*ఆపరేషన్ క్రాక్‌డౌన్-1.0, వెలుగులోకి సైబర్ మోసాలు* *74 అనుమానాస్పద బ్యాంక్ ఖాతాల గుర్తింపు — 12 కేసులు నమోదు* *పత్రికా ప్రకటన* ఆదిలాబాద్ జిల్లా, ఏప్రిల్ 25 :- *రూ.7,01,83,214 మోసం వెలుగులోకి* *మ్యూల్ అకౌంట్ల ద్వారా గేమింగ్, బెట్టింగ్, ఫేక్ ట్రేడింగ్ మోసాలు* *బ్యాంక్ ఖాతాలను ఇతరులకు, సైబర్ నేరగాళ్లకు ఇవ్వడం నేరమే* *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్* శనివారం సాయంత్రం స్థానిక పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరం నందు ఏర్పాటు చేసిన సేవ మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పాల్గొని ఆపరేషన్ క్రాక్ డౌన్ 1 సంబంధించిన వివరాలను వెల్లడించారు, ఆదిలాబాద్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో “ఆపరేషన్ క్రాక్‌డౌన్-1.0”లో భాగంగా సైబర్ మోసాలు, ఆన్‌లైన్ గేమింగ్/బెట్టింగ్ లావాదేవీలకు సంబంధించి అనుమానాస్పద బ్యాంక్ ఖాతాలపై జిల్లా వ్యాప్తంగా విశ్లేషణ నిర్వహించడం జరిగింది. ఈ పరిశీలనలో మొత్తం 74 మ్యూల్ అకౌంట్లు గుర్తించగా, వివిధ పోలీస్ స్టేషన్లలో 12 ప్రధాన కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుల్లో నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవడం జరిగింది. *రిమాండ్‌కు పంపబడిన వారు:* షెర్లా రాజవర్ధన్, పేట్లశ్రీ అక్షయ్, రాజేందర్, షేక్ సమీర్. *ఇతర కేసుల్లో గుర్తించిన నిందితులు:* అవేస్ ఖాన్, మడవి ఘనశ్యామ్, జాధవ్ సంతోష్, సురం ఆశమ్మ, జక్కుల ప్రవీణ్, సురం విశ్వేశ్వర్, రాథోడ్ మనోజ్, జి. ఆర్యన్ గౌడ్, జాధవ్ గోవర్ధన్, షేక్ సమీర్, చవాన్ గోపాల్. గేమింగ్ యాప్స్, బెట్టింగ్ ప్లాట్‌ఫార్మ్స్, ఫేక్ ట్రేడింగ్, టాస్క్/రివ్యూ మోసాల ద్వారా అక్రమ డబ్బు మార్పిడి జరిపినట్లు విచారణలో వెల్లడైంది. *పోలీస్ స్టేషన్ వారీగా కేసులు – నిందితుల వివరాలు* ఆదిలాబాద్ II టౌన్ పోలీస్ స్టేషన్ • Cr.No.152/2026 – నిందితులు (రిమాండ్): షెర్లా రాజవర్ధన్, పేట్లశ్రీ అక్షయ్, రాజేందర్ • Cr.No.214/2026 – నిందితుడు: షేక్ సమీర్ (తండ్రి: షేక్ నూర్) ఆదిలాబాద్ I టౌన్ పోలీస్ స్టేషన్ • Cr.No.165/2026 – నిందితుడు: అవేస్ ఖాన్ (తండ్రి: అంజాద్ ఖాన్) • Cr.No.229/2026 – నిందితుడు: జి. ఆర్యన్ గౌడ్ భీంపూర్ పోలీస్ స్టేషన్ • Cr.No.17/2026 – నిందితుడు: మడవి ఘనశ్యామ్ (తండ్రి: విట్టల్) ఇచ్చోడ పోలీస్ స్టేషన్ • Cr.No.96/2026 – నిందితుడు: జాధవ్ సంతోష్ తాంసి పోలీస్ స్టేషన్ • Cr.No.24/2026 – నిందితురాలు: సురం ఆశమ్మ (భర్త: రాములు) • Cr.No.29/2026 – నిందితుడు: సురం విశ్వేశ్వర్ (తండ్రి: రాములు) తలమడుగు పోలీస్ స్టేషన్ • Cr.No.57/2026 – నిందితుడు: జక్కుల ప్రవీణ్ (తండ్రి: మహేందర్) ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ • Cr.No.43/2026 – నిందితుడు: రాథోడ్ మనోజ్ (తండ్రి: సకారం) నార్నూర్ పోలీస్ స్టేషన్ • Cr.No.26/2026 – నిందితుడు: జాధవ్ గోవర్ధన్ (తండ్రి: గోవింద్) • Cr.No.27/2026 – నిందితుడు: చవాన్ గోపాల్ (తండ్రి: రమేష్) దేశవ్యాప్తంగా నమోదైన NCRP ఫిర్యాదులతో ఈ అకౌంట్లు అనుసంధానమై ఉన్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలను హెచ్చరిస్తూ తమ బ్యాంక్ ఖాతాలను స్నేహితులు, బంధువులు లేదా ఇతరులకు ఇవ్వడం కూడా నేరమని స్పష్టం చేశారు. అలా చేసిన వారిపై అరెస్ట్, ఖాతాల ఫ్రీజింగ్, NCRPలో నమోదు వంటి చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. ప్రజలు తమ బ్యాంక్ ఖాతాలు, ATM/డెబిట్ కార్డులు, OTP, PIN వివరాలను ఎవరికీ పంచుకోవద్దని, ఆన్‌లైన్ గేమింగ్/బెట్టింగ్ లావాదేవీలకు దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు. సైబర్ నేరాలపై, మ్యూల్ అకౌంట్ హోల్డర్లపై, గేమింగ్‌కు సంబంధించిన అక్రమ ఆర్థిక లావాదేవీలపై ఆదిలాబాద్ పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, సైబర్ క్రైమ్ ఎస్ఐ గోపికృష్ణ, సిబ్బంది రియాజ్, మజీద్, త్రిశూల్ తదితరులు పాల్గొన్నారు.
*ఆపరేషన్ క్రాక్‌డౌన్-1.0, వెలుగులోకి సైబర్ మోసాలు* *74 అనుమానాస్పద బ్యాంక్ ఖాతాల గుర్తింపు — 12 కేసులు నమోదు* *పత్రికా ప్రకటన* ఆదిలాబాద్ జిల్లా, ఏప్రిల్ 25 :- *రూ.7,01,83,214 మోసం వెలుగులోకి* *మ్యూల్ అకౌంట్ల ద్వారా గేమింగ్, బెట్టింగ్, ఫేక్ ట్రేడింగ్ మోసాలు* *బ్యాంక్ ఖాతాలను ఇతరులకు, సైబర్ నేరగాళ్లకు ఇవ్వడం నేరమే* *జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్* శనివారం సాయంత్రం స్థానిక పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరం నందు ఏర్పాటు చేసిన సేవ మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ పాల్గొని ఆపరేషన్ క్రాక్ డౌన్ 1 సంబంధించిన వివరాలను వెల్లడించారు, ఆదిలాబాద్ జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో “ఆపరేషన్ క్రాక్‌డౌన్-1.0”లో భాగంగా సైబర్ మోసాలు, ఆన్‌లైన్ గేమింగ్/బెట్టింగ్ లావాదేవీలకు సంబంధించి అనుమానాస్పద బ్యాంక్ ఖాతాలపై జిల్లా వ్యాప్తంగా విశ్లేషణ నిర్వహించడం జరిగింది. ఈ పరిశీలనలో
