Shuru
Apke Nagar Ki App…
గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పట్ల అవగాహన పరచుకోండి నరసన్నపేట: బాలికలపై లైంగిక వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో, వాటి నివారణకు చట్టాలున్నాయని ప్రైవేట్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. శుక్రవారం నరసన్నపేట మండలం పోతయ్య వలస ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రమణమూర్తి పాల్గొన్నారు.
Dr.Gangu Manmadharao
గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పట్ల అవగాహన పరచుకోండి నరసన్నపేట: బాలికలపై లైంగిక వేధింపులు పెరుగుతున్న నేపథ్యంలో, వాటి నివారణకు చట్టాలున్నాయని ప్రైవేట్ ట్రస్ట్ సభ్యులు తెలిపారు. శుక్రవారం నరసన్నపేట మండలం పోతయ్య వలస ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పించారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఫోక్సో చట్టం కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం రమణమూర్తి పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఫిబ్రవరి 19 టెక్కలి నియోజకవర్గం లో సనాతన ధర్మం హిందూ ధర్మ పరిరక్షణ సమితి టెక్కలి శాఖ ఆధ్వర్యంలో గురువారం ఛత్రపతి శివాజీ చిత్రపటంతో ఊరేగింపు నిర్వహించారు. టెక్కలి పురవీధుల్లో మేళతాళాలతో శోభాయాత్రని నిర్వహించారు. సనాతన ధర్మము హిందూ ధర్మము సాంప్రదాయ పరిరక్షణను కాపాడాలంటూ టెక్కలి విశ్వహిందూ పరిషత్తు సాంప్రదాయ సనాతన ధర్మ హిందూ సమ్మేళనం ఆధ్వర్యంలో వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు సందర్భంగా చత్రపతి శివాజీ ఛత్రపతి ఊరేగిస్తూ చత్రపతి శివాజీ భారతదేశంలో హిందూ ధర్మానికి స్థాపనకు చేసిన కృషిని కొనియాడారు ఈ ఊరేగింపు టెక్కలి స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ప్రారంభమై ఇందిరాగాంధీ కూడలి అంబేద్కర్ జంక్షన్ వరకు కూడా ఈ శోభాయాత్ర జరిగింది.3
- గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన P4 విధానాన్ని హిందూ రిలీజియస్ & ఛారిటబుల్ ఎండోమెంట్స్ తో అనుసంధానం చేసి ఆ రెండూ కలిపి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖగా చేయవలసిందని నేడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో మన ప్రియతమ నాయకురాలు విజయనగరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి అదితి విజయలక్ష్మి గజపతి రాజు పూసపాటి కోరడం జరిగింది.1
- వీఆర్‌పురం మండలం దుర్భలంక గ్రామంలో గురువారం పురిటి నొప్పులతో బాధ పడుతున్న లక్ష్మిని కుటుంబ సభ్యులు 15కి.మీ మంచంపై మోశారు. రోడ్డు సక్రమంగా లేక పోవడంతో అతి కష్టం మీద 108 వాహనం వద్దకు తీసుకొచ్చారు. రేఖపల్లి పీహెచ్‌సీకి తరలిస్తుండగా మార్గం మధ్యలో వాహనాన్ని నిలిపి పురుడు పోశామని 108 సిబ్బంది నవీన్, మోహన్ తెలిపారు. తల్లి, మగ బిడ్డలను వైద్య పరీక్షలు నిమిత్తం రేఖపల్లి PHCకి తరలించారు.1
- మూడు పూటలా అన్నం కోసం మీకు తోచిన సాయం చేసి ఆదుకోండి 🙏1
- Post by Srinivas Y1
- పక్షవాతంతో జీవితకాలం కాళ్లు చేతులు కాలిపోయిన ఈ నిరుపేద కుటుంబానికి మిగతా వచ్చిన సాయం చేసి ఆదుకోండి🙏1
- నరసన్నపేట: నరసన్నపేట పట్టణంలో కూర్మ ఆశ్రమ ఆధ్వర్యంలో విదేశీ యువకులు గురువారం సాయంత్రం చేపట్టిన హరినామ సంకీర్తన ర్యాలీ స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. మండల పరిషత్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ పాత బస్టాండ్, కొత్త బస్టాండు, కాంప్లెక్స్ మీదుగా పెద్దపేట వరకు కొనసాగింది. అనంతరం స్థానిక కళ్యాణ మండపంలో భగవద్గీత ప్రసంగం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.1
- దేవుడి నైవేద్యంతో ‘ధన’ రాజకీయం చంద్రబాబుపై బొత్స సత్యనారాయణ నిప్పులు, ఉదయ అక్షరం, పిబ్రవరి -19:తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘోరమైన అపచారానికి పాల్పడుతున్నారని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, బడ్జెట్‌లోని డొల్లతనాన్ని ఆధారాలతో సహా ఎండగట్టారు.గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ లబ్ధి కోసమేనని బొత్స విమర్శించారు. "సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిట్ విచారణ జరుగుతున్న వేళ, చంద్రబాబు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలని ఇప్పటికే తేలిపోయింది. తన రాజకీయ ఉనికి కోసం దేవుడి నైవేద్యాన్ని కూడా అపవిత్రం చేయడానికి ఆయన వెనుకాడటం లేదు" అని మండిపడ్డారు.చంద్రబాబు తన ‘ధనదాహం’ కోసం ప్రజాధనాన్ని ఏ విధంగా లూటీ చేస్తున్నారో బొత్స సత్యనారాయణ సంచలన గణాంకాలతో వివరించారు. గతంలో కిలో రూ. 320 కే లభించిన నాణ్యమైన నెయ్యిని పక్కన పెట్టి.. ఇప్పుడు చంద్రబాబు తన సొంత సంస్థ అయిన హెరిటేజ్ తో సంబంధాలున్న ‘ఇందాపూర్ డెయిరీ’ ద్వారా కిలో రూ. 700 కు సరఫరా చేయిస్తున్నారని ఆరోపించారు. ధరను అకస్మాత్తుగా రెట్టింపు చేయడం వెనుక ఉన్న అంతర్యం ఏమిటో, ఆ కమిషన్లు ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. "భక్తి ముసుగులో అవినీతి వ్యాపారం చేస్తున్నారు. రూ. 320 నుంచి రూ. 700 కు ధర పెరగడం వెనుక ఉన్న ‘సీక్రెట్’పై బహిరంగ చర్చకు సిద్ధమా?" అని కూటమి నేతలకు బొత్స సవాల్ విసిరారు.కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీ తప్ప మరేమీ లేదని ఆయన కొట్టిపారేశారు. సభలో వాస్తవాలు మాట్లాడితే ప్రభుత్వం బట్టబయలవుతుందనే భయంతోనే చర్చ నుంచి తప్పించుకుంటున్నారని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి, ఇప్పుడు బడ్జెట్‌లో కోతలు విధిస్తూ మోసం చేస్తున్నారని, దమ్ముంటే పూర్తిస్థాయి చర్చకు రావాలని బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు.1
- దేవీపట్నం మండలంలో ఆశ్రమ పాఠశాలను రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జి రెడ్డి పరిశీలించారు. గురువారం దామనపల్లి ఆశ్రమ స్కూల్, శరభవరం గిరిజన సంక్షేమ పాఠశాలను ఆయన పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న బోధన పద్ధుతులు, మధ్యాహ్న భోజన పథకం వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అవసరమైన వసతులు కల్పించాలని ఆయన సూచించారు. పాఠశాల రిజిస్టర్‌లు పరిశీలించారు.1