Shuru
Apke Nagar Ki App…
రేణుక ఎల్లమ్మ తల్లి ఉత్సవ విగ్రహానికి స్వాగతం పలుకుతూ పూజా కార్యక్రమాలు మండేపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 18,19వ తేదీల్లో నిర్వహించనున్న శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహర్షిల కళ్యాణం మహోత్సవంలో సిద్ధోగం లో భాగంగా శ్రీ ఎల్లమ్మ తల్లి వారి ఉత్సవ విగ్రహం మరియు గడపవనం మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి ఇంటికి రాగా వారు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఉత్సవ విగ్రహానికి ఘన స్వాగతం పలుకుతూ వారి ఇంట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, ముదిరాజ్ సంఘం సిరిసిల్ల అధ్యక్షులు వంకాయల కార్తీక్ గారు, మండపల్లి గ్రామం పెద్దలు బండి భూమయ్య, గుర్రపు మల్లేశం, వెంకట నరసయ్య మొదలగు వారు పాల్గొన్నారు.
Satheesh gangu
రేణుక ఎల్లమ్మ తల్లి ఉత్సవ విగ్రహానికి స్వాగతం పలుకుతూ పూజా కార్యక్రమాలు మండేపల్లి గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 18,19వ తేదీల్లో నిర్వహించనున్న శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహర్షిల కళ్యాణం మహోత్సవంలో సిద్ధోగం లో భాగంగా శ్రీ ఎల్లమ్మ తల్లి వారి ఉత్సవ విగ్రహం మరియు గడపవనం మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి ఇంటికి రాగా వారు శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఉత్సవ విగ్రహానికి ఘన స్వాగతం పలుకుతూ వారి ఇంట్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు జిందం చక్రపాణి, ముదిరాజ్ సంఘం సిరిసిల్ల అధ్యక్షులు వంకాయల కార్తీక్ గారు, మండపల్లి గ్రామం పెద్దలు బండి భూమయ్య, గుర్రపు మల్లేశం, వెంకట నరసయ్య మొదలగు వారు పాల్గొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- పత్రిక ప్రకటన తేది :13. 04.2026 కామారెడ్డి జిల్లా సోమవారం Arrive Alive” అవగాహన కార్యక్రమాలకు శ్రీకారం ఏప్రిల్ 13 నుంచి కామారెడ్డి జిల్లాలో విస్తృత కార్యక్రమాలు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా జిల్లా వ్యాప్తంగా రహదారి భద్రతపై అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు. పోలీస్, రవాణా, ఆర్ & బి, విద్య, వైద్య శాఖల సమన్వయంతో “Arrive Alive” ఇతివృత్తంతో ఏప్రిల్ 13 నుండి 18 వరకు విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగవాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం కలెక్టర్ చాంబర్ లో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారి భద్రతపై ప్రజల్లో చైతన్యం కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రణాళికలో భాగంగా చేపట్టే అన్ని కార్యక్రమాలను సమర్థవంతంగా, విజయవంతంగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పాదచారులు, వాహనదారులకు రహదారి భద్రతపై క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించే విధంగా కార్యక్రమాలను రూపొందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి సంబంధిత శాఖల అధికారులు తమ పూర్తి శక్తి సామర్థ్యాలతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.1
- సహారా ఇండియా సంస్థలో డిపాజిట్ చేసిన ఖాతాదారులు తమ డబ్బులు ఇప్పించాలని ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కథలాపూర్, రాయికల్, కొడిమ్యాల, గొల్లపెల్లి, జగిత్యాల మండలాల నుంచి వచ్చిన బాధితులు కాలపరిమితి పూర్తై ఏళ్లైనా డబ్బులు రాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. సీఆర్‌సీఎస్ పోర్టల్ ద్వారా కొంతమందికే చెల్లింపులు జరిగాయని పేర్కొన్నారు. కట్ ఆఫ్ తేదీ తొలగించి అందరికీ డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.1
- కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పనితీరు దోచుకో, దాచుకో అనే విధంగా ఉందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఘాటుగా స్పందించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో మీడియాతో మాట్లాడిన మంత్రి అడ్లూరి, దోచుకో దాచుకో నైజం కాంగ్రెస్ ది కాదని దానికి కేరాఫ్ అడ్రస్ బిఆర్ఎస్ దేనని విమర్శించారు. చేసిన ఆరోపణ పై కేటీఆర్ కు దమ్ముంటే కేంద్రంలోని ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణ జరిపించుకోవచ్చని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ను విమర్శించే ముందు సోదరి కవితక్క ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక, ఓటమి భయంతో కేటీఆర్ ఏదిపడితే ఆది మాట్లాడుతున్నారని ఆరోపించారు. మళ్ళీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారని మంత్రి అన్నారు.1
- *పదవ తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్* నిజామాబాద్, ఏప్రిల్ 13 : ఆర్మూర్ పట్టణంలోని రాంమందిర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలతో పాటు మామిడిపల్లిలో గల సెయింట్ పాల్స్ హైస్కూల్ లో కొనసాగుతున్న పదవ తరగతి పరీక్షా కేంద్రాలను కలెక్టర్ ఇలా త్రిపాఠి సోమవారం తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును, అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. విద్యార్థులు హాజరు గురించి ఆరా తీయగా, రెండు కేంద్రాలలోనూ పూర్తి స్థాయిలో హాజరు అయ్యారని నిర్వాహకులు తెలిపారు. నిబంధనలకు అనుగుణంగానే నిర్ణీత సమయంలో ప్రశ్న పత్రాలను తెరిచారా? స్ట్రాంగ్ రూం నుండి ఎన్ని గంటలకు ప్రశ్న పత్రాలు కేంద్రానికి చేరుకున్నాయి, ఆ సమయంలో పోలీస్ ఎస్కార్ట్ ఉందా? తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి వసతి, ప్రథమ చికిత్స అందుబాటులో ఉందా? లేదా? అని గమనించారు. కలెక్టర్ వెంట స్థానిక తహసిల్దార్ సత్యనారాయణ ఉన్నారు. --------------------------1
- డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలు చిరస్మరణీయం. మాజీ డిప్యూటీ స్పీకర్ యం.పద్మ దేవేందర్ రెడ్డి..మెదక్ టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ చేసిన సేవలు చిరస్మరణీయమని మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు.భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మెదక్ జిల్లా కేంద్రంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం పార్టీ శ్రేణులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ, దేశంలోని అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించిన ఘనత అంబేద్కర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం ఆయన చేసిన పోరాటం అపారమని కొనియాడారు. దేశ స్వపరిపాలనకు ఆదర్శంగా నిలిచేలా రాజ్యాంగాన్ని రూపొందించిన దూరదృష్టి గల నాయకుడని తెలిపారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యమైందని గుర్తుచేశారు. కేసీఆర్ నాయకత్వంలో అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిస్తూ తెలంగాణ సచివాలయానికి ఆయన పేరు పెట్టడంతో పాటు, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. భవిష్యత్తులో బీఆర్‌ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.అంబేద్కర్ ఆశయాలతో నవ సమాజ నిర్మాణానికి కృషి కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అకిరెడ్డి.కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు,న్యాయవాది జీవన్ రావు, మున్సిపల్ కౌన్సిలర్లు దీపక్ కుమార్,సంధ్య నవీన్, ఉదయ్ కుమార్,గౌస్,సోహెల్, జుబేర్ అహ్మద్, మహిళా నాయకురాలు అంకం.చంద్రకళ రాధ,నాయకులు, కిష్ట గౌడ్, అంజ గౌడ్, కిష్టయ్య, విశ్వం,లింగా రెడ్డి, ప్రభు రెడ్డి,కిషన్, మాయ. మల్లేశం, ఆర్కే శ్రీనివాస్, ఏనుగుల రాజు, సునీల్,రవి లక్ష్మీనారాయణ,దశరథం,ఇందాడ్,సంతోష్ ,వెంకట్,ఆంజనేయులు,ప్రభాకర్ ,లక్ష్మణ్,కిషన్,మోహన్,ఇస్మాయిల్, రవి తదితరులు పాల్గొన్నారు.1
- అంబేద్కర్ జయంతి ని పురస్కరించుకొని మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం మెదక్ మున్సిపల్ చైర్మన్ రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్ తో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, కౌన్సిలర్స్ మన్సూర్, తొడుపునూరి రామకృష్ణ, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.1
- నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కోఆప్షన్ సభ్యులను బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆశీర్వాదంతో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన కో ఆప్షన్ అభ్యర్థులు నంది శంకర్ , సయ్యద్ సోహెల్, సయ్యద్ తస్లీమ్, కొండ అనూష శ్రీనివాస్ ల ఎన్నికకు సహకరించిన కౌన్సిలర్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సిరిసిల్ల అభివృద్ధిలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులుగా కోఆప్షన్ సభ్యులు వారి సూచనలు సలహాలను అందిస్తూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి, వైస్ చైర్మన్ దార్ల సందీప్ కౌన్సిలర్ సభ్యులు మరియు పార్టీ నాయకులు పాల్గొని నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కోఆప్షన్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.1
- పత్రిక ప్రకటన తేదీ: 13-04-2026 కామారెడ్డి జిల్లా సోమవారం టీఎన్‌జీఓస్ (TNGOs) సంఘం ఆధ్వర్యంలో, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో కలెక్టరేట్ ప్రాంగణంలో అంబలి పంపిణీ కేంద్రం, చలివేంద్రం ఏర్పాటు చేయబడింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతీ సోమవారం ప్రజావాణి సందర్బంగా కలెక్టరేట్ కు వచ్చే ప్రజల కోసం ఏర్పాటు చేయడం, అలాగే రోజు వారిగా ప్రజలు కార్యాలయాలకు వివిధ పనుల కోసం వచ్చే వారి కోసం చలి వేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వేసవి కాలంలో ప్రజలు అధికంగా నీరు, ద్రవపదార్థాలు తీసుకోవడం చాలా అవసరమని, ఈ తరహా సేవా కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగకరమని తెలిపారు. టీఎన్‌జీఓస్ సభ్యులు చేపట్టిన ఈ చర్య అభినందనీయమని కొనియాడారు. ప్రజలకు ఉచితంగా అంబలి తాగునీరు అందించారు. ఈ కార్యక్రమం వేసవి కాలమంతా కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఇట్టి చలివేంద్రం అంబలి కేంద్రం ఏర్పాటు చేయడానికి ప్రోత్సహిస్తున్న జిల్లా కలెక్టర్ అధికారులకు TNGO s కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో.. జిల్లా అధ్యక్షులు నరాల వెంకట్ రెడ్డి.. కార్యదర్శి ఎం నాగరాజు.. సహాధ్యక్షులు ఎం చక్రధర్.. కోశాధికారి ఎం దేవరాజు.. ఉపాధ్యక్షులు రాజ్య లక్ష్మి .. జాయింట్ సెక్రెటరీలు రమణ కుమార్, రాజమణి .. ఆర్గనైజింగ్ సెక్రటరీ సంతోష్ కుమార్.. కల్చరల్ సెక్రెటరీ రాజ్ కుమార్.. ఈసీ మెంబర్ శ్రీకాంత్ మరియు సాయినాథ్.. కామారెడ్డి అర్బన్ తాలూకా కార్యవర్గ సభ్యులు.. ఉపాధ్యక్షులు ఎం కిషన్.. మరియు సమీకృత జిల్లా కార్యాలయపు ఉద్యోగులు పాల్గొన్నారు...1
