logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పాలేరు నీళ్లు నియోజకవర్గ రైతులకే చెందాలి: మాజీ ఎమ్మెల్యే కందాళ పాలేరు చెరువు నీటిపై మొదటి హక్కు పాలేరు నియోజకవర్గ రైతులదేనని మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి స్పష్టం చేశారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నప్పుడు నీరు ఇవ్వకపోయినా నిలబడి పోరాడామన్నారు. నియోజకవర్గ రైతుల సాగునీటి హక్కులకు ఎలాంటి భంగం కలగనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు.

1 hr ago
user_Kasani Venkatesh
Kasani Venkatesh
Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
1 hr ago
ba3b81bf-f166-4d4d-bd4f-0a88603228e8
099286fd-0a85-4f86-9340-2241740eeef9

పాలేరు నీళ్లు నియోజకవర్గ రైతులకే చెందాలి: మాజీ ఎమ్మెల్యే కందాళ పాలేరు చెరువు నీటిపై మొదటి హక్కు పాలేరు నియోజకవర్గ రైతులదేనని మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి స్పష్టం చేశారు. నేలకొండపల్లి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నప్పుడు నీరు ఇవ్వకపోయినా నిలబడి పోరాడామన్నారు. నియోజకవర్గ రైతుల సాగునీటి హక్కులకు ఎలాంటి భంగం కలగనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • వైరల్ వీడియో రేషన్ కార్డులపై సీఎం, మంత్రి ఫొటోలు మహిళ ఫైర్ స్మార్ట్ రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి, మంత్రి ఫొటోలు ముద్రించడంపై ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళ అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడైనా రేషన్ కార్డులపై మంత్రుల ఫొటోలు చూశామా అని ప్రశ్నిస్తూ, రేపు ప్రభుత్వం మారితే ఈ కార్డుల పరిస్థితి ఏంటని నిలదీశారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధాని అయితే కరెన్సీ నోట్లపైనా ఫొటోలు వేస్తారా అని ఆమె ప్రశ్నించిన వీడియో ప్రస్తుతం 'ఎక్స్' లో వైరల్ గా మారింది.
    1
    వైరల్ వీడియో రేషన్ కార్డులపై సీఎం, మంత్రి ఫొటోలు మహిళ ఫైర్
స్మార్ట్ రేషన్ కార్డులపై ముఖ్యమంత్రి, మంత్రి ఫొటోలు ముద్రించడంపై ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళ అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో ఎప్పుడైనా రేషన్ కార్డులపై మంత్రుల ఫొటోలు చూశామా అని ప్రశ్నిస్తూ, రేపు ప్రభుత్వం మారితే ఈ కార్డుల పరిస్థితి ఏంటని నిలదీశారు. రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధాని అయితే కరెన్సీ నోట్లపైనా ఫొటోలు వేస్తారా అని ఆమె ప్రశ్నించిన వీడియో ప్రస్తుతం 'ఎక్స్' లో వైరల్ గా మారింది.
    user_Kasani Venkatesh
    Kasani Venkatesh
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    3 hrs ago
  • తిరుమలాయపాలెం ఎం ర్ ఓ ఆఫీస్ ను ముట్టడించన తిప్పరెడ్డి గూడెం రైతులు. ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం తిప్పరెడ్డి గూడెం దళిత రైతులు ఈ రోజు సిపిఐంల్ న్యూ డెమోక్రసి పార్టీ అధ్యరలో ఎం ర్ ఓ ఆఫీస్ ను ముట్టడించినరు. 128సర్వ్ నెంబర్ లో14ఎకరాల20కుంటాలపేదల భూమి లో సీతారామ ప్రజక్ట్ కాలువలు తవ్వి పేదలకు నష్ట పరిహారం ఇవ్వకుండా ఇప్పుడూ అది ప్రభత్వ భూమి అని తప్పుడు పత్రాలు,పోర్జరి సంతకాలు సూపించి పేద రైతులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రైతులు 50 సంవత్సరాలుగా సేద్యంలో ఉంటూన్న రైతులనుగత ఆరు సంవత్సరాల నుంచి సీతారామ కాలవ పేరుతో పేదల భూములు లాక్కొని ఆ పేదల భూముల్లో కాలువల తవ్వి ఆనాటి ప్రభుత్వం మీకు నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పిఇప్పుడు ఆ భూమిని ప్రభుత్వ భూమి గా చూపిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తిప్పారెడ్డి గూడెం రైతుల పక్షాన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వం నుంచి వారికి నష్టపరిహారం అందేంతవరకు పోరాటం కొనసాగిస్తామని ఆ పార్టీ నాయకులు తెలిపినారు.
