logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

డంపింగ్ యార్డ్ దహనం వల్ల కాలనీలో ఆరోగ్య సంక్షోభం – వాహనాల అడ్డగింత, ఆందోళన తీవ్రం ఏప్రిల్ 24:జగిత్యాల ఇందిరమ్మ అర్బన్ కాలనీ డబుల్ బెడ్‌రూమ్ ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డ్‌లో ప్రతిరోజూ చెత్తను తగలబెడుతున్న నేపథ్యంలో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డంపింగ్ యార్డ్ నుండి వెలువడుతున్న దట్టమైన పొగ కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. రోజుకు పలువురు చిన్నారులు ఆసుపత్రుల్లో చేరుతున్నారని, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించిన కాలనీవాసులు, ఇందిరమ్మ అర్బన్ కాలనీ పరిధిలోని రోడ్ నెంబర్ 11 వద్ద డంపింగ్ యార్డ్‌కు వెళ్లే చెత్త వాహనాలను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. దీంతో కొంతసేపు రాకపోకలు అంతరాయం కలిగాయి. డంపింగ్ యార్డ్‌లో పనిచేసే సిబ్బంది ప్రజలతో వాగ్వాదాలకు దిగుతున్నారని ఆరోపించిన స్థానికులు, తక్షణ చర్యలు తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.

3 hrs ago
user_Boga naga bhushanam
Boga naga bhushanam
జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
3 hrs ago

డంపింగ్ యార్డ్ దహనం వల్ల కాలనీలో ఆరోగ్య సంక్షోభం – వాహనాల అడ్డగింత, ఆందోళన తీవ్రం ఏప్రిల్ 24:జగిత్యాల ఇందిరమ్మ అర్బన్ కాలనీ డబుల్ బెడ్‌రూమ్ ప్రాంతంలో ఉన్న డంపింగ్ యార్డ్‌లో ప్రతిరోజూ చెత్తను తగలబెడుతున్న నేపథ్యంలో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డంపింగ్ యార్డ్ నుండి వెలువడుతున్న దట్టమైన పొగ కారణంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమవుతున్నారు. రోజుకు పలువురు చిన్నారులు ఆసుపత్రుల్లో చేరుతున్నారని, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించిన కాలనీవాసులు, ఇందిరమ్మ అర్బన్ కాలనీ పరిధిలోని రోడ్ నెంబర్ 11 వద్ద డంపింగ్ యార్డ్‌కు వెళ్లే చెత్త వాహనాలను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. దీంతో కొంతసేపు రాకపోకలు అంతరాయం కలిగాయి. డంపింగ్ యార్డ్‌లో పనిచేసే సిబ్బంది ప్రజలతో వాగ్వాదాలకు దిగుతున్నారని ఆరోపించిన స్థానికులు, తక్షణ చర్యలు తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలి జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లెలో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో పరిశీలన ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర అందుతుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లె గ్రామంలో ఐకేపీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో కల్పించిన వసతులను పరిశీలించారు. ఎంత ధాన్యం వస్తుందని, గన్ని బ్యాగ్స్ పై నిర్వాహకులను ఆరా తీశారు. ధాన్యం తేమ శాతం పరిశీలించారు. హమాలీలు ఎందరు ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో అన్ని వివరాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్ తో శుభ్రం చేయించాలని సూచించారు. టార్పాలిన్లు అందుబాటులో ఉండాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం అన్ని వసతులు కల్పించాలని సూచించారు. కేటాయించిన మిల్లులకు ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రానున్న సీజన్ లో రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలని పిలుపు నిచ్చారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.పరిశీలనలో జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, తహసీల్దార్ విజయ్ ప్రకాశ్ రావు, ఏపీఎం, ఏవో తదితరులు పాల్గొన్నారు.
