logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలో గంగా హాస్టల్ మూడో అంతస్తు పైనుండి అనుమానాస్పద స్థితిలో పడి ఒక విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో విద్యార్థినికి నడుము, కాలికి గాయాలైనట్లు సమాచారం. అధికారులు ఆమె స్వస్థలం సంగారెడ్డి జిల్లాలోని మనూరు మండలంగా గుర్తించారు. ఈ విషయం బయటకు రాకుండా ట్రిపుల్ ఐటీ కళాశాల యాజమాన్యం జాగ్రత్తపడింది. సంఘటన జరిగిన వెంటనే మీడియా సిబ్బంది కళాశాల ప్రధాన ద్వారం వద్దకు చేరుకోగా, అప్పటికే కళాశాల అంబులెన్స్‌లో విద్యార్థినిని నిజామాబాద్‌కు తరలించారు. మెరుగైన చికిత్స కోసం నిన్న సాయంత్రం నిజామాబాద్ నుండి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం, విద్యార్థిని ప్రమాదవశాత్తు జారిపడిందా లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అనే విషయాన్ని కళాశాల అధికారులు ఇంకా తేల్చలేదు. ఈ ఘటనతో విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు.

1 day ago
user_RP
RP
Academy బాసర, నిర్మల్, తెలంగాణ•
1 day ago

నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలో గంగా హాస్టల్ మూడో అంతస్తు పైనుండి అనుమానాస్పద స్థితిలో పడి ఒక విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో విద్యార్థినికి నడుము, కాలికి గాయాలైనట్లు సమాచారం. అధికారులు ఆమె స్వస్థలం సంగారెడ్డి జిల్లాలోని మనూరు మండలంగా గుర్తించారు. ఈ విషయం బయటకు రాకుండా ట్రిపుల్ ఐటీ కళాశాల యాజమాన్యం జాగ్రత్తపడింది. సంఘటన జరిగిన వెంటనే మీడియా సిబ్బంది కళాశాల ప్రధాన ద్వారం వద్దకు చేరుకోగా, అప్పటికే కళాశాల అంబులెన్స్‌లో విద్యార్థినిని నిజామాబాద్‌కు తరలించారు. మెరుగైన చికిత్స కోసం నిన్న సాయంత్రం నిజామాబాద్ నుండి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ప్రస్తుతం, విద్యార్థిని ప్రమాదవశాత్తు జారిపడిందా లేక మరేదైనా కారణాలు ఉన్నాయా అనే విషయాన్ని కళాశాల అధికారులు ఇంకా తేల్చలేదు. ఈ ఘటనతో విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం అమీర్ నగర్ గ్రామంలో మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మహిళా సంఘం భవనానికి శంకుస్థాపన చేశారు.
    1
    నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలం అమీర్ నగర్ గ్రామంలో మహిళా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో మానాల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన మహిళా సంఘం భవనానికి శంకుస్థాపన చేశారు.
    user_Bandi Laxman
    Bandi Laxman
    Local News Reporter కమ్మర్‌పల్లి, నిజామాబాద్, తెలంగాణ•
    18 hrs ago
  • లింగంపేట్ : ఉపాధి హామీ ద్వారా వలసలను నివారించవచ్చు.... లింగంపేట మండలం భవానిపేట్ గ్రామంలో ఉపాధి హామీ పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. ఉపాధి హామీ పనులు చేయడం వలన వలసలు నివారించవచ్చు ఈ పనుల ద్వారా చెరు వు పూడిక, కంధకాలు, మొక్కలు నాటడం, వంటి పనుల ద్వారా, గ్రామం లోప్రజలు ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతుంది ఈ పని.
    1
    లింగంపేట్ : ఉపాధి హామీ ద్వారా వలసలను నివారించవచ్చు....
లింగంపేట మండలం భవానిపేట్ గ్రామంలో ఉపాధి హామీ పనులు చేపట్టడం జరిగిందని అన్నారు. ఉపాధి హామీ పనులు చేయడం వలన వలసలు నివారించవచ్చు ఈ పనుల ద్వారా చెరు వు పూడిక, కంధకాలు, మొక్కలు నాటడం, వంటి పనుల ద్వారా, గ్రామం లోప్రజలు ఆర్థికంగా ఎదగడానికి దోహదపడుతుంది ఈ పని.
    user_Akula Mahender
    Akula Mahender
