కడుతుల గ్రామంలో నీటి సమస్యపై గిరిజన సంఘం హెచ్చరిక, వెంటనే పరిష్కరించాలి అల్లూరి జిల్లా కడుతుల గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా మారడంతో ఆదివాసి గిరిజన సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. బుధవారం గ్రామాన్ని సందర్శించిన మండల అధ్యక్షుడు కొర్ర నర్సయ్య, కార్యదర్శి ఎం.ఎం శ్రీను మాట్లాడుతూ— విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్ల లో వోల్టేజ్ సమస్య ఏర్పడి నీటి సరఫరా నిలిచిపోయిందన్నారు. పీవీడీజీ కుటుంబాలు ఉన్నప్పటికీ పీఎం జన్మన్ పథకం ద్వారా మంచినీరు ఎందుకు అందించడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దశాబ్దాలుగా సమస్యను పరిష్కరించడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు విఫలమయ్యారని మండిపడ్డారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయకపోవడం వల్ల సమస్య మరింత తీవ్రమైందన్నారు. వేసవిలో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ దాహంతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గతంలో బడ్జెట్ ప్రణాళికలు చేసినా అమలు కాలేదని విమర్శించారు. వారం రోజుల్లో సమస్య పరిష్కారం చేయకపోతే మహిళలతో కలిసి మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రామ మహిళలు, గిరిజనులు పాల్గొన్నారు.

- 🙏😭1
- శ్రీకాకుళం, ఏప్రిల్ 22 ; ప్రతి విద్యార్థి పర్యావరణ పరిరక్షణను ఒక బాధ్యతగా స్వీకరించినప్పుడే భవిష్యత్తు తరాలకు స్వచ్ఛమైన ధరిత్రిని అందించగలమని విజయనగరం జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ కె.ఆర్.డి. ప్రసాద్ పిలుపునిచ్చారు. ప్రపంచ ధరిత్రి దినోత్సవం పురస్కరించుకొని శ్రీకాకుళం జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ పి. జగన్మోహన్ రావు ఆదేశాల మేరకు బుధవారం నగరంలో భారీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రసాద్ గారు తొలుత విద్యార్థుల అవగాహన ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం రెడ్‌క్రాస్ పరిపాలనా భవనంలో నిర్వహించిన బహుమతుల ప్రధానోత్సవంలో ఆయన మాట్లాడుతూ.. మట్టి ప్రాముఖ్యతను గుర్తించి, ప్రకృతిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి కనీస ధర్మమన్నారు. విద్యార్థులు పర్యావరణ హిత చర్యలు చేపట్టి సమాజానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. అవగాహన ర్యాలీని ఆదిత్య డిగ్రీ మహిళా కళాశాల ప్రిన్సిపల్ కె. శివశంకర్, ప్రభుత్వ మహిళా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రెడ్‌క్రాస్ ఎంసీ కమిటీ సభ్యులు డాక్టర్ నిక్కపన్న, పి. శ్రీకాంత్, బి. చిన్మయిరావు, పి. వైకుంఠరావు, ప్రతినిధులు కె. సత్యనారాయణ, జి. రమణ, పి. చైతన్య కుమార్ తదితరులు పాల్గొన్నారు.4
- వృద్ధులు, బాటసారులకు తక్షణ శాంతి – మే 31 వరకు నిరంతరాయ సేవలు 📍 అనపర్తి నియోజకవర్గం | 22 ఏప్రిల్ 2026 ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు అనపర్తి మండలం పీరా రామచంద్రపురం గ్రామంలో మజ్జిగ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ చలివేంద్రాన్ని అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి బుధవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత అధికమవుతున్న ఈ సమయంలో ప్రజలకు తక్షణ ఉపశమనం అందించడం అత్యవసరమని పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధులు, బాటసారులు వడదెబ్బకు గురికాకుండా ఉండేందుకు