logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వర్షాలతో జలకళను సంతరించుకున్న యాడికి కోన ఉప్పలపాడు జలపాతం.. అనంతపురం జిల్లాలో వర్షాలు ప్రకృతి అందాలను మరింత ఇనుమడింపజేస్తున్నాయి. యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామ సమీపంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి క్షేత్రం వద్ద ఉన్న కోన జలపాతం వర్షపు నీటితో జాలువారుతూ సందర్శకులను ఆకట్టుకుంటోంది.గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో కొండ ప్రాంతాల నుంచి నీరు ప్రవహిస్తూ జలపాతంగా మారింది. ఎత్తైన ప్రాంతం నుంచి నీరు కిందకు జాలువారుతున్న దృశ్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.జలపాతం అందాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వర్షాకాలంలో మాత్రమే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే కోన జలపాతం ప్రస్తుతం పచ్చని ప్రకృతి మధ్య మరింత శోభాయమానంగా దర్శనమిస్తోంది. వర్షాలతో జలపాతం జలకళను సంతరించుకోవడంతో స్థానికంగా పర్యాటక సందడి నెలకొంది.

13 hrs ago
user_Sanjeev
Sanjeev
Local News Reporter తాడిపత్రి, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
13 hrs ago

వర్షాలతో జలకళను సంతరించుకున్న యాడికి కోన ఉప్పలపాడు జలపాతం.. అనంతపురం జిల్లాలో వర్షాలు ప్రకృతి అందాలను మరింత ఇనుమడింపజేస్తున్నాయి. యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామ సమీపంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి క్షేత్రం వద్ద ఉన్న కోన జలపాతం వర్షపు నీటితో జాలువారుతూ సందర్శకులను ఆకట్టుకుంటోంది.గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో కొండ ప్రాంతాల నుంచి నీరు ప్రవహిస్తూ జలపాతంగా మారింది. ఎత్తైన ప్రాంతం నుంచి నీరు కిందకు జాలువారుతున్న దృశ్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.జలపాతం అందాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వర్షాకాలంలో మాత్రమే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే కోన జలపాతం ప్రస్తుతం పచ్చని ప్రకృతి మధ్య మరింత శోభాయమానంగా దర్శనమిస్తోంది. వర్షాలతో జలపాతం జలకళను సంతరించుకోవడంతో స్థానికంగా పర్యాటక సందడి నెలకొంది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • వర్షాలతో జలకళను సంతరించుకున్న యాడికి కోన ఉప్పలపాడు జలపాతం.. అనంతపురం జిల్లాలో వర్షాలు ప్రకృతి అందాలను మరింత ఇనుమడింపజేస్తున్నాయి. యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామ సమీపంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి క్షేత్రం వద్ద ఉన్న కోన జలపాతం వర్షపు నీటితో జాలువారుతూ సందర్శకులను ఆకట్టుకుంటోంది.గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో కొండ ప్రాంతాల నుంచి నీరు ప్రవహిస్తూ జలపాతంగా మారింది. ఎత్తైన ప్రాంతం నుంచి నీరు కిందకు జాలువారుతున్న దృశ్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.జలపాతం అందాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వర్షాకాలంలో మాత్రమే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే కోన జలపాతం ప్రస్తుతం పచ్చని ప్రకృతి మధ్య మరింత శోభాయమానంగా దర్శనమిస్తోంది. వర్షాలతో జలపాతం జలకళను సంతరించుకోవడంతో స్థానికంగా పర్యాటక సందడి నెలకొంది.
    1
    వర్షాలతో జలకళను సంతరించుకున్న యాడికి కోన ఉప్పలపాడు జలపాతం..
అనంతపురం జిల్లాలో వర్షాలు ప్రకృతి అందాలను మరింత ఇనుమడింపజేస్తున్నాయి. యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామ సమీపంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి క్షేత్రం వద్ద ఉన్న కోన జలపాతం వర్షపు నీటితో జాలువారుతూ సందర్శకులను ఆకట్టుకుంటోంది.గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో కొండ ప్రాంతాల నుంచి నీరు ప్రవహిస్తూ జలపాతంగా మారింది. ఎత్తైన ప్రాంతం నుంచి నీరు కిందకు జాలువారుతున్న దృశ్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.జలపాతం అందాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వర్షాకాలంలో మాత్రమే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే కోన జలపాతం ప్రస్తుతం పచ్చని ప్రకృతి మధ్య మరింత శోభాయమానంగా దర్శనమిస్తోంది.
