Shuru
Apke Nagar Ki App…
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 విధానాన్ని హిందూ రిలీజియస్ & ఛారిటబుల్ ఎండోమెంట్స్ తో అనుసంధానం చేసి ఆ రెండూ కలిపి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖగా చేయవలసిందని నేడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో మన ప్రియతమ నాయకురాలు విజయనగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతి రాజు పూసపాటి కోరడం జరిగింది.
Giridhar singh
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 విధానాన్ని హిందూ రిలీజియస్ & ఛారిటబుల్ ఎండోమెంట్స్ తో అనుసంధానం చేసి ఆ రెండూ కలిపి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖగా చేయవలసిందని నేడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో మన ప్రియతమ నాయకురాలు విజయనగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతి రాజు పూసపాటి కోరడం జరిగింది.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- గిరిజన గ్రామాలపై పాలకుల నిర్లక్ష్యం.. నిధులు కాగితాలకే పరిమితమా? అసంపూర్తి రహదారులతో గిరిజనులకు తప్పని ‘డోలీ మోత’ కష్టాలు ఐదు కోట్లు మంజూరైనా కదలని ఫైళ్లు కొమరాడ మండలంలో సీపీఎం ఆగ్రహం గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై పాలకులు చేస్తున్న ప్రగల్భాలు క్షేత్రస్థాయిలో నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. నిధులు మంజూరయ్యాయని ప్రకటనలు వస్తున్నా, పనులు మాత్రం ప్రారంభానికి నోచుకోకపోవడంతో గిరిజన గ్రామాల ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ముఖ్యంగా కొమరాడ మండలం, పాడెకల్గ పంచాయతీలోని సి.శాడవలస నుండి సంకేసు మీదుగా నయా గ్రామం వరకు ఉన్న రహదారి పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ రహదారి నిర్మాణానికి నిధులు కేటాయించి, కేవలం మెటల్ రాళ్లు వేసి మధ్యలోనే వదిలేశారు. దీనివల్ల రహదారి మరింత ప్రమాదకరంగా మారిందని, అప్పట్లో ఖర్చు చేసిన ప్రజా ధనం ఎవరి జేబుల్లోకి వెళ్లిందని సీపీఎం నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఆ పనులకు ఎంత ఖర్చు చేశారు? ఎందుకు అసంపూర్తిగా వదిలేశారు? అనే అంశాలపై తక్షణమే విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, నయా పంచాయతీ పరిధిలోని గిరిజన గ్రామాల రహదారులకు 5 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని కూటమి నాయకులు ఆర్భాటంగా పత్రికా ప్రకటనలు ఇచ్చారు. అయితే నెల రోజులు గడుస్తున్నా.. ఐటీడీఏ లేదా పంచాయతీరాజ్ అధికారులు ఎందుకు పనులు ప్రారంభించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఒకవైపు నిధులు విడుదలయ్యాయని చెబుతూనే, మరోవైపు అటవీ శాఖ అనుమతులు లేవని సాకులు చెప్పడం గిరిజనులను మోసం చేయడమేనని స్థానికులు మండిపడుతున్నారు. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, అటవీ శాఖ మంత్రితో మాట్లాడి క్లియరెన్స్ ఎందుకు తీసుకురావడం లేదని సీపీఎం నాయకులు నిలదీశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల గర్భిణులు, రోగులను ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే ఇప్పటికీ 'డోలీ మోతలే' గతిగా మారడం సిగ్గుచేటని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.గత ప్రభుత్వంలో జరిగిన రహదారి పనుల ఖర్చుపై వెంటనే విచారణ జరిపించాలి. ప్రస్తుత 5 కోట్ల రూపాయల నిధులతో పనులను తక్షణమే ప్రారంభించాలి. అటవీ శాఖ అధికారులతో మాట్లాడి అనుమతులు సాధించి, యుద్ధ ప్రాతిపదికన రహదారి పూర్తి చేయాలి. వెంటనే అధికారులు స్పందించి రహదారి సౌకర్యం కల్పించకపోతే, నయా పంచాయతీ పరిధిలోని గిరిజన ప్రజలతో కలిసి పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద భారీ ఎత్తున ఆందోళన చేస్తామని సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేశారు.1
- గత 4 సంవత్సరాలుగా మమ్మల్ని నమ్మినందుకు విజయనగరంలోని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ దంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కొనసాగించాలని మేము ఎదురుచూస్తున్నాము. Thank you to everyone in Vizianagaram for trusting us over the past 4 years. We look forward to continuing to care for your dental health. Dr. Kiran Vungarala, ఎత్తు వంకర పళ్ళు చికిత్స నిపుణులు Dr. Priyanka Majji, చిగుళ్ల చికిత్స మరియు దంత ఇంప్లాంట్లు నిపుణులు Kiran Dental Clinic, Vizianagaram1