మొత్తం 74 మ్యూల్ అకౌంట్లు గుర్తించగా, వివిధ పోలీస్ స్టేషన్లలో 12 ప్రధాన కేసులు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుల్లో నిందితులను గుర్తించి చర్యలు తీసుకోవడం జరిగింది. *రిమాండ్‌కు పంపబడిన వారు:* షెర్లా రాజవర్ధన్, పేట్లశ్రీ అక్షయ్, రాజేందర్, షేక్ సమీర్. *ఇతర కేసుల్లో గుర్తించిన నిందితులు:* అవేస్ ఖాన్, మడవి ఘనశ్యామ్, జాధవ్ సంతోష్, సురం ఆశమ్మ, జక్కుల ప్రవీణ్, సురం విశ్వేశ్వర్, రాథోడ్ మనోజ్, జి. ఆర్యన్ గౌడ్, జాధవ్ గోవర్ధన్, షేక్ సమీర్, చవాన్ గోపాల్. గేమింగ్ యాప్స్, బెట్టింగ్ ప్లాట్‌ఫార్మ్స్, ఫేక్ ట్రేడింగ్, టాస్క్/రివ్యూ మోసాల ద్వారా అక్రమ డబ్బు మార్పిడి జరిపినట్లు విచారణలో వెల్లడైంది. *పోలీస్ స్టేషన్ వారీగా కేసులు – నిందితుల వివరాలు* ఆదిలాబాద్ II టౌన్ పోలీస్ స్టేషన్ • Cr.No.152/2026 – నిందితులు (రిమాండ్): షెర్లా రాజవర్ధన్, పేట్లశ్రీ అక్షయ్, రాజేందర్ • Cr.No.214/2026 – నిందితుడు: షేక్ సమీర్ (తండ్రి:
షేక్ నూర్) ఆదిలాబాద్ I టౌన్ పోలీస్ స్టేషన్ • Cr.No.165/2026 – నిందితుడు: అవేస్ ఖాన్ (తండ్రి: అంజాద్ ఖాన్) • Cr.No.229/2026 – నిందితుడు: జి. ఆర్యన్ గౌడ్ భీంపూర్ పోలీస్ స్టేషన్ • Cr.No.17/2026 – నిందితుడు: మడవి ఘనశ్యామ్ (తండ్రి: విట్టల్) ఇచ్చోడ పోలీస్ స్టేషన్ • Cr.No.96/2026 – నిందితుడు: జాధవ్ సంతోష్ తాంసి పోలీస్ స్టేషన్ • Cr.No.24/2026 – నిందితురాలు: సురం ఆశమ్మ (భర్త: రాములు) • Cr.No.29/2026 – నిందితుడు: సురం విశ్వేశ్వర్ (తండ్రి: రాములు) తలమడుగు పోలీస్ స్టేషన్ • Cr.No.57/2026 – నిందితుడు: జక్కుల ప్రవీణ్ (తండ్రి: మహేందర్) ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ • Cr.No.43/2026 – నిందితుడు: రాథోడ్ మనోజ్ (తండ్రి: సకారం) నార్నూర్ పోలీస్ స్టేషన్ • Cr.No.26/2026 – నిందితుడు: జాధవ్ గోవర్ధన్ (తండ్రి: గోవింద్) • Cr.No.27/2026 – నిందితుడు: చవాన్ గోపాల్ (తండ్రి: రమేష్) దేశవ్యాప్తంగా నమోదైన NCRP ఫిర్యాదులతో ఈ అకౌంట్లు అనుసంధానమై ఉన్నట్లు
గుర్తించారు. ఈ సందర్భంగా పోలీసులు ప్రజలను హెచ్చరిస్తూ తమ బ్యాంక్ ఖాతాలను స్నేహితులు, బంధువులు లేదా ఇతరులకు ఇవ్వడం కూడా నేరమని స్పష్టం చేశారు. అలా చేసిన వారిపై అరెస్ట్, ఖాతాల ఫ్రీజింగ్, NCRPలో నమోదు వంటి చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. ప్రజలు తమ బ్యాంక్ ఖాతాలు, ATM/డెబిట్ కార్డులు, OTP, PIN వివరాలను ఎవరికీ పంచుకోవద్దని, ఆన్‌లైన్ గేమింగ్/బెట్టింగ్ లావాదేవీలకు దూరంగా ఉండాలని సూచించారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్‌లైన్ లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని సూచించారు. సైబర్ నేరాలపై, మ్యూల్ అకౌంట్ హోల్డర్లపై, గేమింగ్‌కు సంబంధించిన అక్రమ ఆర్థిక లావాదేవీలపై ఆదిలాబాద్ పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, సైబర్ క్రైమ్ ఎస్ఐ గోపికృష్ణ, సిబ్బంది రియాజ్, మజీద్, త్రిశూల్ తదితరులు పాల్గొన్నారు.
