంప్రసాద్, సునీల్ పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో వీర ధ్యాన ఆంజనేయ స్వామి యంత్ర, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఆదివారం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభానికి యంత్ర ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా శాస్త్రోక్తంగా, వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు1
- హుస్నాబాద్ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ దారిలో కనిపించిన తాటి ముంజలను చూసి కారు ఆపేశాడు. గౌడన్న దగ్గరికి వెళ్లి తాటి ముంజలు కోయించుకుని తిన్నాడు. వేసవికాలంలో చల్లదనంగా ఆరోగ్యానికి న్యాచురల్ తాటి ముంజలు ఎంతో ఉపయోగపడుతాయని తెలిపారు. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు వెలువడిన సందర్భంగా విద్యార్థులందరికి శుభాకాంక్షలు తెలిపారు. ఫలితాలు కృషి, క్రమశిక్షణ, మరియు అంకితభావానికి ప్రతిబింబంగా నిలుస్తాయని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆశించిన ఫలితాలు రాకపోయిన వారు నిరుత్సాహానికి లోనుకాకుండా, ఈ అనుభవాన్ని ఒక పాఠంగా తీసుకొని మరింత ఉన్నత లక్ష్యాల వైపు సాగాలని కోరారు.2
- కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతనమానపల్లి మండలం బారెగుడ, ధరంపల్లి గ్రామాల మధ్య రహదారి దెబ్బతిని రాకపోకలు కష్టంగా మారాయి. మిషన్ భగీరథ పైప్ లీకేజీతో రోడ్లు బురదమయంగా మారడంతో 7వ వార్డులో జరుగుతున్న వివాహానికి వచ్చే బంధువులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరోవైపు వాగు వద్ద రోడ్డు కొట్టుకుపోవడంతో ప్రయాణం మరింత క్లిష్టమైంది. సమస్యను పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ తక్షణమే రహదారి మరమ్మత్తులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.1
- తంగళ్ళపల్లి మండలం వేణుగోపాల్ పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు నూతన గృహప్రవేశం కార్యక్రమాన్ని నిర్వహించగా కార్యక్రమంలో తంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.1
- గన్నేరువరం మండలంలోని కాసింపేట మానసా దేవి ఆలయాలను శ్రీ ఉదయభారతి విద్యాపీఠం నిర్వాహకులు వేద పండితులు వ్యాసోజుల గోపికృష్ణ శర్మ, శ్రీ వీరి వింటి ఫణి శశాంక శర్మ లు శనివారం మానసా దేవి ఆలయాన్ని సందర్శించారు ఆలయ చైర్మన్ ఏలేటి చంద్రారెడ్డి ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో విజయ మసాలా నిర్వాహకుడు రాజేష్, మానసా దేవి ఆలయ కమిటీ సభ్యులు,అధిక సంఖ్యలో గ్రామస్తులు భక్తులు పాల్గొన్నారు1