logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

నకిరేకల్ బోనాల ఉత్సవాల్లో స్వయంభూ కాళికామాతను దర్శించుకున్న నేతి విద్యాసాగర్, దైద రవీందర్ నకిరేకల్ నియోజకవర్గం:- నకిరేకల్ పట్టణ కేంద్రంలోని శ్రీ స్వయంభూ కాళికామాత 14వ ఆషాఢ బోనాల మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి శాసనమండలి చైర్మన్ శ్రీ నేతి విద్యాసాగర్ గారు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ దైద రవీందర్ గారు ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, ఇటువంటి ఉత్సవాలు ప్రజల్లో ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి, జటంగి వెంకటనర్సయ్య, కోట పుల్లయ్య, అరూరి వెంకటేశ్వర్లు, సకినాల రవికుమార్, ఆకుల నాగయ్య, సైదులుతో పాటు యూత్ కాంగ్రెస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

4 hrs ago
user_Nagesh Kothapalli
Nagesh Kothapalli
Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
4 hrs ago

నకిరేకల్ బోనాల ఉత్సవాల్లో స్వయంభూ కాళికామాతను దర్శించుకున్న నేతి విద్యాసాగర్, దైద రవీందర్ నకిరేకల్ నియోజకవర్గం:- నకిరేకల్ పట్టణ కేంద్రంలోని శ్రీ స్వయంభూ కాళికామాత 14వ ఆషాఢ బోనాల మహోత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి శాసనమండలి చైర్మన్ శ్రీ నేతి విద్యాసాగర్

fc376349-f98b-46c1-9d3c-3e60049c24d3

గారు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ దైద రవీందర్ గారు ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు వారికి ఘన స్వాగతం పలికి అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని, ఇటువంటి ఉత్సవాలు

