Shuru
Apke Nagar Ki App…
పులివెందుల మండలంలో భారీ వర్షానికి నేలకొరిగిన అరటి తోటలు పులివెందులలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అరటి తోటలు నేలకూలాయి. పులివెందుల నుంచి అంబకపల్లెకు వెళ్లే రోడ్డులో గాలివానకు అరటి చెట్లు రోడ్డుపై నేలకొరిగాయి. పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లె, మల్లికార్జునపురం గ్రామాలలో వందల ఎకరాలలో అరటి చెట్లు నేలకూలాయి. దీంతో లక్షలాది రూపాయలు నష్టపోయినట్లు అరటి రైతులు ఆవేదన చెందుతున్నారు. నష్టపోయిన అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
LAKKU SIVA SANKAR reddy
పులివెందుల మండలంలో భారీ వర్షానికి నేలకొరిగిన అరటి తోటలు పులివెందులలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అరటి తోటలు నేలకూలాయి. పులివెందుల నుంచి అంబకపల్లెకు వెళ్లే రోడ్డులో గాలివానకు అరటి చెట్లు రోడ్డుపై నేలకొరిగాయి. పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లె, మల్లికార్జునపురం గ్రామాలలో వందల ఎకరాలలో అరటి చెట్లు నేలకూలాయి. దీంతో లక్షలాది రూపాయలు నష్టపోయినట్లు అరటి రైతులు ఆవేదన చెందుతున్నారు. నష్టపోయిన అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- పులివెందుల మండలంలో భారీ వర్షానికి నేలకొరిగిన అరటి తోటలు పులివెందులలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అరటి తోటలు నేలకూలాయి. పులివెందుల నుంచి అంబకపల్లెకు వెళ్లే రోడ్డులో గాలివానకు అరటి చెట్లు రోడ్డుపై నేలకొరిగాయి. పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లె, మల్లికార్జునపురం గ్రామాలలో వందల ఎకరాలలో అరటి చెట్లు నేలకూలాయి. దీంతో లక్షలాది రూపాయలు నష్టపోయినట్లు అరటి రైతులు ఆవేదన చెందుతున్నారు. నష్టపోయిన అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.1
- వర్షాలతో జలకళను సంతరించుకున్న యాడికి కోన ఉప్పలపాడు జలపాతం.. అనంతపురం జిల్లాలో వర్షాలు ప్రకృతి అందాలను మరింత ఇనుమడింపజేస్తున్నాయి. యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామ సమీపంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి క్షేత్రం వద్ద ఉన్న కోన జలపాతం వర్షపు నీటితో జాలువారుతూ సందర్శకులను ఆకట్టుకుంటోంది.గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో కొండ ప్రాంతాల నుంచి నీరు ప్రవహిస్తూ జలపాతంగా మారింది. ఎత్తైన ప్రాంతం నుంచి నీరు కిందకు జాలువారుతున్న దృశ్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.జలపాతం అందాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వర్షాకాలంలో మాత్రమే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే కోన జలపాతం ప్రస్తుతం పచ్చని ప్రకృతి మధ్య మరింత శోభాయమానంగా దర్శనమిస్తోంది. వర్షాలతో జలపాతం జలకళను సంతరించుకోవడంతో స్థానికంగా పర్యాటక సందడి నెలకొంది.1
- గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి వెల్దుర్తి పంట పొలాల్లో పడిన వర్షపు నీరు ఉపాధి పనులతో చేసిన కాలువ ద్వారా నేరుగా ప్రధాన వంకలోకి చేరుతోంది రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలంలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వెల్దుర్తి గ్రామంలో కరువు పనుల కోసం తీసిన కాలువ నుండి వరద నీరు ప్రధానవంకలోకి ప్రవహిస్తోంది ఉపాధి పనులలో ఇలాంటి ఉపయోగకరమైన పనులు చేపట్టడం వల్లనే వర్షపు నీరు పొలాల మీద కోతలు పడకుండా వంకలోకి కాలు ద్వారా చేరటం చాలా ఆనందంగా ఉందని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు1
