Shuru
Apke Nagar Ki App…
పులిచెర్ల లో అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ చేసిన కల్లూరు పోలీసులు పులిచెర్ల లో ఐదుగురు అంతరాష్ట్ర దొంగల ముఠా నిందితులను కల్లూరు పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 90లక్షల విలువగల బంగారు,వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కల్లూరు శ్రీ కృష్ణ జ్యువలరీ దుకాణంలో చోరికి పాల్పడిన నిందితులు. దినేష్,చిరంజీవి,జగన్, వసంత్ కుమార్, సిలంబరసన్ ను పోలీసులు రిమాండ్ కు తరలించడం జరిగింది. A 1 ముద్దాయి దినేష్ పై గతంలో 18 కేసులు నమోదు అయినట్లు డి.ఎస్.పి వెంకటనారాయణ వెల్లడించారు.
Manjunath Chakkala Sr.Reporter
పులిచెర్ల లో అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ చేసిన కల్లూరు పోలీసులు పులిచెర్ల లో ఐదుగురు అంతరాష్ట్ర దొంగల ముఠా నిందితులను కల్లూరు పోలీసులు అదుపులో తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 90లక్షల విలువగల బంగారు,వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కల్లూరు శ్రీ కృష్ణ జ్యువలరీ దుకాణంలో చోరికి పాల్పడిన నిందితులు. దినేష్,చిరంజీవి,జగన్, వసంత్ కుమార్, సిలంబరసన్ ను పోలీసులు రిమాండ్ కు తరలించడం జరిగింది. A 1 ముద్దాయి దినేష్ పై గతంలో 18 కేసులు నమోదు అయినట్లు డి.ఎస్.పి వెంకటనారాయణ వెల్లడించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- వేలంపాటలో కలికిరి క్రాస్ రోడ్ వినాయకుని చేతిలోని లడ్డూలను రూ.32,100 లకు దక్కించుకున్న వేలం పాటదారులు కలికిరి నేస్తం న్యూస్..కలికిరి: 20సెప్టెంబర్2026:కలికిరి క్రాస్ రోడ్ కలకడ రోడ్లో శ్రీరాములవారి ఆలయం వద్ద ఉమా మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని చేతిలోని లడ్డూలను 5రోజుల ప్రత్యేక పూజల అనంతరం ఆదివారం సాయంత్రం నిమజ్జనం సందర్భంగా వేలం వేయగా పెద్ద లడ్డూను 24వేల రూపాయలకు గాంధీ హెచ్చు పాట పాడి దక్కించుకున్నాడు. అదేవిధంగా చిన్న లడ్డూను 8100రూపాయలకు విశ్వ వేలం పాటలో దక్కించుకున్నారు. అనంతరం నిమజ్జనం సందర్భంగా వినాయకుని ఊరేగింపు కార్యక్రమం నిర్వహించి ఉమ్మళ్ల కుంటలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.1
- శ్రీవారి లడ్డు ప్రసాదంపై మీరు చేసిన తప్పుడు ప్రచారానికి ఏం ప్రక్షాళన చేస్తారు చంద్రబాబు? ఎలాంటి ఆధారాలు లేకుండానే లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం హోదాలో చంద్రబాబు ఎలా చెప్తారు? ఏ జంతు కొవ్వు లడ్డులో కలవలేదని ఈడీ తేల్చింది తప్పుడు ప్రచారంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీసినందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి. -చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు, మాజీ మంత్రి, శ్రీవారి లడ్డు ప్రసాదంపై మీరు చేసిన తప్పుడు ప్రచారానికి ఏం ప్రక్షాళన చేస్తారు చంద్రబాబు? ఎలాంటి ఆధారాలు లేకుండానే లడ్డులో జంతువుల కొవ్వు కలిసిందని సీఎం హోదాలో చంద్రబాబు ఎలా చెప్తారు? ఏ జంతు కొవ్వు లడ్డులో కలవలేదని ఈడీ తేల్చింది తప్పుడు ప్రచారంతో కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బ తీసినందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలి. -చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ గారు, మాజీ మంత్రి,1
- గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షానికి వెల్దుర్తి పంట పొలాల్లో పడిన వర్షపు నీరు ఉపాధి పనులతో చేసిన కాలువ ద్వారా నేరుగా ప్రధాన వంకలోకి చేరుతోంది రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలంలో గత రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వెల్దుర్తి గ్రామంలో కరువు పనుల కోసం తీసిన కాలువ నుండి వరద నీరు ప్రధానవంకలోకి ప్రవహిస్తోంది ఉపాధి పనులలో ఇలాంటి ఉపయోగకరమైన పనులు చేపట్టడం వల్లనే వర్షపు నీరు పొలాల మీద కోతలు పడకుండా వంకలోకి కాలు ద్వారా చేరటం చాలా ఆనందంగా ఉందని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు1
- పెరిగే ధరలకు హద్దే లేదు- కూటమి ప్రభుత్వానికి సిగ్గే లేదు. ఆకాశాన్ని అంటుతున్న నిత్యవసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తి విఫలం. బ్లాక్ మార్కెట్ ను ప్రోత్సహిస్తూ పేదల నడ్డి విరుస్తున్న కూటమి ప్రభుత్వం. బద్వేలు, సెప్టెంబర్ 20:దుకాణాలను పరిశీలించి నిత్యావసర వస్తువుల ధరలను అడిగి తెలుసుకున్న సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ బృందం.ఆకాశాన్ని అంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలను అదుపు చేయడంలో, బ్లాక్ మార్కెట్ మాఫియాను అరికట్టడంలో కూటమి ప్రభుత్వం పూర్తి వైఫల్యం చెందిందని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్ చంద్రశేఖర్ నియోజకవర్గ పార్టీ కార్యదర్శి పి చంద్రమోహన్ రాజు ఘాటుగా విమర్శించారు. ఆదివారం పార్టీ నాయకులతో కలిసి పట్టణంలోని పలు దుకాణాలలో పర్యటించి నిత్యవసర వస్తువుల ధరలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ చంద్రశేఖర్, చంద్రమోహన్ రాజు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నానాటికి నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగి పేద మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షలా మారాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఒకవైపు వర్షాలు లేక పంటలు పండక ప్రజలు అల్లాడుతుంటే మరోవైపు మూలుగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా ప్రజలపై నిత్యవసర వస్తువుల భారాలు పడుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే కింటా బియ్యం పై వెయ్యి రూపాయల వరకు అదనంగా ధరలు పెంచారని దీనికి తోడు ఉల్లిపాయ దగ్గర నుండి నూనె వరకు వందల రూపాయలు ధరలు పెరిగి పేద మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తున్నాయని కిలో ఉల్లిపాయ 80 రూపాయలు వరకు కందిపప్పు 140కి నూనె 200 రూపాయలకు దగ్గరలో ఉన్నదని దీనికంతటికి ప్రభుత్వ వైఫల్యమే ప్రధాన కారణమని వారు తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రజారంజక పరిపాలనఅందిస్తున్నామని డబ్బాలుకొట్టుకుంటున్నారు తప్ప క్షేత్రస్థాయిలో దీనికి భిన్నంగా ఉన్నదని బ్లాక్ మార్కెట్ మాఫియా మరియు దళారులు ఉన్న సరుకులను దాచిపెట్టి ఉద్దేశపూర్వకంగా కొరత సృష్టిస్తూ ధరలను విపరీతంగా పెంచేలా చేస్తుంటే కూటమి ప్రభుత్వం ఏం చేస్తున్నదని వారు ప్రశ్నించారు. తక్షణమే బ్లాక్ మార్కెట్ మాఫియా పై ఉక్కు పాదం మోపి నిత్యవసర వస్తువుల ధరలను అందుబాటులోకి తీసుకురాకపోతే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుంది అని హితువు పలికారు. అర్బాటపు ప్రకటనలు మాని ప్రభుత్వ రేషన్ షాపుల ద్వారా తక్కువ ధరలకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేసేలా చర్యలు తీసుకొని పేద మధ్యతరగతి ప్రజలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజా ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు కే జకరయ్య నియోజకవర్గ కమిటీ సభ్యులు రామరాజు, విజయరావు, జయరామరాజు, గంట మహబూబ్బాషా, ఈశ్వర్, దేవదానం, పోతురాజు రమణ తదితరులు పాల్గొన్నారు.1
