Shuru
Apke Nagar Ki App…
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో రోడ్డెక్కిన మొక్కజొన్న రైతన్నలు... మొక్కజొన్నలు తెచ్చి రెండు నెలలు అవుతున్న ఇప్పటి వరకు కొనుగోలు చేయకపోవడంతో రైతన్నలు రోడ్డెక్కి నిరసన తెలిపిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో జరిగింది. అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయి ఏ రాత్రి ఏం జరుగుతుందో అని ఇక్కడే కాపలా ఉండాల్సి వస్తుందనీ ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ధ్యానమును కొనుగోలు చేసి ఆదుకోవాలని అత్తా కోడళ్ళు వెంటనే రావాలాంటు యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.
Journalist Anil kumar
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల కేంద్రంలో రోడ్డెక్కిన మొక్కజొన్న రైతన్నలు... మొక్కజొన్నలు తెచ్చి రెండు నెలలు అవుతున్న ఇప్పటి వరకు కొనుగోలు చేయకపోవడంతో రైతన్నలు రోడ్డెక్కి నిరసన తెలిపిన ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలో జరిగింది. అకాల వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు వస్తున్నాయి ఏ రాత్రి ఏం జరుగుతుందో అని ఇక్కడే కాపలా ఉండాల్సి వస్తుందనీ ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ధ్యానమును కొనుగోలు చేసి ఆదుకోవాలని అత్తా కోడళ్ళు వెంటనే రావాలాంటు యశస్విని రెడ్డి, ఝాన్సీ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసారు.
More news from Telangana and nearby areas
- టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కలెక్టరేట్ ముట్టడి ధాన్యం కొనుగోలలో రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ సోమవారం బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ను ముట్టడించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందని ఆరోపించారు. కాంటాలు వేయడంలో నిర్లక్ష్యం చేస్తున్న కారణంగా రోజుల తరబడి రైతులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.1
- ఖమ్మం లో త్రాగునీటి సమస్య పరిష్కరించాలని సిపిఎం ఆధ్వర్యంలో ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన1
- గోదావరి బాధిత కుటుంబాలకు బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్ బాబు పరామర్శ MLG: కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురం గోదావరి ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలను బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్ బాబు సోమవారం పరామర్శించారు. రోయ్యూరు గ్రామంలో మృతుని కుటుంబ సభ్యులను ఓదార్చి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ విషాదాన్ని తట్టుకునే ధైర్యం కుటుంబ సభ్యులకు కలగాలని ఆకాంక్షిస్తూ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.1
- రైతుల ఇబ్బందులపై కరీంనగర్ ప్రజావాణి లో కలెక్టర్ కు పిర్యాదు చేసిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం....రైతులను ఇబ్బంది పెడితే తామే స్వయంగా ధర్నా చేస్తామని హెచ్చరిక ఆరుగాలం శ్రమించి పంటలు పండించిన రైతులు ధాన్యం అమ్ముకోవడానికి అష్ట కష్టాలు పడడానికి ప్రధాన కారణం రైస్ మిల్లర్లేనని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆరోపించారు. రైతు సమస్యలపై కరీంనగర్ కలెక్టరేట్ లో ప్రజావాణిలో కలెక్టర్ కు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పిర్యాదు చేశారు. రైతులు ఇబ్బంది పడకుండా త్వరితగతిన కొనుగోలు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని కోరారు. బ్యాగ్ లో 43 కేజీల ధాన్యం తూకం వేయడాన్ని వెంటనే అరికట్టాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్స్ నిర్లక్ష్యం వల్ల రైతులకు సమస్యలు తప్పడం లేదని ఎమ్మెల్యే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి మండలానికి ఒక స్పెషల్ ఆఫీసర్ ను పెట్టి నిరంతరం ధాన్యం కొనుగోలను పర్యవేక్షించాలని, టోల్ ఫ్రీ ఏర్పాటు చేసి రైతులకు సమస్యలు లేకుండా చూడాలని కోరారు. రైతులకు ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు ఇబ్బంది కలిగితే తామే స్వయంగా ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఎమ్మెల్యే ప్రస్తావించిన సమస్యలపై చర్యలు చేపడుతామని కలెక్టర్ చిత్రమిశ్రా ప్రకటించారు.2
