logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నిర్వహించనున్న గిరిప్రదక్షిణ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 5:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మండలంలోని భక్తులతో పాటు కరీంనగర్, సిద్ధిపేట జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారని ఆలయ ప్రధాన పూజారి శేషం మధుసూదనాచార్యులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్ వెల్లడించారు. గిరిప్రదక్షిణలో పాల్గొని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.

4 hrs ago
user_ప్రభాకర్
ప్రభాకర్
Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
4 hrs ago

బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నిర్వహించనున్న గిరిప్రదక్షిణ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 5:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మండలంలోని భక్తులతో పాటు కరీంనగర్, సిద్ధిపేట జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారని ఆలయ ప్రధాన పూజారి శేషం మధుసూదనాచార్యులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్ వెల్లడించారు. గిరిప్రదక్షిణలో పాల్గొని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.

More news from తెలంగాణ and nearby areas
  • బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నిర్వహించనున్న గిరిప్రదక్షిణ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 5:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మండలంలోని భక్తులతో పాటు కరీంనగర్, సిద్ధిపేట జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారని ఆలయ ప్రధాన పూజారి శేషం మధుసూదనాచార్యులు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్ వెల్లడించారు. గిరిప్రదక్షిణలో పాల్గొని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
    1
    బెజ్జంకి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నిర్వహించనున్న గిరిప్రదక్షిణ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 5:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మండలంలోని భక్తులతో పాటు కరీంనగర్, సిద్ధిపేట జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారని ఆలయ ప్రధాన పూజారి శేషం మధుసూదనాచార్యులు తెలిపారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు బెజ్జంకి సర్పంచ్ బొల్లం శ్రీధర్ వెల్లడించారు. గిరిప్రదక్షిణలో పాల్గొని శ్రీ లక్ష్మీనరసింహస్వామివారి ఆశీస్సులు పొందాలని ఆయన భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ప్రత్యేక చర్యలు చేపట్టింది.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    4 hrs ago
  • గోదావరిఖని నుంచి కరీంనగర్ వైపు వస్తున్న ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు సాంకేతిక లోపం కారణంగా మార్గమధ్యంలోనే నిలిచిపోయింది. తొలుత సుల్తానాబాద్ వద్ద పది నిమిషాల పాటు ఆగిన ఈ బస్సు, ఆ తర్వాత కరీంనగర్ ఆర్ట్స్ కాలేజీ వద్దకు చేరుకోగానే మళ్లీ మొరాయించింది. బస్సు సిబ్బంది ఎంత ప్రయత్నించినా కూడా సాంకేతిక లోపాన్ని సరిదిద్దలేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు విసిగిపోయిన ప్రయాణికులు బస్సు దిగి, మరో మార్గం లేక కాలినడకనే బస్టాండ్‌కు చేరుకున్నారు. ముందస్తు తనిఖీలు సరిగా లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
    1
    గోదావరిఖని నుంచి కరీంనగర్ వైపు వస్తున్న ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు సాంకేతిక లోపం కారణంగా మార్గమధ్యంలోనే నిలిచిపోయింది. తొలుత సుల్తానాబాద్ వద్ద పది నిమిషాల పాటు ఆగిన ఈ బస్సు, ఆ తర్వాత కరీంనగర్ ఆర్ట్స్ కాలేజీ వద్దకు చేరుకోగానే మళ్లీ మొరాయించింది.