వర్షాలతో జలపాతం జలకళను సంతరించుకోవడంతో స్థానికంగా పర్యాటక సందడి నెలకొంది.
    user_Sanjeev
    Sanjeev
    Local News Reporter తాడిపత్రి, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • పులివెందుల మండలంలో భారీ వర్షానికి నేలకొరిగిన అరటి తోటలు పులివెందులలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అరటి తోటలు నేలకూలాయి. పులివెందుల నుంచి అంబకపల్లెకు వెళ్లే రోడ్డులో గాలివానకు అరటి చెట్లు రోడ్డుపై నేలకొరిగాయి. పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లె, మల్లికార్జునపురం గ్రామాలలో వందల ఎకరాలలో అరటి చెట్లు నేలకూలాయి. దీంతో లక్షలాది రూపాయలు నష్టపోయినట్లు అరటి రైతులు ఆవేదన చెందుతున్నారు. నష్టపోయిన అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
    1
    పులివెందుల మండలంలో భారీ వర్షానికి నేలకొరిగిన అరటి తోటలు
పులివెందులలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అరటి తోటలు నేలకూలాయి. పులివెందుల నుంచి అంబకపల్లెకు వెళ్లే రోడ్డులో గాలివానకు అరటి చెట్లు రోడ్డుపై నేలకొరిగాయి. పులివెందుల మండలం
నల్లపురెడ్డి పల్లె, మల్లికార్జునపురం గ్రామాలలో వందల ఎకరాలలో అరటి చెట్లు నేలకూలాయి. దీంతో లక్షలాది రూపాయలు నష్టపోయినట్లు అరటి రైతులు ఆవేదన
చెందుతున్నారు. నష్టపోయిన అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    14 hrs ago
  • మహానంది మండలంలో చిగురుస్తున్న రైతన్న ఆశలు.. ఎండిపోతున్న పంటలకు జీవం పోసిన వర్షం మహానంది మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతన్న ఆశలు చిగురిస్తున్నాయి. ఎల్లీనో ప్రభావంతో మండలంలో సరైన వర్షాభావం లేకపోవడంతో రైతులు పడ్డ కష్టాలు వర్ణనాతీతం. అడపాదడపా వర్షాలు పడిన పంటలు సాగులో చాలా ఇబ్బందులు పడ్డారు. నిన్న నేడు వర్షాలు కురుస్తుండడంతో ఎండిపోయిన పంటలకు జీవం వస్తుందని రైతుల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వరుణ దేవుడా కరుణించి సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతున్నారు.
    1
    మహానంది మండలంలో చిగురుస్తున్న రైతన్న ఆశలు.. ఎండిపోతున్న పంటలకు జీవం పోసిన వర్షం 
మహానంది మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతన్న ఆశలు చిగురిస్తున్నాయి. ఎల్లీనో ప్రభావంతో మండలంలో సరైన వర్షాభావం లేకపోవడంతో రైతులు పడ్డ కష్టాలు వర్ణనాతీతం. అడపాదడపా వర్షాలు పడిన పంటలు సాగులో చాలా ఇబ్బందులు పడ్డారు. నిన్న నేడు వర్షాలు కురుస్తుండడంతో ఎండిపోయిన పంటలకు జీవం వస్తుందని రైతుల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వరుణ దేవుడా కరుణించి సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతున్నారు.
