Shuru
Apke Nagar Ki App…
శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను పునర్ నిర్మించండి నరసన్నపేట: నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శుక్రవారం శాసనసభలో జీరో అవర్లో మాట్లాడుతూ, తన నియోజకవర్గ పరిధిలోని 25 ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయని, వాటిలో 14 అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని తెలిపారు. ఈ పాఠశాలల నిర్మాణాలను త్వరితగతిన పునర్నిర్మించాలని విద్యాశాఖ మంత్రికి నివేదిక సమర్పించి, సభలో విన్నవించారు.
Dr.Gangu Manmadharao
శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను పునర్ నిర్మించండి నరసన్నపేట: నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శుక్రవారం శాసనసభలో జీరో అవర్లో మాట్లాడుతూ, తన నియోజకవర్గ పరిధిలోని 25 ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయని, వాటిలో 14 అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని తెలిపారు. ఈ పాఠశాలల నిర్మాణాలను త్వరితగతిన పునర్నిర్మించాలని విద్యాశాఖ మంత్రికి నివేదిక సమర్పించి, సభలో విన్నవించారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- నరసన్నపేట: నరసన్నపేట ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి శుక్రవారం శాసనసభలో జీరో అవర్లో మాట్లాడుతూ, తన నియోజకవర్గ పరిధిలోని 25 ప్రభుత్వ పాఠశాలలు శిథిలావస్థలో ఉన్నాయని, వాటిలో 14 అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని తెలిపారు. ఈ పాఠశాలల నిర్మాణాలను త్వరితగతిన పునర్నిర్మించాలని విద్యాశాఖ మంత్రికి నివేదిక సమర్పించి, సభలో విన్నవించారు.1
- మన్యం జిల్లా పాలకొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో యోగివేమన జయంతి ఘనంగా జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాసరి నాగభూషణం గారు యోగివేమన చిత్రపటానికి పుష్పమాలను తో అలంకరించారు. సంస్కృత పండితులు బౌరోతు శంకర రావు మాట్లాడుతూ 17వ శతాబ్దానికి చెందిన యోగివేమన చెప్పిన పద్యాలు అక్షర సత్యాలు. విశ్వ మానవాళికి వేమన చెప్పిన పద్యాలు వేదాలతో సమానము. వాడుకు భాషలో అందరి కి అర్థమయ్యే రీతిలో పద్యాలు చెప్పారు. వేమన శతకంలో కొన్ని పద్యాలు మాత్రమే మనకు ఎరుక . వేమన స్ఫూర్తితో శంకర శతకాన్ని రచించానని 2025 జూన్ నెల నుండి ఫిబ్రవరి 19వ తారీఖు వరకు శంకర శతక పద్యాలు ప్రార్థనలో రోజుకు ఒక పద్యాన్ని విద్యార్థులతో చదివించ దానికి అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులకి ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగు ఉపాధ్యాయులు వేమన గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు1
- ఫిబ్రవరి 20 శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాలి మండలం మర్రిపాడు పంచాయతీ జామి ఎల్లమ్మ దేవాలయంలో శుక్రవారం భక్తులు ప్రత్యేక విశేష పూజలు నిర్వహించారు కుంకుమపువ్వు నిర్వహించారు అలాగే ఫిబ్రవరి నెల 24 25 26 తేదీల్లో జామి ఎల్లమ్మ యాత్ర నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వచ్చిన భక్తులందరికి తీర్ధ ప్రసాదాలు పంచిపెట్టారు.2
- ఆలయానికి రూ.2 లక్షల విరాళం: ఎమ్మెల్యే ఎంజీఆర్.... పాతపట్నం ఆల్ ఆంధ్ర రోడ్డులో నిర్మించిన శ్రీలక్ష్మీగణపతి, జ్ఞాన సరస్వతిదేవి, అభయాంజనేయస్వామి ఆలయాలకు ఎమ్మెల్యే మామిడి గోవిందరావు రూ.2 లక్షల విరా ళం శుక్రవారం అందజేశారు. నూతనంగా నిర్మిం చిన ఆలయంలో అభయాంజనేయ విగ్రహ ప్రతిష్టో త్సవానికి ఆయన హాజరై ఆలయ కమిటీ ప్రతినిధు లకు ఆ మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎంజిఆర్ స్వామివారి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజల ఆధ్యాత్మికాభివృద్ధి కోసం నిర్మించిన ఈ ఆలయం భక్తులకు శాశ్వత ఆధ్యా త్మిక క్షేత్రంగా నిలవాలని ఆకాంక్షించారు. ప్రజల ఆధ్యాత్మిక, సామాజిక అభివృద్ధి కోసం తాను ఎల్ల ప్పుడూ కట్టుబడి ఉంటానన్నారు. నియోజకవర్గంలో దేవాలయాల నిర్మాణం ఎక్కడ జరిగిన తన వం తుగా ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నానని ఎంజీఆర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.2
- గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 విధానాన్ని హిందూ రిలీజియస్ & ఛారిటబుల్ ఎండోమెంట్స్ తో అనుసంధానం చేసి ఆ రెండూ కలిపి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖగా చేయవలసిందని నేడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో మన ప్రియతమ నాయకురాలు విజయనగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతి రాజు పూసపాటి కోరడం జరిగింది.1
- గత 4 సంవత్సరాలుగా మమ్మల్ని నమ్మినందుకు విజయనగరంలోని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. మీ దంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం కొనసాగించాలని మేము ఎదురుచూస్తున్నాము. Thank you to everyone in Vizianagaram for trusting us over the past 4 years. We look forward to continuing to care for your dental health. Dr. Kiran Vungarala, ఎత్తు వంకర పళ్ళు చికిత్స నిపుణులు Dr. Priyanka Majji, చిగుళ్ల చికిత్స మరియు దంత ఇంప్లాంట్లు నిపుణులు Kiran Dental Clinic, Vizianagaram1
- విద్యుత్ వైర్లకు JCB తగలడంతో మంటలు వ్యాపించి డ్రైవర్ అక్కడికక్కడే సజీవ దహనమైన ఘటన చింతపల్లి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని చెరువూరులో జరుగుతున్న వంతెన నిర్మాణ పనులకు విశాఖకి చెందిన శ్రీనివాసరాజు JCBని తీసుకువెళ్తుండగా ఇటుక దిబ్బలు గ్రామానికి వచ్చేసరికి విద్యుత్ వైర్లకు JCB తగిలి మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో డ్రైవర్ శ్రీనివాసరాజుకు మంటలు అంటుకొని సజీవదహనం అయ్యారు.1
- నరసన్నపేట: బాలికలపై లైంగిక వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో, వాటి నివారణకు చట్టాలున్నాయని ప్రైవేట్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. శుక్రవారం నరసన్నపేట మండలం పోతయ్య వలస ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రమణమూర్తి పాల్గొన్నారు.1