Shuru
Apke Nagar Ki App…
హిందూపురం గణేష్ వేడుకల్లో హెలికాప్టర్‌తో పూల వర్షం. . హిందూపురం: పట్టణంలో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గరుడి రాజ్ గణపతి లడ్డూ రూ.3,33,000లకు వేలం జరిగింది. గరుడ మహారాజ్ సమితి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. వేడుకలను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో రహదారులు భక్తులతో నిండిపోయాయి.
LNL
హిందూపురం గణేష్ వేడుకల్లో హెలికాప్టర్‌తో పూల వర్షం. . హిందూపురం: పట్టణంలో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గరుడి రాజ్ గణపతి లడ్డూ రూ.3,33,000లకు వేలం జరిగింది. గరుడ మహారాజ్ సమితి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. వేడుకలను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో రహదారులు భక్తులతో నిండిపోయాయి.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- హిందూపురం గణేష్ వేడుకల్లో హెలికాప్టర్‌తో పూల వర్షం. . హిందూపురం: పట్టణంలో గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గరుడి రాజ్ గణపతి లడ్డూ రూ.3,33,000లకు వేలం జరిగింది. గరుడ మహారాజ్ సమితి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హెలికాప్టర్ ద్వారా పూల వర్షం కురిపించారు. వేడుకలను చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో రహదారులు భక్తులతో నిండిపోయాయి.1
- గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి వెల్దుర్తి పంట పొలాల్లో పడిన వర్షపు నీరు ఉపాధి పనులతో చేసిన కాలువ ద్వారా నేరుగా ప్రధాన వంకలోకి చేరుతోంది రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలంలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వెల్దుర్తి గ్రామంలో కరువు పనుల కోసం తీసిన కాలువ నుండి వరద నీరు ప్రధానవంకలోకి ప్రవహిస్తోంది ఉపాధి పనులలో ఇలాంటి ఉపయోగకరమైన పనులు చేపట్టడం వల్లనే వర్షపు నీరు పొలాల మీద కోతలు పడకుండా వంకలోకి కాలు ద్వారా చేరటం చాలా ఆనందంగా ఉందని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు1
- అనంతపురం జిల్లాలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు కనువిందు చేస్తూ దృశ్యాలు అనంతపురం జిల్లాలో ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన జలపాతాలు కనువిందు చేస్తూ దర్శనమిస్తున్నాయి. యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామ సమీపంలోని రామలింగేశ్వరస్వామి క్షేత్రం వద్ద ఉన్న కోన జలపాతం జాలువారుతూ దర్శనమిస్తోంది. దీంతో చుట్టుపక్కల ప్రాంతాల వారు ఆ సుందర దృశ్యాలను తిలకించేందుకు ప్రకృతి ప్రేమికుల సైతం వెళ్తున్నారు. గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా జలపాతం జాలువారుతోంది.1
- పులివెందుల మండలంలో భారీ వర్షానికి నేలకొరిగిన అరటి తోటలు పులివెందులలో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి అరటి తోటలు నేలకూలాయి. పులివెందుల నుంచి అంబకపల్లెకు వెళ్లే రోడ్డులో గాలివానకు అరటి చెట్లు రోడ్డుపై నేలకొరిగాయి. పులివెందుల మండలం నల్లపురెడ్డి పల్లె, మల్లికార్జునపురం గ్రామాలలో వందల ఎకరాలలో అరటి చెట్లు నేలకూలాయి. దీంతో లక్షలాది రూపాయలు నష్టపోయినట్లు అరటి రైతులు ఆవేదన చెందుతున్నారు. నష్టపోయిన అరటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు.1