బస్సు సిబ్బంది ఎంత ప్రయత్నించినా కూడా సాంకేతిక లోపాన్ని సరిదిద్దలేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చివరకు విసిగిపోయిన ప్రయాణికులు బస్సు దిగి, మరో మార్గం లేక కాలినడకనే బస్టాండ్‌కు చేరుకున్నారు. ముందస్తు తనిఖీలు సరిగా లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    14 hrs ago
  • తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5న భువనగిరిలో నిర్వహించనున్న “రాజ్యాధికార సమరభేరి – హలో బీసీ.. చలో భువనగిరి” మహాసభ పోస్టర్‌ను సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోదం రజనీకుమార్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా, జిల్లా అధ్యక్షుడు దండు వినోద్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న నాయకత్వంలో జరగనున్న ఈ మహాసభకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి లక్ష మందికి పైగా ప్రజలు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో బీసీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు కలికోట రేణుక, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కొడూరి శ్రీహరి, పట్టణ అధ్యక్షుడు ఆరుకల రమేష్, మహిళా పట్టణ అధ్యక్షురాలు బిట్ల జ్యోత్స్న, ప్రధాన కార్యదర్శి చెట్టిపల్లి నరేందర్, మండల అధ్యక్షుడు మొగిళ్ల బాబు, కొంకటి శ్రీధర్, చెన్నోజి విద్యాసాగర్, దూడం సత్యం, గాంధీబాబు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
    3
    తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో జూలై 5న భువనగిరిలో నిర్వహించనున్న “రాజ్యాధికార సమరభేరి – హలో బీసీ.. చలో భువనగిరి” మహాసభ పోస్టర్‌ను సిరిసిల్ల ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మోదం రజనీకుమార్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా, జిల్లా అధ్యక్షుడు దండు వినోద్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న నాయకత్వంలో జరగనున్న ఈ మహాసభకు రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి లక్ష మందికి పైగా ప్రజలు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో బీసీ నాయకత్వాన్ని మరింత బలోపేతం చేసేందుకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కృషి చేస్తుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు కలికోట రేణుక, కార్మిక విభాగం జిల్లా అధ్యక్షుడు కొడూరి శ్రీహరి, పట్టణ అధ్యక్షుడు ఆరుకల రమేష్, మహిళా పట్టణ అధ్యక్షురాలు బిట్ల జ్యోత్స్న, ప్రధాన కార్యదర్శి చెట్టిపల్లి నరేందర్, మండల అధ్యక్షుడు మొగిళ్ల బాబు, కొంకటి శ్రీధర్, చెన్నోజి విద్యాసాగర్, దూడం సత్యం, గాంధీబాబు, చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.
    user_సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల స్వరం
    సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    17 hrs ago
  • కరీంనగర్ నగరంలోని కోతీరాంపూర్‌కు చెందిన ఆటో డ్రైవర్ భూక్యా లాలు కుమార్తె వెన్నెల వివాహానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నరాదాసు వసంత రావు మేనమామగా ఆర్థిక సహాయం అందించారు. ఈ నెల 25వ తేదీన జరగనున్న వెన్నెల వివాహ సందర్భంగా, వసంత రావు ఈరోజు వారి ఇంటికి వెళ్లి ₹5016 అందజేశారు. గత నెలలో జరిగిన ఆటో యూనియన్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఆటో కార్మికుల ఆడపిల్లల వివాహాలకు ₹5000 ఆర్థిక సహాయం అందిస్తానని వసంత రావు ప్రకటించారు. భూక్యా సత్తమ్మ, లాలు దంపతుల కుమార్తె వివాహం నిశ్చయమైన విషయం తెలుసుకున్న తర్వాత, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ఆయన ఈ సహాయాన్ని అందించారు. ఆడబిడ్డ పెళ్లికి చిన్న సహాయం అందించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, కరీంనగర్ నగరంలోని ఏ ఆటో కార్మికుడైనా తన కుమార్తె వివాహం చేస్తే, తనను సంప్రదించి ₹5016 ఆర్థిక సహాయాన్ని పొందవచ్చని వసంత రావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నరాదాసు వసంత రావుతో పాటు, గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అఫ్రోజ్ ఖాన్, ఆరే రవి, ఆటో యూనియన్ అధ్యక్షుడు బొమ్మడి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బండారు సంపత్ పటేల్, ఉపాధ్యక్షులు ఇరవేని కుమార్, కుక్కట్ల సంపత్, కోశాధికారి చిట్టిమల్ల నాగభూషణం, ఈసీ మెంబర్స్ కూర్మచలం వేణుమాధవ్, బొంగోని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
    1
    కరీంనగర్ నగరంలోని కోతీరాంపూర్‌కు చెందిన ఆటో డ్రైవర్ భూక్యా లాలు కుమార్తె వెన్నెల వివాహానికి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నరాదాసు వసంత రావు మేనమామగా ఆర్థిక సహాయం అందించారు. ఈ నెల 25వ తేదీన జరగనున్న వెన్నెల వివాహ సందర్భంగా, వసంత రావు ఈరోజు వారి ఇంటికి వెళ్లి ₹5016 అందజేశారు.

