Shuru
Apke Nagar Ki App…
ప్రవీణ్ టూర్స్ అండ్ ట్రావెల్స్, సెల్ఫ్ డ్రైవ్ కార్స్ ప్రీమియం కార్ రెంటల్స్, అన్ని రకముల కార్లు సెల్ఫ్ అండ్ రెంటల్స్ కి ఇవ్వబడును వెడ్డింగ్ అండ్ పార్టీ ల కోసం కార్లు సప్లై చేయబడును
Seelam Ashok Reddy
ప్రవీణ్ టూర్స్ అండ్ ట్రావెల్స్, సెల్ఫ్ డ్రైవ్ కార్స్ ప్రీమియం కార్ రెంటల్స్, అన్ని రకముల కార్లు సెల్ఫ్ అండ్ రెంటల్స్ కి ఇవ్వబడును వెడ్డింగ్ అండ్ పార్టీ ల కోసం కార్లు సప్లై చేయబడును
More news from తెలంగాణ and nearby areas
- వైరా ద్వారకా నగర్ లో శ్రీ కృష్ణ బాల పోచమ్మ తల్లి దేవాలయంలో భక్తులు బోణాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు బోనాల వేడుక కార్యక్రమంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వైరా లో ఘనంగా బోనాల జాతర ఖమ్మం జిల్లా వైరా ద్వారకా నగర్ లో శ్రీ కృష్ణ బాల పోచమ్మ తల్లి దేవాలయంలో భక్తులు బోణాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు బోనాల వేడుక కార్యక్రమంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మున్సిపల్ చైర్మన్ DR కాపా చంద్రకళ అమ్మవారికి బోనమేత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్బంగా వైరా పట్టణం లో మహిళలు బోనాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ అషాడ మాసంలో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం శుభప్రధమని అన్నారు వైరా నియోజక వర్గ ప్రజలకు అమ్మవారి అశీసులు అందాలని కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ కాపా మురళీకృష్ణ , ఏఎంసీ చైర్మన్ బోళ్ల గంగారావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానికులు పాల్గొన్నారు1
- రేపటి బీసీ ప్రభుత్వంలో ప్రైవేట్ విద్యా వ్యవస్థకు ముగింపు – టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న ప్రజలకు నాణ్యమైన, సమానమైన మరియు ఉచిత విద్యను అందించడం లక్ష్యంగా రాబోయే బీసీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు టీఆర్పీ చీఫ్ తెలిపారు. ప్రస్తుత ప్రైవేట్ విద్యా వ్యవస్థ కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక భారం ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించే ప్రభుత్వ ఆధ్వర్యంలోని బలమైన విద్యా వ్యవస్థను నిర్మించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ దిశగా విద్యా రంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలకు సంబంధించిన సమగ్ర డ్రాఫ్ట్‌ను ఇప్పటికే సిద్ధం చేసినట్లు వెల్లడించారు. బీసీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ డ్రాఫ్ట్‌ను అమలు చేసి, విద్యను వ్యాపారం కాకుండా ప్రతి విద్యార్థి హక్కుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యలో అసమానతలను తొలగించి, ప్రభుత్వ విద్యాసంస్థలను అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయడం ద్వారా ప్రైవేట్ విద్యాసంస్థల అవసరం లేకుండా చేసే విధానాన్ని అమలు చేస్తామని టీఆర్పీ చీఫ్ తెలిపారు.1
- బిహారీలకు ఏదైనా సాధ్యమే….🐊* ఏకంగా మొసలినే మడతపెట్టేశాడు! బిహార్లో ఓ రైతు మొసలిని తాళ్లతో కట్టేసి భుజాలపై వేసుకొని వెళ్తున్న వీడియో వైరలవుతోంది. అమిత్ కుమార్ తన పొలంలో మొసలి కనిపించగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీస్కు వెళ్లాడు. అక్కడ సిబ్బంది లేకపోవడంతో అతడే దాన్ని తాళ్లతో బంధించి మోసుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు. తర్వాత అటవీ అధికారులు మొసలిని స్వాధీనం చేసుకొని నదిలో వదిలేశారు. బిహారీలకు ఏదైనా సాధ్యమేనని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.1
