logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

టెకం పెంటయ్య కుటుంబానికి అండగా ఉంటాం : కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా కార్యదర్శి ఆదిత. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా : కొమురం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలోని హీరాపూర్ గ్రామంలో ఇటీవల పురుగుల మందు తాగి మృతి చెందిన టెకం పెంటయ్య యువకుడు కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా కార్యదర్శి ఆదిత శనివారం సందర్శించి పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా ఆదిత మాట్లాడుతూ గ్రామంలో ఇలాంటి విషాదకర ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామ ప్రజలకు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురైనా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆమె భరోసాకల్పించారు.అనంతరం బాధిత కుటుంబానికి తన వంతుగా ఆర్థిక సహాయం అందజేసి, అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

2 hrs ago
user_Banka Srinivas
Banka Srinivas
Insurance Agent కాగజ్‌నగర్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
2 hrs ago
3348aed7-a4f0-4a70-89ef-acca035f9ff9

టెకం పెంటయ్య కుటుంబానికి అండగా ఉంటాం : కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా కార్యదర్శి ఆదిత. కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా : కొమురం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలోని హీరాపూర్ గ్రామంలో ఇటీవల పురుగుల మందు తాగి మృతి చెందిన టెకం పెంటయ్య యువకుడు కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా కార్యదర్శి ఆదిత శనివారం సందర్శించి పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి, వారికి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా ఆదిత మాట్లాడుతూ గ్రామంలో ఇలాంటి విషాదకర ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామ ప్రజలకు ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురైనా కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని ఆమె భరోసాకల్పించారు.అనంతరం బాధిత కుటుంబానికి తన వంతుగా ఆర్థిక సహాయం అందజేసి, అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

More news from తెలంగాణ and nearby areas
  • కాగజ్‌నగర్ పట్టణంలోని ఎల్లగౌడ్ తోట ఏరియా ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ సెంటర్‌లో అదనంగా 5 డయాలసిస్ బెడ్లను సిర్పూర్ శాసనసభ్యుడు డా. పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి ప్రారంభించారు. దీంతో సెంటర్‌లో మొత్తం బెడ్ల సంఖ్య 10కి పెరిగింది. అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించి, ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శిని ఒప్పించి ఈ బెడ్లు మంజూరు చేయించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. కౌటాల, బెజ్జూర్ మండలాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని, ఆ రెండు ఆసుపత్రుల్లోనూ డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నూతన భవనాలు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది నియామకంతో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డా. అనివాష్, డాక్టర్లు హర్షవర్ధన్, అరుణ్ కుమార్, అరుణ పాల్గొన్నారు.
    2
    కాగజ్‌నగర్ పట్టణంలోని ఎల్లగౌడ్ తోట ఏరియా ఆసుపత్రిలో ఉన్న డయాలసిస్ సెంటర్‌లో అదనంగా 5 డయాలసిస్ బెడ్లను సిర్పూర్ శాసనసభ్యుడు డా. పాల్వాయి హరీష్ బాబు, ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి ప్రారంభించారు. దీంతో సెంటర్‌లో మొత్తం బెడ్ల సంఖ్య 10కి పెరిగింది.
అసెంబ్లీలో పలుమార్లు ప్రస్తావించి, ఆరోగ్య శాఖ మంత్రి, కార్యదర్శిని ఒప్పించి ఈ బెడ్లు మంజూరు చేయించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. కౌటాల, బెజ్జూర్ మండలాల్లో భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటం వల్ల కిడ్నీ సమస్యలు తలెత్తుతున్నాయని, ఆ రెండు ఆసుపత్రుల్లోనూ డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో నూతన భవనాలు, డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది నియామకంతో వైద్య రంగాన్ని బలోపేతం చేస్తున్నట్టు తెలిపారు.
కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డా. అనివాష్, డాక్టర్లు హర్షవర్ధన్, అరుణ్ కుమార్, అరుణ పాల్గొన్నారు.
    user_Krishna
    Krishna
    ఆసిఫాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, తెలంగాణ•
    18 hrs ago
  • చిన్న బ్రిడ్జితో ఇబ్బంది పడుతున్న ప్రజలు, పెద్ద బ్రిడ్జి నిర్మించాలని వినతి జన్నారం పట్టణంలోని రాంనగర్ వద్ద చిన్న బ్రిడ్జితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన రామ్ నగర్ కు వెళ్లే దారిలో చిన్న బ్రిడ్జి ఉంది.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి పైనుండి మూడు రోజుల పాటు వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయ. బ్రిడ్జి చిన్న ఉండటంతో నీరు పోయే మార్గం లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు. అక్కడ పెద్ద బ్రిడ్జి నిర్మించాలని వారు కోరారు.
    1
    చిన్న బ్రిడ్జితో ఇబ్బంది పడుతున్న ప్రజలు, పెద్ద బ్రిడ్జి నిర్మించాలని వినతి
జన్నారం పట్టణంలోని రాంనగర్ వద్ద చిన్న బ్రిడ్జితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన రామ్ నగర్ కు వెళ్లే దారిలో చిన్న బ్రిడ్జి ఉంది.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి పైనుండి మూడు రోజుల పాటు వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయ. బ్రిడ్జి చిన్న ఉండటంతో నీరు పోయే మార్గం లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు. అక్కడ పెద్ద బ్రిడ్జి నిర్మించాలని వారు కోరారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • వాహన తనిఖీల్లో భారీగా అక్రమ మద్యం పట్టివేత రూ.2.15 లక్షల విలువైన అక్రమ మద్యం,టాటా సుమో స్వాధీనం.,డ్రైవర్ పరారీ వాహన తనిఖీల్లో భారీగా అక్రమ మద్యం పట్టివేత రూ.2.15 లక్షల విలువైన అక్రమ మద్యం,టాటా సుమో స్వాధీనం.,డ్రైవర్ పరారీ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ఎ.రాజేందర్ సిబ్బందితో కలిసి శనివారం మధ్యాహ్నం అవడం ఎక్స్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ MH-34 M 9927 గల టాటా సుమో గోల్డ్ వాహనం చెన్నూర్ వైపు నుంచి వస్తుండగా పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. అయితే డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లిపోవడంతో అనుమానం వచ్చి పోలీసులు వాహనాన్ని వెంబడించారు.ఈ క్రమంలో భీమారం మండలం పోలంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి-63పై బస్‌స్టాప్ సమీపంలో వాహనాన్ని రోడ్డుపక్కన వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు.అనంతరం పంచుల సమక్షంలో వాహనాన్ని తనిఖీ చేయగా భారీ మొత్తంలో అక్రమ మద్యం లభించింది. అందులో ఆఫీసర్స్ ఛాయిస్ విస్కీ 120 సీసాలు,రాయల్ స్టాగ్ విస్కీ 108 సీసాలు, హేవర్డ్స్ 5000 బీర్ 216 టిన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం మొత్తం విలువ రూ.2,15,100గా నిర్ధారించారు. అనంతరం మద్యం, టాటా సుమో వాహనాన్ని భీమారం పోలీస్ స్టేషన్‌కు తరలించి,తెలంగాణ ఎక్సైజ్ చట్టం–1968లోని సెక్షన్ 34(ఎ) కింద సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పరారీలో ఉన్న వాహన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఎ.రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
    1
    వాహన తనిఖీల్లో భారీగా అక్రమ మద్యం పట్టివేత

రూ.2.15 లక్షల విలువైన అక్రమ మద్యం,టాటా సుమో స్వాధీనం.,డ్రైవర్ పరారీ

వాహన తనిఖీల్లో భారీగా అక్రమ మద్యం పట్టివేత
రూ.2.15 లక్షల విలువైన అక్రమ మద్యం,టాటా సుమో స్వాధీనం.,డ్రైవర్ పరారీ
