Shuru
Apke Nagar Ki App…
అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా వాసవి మాత జయంతి....... జన్నారం మండల కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో వాసవి మాతా జయంతిని ఆర్యవైశ్య సంఘం నాయకులు నిర్వహించారు. వాసవి మాత జయంతి సందర్భంగా ఆదివారం వారు వాసవి మాత చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలందరూ కలిసి సామూహికంగా వాసవి మాత స్తోత్రాన్ని పఠించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జన్నారం పట్టణ అధ్యక్షులు జక్కు భూమేష్, సర్పంచ్ సుష్మ భూమేష్, ఒజ్జల వామన్, తదితరులు ఉన్నారు.
P.G. Murthy
అభయాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా వాసవి మాత జయంతి....... జన్నారం మండల కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో వాసవి మాతా జయంతిని ఆర్యవైశ్య సంఘం నాయకులు నిర్వహించారు. వాసవి మాత జయంతి సందర్భంగా ఆదివారం వారు వాసవి మాత చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మహిళలందరూ కలిసి సామూహికంగా వాసవి మాత స్తోత్రాన్ని పఠించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జన్నారం పట్టణ అధ్యక్షులు జక్కు భూమేష్, సర్పంచ్ సుష్మ భూమేష్, ఒజ్జల వామన్, తదితరులు ఉన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- జగిత్యాల: మూడు రోజుల్లోనే ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలికి, పల్లెల్లో ప్రగతి రథ చక్రాలు కదిలేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్న సందర్బంగా జగిత్యాలలో శనివారం మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో పొన్నాల గార్డెన్స్ లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆర్టీసీ జేఏసీ నాయకులు కలిసి సన్మానం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి రుణపడి ఉంటామని ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మరోమారు ఆర్టీసీ కార్మికులకు న్యాయం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆర్టీసీ కార్మికులు అండగా నిలుస్తామని మంత్రికి జేఏసీ నాయకులు హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే నాటి ప్రభుత్వం కనీసం కార్మిక సంఘాలను చర్చలకు పిలవలేదని రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ సమ్మె చేస్తున్న కార్మికులను డిస్మిస్ చేస్తామని హెచ్చరించారని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీలో పనిచేస్తున్న కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం చేస్తున్న సమ్మె సమస్యను పరిష్కరించి కార్మికులకు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు గారు పొన్నం ప్రభాకర్ గారు వివేక్ గారితో పాటు తాను ఆర్టీసీ కి చెందిన 24 కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించామని మంత్రి తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో ఆర్టీసీ కార్మికులు సుమారు 52 రోజులు సమ్మె చేస్తే కార్మిక సంఘాలను నాటి ప్రభుత్వ పెద్దలు కనీసం చర్చలకు పిలవలేదని మంత్రి అన్నారు. విధులకు హాజరుకాకుంటే ఉద్యోగం నుండి డిస్మిస్ చేస్తామని స్వయంగా నాటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఆనాడు కార్మికులను భయభ్రాంతులకు గురి చేశారని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ప్రజా ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మూడు రోజుల్లోనే ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలికామని మంత్రి తెలిపారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మరణించడం చాలా బాధాకరమని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు.1
- करीमनगर थ्री टाउन पुलिस स्टेशन के सब-इंस्पेक्टर एन. चैतन्य चंदर को निलंबित कर दिया गया है। खानपुर में एक सैलून में बाल कटवाने गए एसआई ने दुकानदार रामुलु के साथ अभद्र व्यवहार किया। दुकानदार द्वारा "अन्ना बैठिए" कहने पर एसआई ने आपत्ति जताते हुए असभ्य भाषा का प्रयोग किया और हाथापाई की। यह घटना सीसीटीवी फुटेज में कैद हो गई और सोशल मीडिया पर वायरल होने के बाद पुलिस आयुक्त गाउस आलम ने त्वरित कार्रवाई करते हुए एसआई को निलंबित करने का आदेश जारी किया। ➡️ यह मामला पुलिस विभाग की छवि पर सवाल खड़े करता है और अधिकारियों द्वारा अनुशासनहीनता पर सख्त रुख अपनाने का संकेत देता है।1
- మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కుమారుడు హరిహరన్ సాయి వివాహము నేడు హైదరాబాదులో జరగగా ఈ వివాహ వేడుకకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై వధూవరులను ఆశీర్వదించారు.1
- అమరావతిని నిర్మించే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఎక్కువకాలం జీవించాలనుకునేవాళ్ళు అమరావతికి వచ్చి స్థిరపడొచ్చు. ఆ విధంగా కాలుష్య రహిత నగరంగా అమరావతిని తీర్చిదిద్దుతున్నాం.1
- గన్నేరువరం మండలం మైలారం–కాసింపేట చౌరస్తా వద్ద ఆదివారం బైక్‌పై గొర్రెను తరలిస్తున్న ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. సమాచారం ప్రకారం ఖాసింపేట గ్రామానికి చెందిన సందవేని నాగరాజు గొర్రెలను మేపుకుంటూ వెళ్తుండగా, వెనకాల ఉన్న ఒక గొర్రెను గన్నేరువరం మండలానికి ఒక ఫంక్షన్‌కు వచ్చిన ముగ్గురు వ్యక్తులు అపహరించినట్లు తెలిసింది. వీరు బెజ్జంకి ప్రాంతానికి చెందిన వారిగా గుర్తించారు. అనంతరం వారు TS26D9283 నంబర్ గల రెడ్ కలర్ గ్లామర్ బైక్‌పై గొర్రెను తీసుకెళ్తుండగా, గన్నేరువరం వద్ద గొర్ల కాపర్లు వెంబడించి పట్టుకున్నారు. ఈ క్రమంలో ముగ్గురిలో ఒకరు పరారీలోకి వెళ్లినట్లు సమాచారం. మిగతా ఇద్దరిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు తెలిసింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- జనగణన 2027లో భాగంగా స్వీయ గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ కో సాగుతుందని అందుకు సంబంధించిన వివరాలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం లో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మీడియా సమావేశం నిర్వహించి వెల్లడించారు.జనగణన–2027లో భాగంగా స్వీయ గణన ప్రక్రియ ప్రారంభమైందని ఈ కార్యక్రమంలో తాను పాల్గొని స్వయంగా తన కుటుంబ వివరాలను నమోదు చేసుకున్నట్లు తెలిపారు.జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ప్రజలందరూ జనగణనలో భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా కలెక్టర్ పిలుపునిచ్చారు. ప్రతి కుటుంబం తమ వివరాలను ఖచ్చితంగా నమోదు చేయడం ఎంతో కీలకమని తెలిపారు. సరైన గణాంకాలు అందుబాటులోకి వస్తేనే ప్రభుత్వ పథకాలు సమర్థ వంతంగా అమలు అవుతాయని పేర్కొన్నారు. జనగణన విజయవంతం కావాలంటే ప్రజల సహకారం తప్పనిసరిగా అవసరమని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.2
- *కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ఖానాపుర ఏరియాలో సెలున్ షాపులో పని చేసుకునే పగడాల రాము అనే నాయీబ్రాహ్మణుడి మీద త్రీటౌన్ ఎస్ఐ చైతన్య చందర్ కేవలం తనను అన్నా అని పిలిచినందుకు పగడాల రాము మీద దాడి వేయడంమే కాకుండా ఇష్టం వచ్చినట్లు తిట్టిన ఎస్ఐని సస్పెండ్ చేసి చేతులు దులుపు కోకుండా అతడిపై రాము ఇచ్చిన పిర్యాదు అధారంగా కేసు పెట్టి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ నాయీబ్రాహ్మణ ఐక్యవేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంజపడుగు హరిప్రసాద్ అన్నారు.*1
- *పత్రికా ప్రకటన* ఆదిలాబాద్ జిల్లా, ఏప్రిల్ 25 :- *రూ.7,01,83,214 మోసం వెలుగులోకి* *మ్యూల్ అకౌంట్ల ద్వారా గేమింగ్, బెట్టింగ్, ఫేక్ ట్రేడింగ్ మోసాలు* *బ్యాంక్ ఖాతాలను ఇతరులకు, సైబర్ నేరగాళ్లకు ఇవ్వడం నేరమే* *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్* శనివారం సాయంత్రం స్థానిక పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరం నందు ఏర్పాటు చేసిన సేవ మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పాల్గొని ఆపరేషన్ క్రాక్ డౌన్ 1 సంబంధించిన వివరాలను వెల్లడించారు, ఆదిలాబాద్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో “ఆపరేషన్ క్రాక్‌డౌన్-1.0”లో భాగంగా సైబర్ మోసాలు, ఆన్‌లైన్ గేమింగ్/బెట్టింగ్ లావాదేవీలకు