logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ మండలం, కొత్తపల్లిలో జరిగిన ఎల్లమ్మ బోనాల జాతరలో కుల వివక్షత తీవ్ర కలకలం సృష్టించింది. బోనాలతో గుడిలోకి వస్తున్న దళితులను గౌడ కులస్తులు అడ్డుకున్నారని దళితులు ఆందోళనకు దిగారు. గుడి ముందు బైఠాయించి ధర్నా నిర్వహించిన దళితులు, గుడిలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఒక శివసత్తి మహిళను అడ్డుకొని నెట్టేయడంతో ఆమె కింద పడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన దళితులకు, గౌడ కులస్తులకు మధ్య తీవ్ర వాగ్వివాదానికి, ఘర్షణ వాతావరణానికి దారి తీసి ఉద్రిక్తతకు కారణమైంది. సమాచారం అందుకున్న ఎల్ఎండి ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను సముదాయించారు. ఎల్లమ్మ తల్లి గుడిలోకి తమను రాకుండా అడ్డుకున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకుని న్యాయం చేయాలని దళితులు పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసుల జోక్యంతో అక్కడ నెలకొన్న ఆందోళన తాత్కాలికంగా సద్దుమణిగింది.

3 hrs ago
user_K.V.REDDY
K.V.REDDY
చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
3 hrs ago

కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ మండలం, కొత్తపల్లిలో జరిగిన ఎల్లమ్మ బోనాల జాతరలో కుల వివక్షత తీవ్ర కలకలం సృష్టించింది. బోనాలతో గుడిలోకి వస్తున్న దళితులను గౌడ కులస్తులు అడ్డుకున్నారని దళితులు ఆందోళనకు దిగారు. గుడి ముందు బైఠాయించి ధర్నా నిర్వహించిన దళితులు, గుడిలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఒక శివసత్తి మహిళను అడ్డుకొని నెట్టేయడంతో ఆమె కింద పడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన దళితులకు, గౌడ కులస్తులకు మధ్య తీవ్ర వాగ్వివాదానికి, ఘర్షణ వాతావరణానికి దారి తీసి ఉద్రిక్తతకు కారణమైంది. సమాచారం అందుకున్న ఎల్ఎండి ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను సముదాయించారు. ఎల్లమ్మ తల్లి గుడిలోకి తమను రాకుండా అడ్డుకున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకుని న్యాయం చేయాలని దళితులు పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసుల జోక్యంతో అక్కడ నెలకొన్న ఆందోళన తాత్కాలికంగా సద్దుమణిగింది.

More news from తెలంగాణ and nearby areas
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో చిరుత సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. దేవుని గుట్ట తండాలో ఒక మేకపై చిరుత దాడి చేసింది. మేకల కాపరి అరవడంతో చిరుత సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయింది, అయితే ఈ దాడిలో మేక గాయపడింది. చిరుత సంచారంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతుండగా, అటవీశాఖ అధికారులు వెంటనే ఆ ప్రాంతాన్ని సందర్శించి చిరుత ఆనవాళ్లను గుర్తించారు. ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు, పశువులను అటవీ ప్రాంతంలోకి పంపించవద్దని వారికి సూచించారు.
    4
    రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో చిరుత సంచారం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. దేవుని గుట్ట తండాలో ఒక మేకపై చిరుత దాడి చేసింది. మేకల కాపరి అరవడంతో చిరుత సమీపంలోని అటవీ ప్రాంతంలోకి పారిపోయింది, అయితే ఈ దాడిలో మేక గాయపడింది. చిరుత సంచారంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతుండగా, అటవీశాఖ అధికారులు వెంటనే ఆ ప్రాంతాన్ని సందర్శించి చిరుత ఆనవాళ్లను గుర్తించారు. ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు, పశువులను అటవీ ప్రాంతంలోకి పంపించవద్దని వారికి సూచించారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    18 min ago
  • బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నిర్వహించనున్న గిరిప్రదక్షిణ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 5:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మండలంలోని భక్తులతో పాటు కరీంనగర్, సిద్ధిపేట జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారని ఆలయ ప్రధాన పూజారి శేషం మధుసూదనాచార్యులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్ వెల్లడించారు. గిరిప్రదక్షిణలో పాల్గొని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
    1
    బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నిర్వహించనున్న గిరిప్రదక్షిణ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 5:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మండలంలోని భక్తులతో పాటు కరీంనగర్, సిద్ధిపేట జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారని ఆలయ ప్రధాన పూజారి శేషం మధుసూదనాచార్యులు తెలిపారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్ వెల్లడించారు. గిరిప్రదక్షిణలో పాల్గొని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    6 hrs ago
  • భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) కరీంనగర్ జిల్లా కమిటీ బుధవారం కరీంనగర్ పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ వింగ్ జూనియర్ కళాశాలను సర్వే చేసింది. ఈ సందర్భంగా నాయకులు విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ, ఎంతోమంది మేధావులను అందించిన సైన్స్ వింగ్ కళాశాల ప్రస్తుతం కనీస వసతులు లేక అల్లాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో విద్యార్థులకు సరిపడా బెంచీలు, క్లాస్ రూములు, ల్యాబ్‌లు లేని పరిస్థితి ఉందని, మొత్తం 26 తరగతి గదులు అవసరం ఉండగా, కేవలం 12 రూములతోనే నెట్టుకొస్తున్నారని విమర్శించారు. పక్కనే ఉన్న పాడుబడిన తరగతి గదుల్లో సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. అంతేకాకుండా, ఏఈటీ (AET) సబ్జెక్టుకు కనీసం ఫ్యాకల్టీని కూడా రిక్రూట్ చేయలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ఈ విద్యాసంవత్సరంలో నూతన సిలబస్ ప్రవేశపెట్టి, ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ల్యాబ్‌లు నిర్వహించాలని చెప్తున్నప్పటికీ, కళాశాలలో మాత్రం ఎలాంటి ల్యాబ్ పరికరాలు లేవని ఆయన మండిపడ్డారు. కరీంనగర్ నడిబొడ్డున ఉన్న ఈ కళాశాల సమస్యలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పినప్పటికీ, ఇప్పటికీ విద్యార్థులను, విద్యారంగ సమస్యలను పట్టించుకున్న దాఖలాలు రాష్ట్రవ్యాప్తంగా లేవని శ్రీకాంత్ ఆరోపించారు. రోజురోజుకూ విద్యార్థులకు సమస్యలు పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేదని ఆయన అన్నారు. ప్రతి ఏటా విద్యారంగానికి కేటాయించే బడ్జెట్‌లో కోతలు వేస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేని పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తోందని విమర్శించారు. కావున ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి సైన్స్ వింగ్ కళాశాలకు ల్యాబ్ పరికరాలను సమకూర్చాలని, మౌలిక వసతులు కల్పించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. అంతేకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరింది. లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వినయ్, గట్టు ఆకాష్, జిల్లా కమిటీ సభ్యులు సన్నీ, నరేష్ తో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
    3
    భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) కరీంనగర్ జిల్లా కమిటీ బుధవారం కరీంనగర్ పట్టణంలోని ప్రభుత్వ సైన్స్ వింగ్ జూనియర్ కళాశాలను సర్వే చేసింది. ఈ సందర్భంగా నాయకులు విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ మాట్లాడుతూ, ఎంతోమంది మేధావులను అందించిన సైన్స్ వింగ్ కళాశాల ప్రస్తుతం కనీస వసతులు లేక అల్లాడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కళాశాలలో విద్యార్థులకు సరిపడా బెంచీలు, క్లాస్ రూములు, ల్యాబ్‌లు లేని పరిస్థితి ఉందని, మొత్తం 26 తరగతి గదులు అవసరం ఉండగా, కేవలం 12 రూములతోనే నెట్టుకొస్తున్నారని విమర్శించారు. పక్కనే ఉన్న పాడుబడిన తరగతి గదుల్లో సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. అంతేకాకుండా, ఏఈటీ (AET) సబ్జెక్టుకు కనీసం ఫ్యాకల్టీని కూడా రిక్రూట్ చేయలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ఈ విద్యాసంవత్సరంలో నూతన సిలబస్ ప్రవేశపెట్టి, ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ల్యాబ్‌లు నిర్వహించాలని చెప్తున్నప్పటికీ, కళాశాలలో మాత్రం ఎలాంటి ల్యాబ్ పరికరాలు లేవని ఆయన మండిపడ్డారు. కరీంనగర్ నడిబొడ్డున ఉన్న ఈ కళాశాల సమస్యలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఎందుకు కనిపించడం లేదని ప్రశ్నించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చెప్పినప్పటికీ, ఇప్పటికీ విద్యార్థులను, విద్యారంగ సమస్యలను పట్టించుకున్న దాఖలాలు రాష్ట్రవ్యాప్తంగా లేవని శ్రీకాంత్ ఆరోపించారు. రోజురోజుకూ విద్యార్థులకు సమస్యలు పుట్టగొడుగుల్లా పెరిగిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వానికి చలనం లేదని ఆయన అన్నారు. ప్రతి ఏటా విద్యారంగానికి కేటాయించే బడ్జెట్‌లో కోతలు వేస్తూ పేద, మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు లేని పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా కనిపిస్తోందని విమర్శించారు.

