Shuru
Apke Nagar Ki App…
Bondhu Suresh
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- బద్వేలు, ఏప్రిల్ 17: పట్టణంలోని మార్కెట్ యార్డ్ నందు గల రైతు బజార్ ను మార్కెట్ యార్డ్ చైర్మన్ నారిశెట్టి సుప్రజ సందర్శించారు. రైతులకు , ప్రజల కోసం కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బద్వేలు రైతు బజార్ లోని రైతులు , ప్రజల తో మాట్లాడటం జరిగింది . రైతు బజార్ లో ఏమైనా సమస్యలు ఉంటె పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది . ఈ కార్యక్రమం లో డైరెక్టర్ లు కుప్పయ్య యాదవ్ , సుబ్బారావు పాల్గొన్నారు .1
- నంద్యాల జిల్లా మహానంది పుణ్యక్షేత్రంలోని మహానందీశుని దంపతులకు శుక్రవారం సందర్భంగా పల్లకి సేవ వైభవంగా నిర్వహించారు. దేవస్థానం అలంకార మండపంలో శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువుదీర్చి వేదపండితులు ప్రత్యేకంగా అలంకరించి గణపతిపూజ , పుణ్యాహవాచనం , అలంకార పూజ , అలంకార హారతులు చేపట్టి వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా విశేష పూజలు నిర్వహించారు. ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ వేద పండితులు, అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పాటించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాకారంలో పల్లకిసేవ నిర్వహించారు. వివిధ ప్రాంతాల భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లను తిలకించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.1
- జిల్లా కేంద్రంలోని టాస్క్ సెంటర్లో ఈరోజు జాబ్ మేళా నిర్వహించగా 380 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరుకాగా 62 మందికి ఉద్యోగాలు లభించాలని ఉపాధి కల్పనాధికారి తిరుపతిరావు తెలిపారు1
- పెదకూరపాడు : జనగణన సర్వే 2027 మూడవరోజు శిక్షణ కార్యక్రమంలో భాగంగా తహశీల్దార్ ధనలక్ష్మి ఆధ్వర్యంలో శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. జడ్పీ హైస్కూల్ చిన్నారులచే కచేరి సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఎలిమినేటర్ ఫీల్డ్ కు వెళ్లి జనగణన సర్వే ప్రారంభిస్తారని తెలిపారు. గ్రామంలోని ప్రజలు తమ యొక్క వివరాలను సర్వే నిమిత్తం వచ్చిన ఎలిమినేటర్లకు క్లుప్తంగా వివరించాలని కోరారు.1
- *పలమనేరు ఇరిగేషన్ కార్యాలయంలో శుక్రవారం ACB అధికారులు సోదాలు నిర్వహించారు* . *పుంగనూరు మండలం, కంగానంపల్లి కి చెందిన కాంట్రాక్టర్ ఈశ్వర్ అలియాస్ ఆనంద్ 2017-18 సంవత్సరంలో చేసిన నీరు చెట్టు పనులకు ఆరు లక్షల రూపాయల బిల్లులు రావాల్సి ఉంది. 8 సంవత్సరాల నుండి బిల్లులు పెట్టాలని ఇరిగేషన్ కార్యాలయం చుట్టూ, అధికారుల చుట్టూ తిరుగుతున్నాడు.* పలమనేరు ఇరిగేషన్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న అబ్దుల్ రజాక్ బిల్లులు పెట్టాలంటే 15 వేల రూపాయలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించినట్లు ఏసీబీ డిఎస్పి సీతారామారావు తెలిపారు. చివరికి 13000 రూపాయలు ఇస్తానని చెప్పి, డబ్బులు ఇస్తుండగా ముందస్తుగానే రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా సీనియర్ అసిస్టెంట్ రజాక్ ను పట్టుకున్నట్లు ఏసీబీ డి.ఎస్.పి తెలిపారు.1
- పెద్దకొత్తపల్లి: నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం జొన్నల బొగుడ గేటు సమీపంలోని జాతీయ రహదారిపై శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మూడు వాహనాలు ప్రయాణిస్తున్న వాహనం మరో వాహనాన్ని బలంగా ఢీకొనడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. మంటలు భారీగా ఎగిసిపడటంతో వాహనం పూర్తిగా దహనమైంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.3
- Post by Bondhu Suresh1
- ఎమ్మెల్సీ భరత్.. రాక్షస ఆనందం పొందడానికి శ్రీహరిని అరెస్ట్ చేశారు.. తెలుగుదేశం పార్టీ నాయకులను సంతోష పరచడానికి చిత్తూరు నుండి పీపీలను రప్పించి శ్రీహరిని రిమాండ్ చేయాలని ప్రయత్నించారు.. చట్టం గెలుస్తుందని ఈ ఘటన ఒక ఉదాహరణ.. వైసీపీ పార్టీ ఎప్పటికీ న్యాయం వైపు నిలబడుతుంది.. జగన్మోహన్ రెడ్డి కోసం పోరాడడానికి కుప్పం నియోజకవర్గంలో కొన్ని వేల మంది కార్యకర్తలు ఉన్నారు..1
- తెలంగాణ కవిత ప్రెస్ మీట్ అందరికీ అధికారం అని మాట్లాడటం ప్రారంభించాకే నాకు కష్టాలు ప్రతి కష్టాన్ని పాఠంగా భావిస్తూ...సామాజిక తెలంగాణ సాధించే వరకు పోరాటం చేస్తా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత1