Shuru
Apke Nagar Ki App…
కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు ఈ నెల 21 నుంచి – భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు, ఆర్జిత సేవల వివరాలు విడుదల జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండలం కాళేశ్వరంలో పరిధిలోని లో ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు సరస్వతి నది అంత్య పుష్కరాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఈవో మహేశ్ వెల్లడించారు. ఆర్జిత సేవలకు 9491017012, ఇతర వివరాల కోసం 9491015252 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. పుష్కర హోమంలో పాల్గొనదలిచిన భక్తులు రూ.2,000 చెల్లించాలని, ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆలయ అధికారులు కోరారు.
M D Azizuddin
కాళేశ్వరంలో సరస్వతి అంత్య పుష్కరాలు ఈ నెల 21 నుంచి – భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు, ఆర్జిత సేవల వివరాలు విడుదల జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపురం మండలం కాళేశ్వరంలో పరిధిలోని లో ఈ నెల 21 నుంచి జూన్ 1 వరకు సరస్వతి నది అంత్య పుష్కరాలు నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఈవో మహేశ్ వెల్లడించారు. ఆర్జిత సేవలకు 9491017012, ఇతర వివరాల కోసం 9491015252 నంబర్లలో సంప్రదించవచ్చని తెలిపారు. పుష్కర హోమంలో పాల్గొనదలిచిన భక్తులు రూ.2,000 చెల్లించాలని, ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆలయ అధికారులు కోరారు.
More news from తెలంగాణ and nearby areas
- నర్సింగాపురంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం – 40 మొక్కజొన్న బస్తాలు దగ్ధం వరంగల్ జిల్లా నర్సంపేట మండలం నర్సింగాపురంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మహిళా రైతు అజ్మీర లలిత పంట చేనులో నిల్వ ఉంచిన మొక్కజొన్న బస్తాల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సుమారు 40 బస్తాల మొక్కజొన్న పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కష్టపడి పండించిన పంట కళ్లముందే అగ్నికి ఆహుతి కావడంతో రైతు కన్నీరు మున్నీరయ్యారు.1
- వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలోని పొలానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు ఎగసిపడటంతో సికింద్రాబాద్-భద్రాచలం కాకతీయ ఎక్స్‌ప్రెస్ 30 నిమిషాలు నిలిచిపోయింది, పలు రైళ్లు ఆలస్యమయ్యాయి. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు; రైల్వే అధికారులు వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు.2
- కొండగట్టులో వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు...భారీగా తరలివస్తున్న భక్తులు....హనుమాన్ దీక్ష స్వాములతో కాషాయవర్ణ శోభితంగా మారిన కొండగట్టు కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో బాగంగా రెండవ రోజు కొండగట్టుకు భక్తులు పోటెత్తారు. భారీగా తరలివస్తున్న భక్తులతో కొండగట్టు భక్తజన సంద్రంగా మారింది. హనుమాన్ దీక్ష స్వాములతో కొండగట్టు కాషాయవర్ణ శోభితంగా మారింది. రామనామ స్మరణలు, జై హనుమాన్ నినాదాలతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమ్రోగుతున్నాయి. భక్తుల రద్దీతో ఆర్జిత సేవలను రద్దుచేసి నిరంతరాయంగా భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు. మాల ధారణతో కొండగట్టుకు చేరుకునే భక్తులు, మాల విరమణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేసవి ఎండలు మండిపోతున్న నేపథ్యంలో భక్తులు అస్వస్థతకు, అనారోగ్యానికి గురి కాకుండా ప్రత్యేకంగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు. రేపు జరిగే హనుమాన్ జయంతి సందర్భంగా రెండు నుంచి మూడు లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి ఆ దిశగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ పలు ప్రాంతాలనుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి సైతం హనుమాన్ దీక్ష స్వాములు కొండగట్టు ను సందర్శించి అంజన్నను దర్శించుకుంటున్నారు. ఇరుముడితో పాదయాత్ర ద్వారా కొండగట్టుకు చేరుకొని మాల విరమణ చేస్తున్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు ఆలయ అధికారులు తెలిపారు. భక్తుల రద్దీ, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కొండగట్టు క్షేత్రం భక్తజన సందోహంతో కళకళలాడుతోంది.4
- తెలంగాణలో 17 ఏళ్ల పోక్సో బాధితురాలిపై బండి సంజయ్ తీవ్ర దిగజారుడు వ్యాఖ్యలు చేసి, బెదిరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాలిక చరित्रంపై ప్రశ్నిస్తూ, తనతో పెట్టుకోవద్దని బాధితులను భయపెట్టినట్లు సమాచారం. ఈ ఘటనపై బండి సంజయ్ ఇంటి సీసీ ఫుటేజ్, కాల్ రికార్డ్స్‌ను తనిఖీ చేయాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.1
- Post by Mana Velugu1
- తెలంగాణలోని ప్రముఖ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం ఒక్కరోజే రూ.51.80 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయాలు, VIP దర్శనాలు, కార్ పార్కింగ్ వంటి వివిధ విభాగాల ద్వారా ఈ భారీ ఆదాయం లభించిందని ఈవో భవాని శంకర్ తెలిపారు.1
- సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. హైదరాబాద్‌లో ప్రధాని మోడీ సభలో చట్టసభల్లో బీసీలకు 50% రిజర్వేషన్లు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ ప్రభుత్వం పంపిన బిల్లును వెంటనే ఆమోదించాలని కోరారు. బీసీలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు.1
- ఎనుమాముల మార్కెట్లో మిర్చి వ్యాపారి పరార్ — రైతులకు రూ.2.60 కోట్ల చెల్లింపులు నిలిచిపోవడం వరంగల్: వరంగల్ నగరంలోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మరో మిర్చి వ్యాపారి రైతులను మోసం చేసి పరారైన ఘటన వెలుగులోకి వచ్చింది. శ్రీవిద్య చిల్లీస్ ట్రేడర్స్ అధినేత అయిలయ్య అలియాస్ అరుణ్ 62 మంది రైతుల వద్ద నుంచి రూ.2.60 కోట్ల విలువైన మిర్చి కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా పరారైనట్లు ఆరోపణలు ఉన్నాయి.దీంతో రైతులకు చెల్లింపులు నిలిచిపోయాయి. బాధితులు చాంబర్ ఆఫ్ కామర్స్‌ను ఆశ్రయించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.1