- करीमनगर थ्री टाउन पुलिस स्टेशन के सब-इंस्पेक्टर एन. चैतन्य चंदर को निलंबित कर दिया गया है। खानपुर में एक सैलून में बाल कटवाने गए एसआई ने दुकानदार रामुलु के साथ अभद्र व्यवहार किया। दुकानदार द्वारा "अन्ना बैठिए" कहने पर एसआई ने आपत्ति जताते हुए असभ्य भाषा का प्रयोग किया और हाथापाई की। यह घटना सीसीटीवी फुटेज में कैद हो गई और सोशल मीडिया पर वायरल होने के बाद पुलिस आयुक्त गाउस आलम ने त्वरित कार्रवाई करते हुए एसआई को निलंबित करने का आदेश जारी किया। ➡️ यह मामला पुलिस विभाग की छवि पर सवाल खड़े करता है और अधिकारियों द्वारा अनुशासनहीनता पर सख्त रुख अपनाने का संकेत देता है।1
- కవిత కొత్త పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన ( TRS) , మొత్తాన్ని TRS పేరు, తెలంగాణ పేరు ఎటూ పోకుండా చూసుకున్నారు. పాంచజన్యం పేరుతో ఐదు హామీలు ప్రకటించిన కవిత.. 1. విద్య: ప్రైవేట్ స్కూళ్లలో కూడా ఫ్రీగా విద్య అందిస్తాం.. 2. వైద్యం: ఏ రోగమైనా రానీ, ఏ ఆస్పత్రైనా సరే ఉచితంగా అందిస్తాం.. 3. వ్యవసాయం: రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేస్తాం.. 4. ఉపాధి: రూ.2 లక్షల-రూ.20 కోట్ల వరకు యువతకు రుణాలు.. మొదటి ఏడాదిలోనే సింగిల్ నోటిఫికేషన్‌లో 4 లక్షల ఉద్యోగాలు.. ఉద్యమకారులకు లక్ష సూపర్ న్యూమరీ ఉద్యోగాలు ఇస్తాం.. 5. సామాజిక న్యాయం ..1
- కేసీఆర్ కప్ 2026 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు సందర్భంగా సిరిసిల్లలో బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు.1
- *తేదీ: 25-04-2026* *పత్రికా ప్రకటన* *కామారెడ్డి నియోజక అభివృద్ధిపై ఎమ్మెల్యే మరియు కలెక్టర్ సంయుక్త సమీక్ష* కామారెడ్డి: కామారెడ్డి కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో శనివారం ఎమ్మెల్యే శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి గారు మాట్లాడుతూ "రైతే రాజు. వరి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు తాగునీరు, నీడ వంటి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలి. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడవకుండా తార్పాలిన్లు సిద్ధంగా ఉంచుకోవాలి" అని జిల్లా సహకార అధికారి రామ్మోహన్ గారికి సూచించారు. "ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం మనందరి బాధ్యత. అన్ని పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, నాణ్యమైన విద్య అందించాలి. ‘బడిబాట’ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించి, ప్రైవేటు పాఠశాలల్లోని విద్యార్థులు సైతం ప్రభుత్వ పాఠశాలల్లో చేరేలా చూడాలి. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలి" అని పిలుపునిచ్చారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. "తాగునీటి పైప్‌లైన్లు ధ్వంసమై సరఫరాకు ఆటంకం కలుగుతోంది. ఎక్కడైనా లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేపట్టాలి. అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా ప్రజలకు సరిపడా మంచినీరు అందించాలి" అని సూచించారు. పట్టణంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీస్, మున్సిపల్ శాఖలు సమన్వయంతో పనిచేసి తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ "ఎమ్మెల్యే సూచనల మేరకు అన్ని శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన చివరి లబ్ధిదారుడికి చేరేలా చూడాలి" అని అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం కలిసి పనిచేస్తే కామారెడ్డి జిల్లా అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి, కామారెడ్డి.1