- పెరిగే ధరలకు హద్దే లేదు- కూటమి ప్రభుత్వానికి సిగ్గే లేదు. ఆకాశాన్ని అంటుతున్న నిత్యవసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తి విఫలం. బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహిస్తూ పేదల నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం. బద్వేలు, సెప్టెంబర్ 20:దుకాణాలను పరిశీలించి నిత్యావసర వస్తువుల ధరలను అడిగి తెలుసుకున్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ బృందం.ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో, బ్లాక్ మార్కెట్ మాఫియాను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్ చంద్రశేఖర్ నియోజకవర్గ పార్టీ కార్యదర్శి పి చంద్రమోహన్ రాజు ఘాటుగా విమర్శించారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని పలు దుకాణాలలో పర్యటించి నిత్యవసర వస్తువుల ధరలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ చంద్రశేఖర్, చంద్రమోహన్ రాజు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నానాటికి నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి పేద మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షలా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఒకవైపు వర్షాలు లేక పంటలు పండక ప్రజలు అల్లాడుతుంటే మరోవైపు మూలుగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ప్రజలపై నిత్యవసర వస్తువుల భారాలు పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కింటా బియ్యం పై వెయ్యి రూపాయల వరకు అదనంగా ధరలు పెంచారని దీనికి తోడు ఉల్లిపాయ దగ్గర నుండి నూనె వరకు వందల రూపాయలు ధరలు పెరిగి పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాయని కిలో ఉల్లిపాయ 80 రూపాయలు వరకు కందిపప్పు 140కి నూనె 200 రూపాయలకు దగ్గరలో ఉన్నదని దీనికంతటికి ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణమని వారు తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రజారంజక పరిపాలనఅందిస్తున్నామని డబ్బాలుకొట్టుకుంటున్నారు తప్ప క్షేత్రస్థాయిలో దీనికి భిన్నంగా ఉన్నదని బ్లాక్ మార్కెట్ మాఫియా మరియు దళారులు ఉన్న సరుకులను దాచిపెట్టి ఉద్దేశపూర్వకంగా కొరత సృష్టిస్తూ ధరలను విపరీతంగా పెంచేలా చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నదని వారు ప్రశ్నించారు. తక్షణమే బ్లాక్ మార్కెట్ మాఫియా పై ఉక్కు పాదం మోపి నిత్యవసర వస్తువుల ధరలను అందుబాటులోకి తీసుకురాకపోతే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది అని హితువు పలికారు. అర్బాటపు ప్రకటనలు మాని ప్రభుత్వ రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసేలా చర్యలు తీసుకొని పేద మధ్యతరగతి ప్రజలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజా ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కే జకరయ్య నియోజకవర్గ కమిటీ సభ్యులు రామరాజు, విజయరావు, జయరామరాజు, గంట మహబూబ్బాషా, ఈశ్వర్, దేవదానం, పోతురాజు రమణ తదితరులు పాల్గొన్నారు.1
- హిందూపురం గణేష్ వేడుకల్లో హెలికాప్టర్‌తో పూల వర్షం. . హిందూపురం: పట్టణంలో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గరుడి రాజ్ గణపతి లడ్డూ రూ.3,33,000లకు వేలం జరిగింది. గరుడ మహారాజ్ సమితి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. వేడుకలను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో రహదారులు భక్తులతో నిండిపోయాయి.1
