logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

Yestarday news in adilabad

on 13 December
user_Shudhodhan Shudhodhan salve
Shudhodhan Shudhodhan salve
Ichoda, Adilabad•
on 13 December

Yestarday news in adilabad

More news from తెలంగాణ and nearby areas
  • ఆత్మవిశ్వాసంతో టెన్త్ విద్యార్థులు పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని ఐద్వా మహిళా సంఘం జన్నారం మండల అధ్యక్షురాలు పోతు విజయశంకర్ కోరారు. టెన్త్ పరీక్షల నేపథ్యంలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి పదో తరగతి పరీక్షలు మైలురాయి వంటివి అన్నారు. భవిష్యత్తు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా వెళ్లేందుకు టెన్త్ పరీక్షలు నిచ్చెనగా ఉపయోగపడతాయన్నారు. పిల్లల భవిష్యత్తును బాగుండాలని తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతుంటారని, వారి ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉంటుందన్నారు. పరీక్షలను కష్టంగా కాకుండా ఇష్టపడి బాగా రాస్తే మంచి ర్యాంకు సాధించడం ఖాయమన్నారు. శనివారం నుండి ప్రారంభం కానున్న టెన్త్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు.
    1
    ఆత్మవిశ్వాసంతో టెన్త్ విద్యార్థులు పరీక్షలు రాసి మంచి ఉత్తీర్ణత సాధించాలని ఐద్వా మహిళా సంఘం జన్నారం మండల అధ్యక్షురాలు పోతు విజయశంకర్ కోరారు. టెన్త్ పరీక్షల నేపథ్యంలో శుక్రవారం ఆమె మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి పదో తరగతి పరీక్షలు మైలురాయి వంటివి అన్నారు. భవిష్యత్తు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా వెళ్లేందుకు టెన్త్ పరీక్షలు నిచ్చెనగా ఉపయోగపడతాయన్నారు. పిల్లల భవిష్యత్తును బాగుండాలని తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతుంటారని, వారి ఆశలను నెరవేర్చాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉంటుందన్నారు. పరీక్షలను కష్టంగా కాకుండా ఇష్టపడి బాగా రాస్తే మంచి ర్యాంకు సాధించడం ఖాయమన్నారు. శనివారం నుండి ప్రారంభం కానున్న టెన్త్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    11 hrs ago
  • ఇందిరమ్మ ఇల్లు కల సాకారం నూతన ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభోత్సవ కార్యక్రమం లో నాయకులు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని చిన లింగాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు అనసూర్య, చంద్రయ్య లు ఈరోజు గృహప్రవేశం నిర్వహించగా ఇట్టి కార్యక్రమం కు ముఖ్య అతిథులుగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ టోనీ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింగం గౌడ్ గారీ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేయడం జరిగింది,అనంతరం లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలుపుతూ కెకె మహేందర్ రెడ్డి గారు పంపించిన చిరు కానుక ప్రవీణ్ టోనీ చేతుల మీదుగా అందివ్వడం జరిగింది.లబ్ధిదారులు ప్రజా పాలన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి ,కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమం లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు నేరల నర్సింగ0 గౌడ్ గారు ,నాయకులు బైరినేని రాము,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మునిగేల రాజు,మిరాల శ్రీనివాస్,నారా గౌడ్,రవీంద్రారెడ్డి మరియు నాయకులు,మహిళలు పాల్గొన్నారు.