గత నెలలో జరిగిన ఆటో యూనియన్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా ఆటో కార్మికుల ఆడపిల్లల వివాహాలకు ₹5000 ఆర్థిక సహాయం అందిస్తానని వసంత రావు ప్రకటించారు. భూక్యా సత్తమ్మ, లాలు దంపతుల కుమార్తె వివాహం నిశ్చయమైన విషయం తెలుసుకున్న తర్వాత, ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ఆయన ఈ సహాయాన్ని అందించారు. ఆడబిడ్డ పెళ్లికి చిన్న సహాయం అందించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, కరీంనగర్ నగరంలోని ఏ ఆటో కార్మికుడైనా తన కుమార్తె వివాహం చేస్తే, తనను సంప్రదించి ₹5016 ఆర్థిక సహాయాన్ని పొందవచ్చని వసంత రావు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకాన్ని ఆదర్శంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో నరాదాసు వసంత రావుతో పాటు, గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అఫ్రోజ్ ఖాన్, ఆరే రవి, ఆటో యూనియన్ అధ్యక్షుడు బొమ్మడి శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బండారు సంపత్ పటేల్, ఉపాధ్యక్షులు ఇరవేని కుమార్, కుక్కట్ల సంపత్, కోశాధికారి చిట్టిమల్ల నాగభూషణం, ఈసీ మెంబర్స్ కూర్మచలం వేణుమాధవ్, బొంగోని శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    21 hrs ago
  • కరీంనగర్ సీపి గౌస్ ఆలం ఆదేశాల మేరకు డ్రగ్స్ అవగాహన కార్యక్రమం లో భాగంగా వీణవంక ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను నిర్వహించారు. ఎస్సై ఆవుల తిరుపతి ఈ మ్యాచ్ ను ప్రారంభించగా, జమ్మికుంట రూరల్ సీఐ పులి వెంకట్ ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ క్రికెట్ మ్యాచ్ లో పోలీస్, ప్రెస్ యూత్ టీంలు ఉత్సాహంగా పాల్గొన్నాయి. నేటి సమాజంలో డ్రగ్స్ కు బానిసలై తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్న యువతను చెడు అలవాట్లకు దూరంగా ఉంచడానికి, వారి ఆలోచనలను ఆటల వైపు మళ్లించే ఉద్దేశ్యంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. యువత విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీఐ పులి వెంకట్ ఈ సందర్భంగా కోరారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం, విక్రయాలపై ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా రెడ్డిపల్లి, వీణవంక, నర్సింగాపూర్, వల్బపూర్, భేతిగల్ గ్రామాలకు చెందిన యువకులకు క్రికెట్ బ్యాట్లు, షటిల్స్, ఫుట్ బాల్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రెస్ మిత్రులు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    కరీంనగర్ సీపి గౌస్ ఆలం ఆదేశాల మేరకు డ్రగ్స్ అవగాహన కార్యక్రమం లో భాగంగా వీణవంక ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం ఫ్రెండ్లీ క్రికెట్ మ్యాచ్ ను నిర్వహించారు. ఎస్సై ఆవుల తిరుపతి ఈ మ్యాచ్ ను ప్రారంభించగా, జమ్మికుంట రూరల్ సీఐ పులి వెంకట్ ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ క్రికెట్ మ్యాచ్ లో పోలీస్, ప్రెస్ యూత్ టీంలు ఉత్సాహంగా పాల్గొన్నాయి.

నేటి సమాజంలో డ్రగ్స్ కు బానిసలై తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్న యువతను చెడు అలవాట్లకు దూరంగా ఉంచడానికి, వారి ఆలోచనలను ఆటల వైపు మళ్లించే ఉద్దేశ్యంతో ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. యువత విద్యార్థులు చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సీఐ పులి వెంకట్ ఈ సందర్భంగా కోరారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగం, విక్రయాలపై ఏదైనా సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ఆయన సూచించారు.