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని భీమారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై ఎ.రాజేందర్ సిబ్బందితో కలిసి శనివారం మధ్యాహ్నం అవడం ఎక్స్ రోడ్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, మహారాష్ట్ర రిజిస్ట్రేషన్ నంబర్ MH-34 M 9927 గల టాటా సుమో గోల్డ్ వాహనం చెన్నూర్ వైపు నుంచి వస్తుండగా పోలీసులు ఆపేందుకు ప్రయత్నించారు. అయితే డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా వేగంగా వెళ్లిపోవడంతో అనుమానం వచ్చి పోలీసులు వాహనాన్ని వెంబడించారు.ఈ క్రమంలో భీమారం మండలం పోలంపల్లి గ్రామ శివారులో జాతీయ రహదారి-63పై బస్‌స్టాప్ సమీపంలో వాహనాన్ని రోడ్డుపక్కన వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు.అనంతరం పంచుల సమక్షంలో వాహనాన్ని తనిఖీ చేయగా భారీ మొత్తంలో అక్రమ మద్యం లభించింది. అందులో ఆఫీసర్స్ ఛాయిస్ విస్కీ 120 సీసాలు,రాయల్ స్టాగ్ విస్కీ 108 సీసాలు, హేవర్డ్స్ 5000 బీర్ 216 టిన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం మొత్తం విలువ రూ.2,15,100గా నిర్ధారించారు. అనంతరం మద్యం, టాటా సుమో వాహనాన్ని భీమారం పోలీస్ స్టేషన్‌కు తరలించి,తెలంగాణ ఎక్సైజ్ చట్టం–1968లోని సెక్షన్ 34(ఎ) కింద సుమోటో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.పరారీలో ఉన్న వాహన డ్రైవర్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని, అక్రమ మద్యం రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై ఎ.రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • మురికి కాలువలు శుభ్రం చేయక దుర్వాసన.. దేవునిగూడలో వ్యాధుల భయం జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో గత కొద్ది రోజులుగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో అవి గడ్డి, చెత్తాచెదారంతో పూర్తిగా నిండిపోయాయి. కాలువల్లో నీరు నిల్వ ఉండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    మురికి కాలువలు శుభ్రం చేయక దుర్వాసన.. దేవునిగూడలో వ్యాధుల భయం
జన్నారం మండలం దేవునిగూడ గ్రామంలో గత కొద్ది రోజులుగా మురికి కాలువలను శుభ్రం చేయకపోవడంతో అవి గడ్డి, చెత్తాచెదారంతో పూర్తిగా నిండిపోయాయి. కాలువల్లో నీరు నిల్వ ఉండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దోమలు విపరీతంగా పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాలువలను శుభ్రం చేసి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    15 hrs ago
  • గోదావరి తల్లికి వాయనం సమర్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు లో వరద నీటిని పరిశీలించారు. అనంతరం గోదావరి తల్లికి వాయనం సమర్పించారు.
    1
    గోదావరి తల్లికి వాయనం సమర్పించిన ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్
శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ను రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు లో వరద నీటిని పరిశీలించారు. అనంతరం గోదావరి తల్లికి వాయనం సమర్పించారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    6 hrs ago
  • గ్రామీణ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి.. ఏఎంసీ చైర్మన్ మావల మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. స్పెషల్ ఆఫీసర్ మిల్కా, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణతో కలిసి ఆయన సమావేశంలో పాల్గొన్నారు. మండల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులపై సమావేశంలో చర్చించారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వ్యవసాయం, వైద్య సేవలు, ప్రాథమిక విద్య, సంక్షేమ పథకాల అమలు తీరును సమీక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో కృష్ణవేణి, మావల ప్రిన్సిపాల్ సరోజ, విద్యుత్ శాఖ ఏఈ జనార్దన్ రెడ్డి, మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, బట్టిసవర్గాం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వాఘాపూర్ సర్పంచ్ దినేష్, వెటర్నరీ డాక్టర్ శ్రీనివాస్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
    1
    గ్రామీణ అభివృద్ధికి సమన్వయంతో పనిచేయాలి.. ఏఎంసీ చైర్మన్