    1
    ఇందిరమ్మ ఇల్లు కల సాకారం నూతన ఇందిరమ్మ ఇళ్లు ప్రారంభోత్సవ కార్యక్రమం లో నాయకులు.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలంలోని చిన లింగాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు  అనసూర్య, చంద్రయ్య లు ఈరోజు గృహప్రవేశం నిర్వహించగా ఇట్టి కార్యక్రమం కు ముఖ్య అతిథులుగా మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్ టోనీ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరెళ్ల నరసింగం గౌడ్ గారీ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేయడం జరిగింది,అనంతరం లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలుపుతూ కెకె మహేందర్ రెడ్డి గారు పంపించిన చిరు కానుక ప్రవీణ్ టోనీ చేతుల మీదుగా అందివ్వడం జరిగింది.లబ్ధిదారులు ప్రజా పాలన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి గారికి ,కాంగ్రెస్ నాయకులకు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
ఇట్టి కార్యక్రమం లో మండల కాంగ్రెస్ అధ్యక్షులు ప్రవీణ్, మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు నేరల నర్సింగ0 గౌడ్ గారు ,నాయకులు బైరినేని రాము,యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు మునిగేల రాజు,మిరాల శ్రీనివాస్,నారా గౌడ్,రవీంద్రారెడ్డి మరియు నాయకులు,మహిళలు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    10 hrs ago
  • పత్రిక ప్రకటన తేది:13.03.2026 కామారెడ్డి జిల్లా శుక్రవారం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం అడ్లూర్–ఎల్లారెడ్డి గ్రామపంచాయతీ పరిధిలో గ్రామ అధికారుల ద్వారా అడ్లూర్ శివారులో నిర్వహిస్తున్న ప్లాస్టిక్ సేకరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తనిఖీ చేసి తగు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు నేషనల్ హైవే పైన ఉన్న డాబా హోటళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. హైవే పైన ఉన్న అన్ని డాబా హోటళ్లకు పంచాయతీ కార్యదర్శులు (PSs) నోటీసులు జారీ చేసి, వారికి సంబంధిత లైసెన్సులు ఉన్నాయా లేదా, అలాగే నేషనల్ హైవే అధికారుల అనుమతి తీసుకున్నారా లేదా అనే విషయాలను పరిశీలించాలని ఆదేశించారు. కలెక్టర్ గారి అప్పీల్: ప్రయాణికులు , ప్రజలు నేషనల్ హైవే పైన ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్, ఫుడ్ వేస్టేజ్, పేపర్ వేస్టేజ్ వంటి చెత్తను వేయకుండా రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ గవిజ్ఞప్తి చేశారు. ఈ దిశగా గ్రామపంచాయతీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా నేషనల్ హైవే పైన ఉన్న డాబా హోటళ్లను పంచాయతీ కార్యదర్శులు (PS), ఎంపీఓ (MPO), ఎంపీడీవో (MPDO)లు సంయుక్తంగా తనిఖీ చేసి, నేషనల్ హైవే అనుమతులు , గ్రామపంచాయతీ అనుమతులు ఉన్నాయా లేదా పరిశీలించాలని ఆదేశించారు. హోటళ్ల నుండి వచ్చే చెత్తను రోడ్డుపై వేస్తే సంబంధిత గ్రామపంచాయతీలు అధిక మొత్తంలో జరిమానాలు విధించాలని కలెక్టర్ ఆదేశించారు.
    1
    పత్రిక ప్రకటన 
తేది:13.03.2026
కామారెడ్డి జిల్లా శుక్రవారం
ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం అడ్లూర్–ఎల్లారెడ్డి గ్రామపంచాయతీ పరిధిలో గ్రామ అధికారుల ద్వారా అడ్లూర్ శివారులో నిర్వహిస్తున్న ప్లాస్టిక్ సేకరణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తనిఖీ చేసి తగు సూచనలు జారీ చేశారు.
ఈ సందర్భంగా అధికారులు నేషనల్ హైవే పైన ఉన్న డాబా హోటళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. హైవే పైన ఉన్న అన్ని డాబా హోటళ్లకు పంచాయతీ కార్యదర్శులు (PSs) నోటీసులు జారీ చేసి, వారికి సంబంధిత లైసెన్సులు ఉన్నాయా లేదా, అలాగే నేషనల్ హైవే అధికారుల అనుమతి తీసుకున్నారా లేదా అనే విషయాలను పరిశీలించాలని ఆదేశించారు.