కావున ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు తక్షణమే స్పందించి సైన్స్ వింగ్ కళాశాలకు ల్యాబ్ పరికరాలను సమకూర్చాలని, మౌలిక వసతులు కల్పించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. అంతేకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరింది. లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు వినయ్, గట్టు ఆకాష్, జిల్లా కమిటీ సభ్యులు సన్నీ, నరేష్ తో పాటు పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    18 min ago
  • గోదావరిఖని నుంచి కరీంనగర్ వైపు వస్తున్న ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు సాంకేతిక లోపం కారణంగా మార్గమధ్యంలోనే నిలిచిపోయింది. తొలుత సుల్తానాబాద్ వద్ద పది నిమిషాల పాటు ఆగిన ఈ బస్సు, ఆ తర్వాత కరీంనగర్ ఆర్ట్స్ కాలేజీ వద్దకు చేరుకోగానే మళ్లీ మొరాయించింది. బస్సు సిబ్బంది ఎంత ప్రయత్నించినా కూడా సాంకేతిక లోపాన్ని సరిదిద్దలేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు విసిగిపోయిన ప్రయాణికులు బస్సు దిగి, మరో మార్గం లేక కాలినడకనే బస్టాండ్‌కు చేరుకున్నారు. ముందస్తు తనిఖీలు సరిగా లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
    1
    గోదావరిఖని నుంచి కరీంనగర్ వైపు వస్తున్న ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు సాంకేతిక లోపం కారణంగా మార్గమధ్యంలోనే నిలిచిపోయింది. తొలుత సుల్తానాబాద్ వద్ద పది నిమిషాల పాటు ఆగిన ఈ బస్సు, ఆ తర్వాత కరీంనగర్ ఆర్ట్స్ కాలేజీ వద్దకు చేరుకోగానే మళ్లీ మొరాయించింది.

బస్సు సిబ్బంది ఎంత ప్రయత్నించినా కూడా సాంకేతిక లోపాన్ని సరిదిద్దలేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు విసిగిపోయిన ప్రయాణికులు బస్సు దిగి, మరో మార్గం లేక కాలినడకనే బస్టాండ్‌కు చేరుకున్నారు. ముందస్తు తనిఖీలు సరిగా లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    16 hrs ago
  • తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5న భువనగిరిలో నిర్వహించనున్న “రాజ్యాధికార సమరభేరి – హలో బీసీ.. చలో భువనగిరి” మహాసభ పోస్టర్‌ను సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోదం రజనీకుమార్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా, జిల్లా అధ్యక్షుడు దండు వినోద్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న నాయకత్వంలో జరగనున్న ఈ మహాసభకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి లక్ష మందికి పైగా ప్రజలు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో బీసీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు కలికోట రేణుక, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కొడూరి శ్రీహరి, పట్టణ అధ్యక్షుడు ఆరుకల రమేష్, మహిళా పట్టణ అధ్యక్షురాలు బిట్ల జ్యోత్స్న, ప్రధాన కార్యదర్శి చెట్టిపల్లి నరేందర్, మండల అధ్యక్షుడు మొగిళ్ల బాబు, కొంకటి శ్రీధర్, చెన్నోజి విద్యాసాగర్, దూడం సత్యం, గాంధీబాబు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
    3
    తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5న భువనగిరిలో నిర్వహించనున్న “రాజ్యాధికార సమరభేరి – హలో బీసీ.. చలో భువనగిరి” మహాసభ పోస్టర్‌ను సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోదం రజనీకుమార్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా, జిల్లా అధ్యక్షుడు దండు వినోద్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న నాయకత్వంలో జరగనున్న ఈ మహాసభకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి లక్ష మందికి పైగా ప్రజలు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో బీసీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు కలికోట రేణుక, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కొడూరి శ్రీహరి, పట్టణ అధ్యక్షుడు ఆరుకల రమేష్, మహిళా పట్టణ అధ్యక్షురాలు బిట్ల జ్యోత్స్న, ప్రధాన కార్యదర్శి చెట్టిపల్లి నరేందర్, మండల అధ్యక్షుడు మొగిళ్ల బాబు, కొంకటి శ్రీధర్, చెన్నోజి విద్యాసాగర్, దూడం సత్యం, గాంధీబాబు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    19 hrs ago
  • హన్మకొండ నగరంలోని ములుగు రోడ్డులో ఉన్న సప్తధామంలో బుధవారం 'కళ్యాణమస్తు' సామూహిక వివాహ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆదివాసీ ప్రాంతాలకు చెందిన 29 జంటలకు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా వివాహాలు నిర్వహించారు, తద్వారా వారి దాంపత్య జీవితానికి శుభారంభం లభించింది. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
    1
    హన్మకొండ నగరంలోని ములుగు రోడ్డులో ఉన్న సప్తధామంలో బుధవారం 'కళ్యాణమస్తు' సామూహిక వివాహ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆదివాసీ ప్రాంతాలకు చెందిన 29 జంటలకు వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా వివాహాలు నిర్వహించారు, తద్వారా వారి దాంపత్య జీవితానికి శుభారంభం లభించింది. ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమానికి నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని పల్లెపహాడ్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో మాజీ జెడ్పీటీసీ రాములు నిర్మిస్తున్న ఇంటిని మున్సిపల్ సిబ్బంది కూల్చివేయడం తీవ్ర కలకలం రేపింది. స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశారని, ఆ లంచం ఇవ్వకపోవడం వల్ల రాజకీయ కక్షతో తన ఇంటిని కూల్చివేశారని రాములు తీవ్రంగా ఆరోపించారు. ఈ సంఘటనపై బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేసిన ఇంటిని పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వంటేరు ప్రతాప్ రెడ్డి, మల్లన్నసాగర్ నిర్వాసితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మున్సిపల్ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపించిన ఆయన, నిర్వాసితులకు పెండింగ్‌లో ఉన్న ప్యాకేజీలు, ప్లాట్లు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. మల్లన్నసాగర్ భూ బాధితుల సమస్యలపై త్వరలో భారీ సమావేశం నిర్వహిస్తామని ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రకటించారు. పేదల ఇండ్ల కూల్చివేతలు ఆపాలని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ, మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కూడా ప్రభుత్వం హామీలు అమలు చేయాలని స్పష్టం చేసింది.
    1
    సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని పల్లెపహాడ్ ఆర్ అండ్ ఆర్ కాలనీలో మాజీ జెడ్పీటీసీ రాములు నిర్మిస్తున్న ఇంటిని మున్సిపల్ సిబ్బంది కూల్చివేయడం తీవ్ర కలకలం రేపింది. స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశారని, ఆ లంచం ఇవ్వకపోవడం వల్ల రాజకీయ కక్షతో తన ఇంటిని కూల్చివేశారని రాములు తీవ్రంగా ఆరోపించారు.

