logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో ఘనంగా నివాళులు మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న పింగళి వెంకయ్య విగ్రహం వద్ద భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలను ఆకూరి శ్వేత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ భారత జాతీయ జెండా రూపకల్పనలో పింగళి వెంకయ్య చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన మహనీయుడిగా ఆయనను కొనియాడారు. యువత పింగళి వెంకయ్య ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లంకిశెట్టి బాలాజీ, చిలకలపూడి ఎస్సై యేసుబాబు, పెద్దిరాజులు, చందమామ బాబు తదితరులు పాల్గొని పింగళి వెంకయ్య చిత్రపటానికి, విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కార్యక్రమం దేశభక్తి నినాదాలు, జాతీయ గీతాలాపనతో గౌరవప్రదంగా ముగిసింది.

14 hrs ago
user_Arja Durga Prasad
Arja Durga Prasad
Local News Reporter మచిలీపట్నం, కృష్ణ, ఆంధ్రప్రదేశ్•
14 hrs ago

పింగళి వెంకయ్య 150వ జయంతి సందర్భంగా మచిలీపట్నంలో ఘనంగా నివాళులు మచిలీపట్నంలోని చిలకలపూడి పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న పింగళి వెంకయ్య విగ్రహం వద్ద భారత జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య 150వ జయంతి వేడుకలను ఆకూరి శ్వేత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పింగళి వెంకయ్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ భారత జాతీయ జెండా రూపకల్పనలో పింగళి వెంకయ్య చేసిన విశిష్ట సేవలను స్మరించుకున్నారు. దేశభక్తి, జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచిన త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన మహనీయుడిగా ఆయనను కొనియాడారు. యువత పింగళి వెంకయ్య ఆశయాలను ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో లంకిశెట్టి బాలాజీ, చిలకలపూడి ఎస్సై యేసుబాబు, పెద్దిరాజులు, చందమామ బాబు తదితరులు పాల్గొని పింగళి వెంకయ్య చిత్రపటానికి, విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. కార్యక్రమం దేశభక్తి నినాదాలు, జాతీయ గీతాలాపనతో గౌరవప్రదంగా ముగిసింది.

More news from తెలంగాణ and nearby areas
  • పుల్లారెడ్డి చెరువు కట్టపై వ్యర్థాల డంపింగ్............ సూర్యాపేట పట్టణంలోని పుల్లారెడ్డి చెరువు కట్ట మాంసాహార వ్యర్థాల డంపింగ్ కేంద్రంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికెన్, మటన్ వ్యర్థాలను విచ్చలవిడిగా పడేయడంతో చెత్తకుప్పలు పేరుకుపోయి దుర్వాసన, దోమల బెడద పెరిగిందన్నారు. ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన వ్యర్థాలను వెంటనే తొలగించి, చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హెచ్చరిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు.
    1
    పుల్లారెడ్డి చెరువు కట్టపై వ్యర్థాల డంపింగ్............
సూర్యాపేట పట్టణంలోని పుల్లారెడ్డి చెరువు కట్ట మాంసాహార వ్యర్థాల డంపింగ్ కేంద్రంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికెన్, మటన్ వ్యర్థాలను విచ్చలవిడిగా పడేయడంతో చెత్తకుప్పలు పేరుకుపోయి దుర్వాసన, దోమల బెడద పెరిగిందన్నారు. ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన వ్యర్థాలను వెంటనే తొలగించి, చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హెచ్చరిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు.