- కరీంనగర్:జిల్లాలో కొంతమంది వైద్యులే సోషల్ మీడియా వేదికలైన యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల ద్వారా తప్పుడు వైద్య ప్రచారం చేస్తూ పేద ప్రజలను, అమాయక రోగులను మోసం చేస్తున్నారని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నరేష్ పటేల్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. dyfi నాయకుల సమావేశం జిల్లా కార్యాలయంలో నిర్వహించారు అనంతరం నరేష్ పటేల్ మాట్లాడుతూ ముఖ్యంగా షుగర్ (మధుమేహం), బీపీ (రక్తపోటు) వంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు అవసరం లేదని, ఇంటి చిట్కాలతో పూర్తిగా నయం అవుతుంది“ఒక్క మందుతో శాశ్వతంగా పోతుంది వంటి అవాస్తవాలు ప్రచారం చేస్తూ వీడియోలు విడుదల చేయడం ప్రజల ప్రాణాలతో ఆటలాడటమేనని విమర్శించారు. వైద్యులపై ఉన్న నమ్మకాన్ని దుర్వినియోగం చేస్తూ ఇలాంటి తప్పుడు వీడియోలు విడుదల చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని తెలిపారు. ప్రజలు ఈ ప్రచారాలను నమ్మి వైద్యుల సలహా లేకుండా మందులు ఆపేస్తే గుండెపోటు, స్ట్రోక్, కిడ్నీ సమస్యలు వంటి ప్రాణాపాయకర పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు, పేదలు ఈ మోసాలకు ఎక్కువగా బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అర్హతలేని వ్యక్తులు మాత్రమే కాకుండా కొంతమంది వైద్యులే ఈ తప్పుడు ప్రచారానికి పాల్పడటం అత్యంత ఆందోళనకరమని తెలిపారు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉన్నవారు లాభాల కోసం ఇలా వ్యవహరించడం ఖండనీయమని పేర్కొన్నారు. ఇక మరోవైపు ప్రైవేట్ ఆసుపత్రులు కూడా ప్రజల పరిస్థితిని దుర్వినియోగం చేస్తూ తీవ్ర దోపిడీకి పాల్పడుతున్నాయని ఆరోపించారు. అవసరం లేని పరీక్షలు చేయించడం, అధిక బిల్లులు వేయడం, అప్రామాణిక చికిత్సలు సూచించడం, పారదర్శకత లేకుండా ఫీజులు వసూలు చేయడం ద్వారా పేద ప్రజలను ఆర్థికంగా నాశనం చేస్తున్నారని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో భయాన్ని ఉపయోగించుకుని లక్షల రూపాయలు వసూలు చేయడం జరుగుతోందని విమర్శించారు. వైద్య రంగం సేవా ధర్మాన్ని కోల్పోయి పూర్తిగా వ్యాపారంగా మారడం దురదృష్టకరమని అన్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వైద్య ప్రచారం చేస్తున్న వైద్యులపై వెంటనే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఇలాంటి వైద్యుల లైసెన్సులను రద్దు చేయాలని, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో ఉన్న ఫేక్ మెడికల్ వీడియోలను తక్షణమే తొలగించాలని, ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీపై ప్రత్యేక దర్యాప్తు కమిటీ ఏర్పాటు చేయాలని, అవసరం లేని టెస్టులు, అధిక బిల్లింగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, వైద్య సేవలపై ప్రభుత్వ పర్యవేక్షణను కఠినంగా అమలు చేయాలని, ప్రజల్లో సరైన వైద్య అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ (DMHO) అధికారులు వెంటనే స్పందించి ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్న వారిపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శివ కుమార్,సహాయ కార్యదర్శులు,అరవింద్ నాయకులు సిన.రాజేష్,నవీన్ తదితరులు పాల్గొన్నారు1
- Post by Vishwamber Rao1
- मध्य प्रदेश के मुख्यमंत्री श्री मोहन यादव के नेतृत्व में एकजुट यह सैलाब गवाह है कि अब महिला विरोधी राजनीति के दिन लद चुके हैं।1
- రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మెప్మా ఆధ్వర్యంలో సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూర్ లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శనివారం పరిశీలించారు. ముందుగా ధాన్యం కుప్పలు, వసతులు పరిశీలించి.. పలు సూచనలు చేశారు.టార్ఫాలిన్లు, గన్ని సంచులు, నీటి వసతి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉన్నాయా అని ఆరా తీసి.. పరిశీలించారు. ఇప్పటిదాకా ఎంత ధాన్యం వచ్చింది? సన్న రకం వడ్లు వచ్చాయా? అని అడిగి తెలుసుకున్నారు. రైస్ మిల్లుల కేటాయింపు.. ఆన్లైన్లో వివరాల నమోదు పై ఆరా తీశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకు వచ్చే రైతులు ప్యాడీ క్లీనర్లు వినియోగించాలని సూచించారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ ధాన్యం కొనుగోలు చేయాలని నిర్వాహకులకు సూచించారు. కేటాయించిన మిల్లులకు ధాన్యాన్ని పంపించాలని ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల్లో ఎటువంటి సమస్యలు రాకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేలా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలని సూచించారు. పరిశీలనలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, తహసీల్దార్ మహేష్ కుమార్ వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.1
- *తేదీ: 25-04-2026* *జిల్లా కలెక్టర్ మరియు ప్రధాన గణన అధికారి, కామారెడ్డి* పత్రికా ప్రకటన *జనగణన-2027: స్వీయ గణనకు అవకాశం* *26-04-2026 నుండి 10-05-2026 వరకు పోర్టల్‌లో నమోదు చేసుకోండి* *ప్రజలందరూ భాగస్వాములు కావాలి: కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్* కామారెడ్డి: జనగణన–2027 కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న గృహ లెక్కింపు మరియు గృహ గణన – హెచ్‌ఎల్‌ఓ ప్రక్రియకు సంబంధించి స్వీయ గణన కార్యక్రమం తేదీ: 26-04-2026 నుండి 10-05-2026 వరకు నిర్వహించబడుతుందని జిల్లా కలెక్టర్ మరియు ప్రధాన గణన అధికారి శ్రీ ఆశిష్ సంగ్వాన్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ "ప్రజల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం స్వీయ గణన కోసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్‌ను అందుబాటులో ఉంచింది. ప్రతి కుటుంబం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి" అని పిలుపునిచ్చారు. *స్వీయ గణన విధానం:* 1. ప్రతి కుటుంబం తమ గృహ వివరాలను స్వయంగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. 2. మొబైల్ ఫోన్, కంప్యూటర్ లేదా ఇంటర్నెట్ సౌకర్యం ఉన్న ఏ పరికరం ద్వారా అయినా ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. 3. నమోదు పూర్తయిన తర్వాత ఒక ప్రత్యేక గుర్తింపు సంఖ్య లభిస్తుంది. 4. ఆ గుర్తింపు సంఖ్యను మీ ఇంటికి వచ్చే ఎన్యూమరేటర్‌కు తప్పనిసరిగా తెలియజేయాలి. 5. నమోదు చేసిన వివరాలను అవసరమైతే తర్వాత సవరించుకునే అవకాశం కూడా ఉంది. "జనగణన ద్వారా సేకరించే సమాచారం ఆధారంగానే దేశ, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలు రూపొందుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యతగా సరైన సమాచారం నమోదు చేయాలి. జిల్లా ప్రజలందరూ స్వీయ లెక్కింపు ప్రక్రియలో చురుగ్గా పాల్గొని జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి" అని కలెక్టర్ కోరారు. *ముఖ్యమైన తేదీలు:* - *స్వీయ గణన:* 26-04-2026 నుండి 10-05-2026 వరకు - *గృహ లెక్కింపు మరియు గృహ గణన – హెచ్‌ఎల్‌ఓ:* 11-05-2026 నుండి 09-06-2026 వరకు ఈ కార్యక్రమంలో ప్రతి కుటుంబం తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.1