    1
    కొనుగోలు కేంద్రాల్లోనే మద్దతు ధర
రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలి
జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్
తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లెలో ఐకేపీ కొనుగోలు కేంద్రంలో పరిశీలన
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు మద్దతు ధర అందుతుందని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లె గ్రామంలో ఐకేపీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రంలో కల్పించిన వసతులను పరిశీలించారు. ఎంత ధాన్యం వస్తుందని, గన్ని బ్యాగ్స్ పై నిర్వాహకులను ఆరా తీశారు. ధాన్యం తేమ శాతం పరిశీలించారు. హమాలీలు ఎందరు ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో అన్ని వివరాలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ధాన్యాన్ని ప్యాడీ క్లీనర్ తో శుభ్రం చేయించాలని సూచించారు. టార్పాలిన్లు అందుబాటులో ఉండాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన వివరాలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. నిబంధనల ప్రకారం అన్ని వసతులు కల్పించాలని సూచించారు.
కేటాయించిన మిల్లులకు ధాన్యం తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. రానున్న సీజన్ లో రైతులు సన్నరకం వడ్లు సాగు చేయాలని పిలుపు నిచ్చారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.పరిశీలనలో జిల్లా పౌర సరఫరాల అధికారి బుచ్చిబాబు, మేనేజర్ నరసింహ, తహసీల్దార్ విజయ్ ప్రకాశ్ రావు, ఏపీఎం, ఏవో తదితరులు పాల్గొన్నారు.
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    23 hrs ago
  • వరంగల్ జిల్లాలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఆర్టీసీ డ్రైవర్ తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ నర్సంపేట బస్టాండ్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం వరంగల్ తరలింపు
    1
    వరంగల్ జిల్లాలో పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ఆర్టీసీ డ్రైవర్
తెలంగాణ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయకుండా కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ నర్సంపేట బస్టాండ్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్ కోలా శంకర్ గౌడ్
పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం వరంగల్ తరలింపు
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    20 hrs ago
  • జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బెజ్జంకి గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభ ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ బొల్లం శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రామ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుదల, శుద్ధమైన తాగునీటి సరఫరా, వీధి దీపాల సక్రమ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని తీర్మానించారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్, ఉప సర్పంచ్ మహేష్, వార్డు సభ్యులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
    1
    జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బెజ్జంకి గ్రామంలో గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ప్రత్యేక గ్రామసభ ఘనంగా నిర్వహించారు. సర్పంచ్ బొల్లం శ్రీధర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో గ్రామ అభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుదల, శుద్ధమైన తాగునీటి సరఫరా, వీధి దీపాల సక్రమ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని తీర్మానించారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు కలిసి పనిచేయాలని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్, ఉప సర్పంచ్ మహేష్, వార్డు సభ్యులు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    43 min ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. స్థానిక కొత్త బస్టాండ్ ఆవరణలోని మూత్రశాలలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ పసికందును వదిలివెళ్లారు. గమనించిన స్థానికులు ఆడపసికందును చేరదీసి జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు. అధికారులు పాపను సురక్షితంగా రక్షించి, మెరుగైన వైద్య పరీక్షల నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాపకు చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. పసికందును అక్కడ వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తుల కోసం ఆరా తీస్తున్నారు.
    3
    రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. స్థానిక కొత్త బస్టాండ్ ఆవరణలోని మూత్రశాలలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ పసికందును వదిలివెళ్లారు. గమనించిన స్థానికులు ఆడపసికందును చేరదీసి జిల్లా శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పగించారు.
