పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల కు ప్రతిభా పురస్కారాలు. బద్వేలు,మే 11: బద్వేలు పట్టణం లో బద్వేలు పట్టణ అభివృద్ది సొసైటీ ఆధ్వర్యంలో సభాధ్యక్షులు బద్వేలు గురుమూర్తి అధ్యక్షతన బద్వేలు మున్సిపాలిటి పరిధిలోగల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో 2025-2026 విద్యాసంవత్సరం పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 500 లకు పైన మార్కులు సాధించిన 6 స్కూళ్లలో మొదటి,రెండవ, మూడవ టాపర్లు 15 మందికి నగదుగా రూ 1000-00 లు,మెమెంటో, ప్రశంసా పత్రము,స్వీట్ బాక్స్ ప్రదానం చేయడమైనది.ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు నానబాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను ప్రోత్సహించుటలో భాగంగా జిల్లా పరిషత్ హైస్కూల్లలోని పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ఇచ్చి ప్రోత్సహించడం చేస్తున్నామన్నారు.మేధావులందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారేనన్నారు. ముఖ్య అతిథులు రిటైర్డ్ జిల్లా డిప్యూటి వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.మార్కారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ,నైతిక విలువలు కలిగివుంటే వున్నత స్థాయి చేరుకోగలరని వివరించారు.మునిసిపల్ కమీషనర్ వి.వి నరసింహారెడ్డి ప్రసంగిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వున్నాయని ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పిస్తున్నారని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలన్నారు.అనంతరం ముఖ్య అతిథులకు, కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారందరికీ దుశ్శాలువా,జ్ఞాపికతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో బద్వేలు పట్టణ అభివృద్ది సొసైటీ సలహాదారు పెద్దిరెడ్డి చెన్నకృష్ణారెడ్డి, కోశాధికారి పి.శ్రీనివాసులు రెడ్డి, ఉపాధ్యక్షులు డా.కృష్ణ, యం.శ్రీనివాసులు,గనుమంతు వెంకట రాజేష్ కుమార్,ఎస్.ఎ సత్తార్,భౌతికవాది పడిగె వెంకటరమణ, ఆవాజ్ కమిటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షేక్ అన్వర్ బాష,లైబ్రేరియన్ ఒ.లక్ష్మీదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్దసంఖ్యలో హాజరైనారు.
పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థుల కు ప్రతిభా పురస్కారాలు. బద్వేలు,మే 11: బద్వేలు పట్టణం లో బద్వేలు పట్టణ అభివృద్ది సొసైటీ ఆధ్వర్యంలో సభాధ్యక్షులు బద్వేలు గురుమూర్తి అధ్యక్షతన బద్వేలు మున్సిపాలిటి పరిధిలోగల జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలల్లో 2025-2026 విద్యాసంవత్సరం పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో 500 లకు పైన మార్కులు సాధించిన 6 స్కూళ్లలో మొదటి,రెండవ, మూడవ టాపర్లు 15 మందికి నగదుగా రూ 1000-00 లు,మెమెంటో, ప్రశంసా పత్రము,స్వీట్ బాక్స్ ప్రదానం చేయడమైనది.ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షులు నానబాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను ప్రోత్సహించుటలో భాగంగా జిల్లా పరిషత్ హైస్కూల్లలోని పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ఇచ్చి ప్రోత్సహించడం చేస్తున్నామన్నారు.మేధావులందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివినవారేనన్నారు.
ముఖ్య అతిథులు రిటైర్డ్ జిల్లా డిప్యూటి వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.మార్కారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ,నైతిక విలువలు కలిగివుంటే వున్నత స్థాయి చేరుకోగలరని వివరించారు.మునిసిపల్ కమీషనర్ వి.వి నరసింహారెడ్డి ప్రసంగిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఫలితాలు వున్నాయని ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పిస్తున్నారని ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలన్నారు.అనంతరం ముఖ్య అతిథులకు, కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన వారందరికీ దుశ్శాలువా,జ్ఞాపికతో సన్మానించారు.ఈ కార్యక్రమంలో బద్వేలు పట్టణ అభివృద్ది సొసైటీ సలహాదారు పెద్దిరెడ్డి చెన్నకృష్ణారెడ్డి, కోశాధికారి పి.శ్రీనివాసులు రెడ్డి, ఉపాధ్యక్షులు డా.కృష్ణ, యం.శ్రీనివాసులు,గనుమంతు వెంకట రాజేష్ కుమార్,ఎస్.ఎ సత్తార్,భౌతికవాది పడిగె వెంకటరమణ, ఆవాజ్ కమిటి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు షేక్ అన్వర్ బాష,లైబ్రేరియన్ ఒ.లక్ష్మీదేవి, ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు వారి తల్లిదండ్రులు పెద్దసంఖ్యలో హాజరైనారు.
