Shuru
Apke Nagar Ki App…
చర్లపల్లి లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా ఎలక్ట్రిసిటీ అధికారులకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చర్లపల్లి డివిజన్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులు సబ్ స్టేషన్ కొరత కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తక్షణమే స్పందించిన మంత్రి గారు సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి, చర్లపల్లిలో నూతన సబ్ స్టేషన్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు స్పష్టం చేశారు.
Journalist Prem
చర్లపల్లి లో నూతన సబ్ స్టేషన్ ఏర్పాటు చేయాల్సిందిగా ఎలక్ట్రిసిటీ అధికారులకు మంత్రి కోమటిరెడ్డి ఆదేశం నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చర్లపల్లి డివిజన్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులు సబ్ స్టేషన్ కొరత కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తక్షణమే స్పందించిన మంత్రి గారు సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి, చర్లపల్లిలో నూతన సబ్ స్టేషన్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు స్పష్టం చేశారు.
More news from తెలంగాణ and nearby areas
- గత 25 ఏళ్లుగా నల్లగొండ ప్రజలు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి ఈ ప్రాంత ప్రజలు నా ప్రాణం. నా చివరి శ్వాస వరకు ఈ ప్రాంత ప్రజల సంక్షేమం కోసమే పని చేస్తాను. నల్లగొండను హైదరాబాద్ తరహాలో అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి సహకారంతో భారీగా నిధులు కేటాయించి, ఇందిరమ్మ ఇళ్లు మరియు సంక్షేమ పథకాలను ప్రతి గడపకు చేరుస్తున్నాం. ప్రతిపక్షాల మాయమాటలు నమ్మకుండా, పట్టణ అభివృద్ధి కోసం 48 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నాను. మీ సమస్యలను నేరుగా నా దృష్టికి తీసుకువచ్చే కాంగ్రెస్ కార్పొరేటర్లకు మద్దతుగా నిలవండి. మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, శాంతిభద్రతలను కాపాడుతూ, నల్లగొండను అభివృద్ధిలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలుపుతాను.1
- గజ్వేల్ సిద్దిపేట జిల్లా జనవరి 4 ప్రజా తెలంగాణ న్యూస్/ సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ లో జగదేవపూర్ వెళ్ళే చౌరస్తా వద్ద స్టార్ హెల్త్ గుడాల రాధాకృష్ణ వారి మిత్రుల సౌజన్యంతో ,మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ, లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి లయన్స్ క్లబ్ పర్యవేక్షణలో బస్టాండ్ పునర్నిర్మాణం చేసి బుధవారం లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ అమర్నాథ్ రావు, గజ్వేల్ ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్ పవన్,స్టార్ హెల్త్ బిజినెస్ హెడ్ బాల బాలాజీ శ్రీనివాస్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా డిపో మేనేజర్ పవన్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరు సేవాగుణం కలిగి ఉండాలని స్టార్ హెల్త్ రాధాకృష్ణ వారి మిత్రుల సౌజన్యంతో ఇక్కడ బస్టాండ్ పునర్నిర్మానం చేయడం అభినందనీయమని అన్నారు, అనంతరం లయన్ అమర్నాథ్ రావు మాట్లాడుతూ మానవసేవే మాధవ సేవ అని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా లయన్స్ క్లబ్ సభ్యులు రాధాకృష్ణ వారి మిత్రులు స్టార్ హెల్త్ వారి సౌజన్యంతో ప్రయాణికులకు సౌకర్యవంతంగా బస్టాండ్ ఏర్పాటు చేయడం శుభసూచికమని అన్నారు, ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సంజయ్ గుప్తా, ఉప్పల మెట్టయ్య లయన్ సంగునూరి సత్యనారాయణ, డాక్టర్కుమార స్వామి, రాం పనిదర్ రావు, నేతి శ్రీనివాస్, మల్లేశం గౌడ్,సంతోష్,నాగేందర్, లయన్స్ క్లబ్ ఆఫ్ మహతి డాక్టర్ శైలజ,సుజాత,స్రవంతి, లయన్స్ క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు4
- హైదరాబాద్, బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్ గారు శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ నితిన్ నబీన్ కి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీని మరింత బలోపేతం చేయడంలో నితిన్ నబీన్ నాయకత్వం కీలకమని ఆయన పేర్కొన్నారు. ఈ స్వాగత కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలతో ఉత్సాహం వ్యక్తం చేశారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, రానున్న ఎన్నికలపై ఈ సందర్భంగా కీలక చర్చలు జరిగినట్లు సమాచారం.1
- హన్మకొండ:పరకాల మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఓటర్లను కలుసుకుని పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.2
- మహబూబాబాద్ జిల్లా కొరివి మండలం అయ్యగారి పల్లి సమీపం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది ఫోన్ మాట్లాడుతూ రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళుతున్న హచ్యా అనే వ్యక్తిని వేగంగా వచ్చిన ద్విచక్ర వాహనం ఢీ కొట్టింది ఈ ఘటనలో హత్య అక్కడికక్కడే మృతి చెందగా ద్విచక్ర వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు గాయపడిన వ్యక్తిని మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించారు1
- *మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రవి ప్రసాద్, మద్యం మత్తులో తన భార్య శిరీషపై దారుణంగా దాడి చేశారు. శిరీష గుడిపేట బెటాలియన్‌లో సూపరిండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. వీరిద్దరూ మంచిర్యాలలోని రెడ్డి కాలనీలో నివసిస్తున్నారు.* అర్ధరాత్రి సమయంలో మద్యం సేవించి ఇంటికి వచ్చిన రవి ప్రసాద్, అనుమానంతో భార్యతో గొడవకు దిగాడు. ఈ క్రమంలో కేవలం లోదుస్తులతో (అర్ధనగ్నంగా) రోడ్డుపైకి వచ్చి, అందరూ చూస్తుండగానే ఆమెను జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్తూ తీవ్రంగా కొట్టాడు. బాధితురాలు ప్రాధేయపడుతున్నా, చుట్టుపక్కల వారు ఆపడానికి ప్రయత్నించినా అతను వినకుండా వీరంగం సృష్టించాడు. బాధిత భార్య శిరీష తన భర్తపై మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు రవి ప్రసాద్‌పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. ఒక రక్షక భటుడే ఇలా బాధ్యతారాహిత్యంగా, అమానవీయంగా ప్రవర్తించడం పట్ల స్థానికులు మరియు ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.1
- డిగ్రీ తో బ్యాంకు ఉద్యోగాలు exam లేదు... ఫుల్ డీటెయిల్స్ వీడియో ఇన్ my యూట్యూబ్ ఛానల్ లింక్ ఇన్ కామెంట్స్ box 👇👇👇🤝1
- నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చర్లపల్లి డివిజన్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికులు సబ్ స్టేషన్ కొరత కారణంగా ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై తక్షణమే స్పందించిన మంత్రి గారు సంబంధిత విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి, చర్లపల్లిలో నూతన సబ్ స్టేషన్ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు స్పష్టం చేశారు.1