- వర్షాలతో జలకళను సంతరించుకున్న యాడికి కోన ఉప్పలపాడు జలపాతం.. అనంతపురం జిల్లాలో వర్షాలు ప్రకృతి అందాలను మరింత ఇనుమడింపజేస్తున్నాయి. యాడికి మండలం కోన ఉప్పలపాడు గ్రామ సమీపంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి క్షేత్రం వద్ద ఉన్న కోన జలపాతం వర్షపు నీటితో జాలువారుతూ సందర్శకులను ఆకట్టుకుంటోంది.గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో కొండ ప్రాంతాల నుంచి నీరు ప్రవహిస్తూ జలపాతంగా మారింది. ఎత్తైన ప్రాంతం నుంచి నీరు కిందకు జాలువారుతున్న దృశ్యం చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది.జలపాతం అందాలను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వర్షాకాలంలో మాత్రమే ప్రత్యేక ఆకర్షణగా నిలిచే కోన జలపాతం ప్రస్తుతం పచ్చని ప్రకృతి మధ్య మరింత శోభాయమానంగా దర్శనమిస్తోంది. వర్షాలతో జలపాతం జలకళను సంతరించుకోవడంతో స్థానికంగా పర్యాటక సందడి నెలకొంది.1
- నెల్లూరు నగరంలోని స్థానిక పప్పుల వీధి మహాలక్ష్మి దేవస్థానం నందు అంగరంగ వైభవంగా పొట్టి శ్రీరాములు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది, సాయంత్రం వాసవి కన్కా పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుండి ఊరేగింపుగా మహాలక్ష్మి దేవస్థానం కు చేరి ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించారు,ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు పొంగూరు నారాయణ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రూప్ కుమార్ యాదవ్ మేయర్ సుజాత రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ చైర్మన్ వెంకటేష్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మయ్య ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు హాజరయ్యారు, అర్బన్ ఆర్యవైశ్య సంఘం కార్యవర్గ ప్రమాణస్వీకారంలో ప్రధాన కార్యదర్శి కోట రమేష్ సెక్రటరీ జె.వి చలపతిరావు అధ్యక్షులు మునగనాగేశ్వరరావు ఆర్యవైశ్య మహిళా విభాగంలో అధ్యక్షులు శేషాద్రి సువర్ణ కుమారి ప్రధాన కార్యదర్శి మెంట రేవతి కోశాధికారి లక్ష్మీ సుకన్య ఆర్యవైశ్య యువజన యువ భాగంలో అధ్యక్షులు వేముల హరిశంకర్ ప్రధాన కార్యదర్శి వెంకట సాయి మోహిత్ కోశాధికారి మెంట సాయి రమణ ఆర్యవైశ్య సంఘం ప్రముఖులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగింది, పొట్టి శ్రీరాములు జిల్లా ఆర్బన్ ఆర్యవైశ్య సంఘం అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలని అభివృద్ధి దిశలో పయనించాలని ప్రతి ఒక్కరిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు,1
- తిరుపతి జిల్లా.. నగరి నియోజకవర్గంలో జరుగుతున్న మైనింగ్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్.. వడమాలపేట మండలం పచ్చకాల్వ గ్రామంలో సీసీ రోడ్డు, కల్వర్టును ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే భానుప్రకాష్.. వైసీపీ హయాంలో క్వారీలకు ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చారు.. *60, 70 అడుగుల మేర బ్లాస్టింగ్‌లు చేస్తుంటే చర్యలు తీసుకోకుండా అధికారులు ఏం చేస్తున్నారు..* *మైనింగ్ అధికారులు, విజిలెన్స్ అధికారులు నిద్రపోతున్నారా..?* ఎస్సీ కాలనీల్లో ప్రజలను నిద్రపోనీయకుండా హడలెత్తిస్తున్నారు.. నగరి, పుత్తూరులో మైనింగ్ విచక్షణారహితంగా సాగుతున్నా అధికారులు ఎందుకు నియంత్రించడం లేదు.. *చుట్టపుచూపుగా వచ్చి మామూళ్లు తీసుకుని వెళ్తున్నట్లుగా ఉంది తప్ప.. ప్రజల కోసం ఏం చేయడం లేదు..