Shuru
Apke Nagar Ki App…
అమ్మవారిని దర్శించుకున్న 65,000 మంది భక్తులు ఒక్కరోజు ఆదాయం 17 లక్షలు కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవ దేవస్థానం ఆదివారం అశేష భక్తజనంతో కళకళలాడింది. వేకువ జాము నుంచే వందలాది వాహనాల్లో భక్తజనం తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకున్నారు..సుమారు 65 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.ఆలయ పరిసరాల్లోనూ, ప్రైవేటు తోటల్లో ఉన్న కాటేజీల్లోనూ వంటలు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. వివిధ విభాగాల ద్వారా ఒక రోజు అమ్మవారికి రూ. 17.40 లక్షలు ఆదాయం వచ్చింది.. ఆలయ చైర్మన్ పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, ఈవో విశ్వనాథరాజు భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు..
Machha Mallesh
అమ్మవారిని దర్శించుకున్న 65,000 మంది భక్తులు ఒక్కరోజు ఆదాయం 17 లక్షలు కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవ దేవస్థానం ఆదివారం అశేష భక్తజనంతో కళకళలాడింది. వేకువ జాము నుంచే వందలాది వాహనాల్లో భక్తజనం తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకున్నారు..సుమారు 65 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.ఆలయ పరిసరాల్లోనూ, ప్రైవేటు తోటల్లో ఉన్న కాటేజీల్లోనూ వంటలు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. వివిధ విభాగాల ద్వారా ఒక రోజు అమ్మవారికి రూ. 17.40 లక్షలు ఆదాయం వచ్చింది.. ఆలయ చైర్మన్ పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, ఈవో విశ్వనాథరాజు భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు..
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- దత్తిరాజేరు: వంగర గ్రామం లో దేశమ్మ తల్లి వారాల పండగ.... దత్తిరాజేరు మండలం వంగర గ్రామం లో ఆదివారం దేశమ్మ తల్లి వారాలు పండగ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రతి సంవత్సరం వరి నాట్లకు ముందు అమ్మవారి పండగ చేయడం ఆనవాయితీగా వస్తుందనీ స్థానికులు తెలిపారు .అమ్మవారికి పసుపు కుంకుమ చీరలు తదితర మొక్కులు గ్రామ ప్రజలు సమర్పించారు. గ్రామ పురోహితుడు నారాయణ ఆధ్వర్యంలో పూజలు జరిపించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.1
- July in frames ✨ Farmers. Students. Youth. Women. From fields to protests to charity to empowerment - Grateful for this month of listening, learning, and connecting across every section and age group.1
- పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో ఘనంగా నివాళులు మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న పింగళి వెంకయ్య విగ్రహం వద్ద భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలను ఆకూరి శ్వేత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ భారత జాతీయ జెండా రూపకల్పనలో పింగళి వెంకయ్య చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన మహనీయుడిగా ఆయనను కొనియాడారు. యువత పింగళి వెంకయ్య ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లంకిశెట్టి బాలాజీ, చిలకలపూడి ఎస్సై యేసుబాబు, పెద్దిరాజులు, చందమామ బాబు తదితరులు పాల్గొని పింగళి వెంకయ్య చిత్రపటానికి, విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కార్యక్రమం దేశభక్తి నినాదాలు, జాతీయ గీతాలాపనతో గౌరవప్రదంగా ముగిసింది.1
- వైరా ద్వారకా నగర్ లో శ్రీ కృష్ణ బాల పోచమ్మ తల్లి దేవాలయంలో భక్తులు బోణాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు బోనాల వేడుక కార్యక్రమంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వైరా లో ఘనంగా బోనాల జాతర ఖమ్మం జిల్లా వైరా ద్వారకా నగర్ లో శ్రీ కృష్ణ బాల పోచమ్మ తల్లి దేవాలయంలో భక్తులు బోణాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు బోనాల వేడుక కార్యక్రమంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మున్సిపల్ చైర్మన్ DR కాపా చంద్రకళ అమ్మవారికి బోనమేత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్బంగా వైరా పట్టణం లో మహిళలు బోనాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ అషాడ మాసంలో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం శుభప్రధమని అన్నారు వైరా నియోజక వర్గ ప్రజలకు అమ్మవారి అశీసులు అందాలని కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ కాపా మురళీకృష్ణ , ఏఎంసీ చైర్మన్ బోళ్ల గంగారావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానికులు పాల్గొన్నారు1
- గుంటూరులో ఆటోల ఆగడాలు.బస్టాండ్ నుంచి విజయవాడ వెళ్లే రోడ్డు పైనే తిష్ట గుంటూరులో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగిస్తూ ఆటోవాలాలు రెచ్చిపోతున్నారు. పోలీసులను కూడా లెక్క చేయడం లేదు. గుంటూరు బస్టాండు నుంచి విజయవాడ పోయేటప్పుడు మనపురం బ్రిడ్జి పాయింట్ వద్ద.... ఓల్డ్ క్లబ్ నుండి వచ్చే వాహనాలు నుంచి వచ్చే వాహనాలకు తీవ్ర ఇబ్బందులు కలగజేస్తూ ఆటోవాలాలు రోడ్డుకు అడ్డంపెట్టిన వీడియోలు మీరు చూడవచ్చు.. అక్కడ ఆటో లు నిలుపుద చేయకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.1
- విద్యార్ధుల రెండు వర్గాలుగా విడిపోయి పరస్పర దాడులు.... హైదరాబాద్‌లోని చంపాపేట్ ఉన్న Aira Junior College విద్యార్థులు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులకు దిగారు. స్థానికులు Dial 100కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ఘర్షణకు గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.1