- .మహబూబాబాద్ జిల్లా: సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకున్న రిటైర్డ్ ఉద్యోగి దంపతులకు మహబూబాబాద్ పోలీసుల అండ.. మహబూబాబాద్ పట్టణానికి చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి దంపతులు సైబర్ నేరగాళ్ల మోసానికి గురై భారీ మొత్తంలో డబ్బులు కోల్పోయారు. పోలీసులమంటూ ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు, "మీపై కేసు నమోదైంది.. మీకు డిజిటల్ అరెస్ట్ చేస్తాం" అంటూ బెదిరించి, భయాందోళనకు గురిచేసి బాధితుల నుంచి డబ్బులు తమ ఖాతాల్లో జమ చేయించుకున్నారు. మోసపోయిన విషయం తెలుసుకున్న బాధితులు వెంటనే మహబూబాబాద్ పోలీసులను ఆశ్రయించారు. జిల్లా ఎస్పీ శబరిష్ ఆదేశాల మేరకు డీఎస్పీ తిరుపతి రావు పర్యవేక్షణలో టౌన్ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులు వెంటనే స్పందించి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలతో నేరగాళ్ల లావాదేవీలను గుర్తించి, బాధితులు కోల్పోయిన నగదును రికవరీ చేసి వారికి అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు తమ అనుభవాన్ని వివరించారు. పోలీసులమని చెప్పి ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు, డిజిటల్ అరెస్ట్ పేరుతో తీవ్రంగా బెదిరించారని, భయంతో వారు చెప్పినట్లే డబ్బులు బదిలీ చేశామని తెలిపారు. అనంతరం మహబూబాబాద్ పోలీసులు వేగంగా స్పందించి తమ డబ్బులు తిరిగి ఇప్పించారని, జిల్లా ఎస్పీ శబరిష్, డీఎస్పీ తిరుపతి రావు, టౌన్ పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పోలీసులమని చెప్పి ఎవరైనా ఫోన్ చేసి డబ్బులు అడిగినా లేదా డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించినా వెంటనే నమ్మవద్దని, సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ హెల్ప్‌లైన్‌కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు.1
- July in frames ✨ Farmers. Students. Youth. Women. From fields to protests to charity to empowerment - Grateful for this month of listening, learning, and connecting across every section and age group.1
- అమెరికాలో వరంగల్ కూచిపూడి నాట్య గురువుకు ప్రతిష్ఠాత్మక 'ఆటా' పురస్కారం వరంగల్: అమెరికా తెలుగు సంఘం (ఆటా) 19వ మహాసభలు, యూత్ కన్వెన్షన్‌లో వరంగల్‌కు చెందిన ప్రముఖ కూచిపూడి నాట్య గురువు బొంపెల్లి సుధీర్‌రావుకు ప్రతిష్ఠాత్మక 'ఆటా పురస్కారం' లభించింది. మూడు దశాబ్దాలుగా వందలాది మంది విద్యార్థులకు కూచిపూడి నృత్యంలో శిక్షణ అందించి, వారిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దిన సేవలకు గుర్తింపుగా ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, శిష్యులు సుధీర్‌రావును అభినందించారు.1
- నకిరేకల్ బోనాల ఉత్సవాల్లో స్వయంభూ కాళికామాతను దర్శించుకున్న నేతి విద్యాసాగర్, దైద రవీందర్ నకిరేకల్ నియోజకవర్గం:- నకిరేకల్ పట్టణ కేంద్రంలోని శ్రీ స్వయంభూ కాళికామాత 14వ ఆషాఢ బోనాల మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి శాసనమండలి చైర్మన్ శ్రీ నేతి విద్యాసాగర్ గారు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ దైద రవీందర్ గారు ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, ఇటువంటి ఉత్సవాలు ప్రజల్లో ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి, జటంగి వెంకటనర్సయ్య, కోట పుల్లయ్య, అరూరి వెంకటేశ్వర్లు, సకినాల రవికుమార్, ఆకుల నాగయ్య, సైదులుతో పాటు యూత్ కాంగ్రెస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.3