కలెక్టర్ గారి అప్పీల్:
ప్రయాణికులు , ప్రజలు నేషనల్ హైవే పైన ఎట్టి పరిస్థితుల్లోనూ ప్లాస్టిక్, ఫుడ్ వేస్టేజ్, పేపర్ వేస్టేజ్ వంటి చెత్తను వేయకుండా రోడ్లను పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ గవిజ్ఞప్తి చేశారు. ఈ దిశగా గ్రామపంచాయతీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
అదేవిధంగా నేషనల్ హైవే పైన ఉన్న డాబా హోటళ్లను పంచాయతీ కార్యదర్శులు (PS), ఎంపీఓ (MPO), ఎంపీడీవో (MPDO)లు సంయుక్తంగా తనిఖీ చేసి, నేషనల్ హైవే అనుమతులు , గ్రామపంచాయతీ అనుమతులు ఉన్నాయా లేదా పరిశీలించాలని ఆదేశించారు. హోటళ్ల నుండి వచ్చే చెత్తను రోడ్డుపై వేస్తే సంబంధిత గ్రామపంచాయతీలు అధిక మొత్తంలో జరిమానాలు విధించాలని కలెక్టర్  ఆదేశించారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    12 hrs ago
  • కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వారిచే శుక్రవారం రోజున సరస్వతి హై స్కూల్ యందు నిర్వహించిన కరాటే పోటీ పరీక్షలలో మా పాఠశాలకు చెందిన సుమారు 70 మంది విద్యార్ధినీ, విద్యార్థులు కరాటే పోటీలలో పాల్గొని వారి, వారి స్థాయికి తగ్గ ప్రతిభను ప్రదర్శించి కరాటేలోని వివిధ స్థాయి బెల్టులను,సర్టిఫికెట్లను పాఠశాల కరాటే శిక్షకుడు పుల్లూరి శ్రీనివాస్ శిక్షణలో, ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చీఫ్ ఎగ్జామినర్ కే. వసంత కుమార్ పర్యవేక్షణలో సాధించారు. ఇట్టి బెల్టులను వసంత కుమార్ గారితో పాటు గ్రామ సర్పంచ్ చిందం ఆంజనేయులు అందించినట్లు పాఠశాల కరెస్పాండెంట్ మిట్టపల్లి రాజశేఖర్ తెలిపారు. వీరిని పాఠశాల ప్రిన్సిపాల్ మిట్టపల్లి మాధవి తో పాటు ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు అభినందించారు.
    1
    కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి గ్రామంలో ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ వారిచే శుక్రవారం రోజున సరస్వతి హై స్కూల్ యందు నిర్వహించిన కరాటే పోటీ పరీక్షలలో మా పాఠశాలకు చెందిన సుమారు 70 మంది విద్యార్ధినీ, విద్యార్థులు కరాటే పోటీలలో పాల్గొని వారి, వారి స్థాయికి తగ్గ ప్రతిభను ప్రదర్శించి కరాటేలోని వివిధ స్థాయి బెల్టులను,సర్టిఫికెట్లను పాఠశాల  కరాటే శిక్షకుడు పుల్లూరి శ్రీనివాస్ శిక్షణలో, ఒకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చీఫ్ ఎగ్జామినర్ కే. వసంత కుమార్ పర్యవేక్షణలో సాధించారు. ఇట్టి బెల్టులను వసంత కుమార్ గారితో పాటు గ్రామ సర్పంచ్ చిందం ఆంజనేయులు  అందించినట్లు పాఠశాల కరెస్పాండెంట్ మిట్టపల్లి రాజశేఖర్ తెలిపారు. వీరిని పాఠశాల ప్రిన్సిపాల్ మిట్టపల్లి మాధవి తో పాటు ఉపాధ్యాయనీ, ఉపాధ్యాయులు అభినందించారు.
    user_ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా న్యూస్
    జర్నలిస్ట్ కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    15 hrs ago
  • ప్రభుత్వం జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ సరఫరా చేస్తుందని ప్రజలెవరు వంటగ్యాస్ కొరకు ఆందోళన చెందరాదని జిల్లా కలెక్టర్ కే. హైమవతి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కే. హైమావతి జిల్లా ప్రజల ఉద్దేశించిమాట్లాడుతూ మన జిల్లాలో 03 లక్షల 32 వేల 850 డొమెస్టిక్ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, దాదాపు 1500 కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని గతంలో ప్రభుత్వం సరఫరా చేసిన విధంగానే ఇప్పుడు కూడా మన జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ ను ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తుందని అన్నారు. ఎప్పటిలాగే మన జిల్లా ప్రజలకు అవసరమైన స్థాయిలో వంట గ్యాస్ సరఫరా చేస్తున్నందున ప్రజలు అనవసర భయాందోళనలకు గురై ఎక్కువ సిలిండర్ లను బుక్ చేసుకోరాదని అన్నారు. ఎక్కువ సిలిండర్లను బుక్ చేసుకోవడం వలననే ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ప్రజలు వంటగ్యాస్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందరాదని సూచించారు. అదేవిధంగా కమర్షియల్ వంట గ్యాస్ ను కూడా సరఫరా చేస్తామని తెలిపారు.