అధికారులు పాపను సురక్షితంగా రక్షించి, మెరుగైన వైద్య పరీక్షల నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం పాపకు చికిత్స అందిస్తున్నామని, ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. పసికందును అక్కడ వదిలివెళ్లిన గుర్తుతెలియని వ్యక్తుల కోసం ఆరా తీస్తున్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    15 hrs ago
  • నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని సుంకేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గురువారం ఒక అద్భుతమైన వేడుకకు వేదికైంది. అటు విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు, ఇటు పాఠశాల భద్రతకు యువత తోడ్పాటు కలగడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థులను, దాతలను ఒకే వేదికపై సత్కరించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ​ప్రతిభకు పట్టాభిషేకం ​పాఠశాలలో 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యా సంవత్సరంలో మొదటి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా సత్కరించింది. కేవలం విద్యార్థులనే కాకుండా, వారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను కూడా శాలువాలు కప్పి, జ్ఞాపికలతో గౌరవించడం ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత. ఈ గుర్తింపు విద్యార్థుల్లో మరింత పోటీ తత్వాన్ని, ఉత్సాహాన్ని నింపుతుందని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు. ​మన ఊరి బడి - మన బాధ్యత' ​గ్రామ యువత తమ సామాజిక బాధ్యతను చాటుకుంటూ పాఠశాల భద్రత కోసం ముందుకొచ్చారు. "మన ఊరి బడిని మనమే కాపాడుకుందాం" అనే నినాదంతో సుమారు 50 వేల రూపాయల వ్యయంతో 11 సీసీ కెమెరాలను పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. యువకులు జక్కుల నరేష్, బండి కిషన్, ఓడపల్లి నవీన్ ఈ కెమెరాలను ప్రారంభించారు. ఈ నిఘా నేత్రాలు పాఠశాల ఆస్తుల రక్షణకు విద్యార్థుల క్రమశిక్షణ పర్యవేక్షణకు ఎంతగానో దోహదపడతాయని వారు తెలిపారు. ​హర్షం వ్యక్తం చేసిన గ్రామస్థులు ​ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిలో యువత పోషిస్తున్న క్రియాశీలక పాత్రను గ్రామ పెద్దలు, ఉపాధ్యాయ బృందం కొనియాడారు. నాణ్యమైన విద్యతో పాటు ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహించడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    4
    నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలంలోని సుంకేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గురువారం ఒక అద్భుతమైన వేడుకకు వేదికైంది. అటు విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు, ఇటు పాఠశాల భద్రతకు యువత తోడ్పాటు కలగడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. విద్యార్థులను, దాతలను ఒకే వేదికపై సత్కరించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది.
​ప్రతిభకు పట్టాభిషేకం
​పాఠశాలలో 6వ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యా సంవత్సరంలో మొదటి మూడు ర్యాంకులు సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం ప్రత్యేకంగా సత్కరించింది. కేవలం విద్యార్థులనే కాకుండా, వారిని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను కూడా శాలువాలు కప్పి, జ్ఞాపికలతో గౌరవించడం ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత. ఈ గుర్తింపు విద్యార్థుల్లో మరింత పోటీ తత్వాన్ని, ఉత్సాహాన్ని నింపుతుందని ఉపాధ్యాయులు ఆకాంక్షించారు.
​మన ఊరి బడి - మన బాధ్యత'
​గ్రామ యువత తమ సామాజిక బాధ్యతను చాటుకుంటూ పాఠశాల భద్రత కోసం ముందుకొచ్చారు. "మన ఊరి బడిని మనమే కాపాడుకుందాం" అనే నినాదంతో సుమారు 50 వేల రూపాయల వ్యయంతో 11 సీసీ కెమెరాలను పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. యువకులు జక్కుల నరేష్, బండి కిషన్, ఓడపల్లి నవీన్ ఈ కెమెరాలను ప్రారంభించారు. ఈ నిఘా నేత్రాలు పాఠశాల ఆస్తుల రక్షణకు  విద్యార్థుల క్రమశిక్షణ పర్యవేక్షణకు ఎంతగానో దోహదపడతాయని వారు తెలిపారు.