    లింగంపేట, కామారెడ్డి, తెలంగాణ•
    9 hrs ago
  • ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని కాండ్లీ గ్రామ సర్పంచ్ జాదవ్ అనిత రాంకిషన్, ఉప సర్పంచ్ గంగయ్య, గిన్నూర్ ఉప సర్పంచ్ రాజేందర్ యాదవ్, కాండ్లీ గ్రామ నాయక్, కొత్తపల్లి గ్రామ పటేల్ సహా పలువురు నాయకులు అధికార కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. వీరిని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, కేసీఆర్ పాలనలో పల్లెలు పచ్చగా, రైతులు సంతోషంగా, ప్రజల జీవితాలు సుభిక్షంగా ఉండేవని ప్రజలు స్పష్టం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ పాలన ఒక స్వర్ణయుగం అని ఆయన కొనియాడారు. మిషన్ భగీరథ, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి వేగంగా జరిగిందని, రైతులకు పెట్టుబడి సాయం, సాగునీటి సౌకర్యాలు అందించడంతో పాటు గ్రామ పంచాయతీల బలోపేతంతో పల్లెలు ప్రగతి బాటలో నడిచాయని వివరించారు. తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ పాలన ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిందని ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేసీఆర్ పాలన తెలంగాణకు స్వర్ణయుగమని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఈ సందర్భంగా మరోసారి నొక్కి చెప్పారు.
    2
    ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని కాండ్లీ గ్రామ సర్పంచ్ జాదవ్ అనిత రాంకిషన్, ఉప సర్పంచ్ గంగయ్య, గిన్నూర్ ఉప సర్పంచ్ రాజేందర్ యాదవ్, కాండ్లీ గ్రామ నాయక్, కొత్తపల్లి గ్రామ పటేల్ సహా పలువురు నాయకులు అధికార కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. వీరిని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ, కేసీఆర్ పాలనలో పల్లెలు పచ్చగా, రైతులు సంతోషంగా, ప్రజల జీవితాలు సుభిక్షంగా ఉండేవని ప్రజలు స్పష్టం చేస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేసీఆర్ పాలన ఒక స్వర్ణయుగం అని ఆయన కొనియాడారు. మిషన్ భగీరథ, రైతు బంధు, రైతు బీమా వంటి పథకాలతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి వేగంగా జరిగిందని, రైతులకు పెట్టుబడి సాయం, సాగునీటి సౌకర్యాలు అందించడంతో పాటు గ్రామ పంచాయతీల బలోపేతంతో పల్లెలు ప్రగతి బాటలో నడిచాయని వివరించారు. తెలంగాణ అభివృద్ధిలో కేసీఆర్ పాలన ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిందని ఆయన ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కేసీఆర్ పాలన తెలంగాణకు స్వర్ణయుగమని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఈ సందర్భంగా మరోసారి నొక్కి చెప్పారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter Bazarhatnoor, Adilabad•
    14 hrs ago
  • కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ రాజేశ్ చంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ రికార్డులను పరిశీలించారు. CCTNS అప్‌డేట్‌లను సక్రమంగా నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, రౌడీషీటర్లు, కేడీలపై ప్రత్యేక నిఘా ఉంచాలని రాజేశ్ చంద్ర సూచించారు. ప్రజలకు సత్వర న్యాయం అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు అధికారులను ఆదేశించారు.
    1
    కామారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఎస్పీ రాజేశ్ చంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టేషన్ రికార్డులను పరిశీలించారు. CCTNS అప్‌డేట్‌లను సక్రమంగా నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు.

పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించాలని, రౌడీషీటర్లు, కేడీలపై ప్రత్యేక నిఘా ఉంచాలని రాజేశ్ చంద్ర సూచించారు. ప్రజలకు సత్వర న్యాయం అందేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసు అధికారులను ఆదేశించారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    14 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన హుండీ ఆదాయ వివరాలను ఆలయ అధికారులు తాజాగా వెల్లడించారు. గత 28 రోజుల కాలానికి గాను, హుండీల ద్వారా ఆలయానికి నగదు రూపంలో ₹1,70,65,200/- (కోటి డెబ్బై లక్షల అరవై ఐదు వేల రెండు వందల రూపాయలు) ఆదాయం లభించింది. నగదుతో పాటు, భక్తులు 080 గ్రాములు 500 మిల్లీ గ్రాముల మిశ్రమ బంగారం, అలాగే 07 కిలోల 400 గ్రాముల మిశ్రమ వెండిని కూడా సమర్పించినట్లు అధికారులు తెలిపారు. ఈ హుండీ లెక్కింపు ప్రక్రియ ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి గారు, కరీంనగర్ ఏసీ ఆఫీస్ పరిశీలకులు రాజమౌళి గారు, మరియు డీఈవో భాస్కర శర్మ పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బందితో పాటు శ్రీ రాజరాజేశ్వర సేవాసమితి సభ్యులు కూడా పాల్గొన్నారు.
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు సమర్పించిన హుండీ ఆదాయ వివరాలను ఆలయ అధికారులు తాజాగా వెల్లడించారు. గత 28 రోజుల కాలానికి గాను, హుండీల ద్వారా ఆలయానికి నగదు రూపంలో ₹1,70,65,200/- (కోటి డెబ్బై లక్షల అరవై ఐదు వేల రెండు వందల రూపాయలు) ఆదాయం లభించింది.

నగదుతో పాటు, భక్తులు 080 గ్రాములు 500 మిల్లీ గ్రాముల మిశ్రమ బంగారం, అలాగే 07 కిలోల 400 గ్రాముల మిశ్రమ వెండిని కూడా సమర్పించినట్లు అధికారులు తెలిపారు.

ఈ హుండీ లెక్కింపు ప్రక్రియ ఆలయ ఈవో శ్రీమతి రమాదేవి గారు, కరీంనగర్ ఏసీ ఆఫీస్ పరిశీలకులు రాజమౌళి గారు, మరియు డీఈవో భాస్కర శర్మ పర్యవేక్షణలో జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయ కార్యనిర్వహణాధికారులు, పర్యవేక్షకులు, ఆలయ సిబ్బంది, పోలీస్ సిబ్బందితో పాటు శ్రీ రాజరాజేశ్వర సేవాసమితి సభ్యులు కూడా పాల్గొన్నారు.
    user_Sai
    Sai
    Local News Reporter కోనరావుపేట, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    1 hr ago
  • రైతులకు ఇబ్బందికరంగా మారిన యూరియా యాప్‌ను తక్షణమే నిషేధించాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎల్లారెడ్డిలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. రోడ్డుపైనే బైఠాయించి, గులాబీ కండువాలు ధరించి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ యాప్ వల్ల సామాన్య రైతులకు ఎరువుల కొనుగోలులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సాంకేతిక సమస్యల వల్ల సకాలంలో యూరియా దొరకక పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు జజాల సురేందర్ మాట్లాడుతూ, రైతుల సంక్షేమాన్ని విస్మరించి ఇటువంటి కఠినమైన యాప్‌లను ప్రవేశపెట్టడం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేసి, రైతులకు మునుపటిలాగే సులభంగా ఎరువులు అందేలా చూడాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ధర్నా కారణంగా ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై కాసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భద్రత దృష్ట్యా పోలీసులు భారీగా మోహరించారు.
    2
    రైతులకు ఇబ్బందికరంగా మారిన యూరియా యాప్‌ను తక్షణమే నిషేధించాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎల్లారెడ్డిలో భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. రోడ్డుపైనే బైఠాయించి, గులాబీ కండువాలు ధరించి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

