*శివుని ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలి* _ఫెర్రీ శివాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన జంపాల సీతారామయ్య_ *ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 17,* మహాశివరాత్రి సందర్భంగా ఇబ్రహీంపట్నం ఫెర్రీ శివాలయంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు జంపాల సీతారామయ్య కి ఘన స్వాగతం పలికారు.శివాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అర్చకులు అభిషేకాలు నిర్వహించి జంపాల సీతారామయ్యకి ఆశీర్వచనాలు,ప్రసాదాలు అందజేశారు.అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు అన్నదానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహా శివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆ మహా శివుని అనుగ్రహం అందరిపై ఉండాలని ఆయన ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని శివుని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
*శివుని ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలి* _ఫెర్రీ శివాలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన జంపాల సీతారామయ్య_ *ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 17,* మహాశివరాత్రి సందర్భంగా ఇబ్రహీంపట్నం ఫెర్రీ శివాలయంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శి జంపాల సీతారామయ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా నిర్వాహకులు జంపాల సీతారామయ్య కి ఘన స్వాగతం పలికారు.శివాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అర్చకులు అభిషేకాలు నిర్వహించి జంపాల సీతారామయ్యకి ఆశీర్వచనాలు,ప్రసాదాలు అందజేశారు.అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు అన్నదానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహా శివరాత్రి సందర్భంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆ మహా శివుని అనుగ్రహం అందరిపై ఉండాలని ఆయన ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని శివుని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
- గుంటూరు జిల్లా: పొన్నూరు మండలం చింతలపూడిలోని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ తల్లి ప్రమీలమ్మ ఇంట్లో భారీ దొంగతనం జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దుండగులు 50 సవర్ల బంగారం, 10 కిలోల వెండితో పాటు లక్ష రూపాయల నగదు ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పొన్నూరు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుంటూరు నుంచి వచ్చిన క్లూస్ టీమ్ ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తోంది.1
- * Delhi: * ఢిల్లీలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (India AI Impact Summit 2026) అట్టహాసంగా ప్రారంభమైంది. * ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ జియో ఇంటెలిజెన్స్ పెవిలియన్‌ను సందర్శించారు. * ఇక్కడ జియో ఏఐ స్టాక్, జియో సంస్కృతి ఏఐ, జియో ఆరోగ్యం ఏఐ, జియో శిక్షా, జియో ఏఐ హోమ్ వంటి వివిధ ఏఐ మోడల్స్ వీక్షించారు. * జియో ఏఐ మోడల్స్ అన్నీ కూడా ఎంటర్‌ప్రైజ్ ఇంటెలిజెన్స్‌ను నడిపించడానికి, భారతీయ భాషలు & సాంస్కృతిక కంటెంట్‌ను ప్రోత్సహించడానికి, ఆరోగ్య సంరక్షణ డెలివరీని మెరుగుపరచడానికి, విద్యా వ్యవస్థలను బలోపేతం చేయడానికి & ఏఐ బేస్డ్ స్మార్ట్ లివింగ్‌ను ప్రారంభించడానికి ప్రత్యేకంగా రూపొందించారు.1
- గుంటూరు లోని అంజుమన్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే పోరాటం తప్పదు ముస్లిం న్యాయవాదులు...1
- కృష్ణాజిల్లా :మచిలీపట్నం * *మచిలీపట్నంలో బార్ ఏర్పాటు నిబంధనల ప్రకారమే ఏర్పాటు చేస్తున్నాం. నిర్వాహకులు*.. మచిలీపట్నం నగరంలో ప్రధాన రహదారి, జిల్లా పరిషత్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేయునున్న బార్‌పై స్థానికులు ,హైనిచర్చి సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయడంపై బార్ నిర్వాహకులు లింగం ఆనంద్ ఆదివారం విలేఖరుల సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బార్ ఏర్పాట్లు పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే జరుగుతున్నాయని స్పష్టం చేశారు. ఎక్సైజ్ శాఖ మార్గదర్శకాల మేరకు అన్ని నిబంధనల ప్రకారమే ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. గతంలో కూడా ఇదే ప్రదేశంలో బార్ వ్యాపారం సాగిందని గుర్తుచేశారు. అయితే,స్థానికులు హైనీ చర్చి సభ్యులు బార్ ఏర్పాటు పై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. కొందరి ప్రోద్బలంతో ఈ కార్యక్రమం చేపట్టారని ఆయన