​హర్షం వ్యక్తం చేసిన గ్రామస్థులు
​ప్రభుత్వ పాఠశాల అభివృద్ధిలో యువత పోషిస్తున్న క్రియాశీలక పాత్రను గ్రామ పెద్దలు, ఉపాధ్యాయ బృందం కొనియాడారు. నాణ్యమైన విద్యతో పాటు ఇలాంటి ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహించడం పట్ల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు  గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_MOHAMMAD SHAIK HUSSAIN
    MOHAMMAD SHAIK HUSSAIN
    బాల్కొండ, నిజామాబాద్, తెలంగాణ•
    16 hrs ago
  • సిద్దిపేట పట్టణం లో ఒకవైపు ఎండలు మండిపోతుండగా, మరోవైపు గురు వారం అకస్మాత్తుగా ఈదురుగాలులతో కూడిన వడగళ్ళ వాన కురిసింది. ఈ నేపథ్యంలో, రైతులు ధాన్యరాశులను భద్రపరుచుకోవాలని, ప్రజలు చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం పడేటప్పుడు సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని సూచించారు
    1
    సిద్దిపేట పట్టణం లో ఒకవైపు ఎండలు మండిపోతుండగా, మరోవైపు గురు వారం అకస్మాత్తుగా ఈదురుగాలులతో కూడిన వడగళ్ళ వాన కురిసింది. ఈ నేపథ్యంలో, రైతులు ధాన్యరాశులను భద్రపరుచుకోవాలని, ప్రజలు చెట్ల కింద లేదా విద్యుత్ స్తంభాల దగ్గర నిలబడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. వర్షం పడేటప్పుడు సురక్షితమైన ప్రదేశాల్లో ఉండాలని సూచించారు
    user_వేణు విలేకరి
    వేణు విలేకరి
    హుస్నాబాద్, సిద్దిపేట, తెలంగాణ•
    15 hrs ago
  • జగిత్యాల తెలంగాణ రాష్ట్ర పొర సరఫరాల సంస్థ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జగిత్యాల వారి ఆద్వర్యంలో  జగిత్యాల రూరల్ మండలం చల్గల్  వ్యవసాయ మార్కెట్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్....అదనపు కలెక్టర్ బి ఎస్ లతతో కలిసి గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, AMC ఛైర్మెన్ గడ్డం నారాయణరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, DCO మనోజ్ కుమార్, Dcso జితేందర్ రెడ్డి, తహసీల్దార్ హకీం, DMO ప్రకాష్, సెక్రటరీ శ్రీనివాస్ రావు,  ఏఎంసి డైరెక్టర్లు జయరాం, సురేష్, సత్తిరెడ్డి, నరేష్, గంగారెడ్డి, రాజన్న, సుర శ్రీనివాస్, పోచయ్య, అంజలి, రాజిరెడ్డి, రమేష్, శ్రీకాంత్, జిల్లా మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు గంగారెడ్డి, కట్ట రాజేందర్, dcc అధ్యక్షులు గాజంగి నందయ్య, నాయకులు బాల ముకుందం,చల్గల్ గ్రామ నాయకులు అబ్బూరి మల్లేశం గౌడ్,దాసరి సతీష్, శ్రీనివాస్, సర్పంచులు, నాయకులు,రైతులు,అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.
    1
    జగిత్యాల 
తెలంగాణ రాష్ట్ర పొర సరఫరాల సంస్థ, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం జగిత్యాల వారి ఆద్వర్యంలో  జగిత్యాల రూరల్ మండలం చల్గల్  వ్యవసాయ మార్కెట్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్....అదనపు కలెక్టర్ బి ఎస్ లతతో కలిసి గురువారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, AMC ఛైర్మెన్ గడ్డం నారాయణరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్, DCO మనోజ్ కుమార్, Dcso జితేందర్ రెడ్డి, తహసీల్దార్ హకీం, DMO ప్రకాష్, సెక్రటరీ శ్రీనివాస్ రావు,  ఏఎంసి డైరెక్టర్లు జయరాం, సురేష్, సత్తిరెడ్డి, నరేష్, గంగారెడ్డి, రాజన్న, సుర శ్రీనివాస్, పోచయ్య, అంజలి, రాజిరెడ్డి, రమేష్, శ్రీకాంత్, జిల్లా మండల సర్పంచుల ఫోరమ్ అధ్యక్షులు గంగారెడ్డి, కట్ట రాజేందర్, dcc అధ్యక్షులు గాజంగి నందయ్య, నాయకులు బాల ముకుందం,చల్గల్ గ్రామ నాయకులు అబ్బూరి మల్లేశం గౌడ్,దాసరి సతీష్, శ్రీనివాస్, సర్పంచులు, నాయకులు,రైతులు,అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.