    1
    తిరుమలాయపాలెం  ఎం ర్ ఓ ఆఫీస్ ను ముట్టడించన తిప్పరెడ్డి గూడెం రైతులు.
ఖమ్మం జిల్లా తిరుమలయపాలెం మండలం తిప్పరెడ్డి గూడెం దళిత రైతులు ఈ రోజు సిపిఐంల్ న్యూ డెమోక్రసి పార్టీ అధ్యరలో ఎం ర్ ఓ ఆఫీస్ ను ముట్టడించినరు. 128సర్వ్ నెంబర్ లో14ఎకరాల20కుంటాలపేదల భూమి లో సీతారామ ప్రజక్ట్ కాలువలు తవ్వి పేదలకు నష్ట పరిహారం ఇవ్వకుండా ఇప్పుడూ అది ప్రభత్వ భూమి అని తప్పుడు పత్రాలు,పోర్జరి సంతకాలు సూపించి పేద రైతులను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. రైతులు 50 సంవత్సరాలుగా సేద్యంలో ఉంటూన్న రైతులనుగత ఆరు సంవత్సరాల నుంచి సీతారామ కాలవ పేరుతో పేదల భూములు లాక్కొని ఆ పేదల భూముల్లో కాలువల తవ్వి ఆనాటి ప్రభుత్వం మీకు నష్టపరిహారం ఇప్పిస్తామని చెప్పిఇప్పుడు ఆ భూమిని ప్రభుత్వ భూమి గా చూపిస్తున్నారని  గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. తిప్పారెడ్డి గూడెం రైతుల పక్షాన సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని ప్రభుత్వం నుంచి వారికి నష్టపరిహారం అందేంతవరకు పోరాటం కొనసాగిస్తామని ఆ పార్టీ నాయకులు తెలిపినారు.
    user_YELLIMALLI SRINIVASARAO
    YELLIMALLI SRINIVASARAO
    Local News Reporter తిరుమలాయపాలెం, ఖమ్మం, తెలంగాణ•
    22 hrs ago
  • జాలలపాలెం అటవీ భూముల ఆక్రమణపై చర్యలు కోరుతూ ప్రజా సంఘంగాలు ధర్నా వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలలపాలెం గ్రామంలో అటవీ, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ఎర్రచందనం చెట్ల నరికివేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నరసరావుపేటలోని జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారికి అర్జీ సమర్పించారు.జాలలపాలెం పరిధిలో ప్రభుత్వ భూములు ఆక్రమించారని, అటవీ భూముల్లో ఎర్రచందనం తదితర చెట్లను నరికివేస్తున్నారని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. ఆక్రమిత భూములను వెంటనే స్వాధీనం చేసుకుని అటవీ సంపద, వన్యప్రాణులను రక్షించాలని వారు డిమాండ్ చేశారు.
    1
    జాలలపాలెం అటవీ భూముల ఆక్రమణపై చర్యలు కోరుతూ ప్రజా సంఘంగాలు ధర్నా
వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలోని జాలలపాలెం గ్రామంలో అటవీ, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, ఎర్రచందనం చెట్ల నరికివేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో మంగళవారం నరసరావుపేటలోని జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారికి అర్జీ సమర్పించారు.జాలలపాలెం పరిధిలో ప్రభుత్వ భూములు ఆక్రమించారని, అటవీ భూముల్లో ఎర్రచందనం తదితర చెట్లను నరికివేస్తున్నారని ప్రజాసంఘాల నాయకులు ఆరోపించారు. ఆక్రమిత భూములను వెంటనే స్వాధీనం చేసుకుని అటవీ సంపద, వన్యప్రాణులను రక్షించాలని వారు డిమాండ్ చేశారు.