    1
    ప్రభుత్వం జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ సరఫరా చేస్తుందని ప్రజలెవరు వంటగ్యాస్ కొరకు ఆందోళన చెందరాదని జిల్లా కలెక్టర్ కే. హైమవతి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కే. హైమావతి జిల్లా ప్రజల ఉద్దేశించిమాట్లాడుతూ  మన జిల్లాలో  03 లక్షల 32 వేల 850 డొమెస్టిక్ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని, దాదాపు 1500 కమర్షియల్ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయని గతంలో ప్రభుత్వం సరఫరా చేసిన విధంగానే ఇప్పుడు కూడా మన జిల్లాకు అవసరమైన వంట గ్యాస్ ను ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా సరఫరా చేస్తుందని అన్నారు. ఎప్పటిలాగే మన జిల్లా ప్రజలకు అవసరమైన స్థాయిలో వంట గ్యాస్ సరఫరా చేస్తున్నందున ప్రజలు అనవసర భయాందోళనలకు గురై  ఎక్కువ సిలిండర్ లను బుక్ చేసుకోరాదని అన్నారు. ఎక్కువ సిలిండర్లను బుక్ చేసుకోవడం వలననే ఇబ్బందులు తలెత్తుతాయి కాబట్టి ప్రజలు వంటగ్యాస్ విషయంలో ఎలాంటి ఆందోళన చెందరాదని సూచించారు. అదేవిధంగా కమర్షియల్ వంట గ్యాస్ ను కూడా సరఫరా చేస్తామని తెలిపారు.
    user_RAMESH P
    RAMESH P
    కుశాల్ నగర్, సిద్దిపేట•
    11 hrs ago
  • కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్ర పేరుతో శనివారం కరీంనగర్ నుంచి కొండగట్టుకు పాదయాత్ర చేపడుతున్నారు. బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్రకు పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 7 గంటలకు కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం నుండి ‘‘అంజన్న ఆశీర్వాద యాత్ర’’ పేరుతో పాదయాత్ర ప్రారంభిస్తారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికైన బీజేపీ సర్పంచులు 108 మంది, 450 మంది వార్డు సభ్యులు, 54 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సైతం బండి సంజయ్ తో కలిసి పాదయాత్రలో పాల్గొంటారు. వారితోపాటు వేలాది మంది బిజేపి కార్యకర్తలు, భక్తమండళ్లు, స్వచ్ఛంద సంస్థలు, హనుమాన్ భక్తులు భారీ ఎత్తున బండి సంజయ్ తో కలిసి కరీంనగర్ఊ నుండి కొండగట్టు వరకు పాదయాత్రలో పాల్గొంటారు. ఇప్పటికే కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు దారి పొడవునా స్వాగత తోరణాలు ఫ్లెక్సీలతో నింపేశారు. 40 కిలోమీటర్లు సాగే పాదయాత్ర లో పెద్ద సంఖ్యలో పాల్గొంటున్న నేపథ్యంలో దారిలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు పకఢ్బందీ చర్యలు చేపట్టారు.