    user_K. UPENDER
    K. UPENDER
    Farmer నాదిగూడెం, సూర్యాపేట, తెలంగాణ•
    11 hrs ago
  • వైరా ద్వారకా నగర్ లో శ్రీ కృష్ణ బాల పోచమ్మ తల్లి దేవాలయంలో భక్తులు బోణాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు బోనాల వేడుక కార్యక్రమంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వైరా లో ఘనంగా బోనాల జాతర ఖమ్మం జిల్లా వైరా ద్వారకా నగర్ లో శ్రీ కృష్ణ బాల పోచమ్మ తల్లి దేవాలయంలో భక్తులు బోణాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు బోనాల వేడుక కార్యక్రమంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మున్సిపల్ చైర్మన్ DR కాపా చంద్రకళ అమ్మవారికి బోనమేత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్బంగా వైరా పట్టణం లో మహిళలు బోనాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ అషాడ మాసంలో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం శుభప్రధమని అన్నారు వైరా నియోజక వర్గ ప్రజలకు అమ్మవారి అశీసులు అందాలని కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ కాపా మురళీకృష్ణ , ఏఎంసీ చైర్మన్ బోళ్ల గంగారావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానికులు పాల్గొన్నారు
    1
    వైరా  ద్వారకా నగర్ లో శ్రీ కృష్ణ బాల పోచమ్మ తల్లి దేవాలయంలో భక్తులు బోణాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు బోనాల వేడుక కార్యక్రమంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్
వైరా లో ఘనంగా బోనాల జాతర 
ఖమ్మం జిల్లా వైరా  ద్వారకా నగర్ లో శ్రీ కృష్ణ బాల పోచమ్మ తల్లి దేవాలయంలో భక్తులు బోణాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు బోనాల వేడుక కార్యక్రమంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మున్సిపల్ చైర్మన్ DR కాపా చంద్రకళ అమ్మవారికి బోనమేత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్బంగా వైరా పట్టణం లో మహిళలు బోనాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ అషాడ మాసంలో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం శుభప్రధమని అన్నారు వైరా నియోజక వర్గ ప్రజలకు అమ్మవారి అశీసులు అందాలని కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ కాపా మురళీకృష్ణ , ఏఎంసీ చైర్మన్ బోళ్ల గంగారావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానికులు పాల్గొన్నారు
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    11 hrs ago
  • రేపటి బీసీ ప్రభుత్వంలో ప్రైవేట్ విద్యా వ్యవస్థకు ముగింపు – టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న ప్రజలకు నాణ్యమైన, సమానమైన మరియు ఉచిత విద్యను అందించడం లక్ష్యంగా రాబోయే బీసీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు టీఆర్పీ చీఫ్ తెలిపారు. ప్రస్తుత ప్రైవేట్ విద్యా వ్యవస్థ కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక భారం ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించే ప్రభుత్వ ఆధ్వర్యంలోని బలమైన విద్యా వ్యవస్థను నిర్మించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ దిశగా విద్యా రంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలకు సంబంధించిన సమగ్ర డ్రాఫ్ట్‌ను ఇప్పటికే సిద్ధం చేసినట్లు వెల్లడించారు. బీసీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ డ్రాఫ్ట్‌ను అమలు చేసి, విద్యను వ్యాపారం కాకుండా ప్రతి విద్యార్థి హక్కుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యలో అసమానతలను తొలగించి, ప్రభుత్వ విద్యాసంస్థలను అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయడం ద్వారా ప్రైవేట్ విద్యాసంస్థల అవసరం లేకుండా చేసే విధానాన్ని అమలు చేస్తామని టీఆర్పీ చీఫ్ తెలిపారు.
    1
    రేపటి బీసీ ప్రభుత్వంలో ప్రైవేట్ విద్యా వ్యవస్థకు ముగింపు – టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న 
ప్రజలకు నాణ్యమైన, సమానమైన మరియు ఉచిత విద్యను అందించడం లక్ష్యంగా రాబోయే బీసీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు టీఆర్పీ చీఫ్ తెలిపారు.
ప్రస్తుత ప్రైవేట్ విద్యా వ్యవస్థ కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక భారం ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించే ప్రభుత్వ ఆధ్వర్యంలోని బలమైన విద్యా వ్యవస్థను నిర్మించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ దిశగా విద్యా రంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలకు సంబంధించిన సమగ్ర డ్రాఫ్ట్‌ను ఇప్పటికే సిద్ధం చేసినట్లు వెల్లడించారు. బీసీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ డ్రాఫ్ట్‌ను అమలు చేసి, విద్యను వ్యాపారం కాకుండా ప్రతి విద్యార్థి హక్కుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
విద్యలో అసమానతలను తొలగించి, ప్రభుత్వ విద్యాసంస్థలను అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయడం ద్వారా ప్రైవేట్ విద్యాసంస్థల అవసరం లేకుండా చేసే విధానాన్ని అమలు చేస్తామని టీఆర్పీ చీఫ్ తెలిపారు.
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    11 hrs ago
  • అమ్మవారిని దర్శించుకున్న 65,000 మంది భక్తులు ఒక్కరోజు ఆదాయం 17 లక్షలు కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవ దేవస్థానం ఆదివారం అశేష భక్తజనంతో కళకళలాడింది. వేకువ జాము నుంచే వందలాది వాహనాల్లో భక్తజనం తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకున్నారు..సుమారు 65 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.ఆలయ పరిసరాల్లోనూ, ప్రైవేటు తోటల్లో ఉన్న కాటేజీల్లోనూ వంటలు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. వివిధ విభాగాల ద్వారా ఒక రోజు అమ్మవారికి రూ. 17.40 లక్షలు ఆదాయం వచ్చింది.. ఆలయ చైర్మన్ పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, ఈవో విశ్వనాథరాజు భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు..