- వైభవంగా ప్రారంభమైన హనుమాన్ జయంతి వేడుకలు. మారుతి రాయుడి ఆశీస్సులు అందరిపై ఉండాలి. బద్వేలు: పట్టణంలోని సిద్ధవటం రోడ్డు సుమిత్ర నగర్ లో గల శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు అభయ ఆంజనేయ స్వామి దేవాలయం శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవం సందర్భంగా ఆలయంలో అభయ ఆంజనేయ స్వామి వారికి సోమవారం సాయంత్రం అత్యంత వైభవంగా విశేష అభిషేకం నిర్వహించారు. స్వామి వారి కృపా కటాక్షాల కోసం భక్తులందరూ తమ శక్తి కొలది కాయ, కర్పూరం, పూలు మరియు పండ్లతో సకాలంలో విచ్చేసి, ఈ దివ్య అభిషేక సేవలో పాల్గొనవలసిందిగా ఆలయ కమిటీ నిర్వాహకులు వి వి రమణ కోరారు. ఆ మారుతి రాయుడి ఆశీస్సులు అందరిపై ఉండాలని మనసారా ఆశిస్తూ...అందరికీ ఆహ్వానం! పలికారు, జై శ్రీరామ్! జై శ్రీమన్నారాయణ!!,2
- ప్రభు యేసుక్రీస్తు నామములో అందరికీ ఉదయపు శుభాభివందనాలు తెలిపారు. మీ చేతి పనులకు ఎదురయ్యే ఆటంకాలు తొలగి, క్షేమకరమైన దీవెనలు పొందుకోవాలని ఆశీర్వదించారు. మీరు అనేకులకు వెలుగుగా, దీవెనగా ఉండాలని ప్రార్థన చేశారు.1
- కాకినాడలోని గాంధీనగర్ ప్రాంతంలో అర్ధరాత్రి ఏపీఎస్పీ కానిస్టేబుల్ జి. నాగేశ్వరరావును గుర్తుతెలియని దుండగులు కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురవ్వగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.3
- కడపలో బీజేపీ నేతలపై పోలీసులు అమానుషంగా వ్యవహరించడంపై ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కడప బీజేపీ జిల్లా అధ్యక్షుడిపై చేయి చేసుకున్న డీఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తూ, పోలీసుల తీరును తీవ్రంగా ఖండించారు.1
- చంద్రగిరి తహశీల్దార్ కార్యాలయం పార్కింగ్ స్థలంగా మారడంతో పాటు, గ్రీవెన్స్ కార్యక్రమాలు ఆలస్యంగా ప్రారంభమవుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల రద్దీ మధ్య నడవలేక, గంటల తరబడి వేచి చూడలేక వృద్ధులు, మహిళలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు, ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.1
- అమరావతిలో మొదటి ఫేజ్ లో భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేదు. ఇప్పుడు రెండో ఫేజ్ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. భూములు ఇవ్వము అన్న రైతుల భూములను నిషేధిత జాబితాలో పెడతాం అని బెదిరిస్తున్నారు. సెకండ్ ఫేజ్ పేరుతో రైతులకు వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం చేస్తున్న బలవంతపు ల్యాండ్ పూలింగ్ ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తోంది. -పేర్ని నాని గారు, కృష్ణా జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు1
- అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం తుమ్మలవందలో ఉపాధి హామీ పనులు ప్రారంభమయ్యాయి. ఈ పనులతో స్థానికుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది, వారి జీవనోపాధికి భరోసా లభించింది.1
- రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ అధినేత మేడా శ్రీనివాస్ 2027 రాజమండ్రి పుష్కరాల ముహూర్తాన్ని పంచాంగం బదులు ఆగమ శాస్త్రం ప్రకారం మార్చాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. పవిత్ర గోదావరి జల ప్రయోజనాలు అందరికీ అందేలా చూడాలని, ఏర్పాట్లను సీతానగరం నుండి అంతర్వేది వరకు విస్తరించాలని ఆయన సూచించారు.1