నూతనంగా కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన వారిని సన్మానించిన నాయకులు నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కోఆప్షన్ సభ్యులను బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీర్వాదంతో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన కో ఆప్షన్ అభ్యర్థులు నంది శంకర్ , సయ్యద్ సోహెల్, సయ్యద్ తస్లీమ్, కొండ అనూష శ్రీనివాస్ ల ఎన్నికకు సహకరించిన కౌన్సిలర్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సిరిసిల్ల అభివృద్ధిలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులుగా కోఆప్షన్ సభ్యులు వారి సూచనలు సలహాలను అందిస్తూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్ కౌన్సిలర్ సభ్యులు మరియు పార్టీ నాయకులు పాల్గొని నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కోఆప్షన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
నూతనంగా కో ఆప్షన్ సభ్యులుగా ఎన్నికైన వారిని సన్మానించిన నాయకులు నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కోఆప్షన్ సభ్యులను బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీర్వాదంతో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన కో ఆప్షన్ అభ్యర్థులు నంది శంకర్ , సయ్యద్ సోహెల్, సయ్యద్ తస్లీమ్, కొండ అనూష శ్రీనివాస్ ల ఎన్నికకు సహకరించిన కౌన్సిలర్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సిరిసిల్ల అభివృద్ధిలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులుగా కోఆప్షన్ సభ్యులు వారి సూచనలు సలహాలను అందిస్తూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్ కౌన్సిలర్ సభ్యులు మరియు పార్టీ నాయకులు పాల్గొని నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కోఆప్షన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
- భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో బిజెపి జిల్లా శాఖ అధ్యక్షుడు రెడ్డి పైన గోపి మరియు బిజెపి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలను సమర్పించి నివాళులను అర్పించారు.1
- నిబంధనలు తూచా తప్పకుండా పాటిస్తేనే మనుషుల ప్రాణాలకు రక్షణ ఉంటుందని కరీంనగర్ సిపి గౌస్ ఆలం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ లో పోలీసుల ఆధ్వర్యంలో కోర్టు చౌరస్తాలో ‘అరైవ్ అలైవ్’ (Arrive Alive) రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం విశిష్ట అతిథులుగా పాల్గొని, రహదారి భద్రతపై ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీపీ గౌస్ ఆలం ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమ పోస్టర్‌ను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ చిత్రా మిశ్రా అందరితో రోడ్డు నియమాలు పాటిస్తామని ప్రతిజ్ఞ చేయించారు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై సీపీ ఆందోళన వ్యక్తం చేశారు. గతేడాది జిల్లాలో రోడ్డు ప్రమాదాల వల్ల 200 మంది ప్రాణాలు కోల్పోయారని వీరిలో అధిక శాతం ద్విచక్ర వాహనదారులే ఉండటం విచారకరమన్నారు. హెల్మెట్ ధరించకపోవడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు. పోలీసుల నిరంతర నిఘా, చర్యల వల్ల జిల్లాలో ప్రమాదాల రేటు 17 శాతం తగ్గిందని చెప్పారు.ప్రమాదం జరిగిన ‘గోల్డెన్ అవర్’లో బాధితులను ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వారికి ప్రభుత్వం 25 వేల నగదు బహుమతి అందజేస్తుందని సీపీ తెలిపారు.1