ఈ సందర్భంగా రెడ్డిపల్లి, వీణవంక, నర్సింగాపూర్, వల్బపూర్, భేతిగల్ గ్రామాలకు చెందిన యువకులకు క్రికెట్ బ్యాట్లు, షటిల్స్, ఫుట్ బాల్ లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రెస్ మిత్రులు మరియు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_T. sridhar✍️
    T. sridhar✍️
    వీణవంక, కరీంనగర్, తెలంగాణ•
    23 hrs ago
  • గజ్వేల్, జూన్ 23న మల్లన్నసాగర్ ముంపు గ్రామాల పునరావాస కాలనీ అయిన పల్లెపహాడ్‌లో మాజీ జెడ్పీటీసీ రాములు నిర్మించుకుంటున్న ఇంటిని మున్సిపల్ సిబ్బంది కూల్చివేయడంపై బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కూల్చివేసిన ఇంటి స్థలాన్ని సందర్శించి, బాధితుడు రాములు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ, ఇంటి నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ అధికారులను సంప్రదించగా ముందుగా స్లాబ్ పూర్తి చేసి, ఆ తర్వాత అనుమతులు తీసుకోవాలని సూచించారని ఆరోపించారు. అయితే, స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశారని, ఆ సొమ్ము ఇవ్వకపోవడంతో రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తన ఇంటిని కూల్చివేశారని రాములు తీవ్ర ఆరోపణలు చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం భూములు, ఇండ్లు కోల్పోయి, తిరిగి జీవనం ప్రారంభించుకునే ప్రయత్నం చేస్తున్న నిర్వాసితులకు ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితోనే మున్సిపల్ అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, పెండింగ్‌లో ఉన్న ప్యాకేజీలు, ప్లాట్లు వెంటనే అందించాలని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. నిర్వాసితుల సమస్యలపై త్వరలో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెండ మధు, పల్లెపహాడ్ గ్రామస్తులు, మల్లన్నసాగర్ ముంపు గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    4
    గజ్వేల్, జూన్ 23న మల్లన్నసాగర్ ముంపు గ్రామాల పునరావాస కాలనీ అయిన పల్లెపహాడ్‌లో మాజీ జెడ్పీటీసీ రాములు నిర్మించుకుంటున్న ఇంటిని మున్సిపల్ సిబ్బంది కూల్చివేయడంపై బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కూల్చివేసిన ఇంటి స్థలాన్ని సందర్శించి, బాధితుడు రాములు కుటుంబ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ, ఇంటి నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ అధికారులను సంప్రదించగా ముందుగా స్లాబ్ పూర్తి చేసి, ఆ తర్వాత అనుమతులు తీసుకోవాలని సూచించారని ఆరోపించారు. అయితే, స్థానిక కాంగ్రెస్ కౌన్సిలర్ ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేశారని, ఆ సొమ్ము ఇవ్వకపోవడంతో రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే తన ఇంటిని కూల్చివేశారని రాములు తీవ్ర ఆరోపణలు చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు కోసం భూములు, ఇండ్లు కోల్పోయి, తిరిగి జీవనం ప్రారంభించుకునే ప్రయత్నం చేస్తున్న నిర్వాసితులకు ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరమని వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ నాయకుల ఒత్తిడితోనే మున్సిపల్ అధికారులు ఈ చర్యకు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం మల్లన్నసాగర్ భూ నిర్వాసితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, పెండింగ్‌లో ఉన్న ప్యాకేజీలు, ప్లాట్లు వెంటనే అందించాలని వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు. నిర్వాసితుల సమస్యలపై త్వరలో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ గంగిశెట్టి చందన రవీందర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెండ మధు, పల్లెపహాడ్ గ్రామస్తులు, మల్లన్నసాగర్ ముంపు గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    user_GOUSE BEURO REPORTER
    GOUSE BEURO REPORTER
    రిపోర్టర్ వర్గల్, సిద్దిపేట, తెలంగాణ•
    13 hrs ago
  • కేంద్రం చేపట్టిన ఓటర్ జాబితా సవరణలో భాగంగా SIR కార్యక్రమం కింద ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ నేటితో ముగుస్తుంది. ఈ ప్రక్రియలో కవర్ కాని ఓటర్ల కోసం బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLOs) రేపటి నుండి ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారం పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 25 నుండి వచ్చే నెల జులై 24 వరకు BLOలు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారం పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇప్పటికే సంబంధిత రెవెన్యూ కార్యాలయాల నుండి BLOలు తమకు కావాల్సిన సామాగ్రి కిట్లను తీసుకెళ్ళారు. SIR పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల స్థాయిలో తహశీల్దార్ కార్యాలయంలో SIR హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు.
