సంచలన వీడియోను విడుదల చేసిన మాజీ మంత్రి, వైసిపి నాయకుడు జోగి రమేష్ నెలరోజులుగా నేను, నా కుటుంబ సభ్యులు మానసిక క్షోభకు గురయ్యాం అని మాజీ మంత్రి, వైసిపి నాయకుడు జోగి రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ మంత్రి, వైసిపి నాయకుడు జోగి రమేష్ సంచలన వీడియోను విడుదల చేశారు.ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఒక్క వీడియోనే బయటపెడుతున్నాం. కేసు కోర్టు పరిధిలో ఉండటం వలన ఒక్క వీడియోనే బయటపెడుతున్నాం. కృష్ణ ప్రసాద్ .మీ పార్టీ నాయకులే నీ వ్యక్తిగత వీడియోలు నాకు పంపారు నేను అలాంటి వ్యక్తిగత విషయాలు జోలికి వెళ్లానని చెప్పాను. ఎమ్మెల్యే కృష్ణ ప్రసాదు ఒక పక్క చేయాల్సిన కుట్రలు చేయిస్తూ మరో పక్క రాజీలంటూ మా వాళ్లనే నా దగ్గరకు పంపారు. రాజకీయంగా నన్ను ఎదుర్కోలేక ఇంత దిగజారిపోతారా అంటూ ప్రశ్నించారు. తల్లిదండ్రులుగా పిల్లల్ని పెంచడం, చదివించడం, పెళ్లిచేయడం మా బాధ్యత. ఈ బాధ్యతలో భాగంగానే నా కుమారుడికి పెళ్లి జరిపించాం.రాజీవ్, మేఘనలకు ఘనంగా పెళ్లి చేశాం.వారిద్దరి మధ్య చిన్న చిన్న భేదాభిప్రాయాలు వచ్చాయి. పిల్లలు కలిసి ఉండాలని కోరుకుంటామే తప్ప విడిపోవాలని కోరుకోము. కానీ వారి మధ్య మనస్పర్ధలు వచ్చాయి. 8-6-2026న విడాకుల కోసం నా కుమారుడు పిటిషన్ వేశాడు. 24-7-2026న మా కుటుంబం మీద మేఘన పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజీవ్,మేఘనల మధ్య పొరపచ్చాలు వచ్చుండొచ్చు.కానీ నేను నా భార్య మేఘనను కన్నకూతిరి మాదిరి చూసుకున్నాం. విడాకులకు దరఖాస్తు చేసుకున్న తర్వాత మేఘన మా కుటుంబంలోని 11 మంది పై ఫిర్యాదు చేసింది.కోర్టు పరిధిలో ఉన్న అంశాల పై ఎక్కువ మాట్లాడలేను.నెలరోజులుగా మా కుటుంబాన్ని మానసికంగా చంపేసేలా కథనాలు ప్రసారం చేశారు.కొన్ని ఛానల్స్ నాకుటుంబం పై వార్తలు వేసి వ్యాపారం చేసుకున్నాయి.

- లారీ ఢీకొని ద్విచక్ర వాహనదారుడికి గాయాలు ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలంలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గౌరారం పంచాయతీ పరిధిలోని వావిళ్లపాడు గ్రామానికి చెందిన పీట్ల శ్రీనివాసరావు.. టీవీఎస్ ఎక్సెల్‌పై కూలి పనికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ఉప్పలచలక సమీపంలోని శివాలయం వద్ద లింగగూడెం లింక్ రోడ్డు నుంచి ప్రధాన రహదారిపైకి వస్తుండగా.. టోల్‌గేట్ వైపు నుంచి ఎర్రగుంట వెళ్తున్న లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసరావుకు గాయాలయ్యాయి. వెంటనే పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తరలించారు.1
- పాలకొల్లులో.. టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతోత్సవం స్థానిక గాంధీ బొమ్మల సెంటర్లో శ్రీ క్షీరారామ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారి 154వ జయంతోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా శ్రీ క్షీరారామ బ్రాహ్మణ సేవా సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు సోమంచి శ్రీనివాస శాస్త్రి మాట్లాడుతూ ఎంతో నీతి నిజాయితీలతో రాష్ట్ర అభివృద్ధికి గణనీయమైన సేవ చేశారని జీవిత మలిదశలో ఎన్నో అవస్థలకు గురయ్యారని ఆయన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఇప్పటికైనా ఆయనకి భారతరత్న ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు చిర్రావూరి నరసింహమూర్తి, కార్యదర్శి నందుల దశరథ్ కోశాధికారి గోటేటి వెంకటేశ్వరరావు, సంఘ ఉపాధ్యక్షులు హోతాహరి నారాయణ, సంఘ సభ్యులు వై ప్రభాకర్ శాస్త్రి, మంచిలి సదాశివమూర్తి, దక్షిణామూర్తి, మీడియా ఇంచార్జ్ శివ సత్య రమణ కుమార్, పాల్గొని ఘన నివాళులు అర్పించారు.3
- వినుకొండ,జాలపాలెం భూములు పేదలకు పంచాలి. పిడిఎం డిమాండ్ వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలపాలెం గ్రామంలో 175 ఎకరాల ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. అక్రమ పాస్‌పుస్తకాలు, రిజిస్ట్రేషన్లపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, భూముల్లోని ఎర్రచందనం తదితర కలపను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. వినుకొండ–వెల్లటూరు రహదారిపై జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.1