- విద్యా, గ్రామాభివృద్ధి పనులకు మానకొండూరు ఎమ్మెల్యే శ్రీకారం మానకొండూరు ఎమ్మెల్యే, ఎస్సీ సెల్ చైర్మన్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో సోమవారం బెజ్జంకి మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. విద్యా వారోత్సవాల సందర్భంగా బెజ్జంకి కేజీబీవీలో రూ.60 లక్షల నిధులతో నిర్మించనున్న అదనపు తరగతి గదుల భవనానికి ఎమ్మెల్యే భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. పేద, బడుగు వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు. అనంతరం లక్ష్మీపూర్ గ్రామంలో రూ.25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్డును ప్రారంభించడంతో పాటు, ప్రభుత్వ హైస్కూల్‌లో రూ.6 లక్షలతో నిర్మించిన వంటగదిని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమాల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, మండల అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ పులి కృష్ణ, వైస్ చైర్మన్ చిలివేరి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీవో ప్రవీణ్, తహసీల్దార్ శ్రీకాంత్, ఎంఈఓ మహతి లక్ష్మి, ప్రిన్సిపాల్ శ్వేత, రావుల నరసయ్య, ఐలేని శ్రీనివాస్ రెడ్డి, బైర సంతోష్, రొడ్డ మల్లేశం, ఎర్రల రాజు, బోయిని ప్రశాంత్, నర్సింగం, మధుసూదన్ రెడ్డి, లక్ష్మీపూర్ సర్పంచ్ ముక్కిస కవిత, ఉపసర్పంచ్ హరీష్ తదితరులు పాల్గొన్నారు.5
- సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో ప్రముఖ వ్యాపారవేత్త నంగునూరు సత్యనారాయణ జన్మదినం సందర్భంగా నిరుపేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. నిత్యం ప్రజా సేవలో ఉంటూ, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనకు మరెన్నో జన్మదినాలు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు.4
- వరి ధాన్యం కొనుగోళ్లపై జనగామ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత.. సీపీఎం ధర్నాతో తోపులాట జనగామ జిల్లాలో వరి ధాన్యం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం నాయకులు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు అడ్డుకోవడంతో సీపీఎం నాయకులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ధాన్యం కొనుగోళ్లలో ఆలస్యం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం నేతలు ఆరోపించారు. కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే వరకు ధర్నా విరమించేది లేదంటూ నాయకులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించారు.1
- ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత: కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు MLG: ములుగు కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 67 దరఖాస్తులు అందగా, వాటిని ప్రాధాన్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భోర్కడే హేమంత్ సహదేవరావు అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్లు, పెన్షన్లు, భూ సమస్యలు తదితర అంశాలపై వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖలకు పంపించినట్లు తెలిపారు. అర్జిదారులు రసీదు ద్వారా తమ దరఖాస్తుల స్థితిని ఆన్‌లైన్‌లో తెలుసుకోవచ్చన్నారు.1
- కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్...గిరి ప్రదక్షణకు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేస్తామని హామీ ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజనేయ స్వామి ఆలయం వద్ద జరిగే గిరి ప్రదక్షణకు ప్రభుత్వ పరంగా ఏర్పాట్లు చేస్తామని రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా కొండగట్టును సందర్శించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆంజనేయస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. రాబోయే కాలంలో గిరి ప్రదక్షిణను మరింత ఘనంగా నిర్వహించేందుకు అందుకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. వేములవాడ కొండగట్టు ధర్మపురి మూడు పుణ్యక్షేత్రాలను కలుపుతూ టెంపుల్ కారిడార్ గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టుకు వచ్చే భక్తులు ఇబ్బంది పడకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు.3