ఆరోపించారు.1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణం గాంధీనగర్‌కు 44 వ డివిజన్ కు చెందిన దొమ్మాటి పద్మ అనే నీరు పేద మహిళ భర్త చనిపోయి 5 సంవత్సరాలు గడుస్తున్నా వితంతు పింఛన్ రావడం లేదు సదరు మహిళకు పింఛన్ కోసం గతం లో కూడ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక పాల్వంచ మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వితంతు పింఛన్ మంజూరు చెయ్యాలని కోరటం జరిగినది కానీ పింఛన్ మంజూరు కాకపోవడం బాధాకరమని పొనిశెట్టి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతు దొమ్మాటి పద్మ గారి భర్త దొమ్మాటి మొగిలయ్య గారు 29-12-2020 తేదీన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని, ఆ వెంటనే ఆమె పాల్వంచ మున్సిపల్ కార్యాలయంలో వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ, ఇప్పటివరకు పింఛన్ మంజూరు కాలేదని అన్నారు.ప్రస్తుతం ఆమె తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతుందని,ఆమెకు ఒక్క కుమార్తె ఉందని ఆమె కూలి పనులు చేస్తూ తల్లిని పోషిస్తోందని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం మానవీయ దృక్పథంతో స్పందించి, అర్హత ఉన్న వితంతు మహిళ దొమ్మాటి పద్మ కు తక్షణమే పింఛన్ మంజూరు చేయాలని కోరారు.జిల్లా కలెక్టర్ మరియు సంబంధిత అధికారులు ఈ అంశాన్ని సానుకూలంగా పరిశీలించి, బాధిత మహిళకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.3
- Post by ఉంగరాల కార్తీక్1
- పల్నాడు జిల్లా: చిలకలూరిపేట ఎన్టీఆర్ నగర్‌లోని టిడ్కో గృహ సముదాయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య గతంలోనే మరణించగా, పిల్లలు హైదరాబాద్‌లో ఉంటున్నారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, ఆ మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1
- *గుంటూరు...కమిషనర్ గారు జరా చూడండి సారు.... దయచేసి వీధి దీపాలు వెలిగేలా చేయండి... స్థానికుల ఆవేదనను దయచేసి అర్ధం చేసుకోండి* 26వ డివిజన్ పరిధిలోని చౌడవరం శివారు జూనం చుండూరులో వెలగని వీధి దీపాలు.... *వీధి దీపాలు వెలగవు... పట్టించుకొనే నాథుడే లేడు....గత రెండు రోజులుగా వెలగని వీధి దీపాల దుస్థితి ...* సాక్షాత్తు శివరాత్రి పండుగ రోజు నుంచి నేటికీ వీధి దీపాలు వెలగక ఇబ్బందులు పడుతున్న స్థానికులు ... దీనికి తోడు వీధికుక్కలు చీకటిలో వెంటబడటంతోబేంబేలెత్తుతున్న స్థానికులు వేలకు వేలు ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకొనే మునిసిపల్ సిబ్బంది మాత్రం ముఖం చాటేసి కన్నెత్తి చూడని వైనం... గుంటూరు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 26వ డివిజన్ చౌడవరం గ్రామ శివారు జూనం చుండూరులో నెలకొన్న దుస్థితి... గత 5సం. ల పాలనలో ఇదే దుస్థితి ఏర్పడితే పట్టించుకోకుండా వదిలేసిన పరిస్థితి నుంచి కొద్దో గొప్పో వీధి దీపాలు వెలిగించుకొనే పరిస్థితికి గత మునిసిపల్ కమిషనర్ కల్పించారనే సంతోషంలో స్థానికులు ఉండగా.... గత రెండు దినాలుగా వీధి దీపాలు వెలగక గాఢాoధకారంలో బిక్కుబిక్కు మంటూ గ్రామస్తులు కాలం వెళ్ళదీస్తున్నారు... మునిసిపల్ అధికారులు మాత్రం వీధి దీపాలా కోసం బొలేడు ఖర్చులు వ్రాసుకోవడం అన్నవాయితీగా మారిపోయిందనే తీవ్ర ఆరోపణలు వెళువెత్తుతున్నాయి... స్థానిక శాసన సభ్యులు సైతం పలుమార్లు దీనిపై పలుమార్లు హెచ్చరించిన కానీ నేటికీ తీరు మార్చుకొని మునిసిపల్ అధికారులు, సిబ్బంది .. ఇప్పటికైనా మునిసిపల్ కమిషనర్ మయూర్ అశోక్ గారు విలీన గ్రామాలలో మౌలిక వసతులపై కనీస దృష్టి పెట్టాలని స్థానికులు వేడుకొంటున్నారు...1
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం మందెరికలపాడు, సత్యనారాయణపురం, సారెకల్లు, కారెకట్టు, ప్రభాత్ నగర్, ఉలవనూరు, రేగుల గూడెం తదితర ప్రాంతాలలో పోడు సాగుదారుల సమస్యపై సిపిఐ జిల్లా కార్యదర్శి *కామ్రేడ్ ఎస్కే సాబీర్ పాషా* నాయకత్వంలో పాయకారి యానం బైలు,శాతకొండ రేంజ్ పరిధి వైల్డ్ లైఫ్. ఫారెస్ట్ డివిజనల్ అధికారి (ఎఫ్ డి ఓ) గారిని కలిసి ఫారెస్ట్ అధికారులు. పోడు సాగుదారులను చీటికిమాటికి ఇబ్బందులకు గురి చేయవద్దని 2023 లో సర్వే చేసిన భూములలో ట్రెంచ్ కొట్టడానికి ప్రయత్నించొద్దని గిరిజన, గిరిజనేతర పేదలు గత 30, 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములను లాక్కోవడానికి ప్రయత్నించొద్దని ఎఫ్డిఓ బాబుని కోరారు.తరువాత పోడు సాగుదారులతో మాట్లాడుతూ కొత్తగా పోడు నరకవద్దని పాత భూములు సాగు చేసుకోవాలని కొత్తగా పోడు నరికితే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నందున 2023 కంటే ముందు ఉన్నటువంటి పోడు భూములు సాగు చేసుకోవడం మంచిదని తెలిపారు.3