    user_మన నల్లమల
    మన నల్లమల
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    45 min ago
  • గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి వెల్దుర్తి పంట పొలాల్లో పడిన వర్షపు నీరు ఉపాధి పనులతో చేసిన కాలువ ద్వారా నేరుగా ప్రధాన వంకలోకి చేరుతోంది రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలంలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వెల్దుర్తి గ్రామంలో కరువు పనుల కోసం తీసిన కాలువ నుండి వరద నీరు ప్రధానవంకలోకి ప్రవహిస్తోంది ఉపాధి పనులలో ఇలాంటి ఉపయోగకరమైన పనులు చేపట్టడం వల్లనే వర్షపు నీరు పొలాల మీద కోతలు పడకుండా వంకలోకి కాలు ద్వారా చేరటం చాలా ఆనందంగా ఉందని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు
    1
    గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి వెల్దుర్తి పంట పొలాల్లో పడిన వర్షపు నీరు   ఉపాధి పనులతో చేసిన కాలువ ద్వారా నేరుగా  ప్రధాన వంకలోకి చేరుతోంది 
రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలంలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు  వెల్దుర్తి గ్రామంలో కరువు పనుల కోసం తీసిన కాలువ నుండి వరద నీరు ప్రధానవంకలోకి ప్రవహిస్తోంది ఉపాధి పనులలో ఇలాంటి ఉపయోగకరమైన పనులు చేపట్టడం వల్లనే వర్షపు నీరు పొలాల మీద కోతలు పడకుండా వంకలోకి కాలు ద్వారా చేరటం చాలా ఆనందంగా ఉందని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు
    user_పుట్టపర్తి మల్లికార్జున
    పుట్టపర్తి మల్లికార్జున
    చెన్నెకొత్తపల్లె, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • మానవత్వం లేని దైవ ప్రార్ధన దానవత్వంతో సమానం.మతం మనుషులను మంచివైపు నడిపించాలి. "మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్దిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామధూతం శిరసానమామి" 🙏 శ్రీరామచంద్రుడు,సీతాదేవి రామాయణం నమ్మే ప్రతి ఒక్కరి ఆరాధ్య దైవాలు.వాల్మీకి రామాయ ణం భారతదేశ ప్రజల అద్వితీయ,అమోఘ,అజ రామర సాహితీ క్షీరసముద్రం.బార్య భర్తలు అం టే సీతారాములను,సహోదరులు అంటే రామ లక్ష్మణులను,స్వామి భక్తి అంటే ఆంజనేయ శ్రీ రామచంద్రులను ఆదర్శంగా పొగడుతూవుంటా రు.నాటినుండి నేటి వరకు ప్రజల మనస్సులలో నిలిచిపోయింది వాల్మీకి రామాయణ మహాకా వ్యం.కాలచక్రం వేల,లక్షల ఏళ్ళు సూచిస్తున్నా రామాయణం,సీతా,రామ లక్షమణ, భరత,శత్రు ఘ్న్లుల ఆదర్శ భావాలు రామాయణం నమ్మే వాళ్ళ మనస్సులోతుల్లో అనునిత్యం నర్తిస్తుం టాయి.రామాంజనేయ సంవాదం,రామరావణ యుద్ధం జరిగాయాన్నదే ప్రజల ఉద్దేశ్యం.నాటి ఆదికవి వాల్మీకి రచించిన రామాయణం ఇంత గొప్పగా లక్షల సంవత్సరాలుగా సజీవంగా ఉం దంటే,నేటికీ మనుషుల మనస్సులలో మంచి అనే ఉషస్సును నింపుతోందని అర్థం. ప్రజలు మహా కావ్యాలు చదవాలి, అర్థం చేసుకోవాలి. ఆదర్శ ప్రాయులుగా మారాలి.మతం మానవ త్వంతో నిండి ఉండాలి.కులం గోకులంలా పా లు పంచాలి, లేనివారి ఆకలి తీర్చాలి. మహా కావ్యాలు మనుషుల పరివార్తనా మార్గమాధ్య మాలుగా మారాలి.