Shuru
Apke Nagar Ki App…
పెదలబుడు పంచాయతీ గాడుగూడలో రూ.14 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని సర్పంచ్ దాసుబాబుతో కలిసి డా.సియ్యారి దొన్నుదొర ప్రారంభించారు. ప్రీ ప్రైమరీ స్థాయి నుంచే నాణ్యమైన విద్య అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఉపాధ్యాయులపై యాప్‌ల భారం తగ్గించి, విద్యావ్యవస్థ బలోపేతానికి మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న చర్యలను ఆయన కొనియాడారు.
Shyam
పెదలబుడు పంచాయతీ గాడుగూడలో రూ.14 లక్షలతో నిర్మించిన అంగన్వాడీ భవనాన్ని సర్పంచ్ దాసుబాబుతో కలిసి డా.సియ్యారి దొన్నుదొర ప్రారంభించారు. ప్రీ ప్రైమరీ స్థాయి నుంచే నాణ్యమైన విద్య అందించేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఉపాధ్యాయులపై యాప్‌ల భారం తగ్గించి, విద్యావ్యవస్థ బలోపేతానికి మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న చర్యలను ఆయన కొనియాడారు.
More news from Alluri Sitharama Raju and nearby areas
- అల్లూరి సీతారామరాజు జిల్లాలో శనివారం రాత్రి ఒక్కసారిగా భూమి స్వల్పంగా కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అరకువేలి, పాడేరు, పెదబయలు, ముంచింగిపుట్టు ప్రాంతాల్లో సుమారు 30 సెకెన్ల పాటు ప్రకంపనలు నమోదైనట్లు సమాచారం. రాత్రివేళ అందరూ నిద్రలో ఉండగానే భూమి ఒక్కసారిగా కంపించడంతో.. ఏం జరుగుతుందో అర్థంకాక ఇళ్లలో ఉన్నవారు బయటకు పరుగులు తీశారు. చాలామంది గిరిజనులు, గ్రామస్థులు భయంతో ఇళ్ల బయటే చాలా సేపు గడిపారు. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలోని సామాన్లు కిందపడినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రకంపనలు వచ్చిన వెంటనే అంతా సద్దుమణిగిపోయినా.. ఈ కంపనలతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై స్థానిక అధికారులు సమాచారం సేకరిస్తూ, జిల్లా కలెక్టరేట్‌కు వివరాలు అందించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా స్వల్ప భూప్రకంపనలు నమోదవుతున్న నేపథ్యంలో.. ఎప్పుడు ఎక్కడ భూమి కంపిస్తుందోనన్న భయం ప్రజల్లో మరింత పెరిగింది. ఇక అరకులో పర్యటనకు వచ్చిన కొందరు పర్యాటకులు కూడా ఈ ప్రకంపనలతో ఒక్కసారిగా భయానికి గురయ్యారు. అల్లూరి జిల్లా ప్రజలను వణికించిన ఈ ఘటనపై అధికారులు మరింత స్పష్టత ఇవ్వాల్సి ఉంది.1
- అనకాపల్లి స్టేడియంలో ప్రారంభించిన. శ్రీ శ్రీ శ్రీ నూకంబిక అమ్మవారి నూతన ఆలయం ప్రారం బోత్స వo. అనకాపల్లి కమిటీ వారికి నా యొక్క ధన్యవాదాలు అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నా యొక్క ధన్యవాదాలు సహకరించినందుకు నా యొక్క ధన్యవాదాలు. ఈ వార్తలు ముఖ్యాంశాలు1
- రాజవొమ్మంగి మండలం జడ్డంగి మడేరు ఆనకట్ట సమీపంలో జాతీయ రహదారి–516పై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పింజరకొండ గ్రామానికి చెందిన రామిరెడ్డి (28) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో వెలుగుల లోవరాజు (25)కు తీవ్ర గాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో జడ్డంగి పీహెచ్‌సీకి తరలించారు. గేదెలు అకస్మాత్తుగా బైక్‌కు అడ్డు రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.1
- ఇప్పుడు ఎండాకాలం చాలా తీవ్రంగా ఉంది. ఈ వేడిలో మనం కూడా దాహంతో ఇబ్బంది పడుతున్నాము. అయితే పక్షులు, జంతువులు ఇంకా ఎక్కువ కష్టాలు పడుతున్నాయి. వాటికి తాగడానికి నీరు, తినడానికి ఆహారం దొరకడం చాలా కష్టం. కాబట్టి మనం చిన్న సహాయం చేయాలి. మన ఇళ్ల ముందు లేదా టెర్రస్‌పై ఒక గిన్నెలో నీరు పెట్టాలి. కొంచెం గింజలు లేదా బియ్యం కూడా పెట్టవచ్చు. ఈ చిన్న పని పక్షుల ప్రాణాలను కాపాడుతుంది. మనందరం కలిసి ఈ ఎండాకాలంలో పక్షులకు సహాయం చేద్దాం.1
- Post by Giridhar singh1
- Coolness isn’t something you find outside… it stays with you 🌊 MGM Cotton Vest keeps you fresh, light, and comfortable all day. Experience true comfort. #MGMVest #StayCool #CottonComfort #FreshFeel #MensWear #DailyWear #CoolVibes #InnerwearStyle1
- ఒడిస్సా నుంచి విశాఖపట్నం కారులో గంజాయిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను ఎల్.కోట పోలీసులు అరెస్ట్ చేసినట్లు విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తెలిపారు. వారి వద్ద నుండి .రూ10లక్షల విలువ గల 55 కిలోల గంజాయి, ఒక కారు, ఒక స్కూటీ, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ తెలిపారు.1
- దేశవ్యాప్తంగా వచ్చే నెలలో జనగణన కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా తుని పట్టణంలో తాసిల్దార్ ఆధ్వర్యంలో శనివారం నాడు ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, సర్వేయర్లు, వీఆర్వోలు, అధికారులు తో తాసిల్దార్ జి వి ఎస్ ప్రసాద్ జనగణన పై తీసుకోవలసిన అవసరం ల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.సెన్సస్ నిర్వహణలో భాగంగా HLB తయారీపై ప్రత్యేక దృష్టి సాధించాలని తెలిపారు. ప్రభుత్వం అందించిన మార్గదర్శకాలుకు అనుగుణంగా జనగణన ప్రక్రియ పూర్తి చేయాలని తాసిల్దార్ అధికారులకు తెలిపారు.1