- వివేకానంద మనోవికాస కేంద్రంలో అన్నదానం ఏర్పాటు గల్ఫ్ వైఎస్సార్సీపీ కోకన్వీనర్ దొండపాటి గల్ఫ్ వైఎస్సార్సీపీ కోకన్వీనర్ దొండపాటి శశికిరణ్ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని రాజోలు వివేకానంద మనోవికాస కేంద్రంలోని దివ్యాంగులకు అన్నదానం ఏర్పాటు చేశారు. రాజోలు నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న దొండపాటి శశికిరణ్ మరెన్నో సేవా కార్యక్రమాలు చేయ్యాలని ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాజోలు పట్టణ ప్రధాన కార్యదర్శి బొడ్డపల్లి ప్రసాద్, వైఎస్సార్సీపీ రాజోలు మండల ఎస్సీ సెల్ కన్వీనర్ బుంగ శ్రీనివాస్, రాజోలు మండల కమిటీ వైఎస్సార్సీపీ సభ్యులు నల్లి శ్రీనివాస్, వివేకానంద మనోవికాస కేంద్ర నిర్వాహకురాలు ఎం లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.1
- భైరవునిపల్లిలో ముత్యాలమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించారు. నేలకొండపల్లి మండలంలోని భైరవునిపల్లిలో ముత్యాలమ్మ తల్లి పండుగను ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉదయాన్నే బోనాలు తయారు చేసుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొబ్బరికాయలు కొట్టి, కోళ్లు, యాటలను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామంలో పండుగ సందడి నెలకొంది.1
- బోనమెత్తిన పల్లె... కొత్త కొత్తూరు గ్రామంలో బొడ్రాయికి ప్రత్యేక పూజలు... బోనమెత్తిన పల్లెలు... నేలకొండపల్లి మండలం లోని వివిధ గ్రామాలలో ఆదివారం బోనమెత్తారు. ముత్యాలమ్మ తల్లి పండగ ను అంగరంగ వైభవంగా నిర్వహించారు. డప్పు వాయిద్యాలతో, కోలాటం, నృత్యాలతో సందడి చేశారు. బోనాలను ఎత్తుకుని ప్రదర్శన నిర్వహించారు. అమ్మవారికి బోనాల సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పలు గ్రామాలలో కుటుంబ సభ్యులతో పాటు, బంధువులు రాకతో సందడి వాతావరణం నెలకొంది. వర్షాలు సమృద్ధిగా పడాలని... పాడి పంటలతో ప్రజలు సంతోషంగా ఉండాలని కొత్తకొత్తూరు గ్రామంలో బొడ్రాయి కి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలతో గ్రామంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటి చైర్మన్ వెన్నపూసల * సీతారాములు, సర్పంచ్ కళావతి, ఉప సర్పంచ్ వల్లాల రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.1
- మచిలీపట్నం మేయర్ అభ్యర్థిత్వంపై జనసేనలో తారాస్థాయికి చేరిన అంతర్గత విబేధాలు మచిలీపట్నం మేయర్ అభ్యర్థిత్వంపై జనసేనలో అంతర్గత విబేధాలు తారాస్థాయికి చేరాయి. జనసేనలోని రెండు వర్గాలు బాహాబాహీకి దిగాయి. ఓ ప్రైవేట్ ఫంక్షన్ లో జనసేన నేతలు తన్నులాటకు దిగారు. రెండు రోజుల క్రితం నియోజకవర్గ జనసేన ఇన్ ఛార్జ్ బండి రామకృష్ణ అనుచరుడు గడ్డం రాజుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మేయర్ అభ్యర్థిత్వం ఆశించిన కొట్టె వెంకట్రావ్ ప్రైవేట్ ఫంక్షన్ కు హాజరైన సమయంలో కొట్టె వెంకట్రావ్ తో వాగ్వివాదానికి దిగిన గడ్డం రాజు. మాటమాట పెరగడంతో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువురికి సర్దుబాటు చేశారు.1
- పాలకొల్లు లో.. గత ఐదేళ్లలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అంబేద్కర్ భవన్ కు కనీసం రంగులు కూడా వేయలేని మీకు పాలకొల్లు తో ఏం పని..!? వైసీపీని ప్రశ్నించిన మంత్రి రామానాయుడు1
- ఖమ్మం జిల్లా లో ఉదయం నుంచి భారీ వర్షం దంచిపోతుందివర్షం రాకతో రైతులు, వ్యవసాయ కూలీలు హర్షం వ్యక్తం చేస్తూ వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు ఖమ్మం జిల్లాలో ఉదయం నుంచి భారీ వర్షం దంచిపోతుంది. రఘునాథపాలెం, ఖమ్మం రూరల్, బోనకల్, నేలకొండపల్లి, కల్లూరు, ఖమ్మం నగరంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఈ భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వర్షం రాకతో రైతులు, వ్యవసాయ కూలీలు హర్షం వ్యక్తం చేస్తూ.. వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.1