- నరసన్నపేట: నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శుక్రవారం శాసనసభలో జీరో అవర్లో మాట్లాడుతూ, తన నియోజకవర్గ పరిధిలోని 25 ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయని, వాటిలో 14 అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని తెలిపారు. ఈ పాఠశాలల నిర్మాణాలను త్వరితగతిన పునర్నిర్మించాలని విద్యాశాఖ మంత్రికి నివేదిక సమర్పించి, సభలో విన్నవించారు.1
- విద్యుత్ వైర్లకు JCB తగలడంతో మంటలు వ్యాపించి డ్రైవర్ అక్కడికక్కడే సజీవ దహనమైన ఘటన చింతపల్లి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని చెరువూరులో జరుగుతున్న వంతెన నిర్మాణ పనులకు విశాఖకి చెందిన శ్రీనివాసరాజు JCBని తీసుకువెళ్తుండగా ఇటుక దిబ్బలు గ్రామానికి వచ్చేసరికి విద్యుత్ వైర్లకు JCB తగిలి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో డ్రైవర్ శ్రీనివాసరాజుకు మంటలు అంటుకొని సజీవదహనం అయ్యారు.1
- మన్యం జిల్లా పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో యోగివేమన జయంతి ఘనంగా జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాసరి నాగభూషణం గారు యోగివేమన చిత్రపటానికి పుష్పమాలను తో అలంకరించారు. సంస్కృత పండితులు బౌరోతు శంకర రావు మాట్లాడుతూ 17వ శతాబ్దానికి చెందిన యోగివేమన చెప్పిన పద్యాలు అక్షర సత్యాలు. విశ్వ మానవాళికి వేమన చెప్పిన పద్యాలు వేదాలతో సమానము. వాడుకు భాషలో అందరి కి అర్థమయ్యే రీతిలో పద్యాలు చెప్పారు. వేమన శతకంలో కొన్ని పద్యాలు మాత్రమే మనకు ఎరుక . వేమన స్ఫూర్తితో శంకర శతకాన్ని రచించానని 2025 జూన్ నెల నుండి ఫిబ్రవరి 19వ తారీఖు వరకు శంకర శతక పద్యాలు ప్రార్థనలో రోజుకు ఒక పద్యాన్ని విద్యార్థులతో చదివించ దానికి అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగు ఉపాధ్యాయులు వేమన గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు1
- ఫిబ్రవరి 20 శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం మర్రిపాడు పంచాయతీ జామి ఎల్లమ్మ దేవాలయంలో శుక్రవారం భక్తులు ప్రత్యేక విశేష పూజలు నిర్వహించారు కుంకుమపువ్వు నిర్వహించారు అలాగే ఫిబ్రవరి నెల 24 25 26 తేదీల్లో జామి ఎల్లమ్మ యాత్ర నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వచ్చిన భక్తులందరికి తీర్ధ ప్రసాదాలు పంచిపెట్టారు.2
- ఆలయానికి రూ.2 లక్షల విరాళం: ఎమ్మెల్యే ఎంజీఆర్.... పాతపట్నం ఆల్ ఆంధ్ర రోడ్డులో నిర్మించిన శ్రీలక్ష్మీగణపతి, జ్ఞాన సరస్వతిదేవి, అభయాంజనేయస్వామి ఆలయాలకు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు రూ.2 లక్షల విరా ళం శుక్రవారం అందజేశారు. నూతనంగా నిర్మిం చిన ఆలయంలో అభయాంజనేయ విగ్రహ ప్రతిష్టో త్సవానికి ఆయన హాజరై ఆలయ కమిటీ ప్రతినిధు లకు ఆ మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంజిఆర్ స్వామివారి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల ఆధ్యాత్మికాభివృద్ధి కోసం నిర్మించిన ఈ ఆలయం భక్తులకు శాశ్వత ఆధ్యా త్మిక క్షేత్రంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రజల ఆధ్యాత్మిక, సామాజిక అభివృద్ధి కోసం తాను ఎల్ల ప్పుడూ కట్టుబడి ఉంటానన్నారు. నియోజకవర్గంలో దేవాలయాల నిర్మాణం ఎక్కడ జరిగిన తన వం తుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నానని ఎంజీఆర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.2
- గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 విధానాన్ని హిందూ రిలీజియస్ & ఛారిటబుల్ ఎండోమెంట్స్ తో అనుసంధానం చేసి ఆ రెండూ కలిపి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖగా చేయవలసిందని నేడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో మన ప్రియతమ నాయకురాలు విజయనగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతి రాజు పూసపాటి కోరడం జరిగింది.1