ఈ యాప్ వల్ల సామాన్య రైతులకు ఎరువుల కొనుగోలులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సాంకేతిక సమస్యల వల్ల సకాలంలో యూరియా దొరకక పంటలు దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు జజాల సురేందర్ మాట్లాడుతూ, రైతుల సంక్షేమాన్ని విస్మరించి ఇటువంటి కఠినమైన యాప్‌లను ప్రవేశపెట్టడం సరికాదని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించి యూరియా యాప్‌ను వెంటనే రద్దు చేసి, రైతులకు మునుపటిలాగే సులభంగా ఎరువులు అందేలా చూడాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఈ ధర్నా కారణంగా ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై కాసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భద్రత దృష్ట్యా పోలీసులు భారీగా మోహరించారు.
    user_ప్రేమ్ కుమార్
    ప్రేమ్ కుమార్
    Interior designer నాగిరెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    18 hrs ago
  • మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ గురువారం రామాయంపేట మండలంలోని అక్కన్నపేటలో వన యోజన పార్కును ఘనంగా ప్రారంభించారు. వన మహోత్సవంలో భాగంగా వారు డీఎఫ్ఓ జోజి, డీఆర్‌డీఓ పీడీ శ్రీనివాసరావు, తహసీల్దార్ రజినిలతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, అక్కన్నపేట పార్కుకు కేంద్ర ప్రభుత్వం రూ. 2 కోట్లు, రాష్ట్రంలోని మొత్తం 11 పార్కులకు రూ. 22 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. జూలైలో 765 డీజీ రోడ్డులో మొదటి దశ కింద 20 వేల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కలెక్టర్ ప్రతిమ సింగ్ మాట్లాడుతూ, భావితరాల కోసం జిల్లాకు కేటాయించిన 31 లక్షల మొక్కల నాటే లక్ష్యాన్ని విజయవంతం చేయాలని కోరారు. నాటిన ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చేయాలని, మైనింగ్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి ఖాళీ స్థలాల్లో పెద్ద సంఖ్యలో చెట్లను నాటాలని సూచించారు. అంతకుముందు, వారు అటవీ శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కూడా తిలకించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
    1
    మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ గురువారం రామాయంపేట మండలంలోని అక్కన్నపేటలో వన యోజన పార్కును ఘనంగా ప్రారంభించారు. వన మహోత్సవంలో భాగంగా వారు డీఎఫ్ఓ జోజి, డీఆర్‌డీఓ పీడీ శ్రీనివాసరావు, తహసీల్దార్ రజినిలతో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ, అక్కన్నపేట పార్కుకు కేంద్ర ప్రభుత్వం రూ. 2 కోట్లు, రాష్ట్రంలోని మొత్తం 11 పార్కులకు రూ. 22 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. జూలైలో 765 డీజీ రోడ్డులో మొదటి దశ కింద 20 వేల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

కలెక్టర్ ప్రతిమ సింగ్ మాట్లాడుతూ, భావితరాల కోసం జిల్లాకు కేటాయించిన 31 లక్షల మొక్కల నాటే లక్ష్యాన్ని విజయవంతం చేయాలని కోరారు. నాటిన ప్రతి మొక్కను జియో ట్యాగింగ్ చేయాలని, మైనింగ్ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలను నియంత్రించడానికి ఖాళీ స్థలాల్లో పెద్ద సంఖ్యలో చెట్లను నాటాలని సూచించారు. అంతకుముందు, వారు అటవీ శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కూడా తిలకించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
    user_తుజాల శ్రీనివాస్ గౌడ్ TSG news channel
    తుజాల శ్రీనివాస్ గౌడ్ TSG news channel
    Local News Reporter రామాయంపేట, మెదక్, తెలంగాణ•
    12 hrs ago
  • కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖలో గురువారం సైబర్ నేరాలు మరియు ఓటీపీల మోసాలపై ఖాతాదారులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై దీపక్ కుమార్ మాట్లాడుతూ, గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంక్ ఖాతా వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదని ప్రజలను హెచ్చరించారు. బ్యాంక్ అధికారులు గానీ, పోలీస్ అధికారులు గానీ ఫోన్ చేసి ఓటీపీలు అడగరని ప్రజలు గుర్తించాలని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్సై దీపక్ కుమార్ సూచించారు. అంతేకాకుండా, ఇతర అత్యవసర సమయాల్లో 100 లేదా 112 నెంబర్లకు సమాచారం అందించాలని ఆయన కోరారు.
    1
    కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ శాఖలో గురువారం సైబర్ నేరాలు మరియు ఓటీపీల మోసాలపై ఖాతాదారులకు ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై దీపక్ కుమార్ మాట్లాడుతూ, గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీలు, బ్యాంక్ ఖాతా వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకూడదని ప్రజలను హెచ్చరించారు. బ్యాంక్ అధికారులు గానీ, పోలీస్ అధికారులు గానీ ఫోన్ చేసి ఓటీపీలు అడగరని ప్రజలు గుర్తించాలని ఆయన స్పష్టం చేశారు.

ఒకవేళ సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోతే వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ 1930కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని ఎస్సై దీపక్ కుమార్ సూచించారు. అంతేకాకుండా, ఇతర అత్యవసర సమయాల్లో 100 లేదా 112 నెంబర్లకు సమాచారం అందించాలని ఆయన కోరారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator బిర్కూర్, కామారెడ్డి, తెలంగాణ•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.