మావల మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) చైర్మన్ బోరంచు శ్రీకాంత్ రెడ్డి హాజరయ్యారు. స్పెషల్ ఆఫీసర్ మిల్కా, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల సత్యనారాయణతో కలిసి ఆయన సమావేశంలో పాల్గొన్నారు. మండల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులపై సమావేశంలో చర్చించారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్యం, వ్యవసాయం, వైద్య సేవలు, ప్రాథమిక విద్య, సంక్షేమ పథకాల అమలు తీరును సమీక్షించారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో కృష్ణవేణి, మావల ప్రిన్సిపాల్ సరోజ, విద్యుత్ శాఖ ఏఈ జనార్దన్ రెడ్డి, మావల సర్పంచ్ ధర్మపురి చంద్రశేఖర్, బట్టిసవర్గాం సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, వాఘాపూర్ సర్పంచ్ దినేష్, వెటర్నరీ డాక్టర్ శ్రీనివాస్‌తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Adilabad Urban, Telangana•
    44 min ago
  • కరీంనగర్‌లో కళాకారుల ఆధ్వర్యంలో బోనాల జాతర పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని కరీంనగర్ నగరంలో కళాకారుల ఆధ్వర్యంలో వైభవంగా బోనాల జాతర నిర్వహించనున్నారు. ఈ నెల 5వ తేదీ, బుధవారం రోజున జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ నుంచి కోతీరాంపూర్ పోచమ్మ ఆలయం వరకు ఈ జాతర కార్యక్రమం అత్యంత వైభవంగా సాగనుంది. ​ గోడపత్రిక ఆవిష్కరణ ​ఈ జాతర కార్యక్రమానికి సంబంధించి కళాకారులు నేడు కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించారు. అనంతరం జాతరకు సంబంధించిన గోడపత్రికల ను వారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాకారుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని వారు ఆకాంక్షించారు. ​కార్యక్రమంలో ​మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు ​బిఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్, ​మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి,​కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ - శ్రీనివాస్, ​మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్,​కళాకారులు గోగుల ప్రసాద్,సంద స్వప్న ​పలువురు బీఆర్ఎస్ నాయకులు, మరియు కళాకారులు తదితరులు ఉన్నారు.
    1
    కరీంనగర్‌లో కళాకారుల ఆధ్వర్యంలో 
 బోనాల జాతర పోస్టర్ ను ఆవిష్కరించిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్
ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని కరీంనగర్ నగరంలో కళాకారుల ఆధ్వర్యంలో వైభవంగా బోనాల జాతర నిర్వహించనున్నారు. ఈ నెల 5వ తేదీ, బుధవారం రోజున జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్ నుంచి కోతీరాంపూర్ పోచమ్మ ఆలయం వరకు ఈ జాతర కార్యక్రమం అత్యంత వైభవంగా సాగనుంది.
​
గోడపత్రిక ఆవిష్కరణ
​ఈ జాతర కార్యక్రమానికి సంబంధించి కళాకారులు నేడు కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్‌ను వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ప్రత్యేకంగా ఆహ్వానించారు. అనంతరం జాతరకు సంబంధించిన గోడపత్రికల ను వారి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కళాకారుల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని వారు ఆకాంక్షించారు.
​కార్యక్రమంలో
​మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు ​బిఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్,
​మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి,​కార్పొరేటర్ గుగ్గిళ్ల జయశ్రీ - శ్రీనివాస్,
​మాజీ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్,​కళాకారులు గోగుల ప్రసాద్,సంద స్వప్న
​పలువురు బీఆర్ఎస్ నాయకులు, మరియు కళాకారులు తదితరులు
ఉన్నారు.
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో వరద నీరు., 5గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేసిన ప్రాజెక్టు అధికారులు అంతర్గం మండలం లోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు.
    1
    ఎల్లంపల్లి ప్రాజెక్ట్ లో వరద నీరు., 5గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేసిన ప్రాజెక్టు అధికారులు
అంతర్గం మండలం లోని ఎల్లంపల్లి ప్రాజెక్ట్ 5 గేట్లు ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    6 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.