    user_Sk chaitanya
    Sk chaitanya
    జగిత్యాల, జగిత్యాల, తెలంగాణ•
    5 hrs ago
  • హుస్నాబాద్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరిక – సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకూ కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు డిపో ముందు ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. బస్సులు డిపో నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకుంటూ ఆందోళనను తీవ్రతరం చేశారు. కార్మికులు తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నినాదాలు చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. వేతనాలు, ఉద్యోగ భద్రత, ఇతర సౌకర్యాల విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సమ్మె ప్రభావంతో హుస్నాబాద్ నుంచి నడిచే అనేక బస్సు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. అధికారులు కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సమ్మె ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేకపోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది.
    1
    హుస్నాబాద్‌లో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరిక – సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులకు ఇబ్బందులు
హుస్నాబాద్ ఆర్టీసీ బస్సు డిపో ఎదుట ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకూ కొనసాగుతోంది. తమ డిమాండ్ల సాధన కోసం కార్మికులు డిపో ముందు ధర్నా చేపట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. బస్సులు డిపో నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకుంటూ ఆందోళనను తీవ్రతరం చేశారు.
కార్మికులు తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నినాదాలు చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. వేతనాలు, ఉద్యోగ భద్రత, ఇతర సౌకర్యాల విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
సమ్మె ప్రభావంతో హుస్నాబాద్ నుంచి నడిచే అనేక బస్సు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. అధికారులు కార్మిక సంఘాలతో చర్చలు జరిపి సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. సమ్మె ఎప్పుడు ముగుస్తుందో స్పష్టత లేకపోవడంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది.
    user_ప్రభాకర్
    ప్రభాకర్
    Farmer బెజ్జంకి, సిద్దిపేట, తెలంగాణ•
    3 hrs ago
  • కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో డంపింగ్ యార్డ్ రద్దుకై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. పోతిరెడ్డిపేట నుంచి హుజురాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించారు. దాదాపు 10 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర లో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ కార్యకర్తలు, పలుగ్రామాల ప్రజలు పాల్గొన్నారు. వద్దంటే వద్దు డంపింగ్ యార్డ్ వద్దు అని నినాదాలు చేశారు. ఈ పాదయాత్ర హుజరాబాదుకె పరిమితం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహించే హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్, బీమదేవరపల్లి మండలాల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రాతినిధ్యం వహించే మానకొండూరు నియోజకవర్గాల పరిధిలో శంకరపట్నం మానకొండూర్ మండలాల్లో పాదయాత్ర చేపడుతామని తెలిపారు. ఎమ్మెల్యే లు రాజీనామా చేయడమో, డంపింగ్ యార్డు రద్దు కావడమో జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.
    3
    కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో డంపింగ్ యార్డ్ రద్దుకై ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. పోతిరెడ్డిపేట నుంచి హుజురాబాద్ వరకు పాదయాత్ర నిర్వహించారు. దాదాపు 10 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర 
లో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ కార్యకర్తలు, పలుగ్రామాల ప్రజలు పాల్గొన్నారు. వద్దంటే వద్దు డంపింగ్ యార్డ్ వద్దు అని నినాదాలు చేశారు. ఈ పాదయాత్ర హుజరాబాదుకె పరిమితం కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాతినిధ్యం వహించే హుస్నాబాద్ నియోజకవర్గంలోని సైదాపూర్, బీమదేవరపల్లి మండలాల్లో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రాతినిధ్యం వహించే మానకొండూరు నియోజకవర్గాల పరిధిలో శంకరపట్నం మానకొండూర్ మండలాల్లో పాదయాత్ర  చేపడుతామని తెలిపారు. ఎమ్మెల్యే లు రాజీనామా చేయడమో, డంపింగ్ యార్డు రద్దు కావడమో జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.