    1
    కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్ర పేరుతో శనివారం కరీంనగర్ నుంచి కొండగట్టుకు పాదయాత్ర చేపడుతున్నారు. బండి సంజయ్ అంజన్న ఆశీర్వాద యాత్రకు పార్టీ శ్రేణులు విస్తృత ఏర్పాటు చేశారు. శనివారం ఉదయం 7 గంటలకు కరీంనగర్ లోని మహాశక్తి ఆలయం నుండి ‘‘అంజన్న ఆశీర్వాద యాత్ర’’ పేరుతో పాదయాత్ర  ప్రారంభిస్తారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికైన బీజేపీ సర్పంచులు 108 మంది, 450 మంది వార్డు సభ్యులు, 54 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు సైతం బండి సంజయ్ తో  కలిసి పాదయాత్రలో పాల్గొంటారు. వారితోపాటు వేలాది మంది బిజేపి కార్యకర్తలు, భక్తమండళ్లు, స్వచ్ఛంద సంస్థలు, హనుమాన్ భక్తులు భారీ ఎత్తున బండి సంజయ్ తో కలిసి కరీంనగర్ఊ నుండి కొండగట్టు వరకు పాదయాత్రలో పాల్గొంటారు. ఇప్పటికే కరీంనగర్ నుంచి కొండగట్టు వరకు దారి పొడవునా స్వాగత తోరణాలు ఫ్లెక్సీలతో నింపేశారు. 40 కిలోమీటర్లు సాగే పాదయాత్ర లో పెద్ద సంఖ్యలో  పాల్గొంటున్న నేపథ్యంలో దారిలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు పకఢ్బందీ చర్యలు చేపట్టారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    12 hrs ago
  • ఆదిలాబాద్ జిల్లా : బోథ్ నియోజకవర్గం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోనాలా మండలంలోని సూర్యానగర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దారావత్ రమేష్ కుమారుని ఇచ్చోడా మండలంలోని హిరపూర్ గ్రామానికి చెందిన జాదవ్ చిరంజీవిలాల్ కుమారుని టీలా కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. వారితోపాటు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    1
    ఆదిలాబాద్ జిల్లా : బోథ్ నియోజకవర్గం ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సోనాలా మండలంలోని సూర్యానగర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దారావత్ రమేష్ కుమారుని ఇచ్చోడా మండలంలోని హిరపూర్ గ్రామానికి చెందిన జాదవ్ చిరంజీవిలాల్ కుమారుని టీలా కార్యక్రమంలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. వారితోపాటు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    17 hrs ago
  • గంజాయి, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని నిర్మల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వసంతరావు సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఖానాపూర్ మండలంలోని సేవా నాయక్ తండాలో గ్రామ ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ఎక్సైజ్ సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాలతో జీవితాలు ప్రశ్నార్ధకంగా మార్తాయని, వాటికి యువత దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు, ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
    1
    గంజాయి, మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని నిర్మల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వసంతరావు సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం ఖానాపూర్ మండలంలోని
సేవా నాయక్ తండాలో గ్రామ ప్రజా ప్రతినిధులు, నాయకులతో కలిసి ఎక్సైజ్ సిబ్బంది భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాలతో జీవితాలు ప్రశ్నార్ధకంగా మార్తాయని, వాటికి యువత దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజా ప్రతినిధులు, ఎక్సైజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
    user_Gourinatha p.g
    Gourinatha p.g
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    16 hrs ago
  • అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల పట్టణం అశోక్ నగర్ లోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో పిల్లల హాజరు రిజిస్టర్ తనిఖీ చేసి, మొత్తం ఎందరు పిల్లలు ఉన్నారు? రోజూ ఎందరు వస్తున్నారో ఆరా తీశారు. పలువురు పిల్లల తల్లులతో మాట్లాడి.. గుడ్డు, పోషకాహారం ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లల ఎత్తు, బరువు కొలిచిన వివరాలు, ఆన్లైన్ అలాగే రిజిస్టర్ నమోదు చేసిన వివరాలు పరిశీలించారు. కేంద్రంలో నిలువు ఉన్న గుడ్లు, బాలా అమృతం తనిఖీ చేశారు. పిల్లల ఎత్తు, బరువు కొలిచే యంత్రాల పనితీరు పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలు రోజూ వచ్చేలా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల సేవలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు.
    1
    అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల పట్టణం అశోక్ నగర్ లోని అంగన్వాడీ కేంద్రంలో శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో పిల్లల హాజరు రిజిస్టర్ తనిఖీ చేసి, మొత్తం ఎందరు పిల్లలు ఉన్నారు? రోజూ ఎందరు వస్తున్నారో ఆరా తీశారు. పలువురు పిల్లల తల్లులతో మాట్లాడి.. గుడ్డు, పోషకాహారం ఇస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్లల ఎత్తు, బరువు కొలిచిన వివరాలు, ఆన్లైన్ అలాగే రిజిస్టర్ నమోదు చేసిన వివరాలు పరిశీలించారు. కేంద్రంలో నిలువు ఉన్న గుడ్లు, బాలా అమృతం తనిఖీ చేశారు. పిల్లల ఎత్తు, బరువు కొలిచే యంత్రాల పనితీరు పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలకు పిల్లలు రోజూ వచ్చేలా వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లలు, గర్భిణులు, బాలింతలు అంగన్వాడీ కేంద్రాల సేవలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నిచ్చారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    10 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.