మజ్జిగ వంటి శీతల పానీయాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. “మజ్జిగ సేవించడం ద్వారా శరీరానికి చల్లదనం లభించడమే కాకుండా, వడదెబ్బ వంటి ఆరోగ్య సమస్యల నుండి రక్షణ పొందవచ్చు,” అని ఆయన వివరించారు. ఈ చలివేంద్రం ద్వారా ఏప్రిల్ 22 నుండి మే 31 వరకు సుమారు రూ.1.30 లక్షల వ్యయంతో మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగించనున్నట్లు తెలిపారు. ప్రజలకు ఉపశమనం కలిగించాలనే లక్ష్యంతో ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టిన స్థానిక వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలను ఆయన అభినందించారు. కార్యక్రమం అనంతరం డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి స్వయంగా బాటసారులకు మజ్జిగను పంపిణీ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- Post by Meenakshi1
- మెలియాపుట్టి మండలంలో జలక లింగుపురం ప్రాథమికోన్నత పాఠశాల నందు హెచ్ఎం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పాఠశాల వార్షికోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారులు దేవేందర్ రావు, పద్మనాభరావులు హాజరయ్యారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ విద్య తోనే భవిష్యత్తు బాగుంటుందని అందరూ చక్కగా చదువుకోవాలని తెలిపారు.సర్పంచ్ ప్రతినిధి రవ్వల గణపతి బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులు వేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.ప్రత్యేకంగా సురేష్ మాస్టారు డాన్స్ ని అందరూ చూసి ఆనందించారు. చిన్నారులకు అభినందనలు తెలిపారు.1
- నల్లజర్ల మండలం అనంతపల్లి టోల్ గేట్ సమీపంలో 500 మీటర్ల సూచిక బోర్డును బుధవారం తెల్లవారుజామున కారు బలంగా ఢీకొంది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి కి తీవ్రగాయలై పరిస్థితి విషమంగా ఉంది. ఏలూరు వైపు నుంచి రాజమండ్రి వైపు వెళ్తుండగా ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. మృతదేహాలను గోపాలపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.1
- 🙏😭1
- చట్టాన్ని కాపాడాల్సిన వాళ్లే చట్టాన్ని ఉల్లంఘించడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు తక్షణమే వీరిపై ఉన్నతాధికారులు స్పందించాలి జిల్లా పంచాయతీ అధికారి అయిన బాలాజీ బేకరీ విచారణపై ఏడోళ్ల బయ్యారం గ్రామ పంచాయతీకి రావడం జరిగినది 21/04/2026 రోజున విచారణ చేయకుండా మాపై రాజకీయ కార్యకర్తలతో విచక్షణారహితమైన మాటలతో మరియు దౌర్జన్యానికి పాల్పడుతూ ఒక ప్రభుత్వ అధికారి అయిన జిల్లా పంచాయతీ అధికారి గారు పిటిషనరే మాట్లాడాలి తన భర్త అయినా ఎటువంటి అధికారం లేదు మాట్లాడడానికి బొగట రమాదేవి వైఫ్ ఆఫ్ పవన్ కుమార్ అయినా ఈ విషయంపై ఇద్దరికీ హక్కు ఉంటుంది అనే విధంగా మాట్లాడిన పిటిషనర్ కి సంబంధం ఉంటుంది అని మాట్లాడినాడు నేను ఒక గిరిజన బిడ్డను అయినందుకు తన నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ వైఫ్ ఆఫ్ లను ఎంతమంది అయినా పెట్టుకోవచ్చని అని నోటికి వచ్చినట్లు దూషించినాడు నేను ఒక గిరిజన బిడ్డగా పుట్టడమే నేను చేసుకున్న పాపమా గిరిజనులకు ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రభుత్వ అధికారుల దగ్గర కూడా న్యాయం జరగదా? అంటూ పిటిషన్ అధికారి అయిన ఒకటి రమాదేవి వైఫ్ అఫ్ పవన్ కుమార్ ప్రశ్నిస్తునారు ఈ విషయంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలి4
- Post by V Ramarao1