ఆలోచిస్తే ఏదీ శాశ్వతం కా దు.సర్వం అశాశ్వతం.మానవత్వం లేని మను ష్యత్వం ఉండరాదని నా అభిప్రాయం.మనిషికి మానవత్వానికి మధ్య ఆగాధం ఏర్పడింది.కానీ అజరామరమైన రామాయణ మహాకావ్య ఏకైక మహా వీరుడు,అనితర రామభక్తుడు ఆంజనే యుడు ఒక్కడే.అతడు చిరంజీవి.ఇటీవలమధ్యప్రదేశ రాష్ట్రం ఉజ్జయిని ఖడేహనుమాన్ విగ్రహం రోడ్ విస్తరణ పనుల నిమిత్తం తొలగించాలని భారీ క్రెన్లు ఉపయోగిం చినా తొలగించడం సాధ్యం కాలేదు.అది దైవశ క్తి అని దేవుడ్ని నమ్మే భక్తులు అంటే కాదు అది సైన్స్ అని నమ్మ ని వాళ్ళు అనుకుం టున్నారు. ఏది ఏమైనా ఎవ రి నమ్మకం వాళ్ళది. అందరు తెలుసు కోవలసిం ది ఒక్కటే!ఈ భూమి మీద ఎవ్వరు శాశ్వతం కాదు.ఇతిహాసాలు భుమ్యా కాశాలు ఉన్నంత వరకు నిలిచి ఉంటాయి. "సర్వేజనా సుఖినో భవంతు"🙏
    1
    మానవత్వం లేని దైవ ప్రార్ధన దానవత్వంతో సమానం.మతం మనుషులను మంచివైపు 
నడిపించాలి.
"మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం 
బుద్దిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామధూతం శిరసానమామి" 🙏 శ్రీరామచంద్రుడు,సీతాదేవి రామాయణం నమ్మే ప్రతి ఒక్కరి ఆరాధ్య దైవాలు.వాల్మీకి రామాయ  ణం భారతదేశ ప్రజల అద్వితీయ,అమోఘ,అజ రామర సాహితీ క్షీరసముద్రం.బార్య భర్తలు అం టే సీతారాములను,సహోదరులు అంటే రామ లక్ష్మణులను,స్వామి భక్తి అంటే ఆంజనేయ శ్రీ రామచంద్రులను ఆదర్శంగా పొగడుతూవుంటా రు.నాటినుండి నేటి వరకు ప్రజల మనస్సులలో నిలిచిపోయింది వాల్మీకి రామాయణ మహాకా వ్యం.కాలచక్రం వేల,లక్షల ఏళ్ళు సూచిస్తున్నా 
రామాయణం,సీతా,రామ లక్షమణ, భరత,శత్రు  ఘ్న్లుల ఆదర్శ భావాలు రామాయణం నమ్మే వాళ్ళ మనస్సులోతుల్లో అనునిత్యం నర్తిస్తుం టాయి.రామాంజనేయ సంవాదం,రామరావణ 
యుద్ధం జరిగాయాన్నదే ప్రజల ఉద్దేశ్యం.నాటి ఆదికవి వాల్మీకి రచించిన రామాయణం ఇంత గొప్పగా లక్షల సంవత్సరాలుగా సజీవంగా ఉం దంటే,నేటికీ మనుషుల మనస్సులలో మంచి అనే ఉషస్సును నింపుతోందని అర్థం. ప్రజలు మహా కావ్యాలు చదవాలి, అర్థం చేసుకోవాలి. ఆదర్శ ప్రాయులుగా మారాలి.మతం మానవ త్వంతో నిండి ఉండాలి.కులం గోకులంలా పా లు పంచాలి, లేనివారి ఆకలి తీర్చాలి. మహా కావ్యాలు మనుషుల పరివార్తనా మార్గమాధ్య మాలుగా  మారాలి.ఆలోచిస్తే ఏదీ శాశ్వతం కా దు.సర్వం అశాశ్వతం.మానవత్వం లేని మను ష్యత్వం ఉండరాదని నా అభిప్రాయం.మనిషికి 
మానవత్వానికి మధ్య ఆగాధం ఏర్పడింది.కానీ అజరామరమైన రామాయణ మహాకావ్య ఏకైక 
మహా వీరుడు,అనితర రామభక్తుడు ఆంజనే యుడు ఒక్కడే.అతడు చిరంజీవి.ఇటీవలమధ్యప్రదేశ రాష్ట్రం ఉజ్జయిని ఖడేహనుమాన్ విగ్రహం  రోడ్ విస్తరణ పనుల నిమిత్తం తొలగించాలని భారీ క్రెన్లు ఉపయోగిం చినా తొలగించడం సాధ్యం కాలేదు.అది దైవశ క్తి అని దేవుడ్ని నమ్మే భక్తులు అంటే కాదు అది సైన్స్ అని నమ్మ ని వాళ్ళు అనుకుం టున్నారు. ఏది ఏమైనా ఎవ రి నమ్మకం వాళ్ళది. అందరు తెలుసు కోవలసిం ది ఒక్కటే!ఈ భూమి మీద ఎవ్వరు శాశ్వతం కాదు.ఇతిహాసాలు భుమ్యా కాశాలు ఉన్నంత వరకు నిలిచి ఉంటాయి.