* వెంటనే నియోజకవర్గంలో బ్లాస్టింగ్‌లు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి.. తిరుపతి జిల్లా.. నగరి నియోజకవర్గంలో జరుగుతున్న మైనింగ్‌పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్.. వడమాలపేట మండలం పచ్చకాల్వ గ్రామంలో సీసీ రోడ్డు, కల్వర్టును ప్రారంభించేందుకు వచ్చిన ఎమ్మెల్యే భానుప్రకాష్.. వైసీపీ హయాంలో క్వారీలకు ఇష్టానుసారంగా అనుమతులు ఇచ్చారు.. *60, 70 అడుగుల మేర బ్లాస్టింగ్‌లు చేస్తుంటే చర్యలు తీసుకోకుండా అధికారులు ఏం చేస్తున్నారు..* *మైనింగ్ అధికారులు, విజిలెన్స్ అధికారులు నిద్రపోతున్నారా..?* ఎస్సీ కాలనీల్లో ప్రజలను నిద్రపోనీయకుండా హడలెత్తిస్తున్నారు.. నగరి, పుత్తూరులో మైనింగ్ విచక్షణారహితంగా సాగుతున్నా అధికారులు ఎందుకు నియంత్రించడం లేదు.. *చుట్టపుచూపుగా వచ్చి మామూళ్లు తీసుకుని వెళ్తున్నట్లుగా ఉంది తప్ప.. ప్రజల కోసం ఏం చేయడం లేదు..* వెంటనే నియోజకవర్గంలో బ్లాస్టింగ్‌లు లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలి..1
- న్యామద్దెల గ్రామానికి చెందిన దాత కదిరోళ్ల నాగిరెడ్డి కంచు గుర్రం భైరవేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాన్ని భైరవేశ్వర స్వామి ఆలయ పూజారి పెద్దలకు అందజేశారు చెన్నేకొత్తపల్లి సెప్టెంబర్:: రాప్తాడు నియోజకవర్గం చెన్నేకొత్తపల్లి మండలంలోని న్యామద్దల గ్రామంలో వెలిసిన భైరవేశ్వర స్వామి ఆలయంకు న్యామద్దల గ్రామానికి చెందిన దాత కదిరోళ్ల నాగిరెడ్డి కాంశ్య గుర్రంపై భైరవ స్వామి, ఉత్సవ విగ్రహాన్ని ఆలయ కమిటీ పెద్దలకు అందజేశారు. ఆలయ పూజారి కమిటీ పెద్దలు ఆధ్వర్యంలో మేడాపురంలో ఘనంగా ఊరేగింపు చేశారు మేడాపురంలోని బైరవ స్వామి ఆలయం వరకు ఊరేగింపుగా వెళ్లి ఆలయంలో ఉంచారు. అక్కడ 41 రోజులు పూజలు గావించి అనంతరం న్యామద్దల గ్రామం చివర్లలోని పంట పొలాలలో వెలసిన భైరవ స్వామి ఆలయంలో ఏర్పాటు చేస్తారు పర్వదినాల సందర్భంగా ఈ ఉత్సవ విగ్రహాన్ని న్యామద్దల గ్రామంలో ఊరేగింపు చేయడం జరుగుతుందని ఆలయ పూజారి, కమిటీ పెద్దలు తెలిపారు1
- తిరుమల వైభవాన్ని తలపిస్తున్న తాడిపత్రి చింతల వెంకటరమణస్వామి ఆలయం తాడిపత్రిలోని చారిత్రక శ్రీ చింతల వెంకటరమణస్వామి దేవస్థానం రాత్రివేళ సరికొత్త శోభను సంతరించుకుంది. ఆలయ గోపురాలకు ఏర్పాటు చేసిన బంగారు వర్ణ లైట్ల వెలుగులతో ఆలయ ప్రాంగణం తిరుమల శ్రీవారి ఆలయ గోపురాలను తలపించేలా దర్శనమిస్తోంది. ముఖ్యంగా రాత్రివేళ వర్షం కురుస్తున్న సమయంలో వెలుగులతో మెరిసిపోతున్న గోపురాల దృశ్యాలు భక్తులు, స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.విజయనగర సామ్రాజ్య కాలంలో శ్రీకృష్ణదేవరాయల కాలంలో నిర్మితమైన ఈ ఆలయం తాడిపత్రి చారిత్రక, ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. శిల్పకళతో ప్రత్యేక గుర్తింపు పొందిన ఆలయ గోపురాలకు ఆధునిక లైటింగ్ ఏర్పాటు చేయడంతో పురాతన కట్టడానికి మరింత ఆకర్షణ జతకలిసింది. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఆలయ గోపురాలకు బంగారు వర్ణ లైట్లు ఏర్పాటు చేసినట్లు ఆలయ వర్గాలు తెలిపాయి. రాత్రివేళ ఈ లైట్ల వెలుగుల్లో ఆలయ గోపురాలు బంగారు కాంతులతో మెరిసిపోతుండటంతో భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు.ఇటీవల కురుస్తున్న వర్షాల నేపథ్యంలో తడిసిన ఆలయ పరిసరాలు, వాటిపై ప్రతిబింబిస్తున్న బంగారు కాంతులు ఆలయ సౌందర్యాన్ని మరింత పెంచుతున్నాయి. దీంతో రాత్రివేళ ఆలయాన్ని చూసేందుకు వచ్చే భక్తులు, స్థానికులు ఈ అందమైన దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించుకుంటున్నారు. చారిత్రక నిర్మాణ వైభవానికి ఆధునిక లైటింగ్ తోడవడంతో శ్రీ చింతల వెంకటరమణస్వామి ఆలయం రాత్రివేళ తాడిపత్రిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.1