- *శివసాయి మల్టీ స్పెషలిటీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం విజయవంతం* -ఉచిత శిబిరంలో సుమారు 350 మందికి పరీక్షలు, మందులు పంపిణీ, * ఉచిత మెగా హెల్త్ క్యాంపు కు విశేష స్పందన గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్న వైద్య శిభిరాలను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని గ్రామ సర్పంచ్ బాదావత్ మోతిలాల్ అన్నారు. ఆదివారం భీమ్‌గల్ శ్రీ శివ సాయి మల్టీ స్పెషాలిటీ అలాగే పిల్లల హాస్పిటల్ మేనేజ్మెంట్ డైరెక్టర్ సాయికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని కారేపల్లి గ్రామంలో గ్రామ సర్పంచ్ పాలకవర్గం గ్రామస్తుల కోరిక మేరకు ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. శివ సాయి ఆసుపత్రి ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆరో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 27వ ఉచిత మెగా హెల్త్ క్యాంప్ ను కారేపల్లి గ్రామంలో నిర్వహించడం జరిగింది.ఈ మెగా క్యాంప్ ముఖ్యఅతిథిగా విచ్చేసిన ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్, మాట్లాడుతూ, ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున జరపాలని జరపడానికి తన వంతు కృషి కూడా చేస్తానని అన్నారు.ఈ సందర్భంగా ఆసుపత్రి మేనేజ్మెంట్ డైరెక్టర్ సాయికుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఆసుపత్రి ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆరో సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా 27వ హెల్త్ మెగా క్యాంపును కారేపల్లి గ్రామంలో గ్రామస్తుల కోరిక మేరకు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. గ్రామస్తులు ఆర్మూర్, నిజామాబాద్ వెళ్లకుండా మా ఆస్పత్రికి వస్తున్న గ్రామ గ్రామస్తులకు అన్ని విధాలుగా పరీక్షలు చేయడంతో నమ్మకంతో వైద్య పరీక్షలు చేయించుకుంటారని అన్నారు. ఉచిత మెగా హెల్త్ క్యాంపులో సుమారు 200, మంది పెద్దవారికి 150,మంది పిల్లలకు వైద్య పరీక్షలు అలాగే ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగిందని అన్నారు.భీమ్‌గల్ మండలంలోని ప్రతి గ్రామంలో మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించి ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం కలుగుతుంధన్నారు, ఇలాంటి క్యాంప్ ద్వారా చిన్నచిన్న సమస్యలను పరిష్కరించ వచ్చు పెద్ద సమస్య ఎదురైతే దానికి తగ్గట్టుగా పెద్ద లెవెల్లో కూడా హెల్ప్ చేయడానికి వీలవుతుందని అన్నారు. ఆర్థిక సహాయం ఎంత చేసినా కలగని ఆనందం పదిమంది ఆరోగ్యాన్ని ఇచ్చినప్పుడు మంచి గుర్తింపు ఉంటుందని అన్నారు. అలాగే డాక్టర్ లు ప్రజాసేవ చేయాలనే ఆలోచన కలగడం ఆనందంగా ఉందని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా పెద్ద ఎత్తున జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ లు జి. సూర్యనారాయణ ఎండి. ఎంఎస్. జర్నల్ సర్జరి& ఫిజీషియన్, డాక్టర్ వి.జైపాల్ ఎంబిబిఎస్ డిఎన్బి చిన్నపిల్లల, కే.హైందవి, ఎం ఎస్. ఓబిజి గర్భిణీ స్త్రీ లకు సేవలందిస్తున్న వైద్యురాలు, ఉప సర్పంచ్ ధరావత్ రాజేష్ నాయక్, మాజీ ఎంపీటీసీ గోవింద్ నాయక్, మాజీ సర్పంచ్ వాసు, గ్రామ శాఖ అధ్యక్షులు గంగాధర్, రమేష్, ఆసుపత్రి సిబ్బంది షాబుద్దీన్, ప్రకాష్, రాజు, అలం, అదనాన్, రమ్య,నందిని, మౌనిక, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆలయ, గ్రామ, కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.3