"సర్వేజనా సుఖినో భవంతు"🙏
    user_PULIKONDARANGAPPA
    PULIKONDARANGAPPA
    Social worker Chippagiri, Kurnool•
    10 hrs ago
  • వీపనగండ్ల గ్రామంలో వర్షం వానజల్లుతో పుడమి పరవశిస్తోంది... నంద్యాల జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురుస్తుంది. మిడుతూరు మండల(M) వీపనగండ్లలో ఉదయం నుంచి మోస్తారు వర్షం కురుస్తోంది. చాలా రోజులుగా సరైన వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పంటలకు విత్తనాలు ఇచ్చినప్పటి నుంచి సరైన మోతాదులో వర్షం లేక పంటల్లో తీవ్రంగా ఎదుగుదల తగ్గిపోయాయి. సరైన వర్షాలు లేకపోవడంతో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు వానజల్లులతో పుడమి పరవశిస్తోంది.
    1
    వీపనగండ్ల గ్రామంలో వర్షం వానజల్లుతో పుడమి పరవశిస్తోంది...
నంద్యాల జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురుస్తుంది. మిడుతూరు మండల(M) వీపనగండ్లలో ఉదయం నుంచి మోస్తారు వర్షం కురుస్తోంది. చాలా రోజులుగా సరైన వర్షాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు పంటలకు విత్తనాలు ఇచ్చినప్పటి నుంచి సరైన మోతాదులో వర్షం లేక పంటల్లో తీవ్రంగా ఎదుగుదల తగ్గిపోయాయి. సరైన వర్షాలు లేకపోవడంతో మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. మరోవైపు వానజల్లులతో పుడమి పరవశిస్తోంది.
    user_Why not dinesh... yashaswi
    Why not dinesh... yashaswi
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • స్థానిక ఎన్నికల్లో ధైర్యంగా నామినేషన్లు వేయండి: మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి స్థానిక సంస్థ ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు ధైర్యంగా నామినేషన్లు వేయాలని శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పిలుపునిచ్చారు.కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై బండి ఆత్మకూరు మండల విస్తృత స్థాయి సమావేశాన్ని పార్నపల్లె గ్రామంలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ... ప్రతి కార్యకర్త కలిసికట్టుగా పనిచేసి వైసీపీ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
    1
    స్థానిక ఎన్నికల్లో ధైర్యంగా నామినేషన్లు వేయండి: మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి
స్థానిక సంస్థ ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తలు ధైర్యంగా నామినేషన్లు వేయాలని శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పిలుపునిచ్చారు.కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కార్యాచరణపై బండి ఆత్మకూరు మండల విస్తృత స్థాయి సమావేశాన్ని పార్నపల్లె గ్రామంలోని టీటీడీ కల్యాణ మండపంలో నిర్వహించారు.  ఆయన మాట్లాడుతూ... ప్రతి కార్యకర్త కలిసికట్టుగా పనిచేసి వైసీపీ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    17 hrs ago