- వైసీపీ నుంచి ముస్లిం మైనార్టీలు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో టీడీపీ లోకి భారీగా చేరికలు ముస్లిం మైనార్టీ సోదరులు తమ తండ్రి కాలం నుంచి నల్లారి కుటుంబానికి అండగా ఉన్నారని పీలేరు నియోజకవర్గం శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి అన్నారు. కలకడ మండల కేంద్రంలో ఓల్డ్ ఆక్స్ఫర్డ్ స్కూల్ సమీపంలో జరిగిన సమావేశంలో కలకడ మాజీ సర్పంచ్ దండు జిలాని తమ కుటుంబ సభ్యులు మరియు అనూయాయులతో 175 కుటుంబాలకు పైగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో ఆదివారం టిడిపిలో చేరారు. అదే విధంగా కలకడ మండల కేంద్రములో సింగిల్ విండో మాజీ డైరెక్టర్ టిఎస్ సుల్తానీ భాష తమ కుటుంబ సభ్యులు మరియు అనూయాయులతో 175కుటుంబాలకు పైగా తెలుగు దేశం పార్టీ లో ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సమక్షంలో చేరగా వీరందరికీ పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం మైనార్టీ సోదరుల విషయంలో పొరపాటు గాని, నేనెప్పుడూ తప్పు గాని చేయలేదని చెప్పారు. కలకడ ముస్లిం సోదరులు ఇకపై తప్పు చేయవద్దని అన్నారు. మీకు ఏ పని కావాలన్నా చేసుకుని వెళ్లాలని కోరారు. కలకడలో అభివృద్ధి తాము చేసిందే అని, వైకాపా చేసింది ఏమీ లేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లారపు రవిప్రకాష్ నాయుడు, మండల పార్టీ అధ్యక్షులు పొత్తూరు ప్రభాకర్ నాయుడు, సింగిల్ విండో చైర్మన్ మద్దిపట్ల వెంకటరమణ నాయుడు, శ్రీనివాసులు రెడ్డి, వై.వెంకట్రమణ అలియాస్ పెద్దోడు, కలికిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ముబారక్ అలీ, యల్లమంద జిలాని, బి.జాఫర్ హుస్సేన్, ఆర్.జాకీర్ హుస్సేన్, సయ్యద్ ఇర్ఫాన్, మెడికల్ స్టోర్ బాబు, రఫీ, టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు1
- మహానంది మండలంలో చిగురుస్తున్న రైతన్న ఆశలు.. ఎండిపోతున్న పంటలకు జీవం పోసిన వర్షం మహానంది మండలంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతన్న ఆశలు చిగురిస్తున్నాయి. ఎల్లీనో ప్రభావంతో మండలంలో సరైన వర్షాభావం లేకపోవడంతో రైతులు పడ్డ కష్టాలు వర్ణనాతీతం. అడపాదడపా వర్షాలు పడిన పంటలు సాగులో చాలా ఇబ్బందులు పడ్డారు. నిన్న నేడు వర్షాలు కురుస్తుండడంతో ఎండిపోయిన పంటలకు జీవం వస్తుందని రైతుల ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. వరుణ దేవుడా కరుణించి సమృద్ధిగా వర్షాలు కురవాలని కోరుతున్నారు.1
- తిరుమల వైభవాన్ని తలపిస్తున్న తాడిపత్రి చింతల వెంకటరమణస్వామి ఆలయం తాడిపత్రిలోని చారిత్రక శ్రీ చింతల వెంకటరమణస్వామి దేవస్థానం రాత్రివేళ సరికొత్త శోభను సంతరించుకుంది. ఆలయ గోపురాలకు ఏర్పాటు చేసిన బంగారు వర్ణ లైట్ల వెలుగులతో ఆలయ ప్రాంగణం తిరుమల శ్రీవారి ఆలయ గోపురాలను తలపించేలా దర్శనమిస్తోంది. ముఖ్యంగా రాత్రివేళ వర్షం కురుస్తున్న సమయంలో వెలుగులతో మెరిసిపోతున్న గోపురాల దృశ్యాలు భక్తులు, స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.విజయనగర సామ్రాజ్య కాలంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మితమైన ఈ ఆలయం తాడిపత్రి చారిత్రక, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. శిల్పకళతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆలయ గోపురాలకు ఆధునిక లైటింగ్ ఏర్పాటు చేయడంతో పురాతన కట్టడానికి మరింత ఆకర్షణ జతకలిసింది. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఆలయ గోపురాలకు బంగారు వర్ణ లైట్లు ఏర్పాటు చేసినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. రాత్రివేళ ఈ లైట్ల వెలుగుల్లో ఆలయ గోపురాలు బంగారు కాంతులతో మెరిసిపోతుండటంతో భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తడిసిన ఆలయ పరిసరాలు, వాటిపై ప్రతిబింబిస్తున్న బంగారు కాంతులు ఆలయ సౌందర్యాన్ని మరింత పెంచుతున్నాయి. దీంతో రాత్రివేళ ఆలయాన్ని చూసేందుకు వచ్చే భక్తులు, స్థానికులు ఈ అందమైన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించుకుంటున్నారు. చారిత్రక నిర్మాణ వైభవానికి ఆధునిక లైటింగ్ తోడవడంతో శ్రీ చింతల వెంకటరమణస్వామి ఆలయం రాత్రివేళ తాడిపత్రిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.1