సంబంధించి అనుమానాస్పద బ్యాంక్ ఖాతాలపై జిల్లా వ్యాప్తంగా విశ్లేషణ నిర్వహించడం జరిగింది. ఈ పరిశీలనలో మొత్తం 74 మ్యూల్ అకౌంట్లు గుర్తించగా, వివిధ పోలీస్ స్టేషన్లలో 12 ప్రధాన కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుల్లో నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవడం జరిగింది. *రిమాండ్‌కు పంపబడిన వారు:* షెర్లా రాజవర్ధన్, పేట్లశ్రీ అక్షయ్, రాజేందర్, షేక్ సమీర్. *ఇతర కేసుల్లో గుర్తించిన నిందితులు:* అవేస్ ఖాన్, మడవి ఘనశ్యామ్, జాధవ్ సంతోష్, సురం ఆశమ్మ, జక్కుల ప్రవీణ్, సురం విశ్వేశ్వర్, రాథోడ్ మనోజ్, జి. ఆర్యన్ గౌడ్, జాధవ్ గోవర్ధన్, షేక్ సమీర్, చవాన్ గోపాల్. గేమింగ్ యాప్స్, బెట్టింగ్ ప్లాట్‌ఫార్మ్స్, ఫేక్ ట్రేడింగ్, టాస్క్/రివ్యూ మోసాల ద్వారా అక్రమ డబ్బు మార్పిడి జరిపినట్లు విచారణలో వెల్లడైంది. *పోలీస్ స్టేషన్ వారీగా కేసులు – నిందితుల వివరాలు* ఆదిలాబాద్ II టౌన్ పోలీస్ స్టేషన్ • Cr.No.152/2026 – నిందితులు (రిమాండ్): షెర్లా రాజవర్ధన్, పేట్లశ్రీ అక్షయ్, రాజేందర్ • Cr.No.214/2026 – నిందితుడు: షేక్ సమీర్ (తండ్రి: షేక్ నూర్) ఆదిలాబాద్ I టౌన్ పోలీస్ స్టేషన్ • Cr.No.165/2026 – నిందితుడు: అవేస్ ఖాన్ (తండ్రి: అంజాద్ ఖాన్) • Cr.No.229/2026 – నిందితుడు: జి. ఆర్యన్ గౌడ్ భీంపూర్ పోలీస్ స్టేషన్ • Cr.No.17/2026 – నిందితుడు: మడవి ఘనశ్యామ్ (తండ్రి: విట్టల్) ఇచ్చోడ పోలీస్ స్టేషన్ • Cr.No.96/2026 – నిందితుడు: జాధవ్ సంతోష్ తాంసి పోలీస్ స్టేషన్ • Cr.No.24/2026 – నిందితురాలు: సురం ఆశమ్మ (భర్త: రాములు) • Cr.No.29/2026 – నిందితుడు: సురం విశ్వేశ్వర్ (తండ్రి: రాములు) తలమడుగు పోలీస్ స్టేషన్ • Cr.No.57/2026 – నిందితుడు: జక్కుల ప్రవీణ్ (తండ్రి: మహేందర్) ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ • Cr.No.43/2026 – నిందితుడు: రాథోడ్ మనోజ్ (తండ్రి: సకారం) నార్నూర్ పోలీస్ స్టేషన్ • Cr.No.26/2026 – నిందితుడు: జాధవ్ గోవర్ధన్ (తండ్రి: గోవింద్) • Cr.No.27/2026 – నిందితుడు: చవాన్ గోపాల్ (తండ్రి: రమేష్) దేశవ్యాప్తంగా నమోదైన NCRP ఫిర్యాదులతో ఈ అకౌంట్లు అనుసంధానమై ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలను హెచ్చరిస్తూ తమ బ్యాంక్ ఖాతాలను స్నేహితులు, బంధువులు లేదా ఇతరులకు ఇవ్వడం కూడా నేరమని స్పష్టం చేశారు. అలా చేసిన వారిపై అరెస్ట్, ఖాతాల ఫ్రీజింగ్, NCRPలో నమోదు వంటి చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. ప్రజలు తమ బ్యాంక్ ఖాతాలు, ATM/డెబిట్ కార్డులు, OTP, PIN వివరాలను ఎవరికీ పంచుకోవద్దని, ఆన్‌లైన్ గేమింగ్/బెట్టింగ్ లావాదేవీలకు దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు. సైబర్ నేరాలపై, మ్యూల్ అకౌంట్ హోల్డర్లపై, గేమింగ్‌కు సంబంధించిన అక్రమ ఆర్థిక లావాదేవీలపై ఆదిలాబాద్ పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, సైబర్ క్రైమ్ ఎస్ఐ గోపికృష్ణ, సిబ్బంది రియాజ్, మజీద్, త్రిశూల్ తదితరులు పాల్గొన్నారు.4
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రముఖులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని భక్తిశ్రద్ధలతో సేవలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రసిద్ధ ప్రవచనకర్త బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అలాగే అమెరికాలోని న్యూ జెర్సీలో శివ విష్ణు ఆలయం నిర్మాణంలో సేవలందించిన రఘు శర్మ సంస్కృత సోదరుడుకూడా ఆలయానికి విచ్చేసి స్వామివారి ఆశీస్సులు పొందారు. ప్రధానమంత్రి సలహాదారులుగా ఉన్న ఆదిత్య దీక్షిత్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని భక్తిపూర్వకంగా దర్శించుకున్నారు.పూజల అనంతరం స్వామివారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం స్వామివారి శేష వస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు.ఈ కార్యక్రమం సందర్భంగా ఆలయంలో భక్తుల రద్దీ కనిపించింది. భక్తులు శాంతియుతంగా దర్శనాలు చేసుకుని స్వామివారి కృపను పొందారు. ఆలయ వాతావరణం భక్తిరసంతో నిండిపోయి ఆధ్యాత్మికంగా మారింది1