    1
    అమ్మవారిని దర్శించుకున్న 65,000 మంది భక్తులు ఒక్కరోజు ఆదాయం 17 లక్షలు
కాకినాడ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ లోవ దేవస్థానం ఆదివారం అశేష భక్తజనంతో కళకళలాడింది. వేకువ జాము నుంచే వందలాది వాహనాల్లో భక్తజనం తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులు చెల్లించుకున్నారు..సుమారు 65 వేల మంది అమ్మవారిని దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.ఆలయ పరిసరాల్లోనూ, ప్రైవేటు తోటల్లో ఉన్న కాటేజీల్లోనూ వంటలు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. వివిధ విభాగాల ద్వారా ఒక రోజు అమ్మవారికి రూ. 17.40 లక్షలు ఆదాయం వచ్చింది.. ఆలయ చైర్మన్ పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, ఈవో విశ్వనాథరాజు భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నారు..
    user_Machha Mallesh
    Machha Mallesh
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • .మహబూబాబాద్ జిల్లా: సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న రిటైర్డ్ ఉద్యోగి దంపతులకు మహబూబాబాద్ పోలీసుల అండ.. మహబూబాబాద్ పట్టణానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి దంపతులు సైబర్ నేరగాళ్ల మోసానికి గురై భారీ మొత్తంలో డబ్బులు కోల్పోయారు. పోలీసులమంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు, "మీపై కేసు నమోదైంది.. మీకు డిజిటల్ అరెస్ట్ చేస్తాం" అంటూ బెదిరించి, భయాందోళనకు గురిచేసి బాధితుల నుంచి డబ్బులు తమ ఖాతాల్లో జమ చేయించుకున్నారు. మోసపోయిన విషయం తెలుసుకున్న బాధితులు వెంటనే మహబూబాబాద్ పోలీసులను ఆశ్రయించారు. జిల్లా ఎస్పీ శబరిష్ ఆదేశాల మేరకు డీఎస్పీ తిరుపతి రావు పర్యవేక్షణలో టౌన్ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే స్పందించి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో నేరగాళ్ల లావాదేవీలను గుర్తించి, బాధితులు కోల్పోయిన నగదును రికవరీ చేసి వారికి అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు తమ అనుభవాన్ని వివరించారు. పోలీసులమని చెప్పి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు, డిజిటల్ అరెస్ట్ పేరుతో తీవ్రంగా బెదిరించారని, భయంతో వారు చెప్పినట్లే డబ్బులు బదిలీ చేశామని తెలిపారు. అనంతరం మహబూబాబాద్ పోలీసులు వేగంగా స్పందించి తమ డబ్బులు తిరిగి ఇప్పించారని, జిల్లా ఎస్పీ శబరిష్, డీఎస్పీ తిరుపతి రావు, టౌన్ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసులమని చెప్పి ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు అడిగినా లేదా డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించినా వెంటనే నమ్మవద్దని, సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
    1
    .మహబూబాబాద్ జిల్లా:
సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న రిటైర్డ్ ఉద్యోగి దంపతులకు మహబూబాబాద్ పోలీసుల అండ..
మహబూబాబాద్ పట్టణానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి దంపతులు సైబర్ నేరగాళ్ల మోసానికి గురై భారీ మొత్తంలో డబ్బులు కోల్పోయారు. పోలీసులమంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు, "మీపై కేసు నమోదైంది.. మీకు డిజిటల్ అరెస్ట్ చేస్తాం" అంటూ బెదిరించి, భయాందోళనకు గురిచేసి బాధితుల నుంచి డబ్బులు తమ ఖాతాల్లో జమ చేయించుకున్నారు.
మోసపోయిన విషయం తెలుసుకున్న బాధితులు వెంటనే మహబూబాబాద్ పోలీసులను ఆశ్రయించారు. జిల్లా ఎస్పీ శబరిష్ ఆదేశాల మేరకు డీఎస్పీ తిరుపతి రావు పర్యవేక్షణలో టౌన్ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే స్పందించి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో నేరగాళ్ల లావాదేవీలను గుర్తించి, బాధితులు కోల్పోయిన నగదును రికవరీ చేసి వారికి అందజేశారు.
ఈ సందర్భంగా బాధితులు తమ అనుభవాన్ని వివరించారు. పోలీసులమని చెప్పి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు, డిజిటల్ అరెస్ట్ పేరుతో తీవ్రంగా బెదిరించారని, భయంతో వారు చెప్పినట్లే డబ్బులు బదిలీ చేశామని తెలిపారు. అనంతరం మహబూబాబాద్ పోలీసులు వేగంగా స్పందించి తమ డబ్బులు తిరిగి ఇప్పించారని, జిల్లా ఎస్పీ శబరిష్, డీఎస్పీ తిరుపతి రావు, టౌన్ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసులమని చెప్పి ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు అడిగినా లేదా డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించినా వెంటనే నమ్మవద్దని, సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    12 hrs ago
  • July in frames ✨ Farmers. Students. Youth. Women. From fields to protests to charity to empowerment - Grateful for this month of listening, learning, and connecting across every section and age group.
