Shuru
Apke Nagar Ki App…
విజయనగరం: పార్వతీపురం జిల్లాలో ఏనుగుల భీభత్సం - తీవ్రంగా భయపడుతున్న ప్రజలు పార్వతీపురం మన్యం జిల్లా,భామిని మండలం, బిల్లుమడలో ఏనుగులు భీభత్సం సృష్టించాయి. మూడు ఏనుగుల గుంపులో ఒడిస్సా నుండి వచ్చిన మరో గున్న ఏనుగు చేరడంతో నాలుగు ఏనుగులు కలిపి పంటలను ధ్వంసం చేస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా అచ్యుతరావు అనే రైతుకు చెందిన మొక్కజొన్న పంటతో పాటు క్షేత్రంలో ఉన్న వ్యవసాయ మోటారు ను ఏనుగులు నాసనం చేసాయి. ఇంత జరుగుతున్నా ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
Journalist naidu
విజయనగరం: పార్వతీపురం జిల్లాలో ఏనుగుల భీభత్సం - తీవ్రంగా భయపడుతున్న ప్రజలు పార్వతీపురం మన్యం జిల్లా,భామిని మండలం, బిల్లుమడలో ఏనుగులు భీభత్సం సృష్టించాయి. మూడు ఏనుగుల గుంపులో ఒడిస్సా నుండి వచ్చిన మరో గున్న ఏనుగు చేరడంతో నాలుగు ఏనుగులు కలిపి పంటలను ధ్వంసం చేస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా అచ్యుతరావు అనే రైతుకు చెందిన మొక్కజొన్న పంటతో పాటు క్షేత్రంలో ఉన్న వ్యవసాయ మోటారు ను ఏనుగులు నాసనం చేసాయి. ఇంత జరుగుతున్నా ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- గాజువాక బీసీ గేట్ వద్ద ప్రయాణిస్తున్న ఓ వాహనంలో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు వాహనం నడుస్తుండగానే ఇంజిన్ భాగంలో నుంచి పొగలు రావడం గమనించిన ప్రయాణికులు వెంటనే అప్రమత్తమయ్యారు. మంటలు వేగంగా వ్యాపించడంతో వాహనంలో ఉన్న వారు భయాందోళనకు గురయ్యారు. అయితే అక్కడున్న తోటి ప్రయాణికులు పెట్రోల్ బంక్‌లో ఉన్న ఫైర్ సేఫ్టీ పరికరాలను ఉపయోగించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు1
- మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అరకు పర్యటనకు రానున్న నేపథ్యంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కుమారుడి వివాహ వేడుకలకు హాజరుకానున్న జగన్మోహన్ రెడ్డి రేపు ఉదయం 10 గంటల సమయంలో అరకు చేరుకుంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి పర్యటించే మార్గాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. వివాహ వేడుకలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించిన అనంతరం ఆయన తిరుగు ప్రయాణం అవుతారు.1
- Post by Shyam1
- మార్చి 3 శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం సంతబొమ్మాళి మండలం మరువాడ పంచాయతీ గుడ్డిమీదపేట, చొక్కరవానిపేట మరియు సూరాడవాని పేట సమీపంలో సర్పంచ్ ప్రతినిధి సూరాడ దాసురాజు తన సొంత నిధులతో యువకులు ఆడుకునేందుకు క్రికెట్ మైదానాన్నిఏర్పాటుచేసిమంగళవారం ఘనంగాప్రారంభించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తీర ప్రాంత యువకుల్లో క్రీడా నైపుణ్యాలు మెరుగ్గా ఉన్నాయని, వాటిని మరింత సానపెట్టేందుకు తాను కృషి చేస్తున్నానని తెలిపారు. గతంలో కూడా పంచాయతీలో రెండు క్రీడా మైదానాలు ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని, క్రీడలు మానసిక ఉల్లాసాన్ని, శారీరక దృఢత్వాన్ని పెంపొందిస్తాయని అన్నారు. రానున్న రోజుల్లో క్రికెట్ టోర్నమెంట్లు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని, క్రీడాకారులకు అవసరమైన సహాయం తన వంతుగా ఎప్పుడూ అందిస్తానని హామీ ఇచ్చారు. మైదానం ఏర్పాటు చేసిన దాసురాజుకు పలువురు క్రీడాకారులు, గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.4
- నరసన్నపేట : నిరుద్యోగులకు కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలుపరచాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మొజ్జాడ యుగంధర్ డిమాండ్ చేశారు. నరసన్నపేటలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. యువతకు ప్రభుత్వం మోసం చేస్తుందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని, తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేసి నియామక ప్రక్రియ చేపట్టాలని అన్నారు1
- పోలవరం జిల్లా... గంగవరం మండలం కొమరవరం గ్రామం నల్లగొండ అటవీ పరిసర ప్రాంతాల్లో పెద్దపులి ఉన్నట్టు సమాచారం. తాళ్లపాలెం అటవీ ప్రాంతం నుంచి పెద్దపులి వెళ్లినట్టు తెలుస్తుంది. పెద్దపులి కదలికలపై పొలాల్లోకి వెళ్లే రైతులు భయాందోళనకు గురవుతున్నారు. మరోపక్క అటవీ శాఖ సిబ్బంది ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేస్తున్నారు.1
- పార్వతీపురం మన్యం జిల్లా,భామిని మండలం, బిల్లుమడలో ఏనుగులు భీభత్సం సృష్టించాయి. మూడు ఏనుగుల గుంపులో ఒడిస్సా నుండి వచ్చిన మరో గున్న ఏనుగు చేరడంతో నాలుగు ఏనుగులు కలిపి పంటలను ధ్వంసం చేస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. తాజాగా అచ్యుతరావు అనే రైతుకు చెందిన మొక్కజొన్న పంటతో పాటు క్షేత్రంలో ఉన్న వ్యవసాయ మోటారు ను ఏనుగులు నాసనం చేసాయి. ఇంత జరుగుతున్నా ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు.1
- ASR:విద్యార్థుల పరీక్షల ప్రభావం వల్ల పాపికొండల విహారయాత్రకు వెళ్లే పర్యాటకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. మంగళవారం దేవీపట్నం మండలం నుంచి పాపికొండల విహారయాత్రకు రెండు పర్యాటక బోట్లలో 80 మంది పర్యాటకులు మాత్రమే వెళ్లారని టూరిజం శాఖ అధికారులు తెలిపారు. విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో పర్యాటక ప్రాంతాలకు వచ్చే వారి సంఖ్య తగ్గిపోయినట్లు చెప్పారు.1
- 🙏😭1