    1
    కేంద్రం చేపట్టిన ఓటర్ జాబితా సవరణలో భాగంగా SIR కార్యక్రమం కింద ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియ నేటితో ముగుస్తుంది. ఈ ప్రక్రియలో కవర్ కాని ఓటర్ల కోసం బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLOs) రేపటి నుండి ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారం పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈనెల 25 నుండి వచ్చే నెల జులై 24 వరకు BLOలు ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారం పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తారు. ఇప్పటికే సంబంధిత రెవెన్యూ కార్యాలయాల నుండి BLOలు తమకు కావాల్సిన సామాగ్రి కిట్లను తీసుకెళ్ళారు. SIR పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టరేట్‌తో పాటు మండల స్థాయిలో తహశీల్దార్ కార్యాలయంలో SIR హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    4 hrs ago
  • కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ మండలం, కొత్తపల్లిలో జరిగిన ఎల్లమ్మ బోనాల జాతరలో కుల వివక్షత తీవ్ర కలకలం సృష్టించింది. బోనాలతో గుడిలోకి వస్తున్న దళితులను గౌడ కులస్తులు అడ్డుకున్నారని దళితులు ఆందోళనకు దిగారు. గుడి ముందు బైఠాయించి ధర్నా నిర్వహించిన దళితులు, గుడిలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఒక శివసత్తి మహిళను అడ్డుకొని నెట్టేయడంతో ఆమె కింద పడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన దళితులకు, గౌడ కులస్తులకు మధ్య తీవ్ర వాగ్వివాదానికి, ఘర్షణ వాతావరణానికి దారి తీసి ఉద్రిక్తతకు కారణమైంది. సమాచారం అందుకున్న ఎల్ఎండి ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను సముదాయించారు. ఎల్లమ్మ తల్లి గుడిలోకి తమను రాకుండా అడ్డుకున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకుని న్యాయం చేయాలని దళితులు పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసుల జోక్యంతో అక్కడ నెలకొన్న ఆందోళన తాత్కాలికంగా సద్దుమణిగింది.
    4
    కరీంనగర్ జిల్లా, తిమ్మాపూర్ మండలం, కొత్తపల్లిలో జరిగిన ఎల్లమ్మ బోనాల జాతరలో కుల వివక్షత తీవ్ర కలకలం సృష్టించింది. బోనాలతో గుడిలోకి వస్తున్న దళితులను గౌడ కులస్తులు అడ్డుకున్నారని దళితులు ఆందోళనకు దిగారు. గుడి ముందు బైఠాయించి ధర్నా నిర్వహించిన దళితులు, గుడిలోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఒక శివసత్తి మహిళను అడ్డుకొని నెట్టేయడంతో ఆమె కింద పడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటన దళితులకు, గౌడ కులస్తులకు మధ్య తీవ్ర వాగ్వివాదానికి, ఘర్షణ వాతావరణానికి దారి తీసి ఉద్రిక్తతకు కారణమైంది. సమాచారం అందుకున్న ఎల్ఎండి ఎస్ఐ సంఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను సముదాయించారు. ఎల్లమ్మ తల్లి గుడిలోకి తమను రాకుండా అడ్డుకున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకుని న్యాయం చేయాలని దళితులు పోలీసులను డిమాండ్ చేశారు. పోలీసుల జోక్యంతో అక్కడ నెలకొన్న ఆందోళన తాత్కాలికంగా సద్దుమణిగింది.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.