    user_Orsu Krishna
    Orsu Krishna
    Social worker పిడుగురాళ్ల, పల్నాడు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • నాగార్జునసాగర్ ఎడమ కాలువకు తాగునీరు అవసరాల కోసం నీటిని విడుదల చేసిన అధికారులు నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు అధికారులు తాగునీటి అవసరాల కోసం 500 క్యూసెక్కుల నీటిని బుధవారం విడుదల చేశారు. ఎడమ కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపుకుని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. గత కొంతకాలంగా నీళ్లు రాక ఎడమ కాలువ పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడగా తాజాగా నీటిని విడుదల చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
    1
    నాగార్జునసాగర్ ఎడమ కాలువకు తాగునీరు అవసరాల కోసం నీటిని విడుదల చేసిన అధికారులు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఎడమ కాలువకు అధికారులు తాగునీటి అవసరాల కోసం 500 క్యూసెక్కుల నీటిని బుధవారం విడుదల చేశారు.
ఎడమ కాలువ పరిధిలోని చెరువులు, కుంటలను నింపుకుని తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. గత కొంతకాలంగా నీళ్లు రాక ఎడమ కాలువ పరివాహక ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడగా తాజాగా నీటిని విడుదల చేయడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు.
    user_T Shankar Public News Reporter
    T Shankar Public News Reporter
    రిపోర్టర్ Kanagal, Nalgonda•
    1 hr ago
  • పండుగల వేళ శాంతికి పెద్ద పీట ముదిగొండలో శాంతి కమిటీ మీటింగ్ ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీస్ స్టేషన్ లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. రాబోయే పండుగల నేపథ్యంలో ప్రజలు సహకరించాలని సీఐ మురళి కోరారు.ముదిగొండ పోలీస్ స్టేషన్ ఆవరణలో శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఐ మురళి మాట్లాడుతూ... గ్రామాల్లో శాంతి భద్రతలకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.పండుగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, యువత రెచ్చగొట్టే వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులకు దూరంగా ఉండాలని సూచించారు. డీజే సౌండ్స్, విగ్రహాల ఏర్పాటు విషయంలో నిబంధనలు పాటించాలని తెలిపారు.ఎవరైనా శాంతికి విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్ఐ, పోలీస్ సిబ్బంది, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
    1
    పండుగల వేళ శాంతికి పెద్ద పీట ముదిగొండలో శాంతి కమిటీ మీటింగ్

ఖమ్మం జిల్లా ముదిగొండ పోలీస్ స్టేషన్ లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. రాబోయే పండుగల నేపథ్యంలో ప్రజలు సహకరించాలని సీఐ మురళి కోరారు.ముదిగొండ పోలీస్ స్టేషన్ ఆవరణలో శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సీఐ మురళి మాట్లాడుతూ... గ్రామాల్లో శాంతి భద్రతలకు ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.పండుగల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలని, యువత రెచ్చగొట్టే వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టులకు దూరంగా ఉండాలని సూచించారు. డీజే సౌండ్స్, విగ్రహాల ఏర్పాటు విషయంలో నిబంధనలు పాటించాలని తెలిపారు.ఎవరైనా శాంతికి విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎస్ఐ, పోలీస్ సిబ్బంది, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
    user_ARUNKUMAR
    ARUNKUMAR
    Local News Reporter నేలకొండపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    5 hrs ago
  • ****ఉప్మా తిన్న 8 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ **** ఖమ్మం జిల్లా: వేంసూరు మండలం మర్లపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. అల్పాహారంగా ఉప్మా తిన్న 6, 7 తరగతులకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు వారిని వెంటనే వేంసూరు పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యులు విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎనిమిది మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా, పాఠశాలలో ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ కార్యక్రమం నేటి నుంచే ప్రారంభమైంది. తొలిరోజే విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉండటంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
    1
    ****ఉప్మా తిన్న 8 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ****
ఖమ్మం జిల్లా: వేంసూరు మండలం మర్లపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. అల్పాహారంగా ఉప్మా తిన్న 6, 7 తరగతులకు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు వాంతులు చేసుకుని అస్వస్థతకు గురయ్యారు.
విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో అప్రమత్తమైన ఉపాధ్యాయులు వారిని వెంటనే వేంసూరు పీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యులు విద్యార్థులకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఎనిమిది మంది విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
కాగా, పాఠశాలలో ఓ ట్రస్ట్ ఆధ్వర్యంలో అల్పాహారం పంపిణీ కార్యక్రమం నేటి నుంచే ప్రారంభమైంది. తొలిరోజే విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉండటంతో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
    user_Tharun
    Tharun
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    23 hrs ago
  • ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు జయశంకర్ భూపాలపల్లి: రేగొండ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానపద కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జానపద కళలు పల్లెల్లోని సమస్యలను ప్రజలకు తెలియజేయడంతో పాటు ఆనందం, చైతన్యాన్ని కలిగిస్తాయని అన్నారు. జానపద, సాంస్కృతిక కళాకారుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. నిరుపేద జానపద కళాకారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందించేందుకు కృషి చేస్తానని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కళాకారులకు అందేలా తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కళాకారుల పట్ల సీఎం రేవంత్‌రెడ్డికి ఎంతో గౌరవం, ప్రేమ ఉన్నాయని పేర్కొన్నారు. కళాకారులకు అవసరమైన రాయితీలు, సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జానపద కళాకారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
    1
    ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
జయశంకర్ భూపాలపల్లి: రేగొండ మండల కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో నిర్వహించిన ప్రపంచ జానపద దినోత్సవ వేడుకల్లో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానపద కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జానపద కళలు పల్లెల్లోని సమస్యలను ప్రజలకు తెలియజేయడంతో పాటు ఆనందం, చైతన్యాన్ని కలిగిస్తాయని అన్నారు. జానపద, సాంస్కృతిక కళాకారుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. నిరుపేద జానపద కళాకారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందించేందుకు కృషి చేస్తానని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు కళాకారులకు అందేలా తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.
కళాకారుల పట్ల సీఎం రేవంత్‌రెడ్డికి ఎంతో గౌరవం, ప్రేమ ఉన్నాయని పేర్కొన్నారు. కళాకారులకు అవసరమైన రాయితీలు, సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జానపద కళాకారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    2 hrs ago
  • సత్తుపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు సత్తుపల్లి పట్టణ శివారులో ఈ ప్రమాదం జరిగింది. సత్తుపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తిని.. అశ్వారావుపేట వైపు వెళ్తున్న డిజైర్ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.క్షతగాత్రుడిని సత్తుపల్లికి చెందిన ఆకోజు రామకృష్ణ(48) గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి రిఫర్ చేశారు.
    2
    సత్తుపల్లి శివారులో రోడ్డు ప్రమాదం.. ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలు
సత్తుపల్లి పట్టణ శివారులో ఈ ప్రమాదం జరిగింది. సత్తుపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వస్తున్న వ్యక్తిని.. అశ్వారావుపేట వైపు వెళ్తున్న డిజైర్ కారు ఢీకొట్టింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు.క్షతగాత్రుడిని సత్తుపల్లికి చెందిన ఆకోజు రామకృష్ణ(48) గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అతడిని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఖమ్మం ఆసుపత్రికి రిఫర్ చేశారు.
    user_Tharun
    Tharun
    Local News Reporter సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    6 hrs ago
  • Writing హైదరాబాద్‌–విజయవాడ హైవేపై జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి డ్రైవర్‌ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. కుడివైపు వెళ్తున్న ఐరన్‌ రాడ్ల కంటైనర్‌ DCMను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో బస్సు దాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. దీంతో DCMలోని ఇనుప రాడ్లు బస్సును చీల్చుకుంటూ దూసుకెళ్లాయి. ఆ వైపు గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే ప్రాణాలు కోల్పోయారు.
    1
    Writing
హైదరాబాద్‌–విజయవాడ హైవేపై జరిగిన ఘోర బస్సు ప్రమాదానికి డ్రైవర్‌ నిద్రమత్తే కారణమని తెలుస్తోంది. కుడివైపు వెళ్తున్న ఐరన్‌ రాడ్ల కంటైనర్‌ DCMను ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో బస్సు దాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. దీంతో DCMలోని ఇనుప రాడ్లు బస్సును చీల్చుకుంటూ దూసుకెళ్లాయి. ఆ వైపు గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు ఏం జరిగిందో తెలుసుకునేలోపే ప్రాణాలు కోల్పోయారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.