- నరేంద్ర మోదీ బ్యానర్‌తో వినాయక నిమజ్జనంలో సందడి పుంగనూరు మండలంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిమజ్జన ఊరేగింపు సందర్భంగా పుంగనూరు గోకుల్ సర్కిల్‌లో నరేంద్ర మోదీ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. జోగిపేటకు చెందిన కొందరు యువకులు నరేంద్ర మోదీపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఆ బ్యానర్‌ను చేతుల్లోకి ఎత్తుకుని ఉత్సాహంగా నృత్యాలు చేశారు. వినాయక నిమజ్జన వేడుకల్లో భాగంగా బ్యానర్‌తో చేసిన ఈ సందడి అక్కడి ప్రజలు, భక్తులను ఆకట్టుకుంది. యువకుల నృత్యాలతో గోకుల్ సర్కిల్ పరిసరాల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. నరేంద్ర మోదీ బ్యానర్‌తో వినాయక నిమజ్జనంలో సందడి పుంగనూరు మండలంలో వినాయక నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిమజ్జన ఊరేగింపు సందర్భంగా పుంగనూరు గోకుల్ సర్కిల్‌లో నరేంద్ర మోదీ బ్యానర్‌ను ఏర్పాటు చేశారు. జోగిపేటకు చెందిన కొందరు యువకులు నరేంద్ర మోదీపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటూ ఆ బ్యానర్‌ను చేతుల్లోకి ఎత్తుకుని ఉత్సాహంగా నృత్యాలు చేశారు. వినాయక నిమజ్జన వేడుకల్లో భాగంగా బ్యానర్‌తో చేసిన ఈ సందడి అక్కడి ప్రజలు, భక్తులను ఆకట్టుకుంది. యువకుల నృత్యాలతో గోకుల్ సర్కిల్ పరిసరాల్లో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.1
- పులిచెర్ల లో అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ చేసిన కల్లూరు పోలీసులు పులిచెర్ల లో ఐదుగురు అంతరాష్ట్ర దొంగల ముఠా నిందితులను కల్లూరు పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 90లక్షల విలువగల బంగారు,వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కల్లూరు శ్రీ కృష్ణ జ్యువలరీ దుకాణంలో చోరికి పాల్పడిన నిందితులు. దినేష్,చిరంజీవి,జగన్, వసంత్ కుమార్, సిలంబరసన్ ను పోలీసులు రిమాండ్ కు తరలించడం జరిగింది. A 1 ముద్దాయి దినేష్ పై గతంలో 18 కేసులు నమోదు అయినట్లు డి.ఎస్.పి వెంకటనారాయణ వెల్లడించారు.1
- వర్షాలతో జలకళను సంతరించుకున్న యాడికి కోన ఉప్పలపాడు జలపాతం.. అనంతపురం జిల్లాలో వర్షాలు ప్రకృతి అందాలను మరింత ఇనుమడింపజేస్తున్నాయి. యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామ సమీపంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి క్షేత్రం వద్ద ఉన్న కోన జలపాతం వర్షపు నీటితో జాలువారుతూ సందర్శకులను ఆకట్టుకుంటోంది.గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో కొండ ప్రాంతాల నుంచి నీరు ప్రవహిస్తూ జలపాతంగా మారింది. ఎత్తైన ప్రాంతం నుంచి నీరు కిందకు జాలువారుతున్న దృశ్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.జలపాతం అందాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వర్షాకాలంలో మాత్రమే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే కోన జలపాతం ప్రస్తుతం పచ్చని ప్రకృతి మధ్య మరింత శోభాయమానంగా దర్శనమిస్తోంది. వర్షాలతో జలపాతం జలకళను సంతరించుకోవడంతో స్థానికంగా పర్యాటక సందడి నెలకొంది.1
- న్యామద్దెల గ్రామానికి చెందిన దాత కదిరోళ్ల నాగిరెడ్డి కంచు గుర్రం భైరవేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాన్ని భైరవేశ్వర స్వామి ఆలయ పూజారి పెద్దలకు అందజేశారు చెన్నేకొత్తపల్లి సెప్టెంబర్:: రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలంలోని న్యామద్దల గ్రామంలో వెలిసిన భైరవేశ్వర స్వామి ఆలయంకు న్యామద్దల గ్రామానికి చెందిన దాత కదిరోళ్ల నాగిరెడ్డి కాంశ్య గుర్రంపై భైరవ స్వామి, ఉత్సవ విగ్రహాన్ని ఆలయ కమిటీ పెద్దలకు అందజేశారు. ఆలయ పూజారి కమిటీ పెద్దలు ఆధ్వర్యంలో మేడాపురంలో ఘనంగా ఊరేగింపు చేశారు మేడాపురంలోని బైరవ స్వామి ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి ఆలయంలో ఉంచారు. అక్కడ 41 రోజులు పూజలు గావించి అనంతరం న్యామద్దల గ్రామం చివర్లలోని పంట పొలాలలో వెలసిన భైరవ స్వామి ఆలయంలో ఏర్పాటు చేస్తారు పర్వదినాల సందర్భంగా ఈ ఉత్సవ విగ్రహాన్ని న్యామద్దల గ్రామంలో ఊరేగింపు చేయడం జరుగుతుందని ఆలయ పూజారి, కమిటీ పెద్దలు తెలిపారు1