    1
    July in frames ✨ 
Farmers. Students. Youth. Women. 
From fields to protests to charity to empowerment - Grateful for this month of listening, learning, and connecting across every section and age group.
    user_Degala samson
    Degala samson
    Chef మణుగూరు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    12 hrs ago
  • శాకంబరీ దేవిగా దర్శనమిస్తున్న తలుపులమ్మ భక్తుల రద్దీతో కళకళలాడుతున్న ఆలయం కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ ఆలయంలో ఆషాడమాస ఆదివారం కావడంతో ఇసక వేస్తే రాలని విధంగా వేకువ జాము నుండి వాహనాల్లో భక్తలు లక్షలాదిగా లోవ క్షేత్రానికి చేరుకున్నారు. అమ్మవారిని శాకంబరీ దేవి అలంకరణలో అలంకరించారు. మూలవిరాట్ ఉత్సవ మూర్తులను శాకంబరి అలంకరణలో అలంకరించి భక్తుల దర్శనానికి అనుమతినిచ్చారు. బీరకాయ, వంకాయ, బెండకాయ ,టమాటా, బంగాళదుంప, కాకరకాయ, చామదుంపలు, పొట్లకాయలు ఇలా ఎన్నో రకాల కూరగాయలతో పాటు పండ్ల మధ్య దేదీప్యమానంగా కొండ గృహలో దర్శనమిస్తున్న అమ్మవారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుని ఆధ్యాత్మిక పారవశ్యం చెందారు. అమ్మవారి దర్శనం ఒక ఎత్తైతే ఇదే అటవీ ప్రాంతంలో కుటుంబాల సమేతంగా భక్తులు వంటావార్పు చేసుకుని ప్రసాదాలుగా స్వీకరించారు, ఏది ఏమైనా లోవక్షేత్రం భక్తజన సందోహంతో ఈ ఆదివారం దర్శనమిచ్చింది .
    1
    శాకంబరీ దేవిగా దర్శనమిస్తున్న తలుపులమ్మ భక్తుల రద్దీతో కళకళలాడుతున్న ఆలయం
కాకినాడ జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం తలుపులమ్మ ఆలయంలో ఆషాడమాస ఆదివారం కావడంతో ఇసక వేస్తే రాలని విధంగా వేకువ జాము నుండి వాహనాల్లో భక్తలు లక్షలాదిగా లోవ క్షేత్రానికి చేరుకున్నారు. అమ్మవారిని శాకంబరీ దేవి అలంకరణలో అలంకరించారు. మూలవిరాట్ ఉత్సవ మూర్తులను శాకంబరి అలంకరణలో అలంకరించి భక్తుల దర్శనానికి అనుమతినిచ్చారు. బీరకాయ, వంకాయ, బెండకాయ ,టమాటా, బంగాళదుంప, కాకరకాయ, చామదుంపలు, పొట్లకాయలు ఇలా ఎన్నో రకాల కూరగాయలతో పాటు పండ్ల మధ్య దేదీప్యమానంగా కొండ గృహలో దర్శనమిస్తున్న అమ్మవారిని భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకుని ఆధ్యాత్మిక పారవశ్యం చెందారు. అమ్మవారి దర్శనం ఒక ఎత్తైతే ఇదే అటవీ ప్రాంతంలో కుటుంబాల సమేతంగా భక్తులు  వంటావార్పు చేసుకుని ప్రసాదాలుగా స్వీకరించారు, ఏది ఏమైనా లోవక్షేత్రం భక్తజన సందోహంతో ఈ ఆదివారం దర్శనమిచ్చింది .
    user_Machha Mallesh
    Machha Mallesh
    Taxi Driver తుని, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • ప్రవీణ్ టూర్స్ అండ్ ట్రావెల్స్, సెల్ఫ్ డ్రైవ్ కార్స్ ప్రీమియం కార్ రెంటల్స్, అన్ని రకముల కార్లు సెల్ఫ్ అండ్ రెంటల్స్ కి ఇవ్వబడును వెడ్డింగ్ అండ్ పార్టీ ల కోసం కార్లు సప్లై చేయబడును
    1
    ప్రవీణ్ టూర్స్ అండ్ ట్రావెల్స్, సెల్ఫ్ డ్రైవ్ కార్స్ ప్రీమియం కార్ రెంటల్స్, అన్ని రకముల కార్లు సెల్ఫ్ అండ్ రెంటల్స్ కి ఇవ్వబడును 
వెడ్డింగ్ అండ్ పార్టీ ల కోసం కార్లు సప్లై చేయబడును
    user_Seelam Ashok Reddy
    Seelam Ashok Reddy
    Graphic designer మైలవరం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.