- గత కొంతకాలంగా జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని వ్యాపారవేత్తలను చంపుతానని బెదిరిస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న విత్తనాల నాగరాజు అను రౌడీ షీటర్ ని , జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ గారి ఆదేశాల మేరకు, మెట్టుపల్లి డి.ఎస్.పి ఏ రాములు గారి ఆధ్వర్యంలో, ఈరోజు కోరుట్ల పట్టణంలో అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగింది గతంలో కూడా విత్తనాలు నాగరాజు పై రెండు మర్డర్ కేసులు మరియు ఎక్స్ట్రాక్షన్ కేసులు నమోదు కాబడినవి అలాగే ఇతనిపై గతంలో PD Act కూడా నమోదు చేసి జైలుకు పంపించనైనది. అలాగే ఈరోజు అరెస్టు చేసిన కేసులో విత్తనాల నాగరాజు తో పాటు మరొక నిందితుడు కూడా ఉన్నట్లు ఆ దర్యాప్తులో తెలిసినది ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు తొందర్లోనే అతని పట్టుకుని అరెస్టు చేస్తాం వీరిద్దరే కాకుండా ఇంకా ఎవరైనా ఉంటే కూడా వారిని కూడా రిమాండ్ చేస్తాం ఈ కేసుని చాలా మైనేట్గా దర్యాప్తు చేస్తున్నాం, అదేవిధంగా విత్తనాల నాగరాజు అనే రౌడీషీటర్ తో కానీ ఇతని సహచరులతో కానీ ఎవరైనా సంబంధాలు కలిగి ఉండి వారితో తిరిగిన ప్రతి ఒక్కరిపై ప్రత్యేక నిగా పెట్టి వారి పైన కూడా కఠిన చర్యలు తీసుకోబడును, అలాగే ఎవరైనా ఎవరినైనా ఇలాంటి బెదిరింపులకు పాల్పడి బలవంతపు వసూలు చేస్తే వారిపై చట్టపరంగా చాలా కఠిన చర్యలు తీసుకోబడును. ముఖ్యంగా కోరుట్ల పట్టణ మరియు పరిసర గ్రామ ప్రజలందరికీ పోలీస్ తరఫున విన్నపం ఏమనగా ఎవరు కూడా ఇలాంటి భయాలకు ఆందోళనలకు గురికావాల్సిన పనిలేదు మిమ్మల్ని ఎవరైనా భయభ్రాంతులకు గురిచేసిన బెదిరించిన నిర్భయంగా పోలీసు వారికి సమాచారం ఇవ్వవచ్చు అదేవిధంగా మీ వివరాలు చాలా రహస్యంగా ఉంచబడతాయి.1
- గొల్లపల్లి మండలం బీబీరాజుపల్లి గ్రామంలో 135వ అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుని సామాజిక న్యాయం, సమానత్వం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తిరుపతి, నాయకులు దొనకొండ తిరుపతి, దొనకొండ మహేష్, అంబేద్కర్ సంఘ నాయకులు, దళిత ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.1
- జగిత్యాల : జగిత్యాల రూరల్ అర్బన్ మండలాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు మాజీ మంత్రి జీవన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 3-30 గంటల ప్రాంతంలో ఈ నెల 20 న నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభకోసం సన్నాహక సమావేశం నిర్వహించారు. గ్రామాల నుండి బహిరంగ సభకు వేలాది మందిని తరలించి, బహిరంగ సభను విజయవంతం చేయాలనీ నిర్ణయించారు. నాలుగు దశాబ్దాల పాటు పార్టీ బలోపేతం కోసం ఒకే కుటుంబంగా పనిచేసినామన్నారు. రాష్ట్ర స్థాయిలో కాంగ్రెస్ పాలనకు ప్రజలు విసిగిపోయి, కేసీఆర్ పాలనే బాగుండే అనే చర్చ వచ్చింది. రేవంత్ రెడ్డి పోవాలి.. కేసీఆర్ రావాలి అనే నినాదం ప్రజల్లో నుండి వచ్చింది. నేను అంటున్నది కాదు. గ్రామ సర్పంచ్ ను ఎవరు ఏమి చేయలేరు..15 వ ఆర్థిక సంఘం నిధులు నేరుగా వస్తాయి.. విధిలేని పరిస్థితిలో పార్టీ నీ వీడాల్సి వచ్చిందనీ, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కే సి ఆర్ దశాబ్దకాలం, రైతులకు, బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారు.2
- పత్రిక ప్రకటన తేది: 13-04-2026 కామారెడ్డి జిల్లా సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 135 దరఖాస్తులు అందినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలు వివిధ సమస్యలపై తమ వినతిపత్రాలను సమర్పించగా, సంబంధిత శాఖల అధికారులకు వెంటనే పరిష్కారం కోసం ఆదేశాలు జారీ చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా స్వీకరించి, వేగవంతమైన పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, మేడంమోహన్, సీఈఓ జిల్లా స్థాయి అధికారులు, వివిధ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.1
- హుస్నాబాద్ మండలం పరిసర గ్రామాల్లో యాసంగి వరి కోతలు సోమవారం ప్రారంభమయ్యాయి. సాగునీరు అందుబాటులో ఉండటంతో ముందస్తుగా సాగు చేసిన రైతులు.. వాతావరణ మార్పుల భయంతో పంటను త్వరగా కోత చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఈ ఏడాది మోగి పురుగు ప్రభావంతో ఆశించిన స్థాయిలో దిగుబడి రావడం లేదని, దిగుబడి గణనీయంగా తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.1
- షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన అంబేద్కర్ జయంతి కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే శ్రీనివాస్1