  • తిరుమల వైభవాన్ని తలపిస్తున్న తాడిపత్రి చింతల వెంకటరమణస్వామి ఆలయం తాడిపత్రిలోని చారిత్రక శ్రీ చింతల వెంకటరమణస్వామి దేవస్థానం రాత్రివేళ సరికొత్త శోభను సంతరించుకుంది. ఆలయ గోపురాలకు ఏర్పాటు చేసిన బంగారు వర్ణ లైట్ల వెలుగులతో ఆలయ ప్రాంగణం తిరుమల శ్రీవారి ఆలయ గోపురాలను తలపించేలా దర్శనమిస్తోంది. ముఖ్యంగా రాత్రివేళ వర్షం కురుస్తున్న సమయంలో వెలుగులతో మెరిసిపోతున్న గోపురాల దృశ్యాలు భక్తులు, స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.విజయనగర సామ్రాజ్య కాలంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మితమైన ఈ ఆలయం తాడిపత్రి చారిత్రక, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. శిల్పకళతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆలయ గోపురాలకు ఆధునిక లైటింగ్‌ ఏర్పాటు చేయడంతో పురాతన కట్టడానికి మరింత ఆకర్షణ జతకలిసింది. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఆలయ గోపురాలకు బంగారు వర్ణ లైట్లు ఏర్పాటు చేసినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. రాత్రివేళ ఈ లైట్ల వెలుగుల్లో ఆలయ గోపురాలు బంగారు కాంతులతో మెరిసిపోతుండటంతో భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తడిసిన ఆలయ పరిసరాలు, వాటిపై ప్రతిబింబిస్తున్న బంగారు కాంతులు ఆలయ సౌందర్యాన్ని మరింత పెంచుతున్నాయి. దీంతో రాత్రివేళ ఆలయాన్ని చూసేందుకు వచ్చే భక్తులు, స్థానికులు ఈ అందమైన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించుకుంటున్నారు. చారిత్రక నిర్మాణ వైభవానికి ఆధునిక లైటింగ్‌ తోడవడంతో శ్రీ చింతల వెంకటరమణస్వామి ఆలయం రాత్రివేళ తాడిపత్రిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
    1
    తిరుమల వైభవాన్ని తలపిస్తున్న తాడిపత్రి చింతల వెంకటరమణస్వామి ఆలయం
తాడిపత్రిలోని చారిత్రక శ్రీ చింతల వెంకటరమణస్వామి దేవస్థానం రాత్రివేళ సరికొత్త శోభను సంతరించుకుంది. ఆలయ గోపురాలకు ఏర్పాటు చేసిన బంగారు వర్ణ లైట్ల వెలుగులతో ఆలయ ప్రాంగణం తిరుమల శ్రీవారి ఆలయ గోపురాలను తలపించేలా దర్శనమిస్తోంది. ముఖ్యంగా రాత్రివేళ వర్షం కురుస్తున్న సమయంలో వెలుగులతో మెరిసిపోతున్న గోపురాల దృశ్యాలు భక్తులు, స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.విజయనగర సామ్రాజ్య కాలంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మితమైన ఈ ఆలయం తాడిపత్రి చారిత్రక, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. శిల్పకళతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆలయ గోపురాలకు ఆధునిక లైటింగ్‌ ఏర్పాటు చేయడంతో పురాతన కట్టడానికి మరింత ఆకర్షణ జతకలిసింది.
తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఆలయ గోపురాలకు బంగారు వర్ణ లైట్లు ఏర్పాటు చేసినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. రాత్రివేళ ఈ లైట్ల వెలుగుల్లో ఆలయ గోపురాలు బంగారు కాంతులతో మెరిసిపోతుండటంతో భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తడిసిన ఆలయ పరిసరాలు, వాటిపై ప్రతిబింబిస్తున్న బంగారు కాంతులు ఆలయ సౌందర్యాన్ని మరింత పెంచుతున్నాయి. దీంతో రాత్రివేళ ఆలయాన్ని చూసేందుకు వచ్చే భక్తులు, స్థానికులు ఈ అందమైన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించుకుంటున్నారు.
చారిత్రక నిర్మాణ వైభవానికి ఆధునిక లైటింగ్‌ తోడవడంతో శ్రీ చింతల వెంకటరమణస్వామి ఆలయం రాత్రివేళ తాడిపత్రిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
    user_Sanjeev
    Sanjeev
    Local News Reporter తాడిపత్రి, అనంతపురం, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.