ఈ సంఘటనపై బీఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కూల్చివేసిన ఇంటిని పరిశీలించి బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వంటేరు ప్రతాప్ రెడ్డి, మల్లన్నసాగర్ నిర్వాసితుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. మున్సిపల్ అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపించిన ఆయన, నిర్వాసితులకు పెండింగ్‌లో ఉన్న ప్యాకేజీలు, ప్లాట్లు వెంటనే అందించాలని డిమాండ్ చేశారు.

మల్లన్నసాగర్ భూ బాధితుల సమస్యలపై త్వరలో భారీ సమావేశం నిర్వహిస్తామని ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రకటించారు. పేదల ఇండ్ల కూల్చివేతలు ఆపాలని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తూ, మల్లన్నసాగర్ నిర్వాసితులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కూడా ప్రభుత్వం హామీలు అమలు చేయాలని స్పష్టం చేసింది.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    1 hr ago
  • జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలం గొడిసెలపేట గ్రామంలో ఒక పిచ్చికుక్క స్వైరవిహారం చేసి ఆరుగురిని గాయపరిచింది. దారిలో వెళ్తున్న వారిపై ఈ కుక్క దాడి చేయడంతో బాధితులకు రక్త గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జగిత్యాల ఆసుపత్రికి తరలించారు, ప్రస్తుతం వారికి అక్కడ వైద్యం అందుతోంది. గ్రామంలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని, బయటికి వెళ్లాలంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తుందని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల నుంచి తమకు రక్షణ కల్పించాలని వారు సంబంధిత అధికారులను కోరుతున్నారు.
    1
    జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలం గొడిసెలపేట గ్రామంలో ఒక పిచ్చికుక్క స్వైరవిహారం చేసి ఆరుగురిని గాయపరిచింది. దారిలో వెళ్తున్న వారిపై ఈ కుక్క దాడి చేయడంతో బాధితులకు రక్త గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్థానికులు, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం జగిత్యాల ఆసుపత్రికి తరలించారు, ప్రస్తుతం వారికి అక్కడ వైద్యం అందుతోంది.

గ్రామంలో కుక్కల బెడద తీవ్రంగా ఉందని, బయటికి వెళ్లాలంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తుందని గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కుక్కల నుంచి తమకు రక్షణ కల్పించాలని వారు సంబంధిత అధికారులను కోరుతున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    27 min ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.