329d2b20-eb92-40fd-a278-29c209a345fc

ప్రజల్లో ఐక్యత, ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తాయని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నకిరేకల్ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గార్లపాటి రవీందర్ రెడ్డి, జటంగి వెంకటనర్సయ్య, కోట పుల్లయ్య, అరూరి వెంకటేశ్వర్లు, సకినాల రవికుమార్, ఆకుల నాగయ్య, సైదులుతో పాటు యూత్ కాంగ్రెస్ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • రేపటి బీసీ ప్రభుత్వంలో ప్రైవేట్ విద్యా వ్యవస్థకు ముగింపు – టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న ప్రజలకు నాణ్యమైన, సమానమైన మరియు ఉచిత విద్యను అందించడం లక్ష్యంగా రాబోయే బీసీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు టీఆర్పీ చీఫ్ తెలిపారు. ప్రస్తుత ప్రైవేట్ విద్యా వ్యవస్థ కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక భారం ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించే ప్రభుత్వ ఆధ్వర్యంలోని బలమైన విద్యా వ్యవస్థను నిర్మించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ దిశగా విద్యా రంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలకు సంబంధించిన సమగ్ర డ్రాఫ్ట్‌ను ఇప్పటికే సిద్ధం చేసినట్లు వెల్లడించారు. బీసీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ డ్రాఫ్ట్‌ను అమలు చేసి, విద్యను వ్యాపారం కాకుండా ప్రతి విద్యార్థి హక్కుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యలో అసమానతలను తొలగించి, ప్రభుత్వ విద్యాసంస్థలను అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయడం ద్వారా ప్రైవేట్ విద్యాసంస్థల అవసరం లేకుండా చేసే విధానాన్ని అమలు చేస్తామని టీఆర్పీ చీఫ్ తెలిపారు.
    1
    రేపటి బీసీ ప్రభుత్వంలో ప్రైవేట్ విద్యా వ్యవస్థకు ముగింపు – టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న 
ప్రజలకు నాణ్యమైన, సమానమైన మరియు ఉచిత విద్యను అందించడం లక్ష్యంగా రాబోయే బీసీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు టీఆర్పీ చీఫ్ తెలిపారు.
ప్రస్తుత ప్రైవేట్ విద్యా వ్యవస్థ కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక భారం ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించే ప్రభుత్వ ఆధ్వర్యంలోని బలమైన విద్యా వ్యవస్థను నిర్మించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ దిశగా విద్యా రంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలకు సంబంధించిన సమగ్ర డ్రాఫ్ట్‌ను ఇప్పటికే సిద్ధం చేసినట్లు వెల్లడించారు. బీసీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ డ్రాఫ్ట్‌ను అమలు చేసి, విద్యను వ్యాపారం కాకుండా ప్రతి విద్యార్థి హక్కుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
విద్యలో అసమానతలను తొలగించి, ప్రభుత్వ విద్యాసంస్థలను అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయడం ద్వారా ప్రైవేట్ విద్యాసంస్థల అవసరం లేకుండా చేసే విధానాన్ని అమలు చేస్తామని టీఆర్పీ చీఫ్ తెలిపారు.
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    13 hrs ago
  • అత్యాచారాలకు పాల్పడేవారిని సమర్థించేవాడి కంటే నీచమైన మనిషి మరొకడు ఉండదు : రాహుల్ గాంధీ అత్యాచారాలకు పాల్పడేవారిని సమర్థించేవాడి కంటే నీచమైన మనిషి మరొకడు ఉండడు. ప్రహ్లాద్ జోషి మన విద్యా వ్యవస్థకు, అందులోని ప్రతి విద్యార్థికి అవమానం. ఆయన ఇప్పుడు పర్యవేక్షిస్తున్న సంస్థలలో కోట్లాది మంది యువతులు చదువుకుంటున్నారు. భారతదేశ మహిళలు ప్రధాని మోదీ కొత్త విద్యాశాఖ మంత్రిని ఎన్నటికీ అంగీకరించరు.
    1
    అత్యాచారాలకు పాల్పడేవారిని సమర్థించేవాడి కంటే నీచమైన  మనిషి మరొకడు ఉండదు : రాహుల్ గాంధీ
అత్యాచారాలకు పాల్పడేవారిని సమర్థించేవాడి కంటే నీచమైన మనిషి మరొకడు ఉండడు.
ప్రహ్లాద్ జోషి మన విద్యా వ్యవస్థకు, అందులోని ప్రతి విద్యార్థికి అవమానం. ఆయన ఇప్పుడు పర్యవేక్షిస్తున్న సంస్థలలో కోట్లాది మంది యువతులు చదువుకుంటున్నారు.
భారతదేశ మహిళలు ప్రధాని మోదీ కొత్త విద్యాశాఖ మంత్రిని ఎన్నటికీ అంగీకరించరు.
    user_Bachannapet, Jangoan, Telangan
    Bachannapet, Jangoan, Telangan
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    16 hrs ago
  • Celebrities who participated in the Banjara Teej festival celebrations *JAC President Jai Kumar, General Secretary & District Joint Secretary of Telangana Rajyadhikari Party Gandra Kamalakar Patel, JAC member Upender, BRS leaders Sainath Goud, Telangana Rajyadhikari Party leaders Sai Kiran, Dhanawat Nayak* and others participated in this program. On this occasion, the organizers, colony elders, women and youth who organized the Teej festival in a grand manner while preserving the Banjara culture and traditions were congratulated. Heartfelt Teej festival greetings to all Banjara brothers and sisters. 🌿🙏
    1
    Celebrities who participated in the Banjara Teej festival celebrations

*JAC President Jai Kumar, General Secretary & District Joint Secretary of Telangana Rajyadhikari Party Gandra Kamalakar Patel, JAC member Upender, BRS leaders Sainath Goud, Telangana Rajyadhikari Party leaders Sai Kiran, Dhanawat Nayak* and others participated in this program.
On this occasion, the organizers, colony elders, women and youth who organized the Teej festival in a grand manner while preserving the Banjara culture and traditions were congratulated. Heartfelt Teej festival greetings to all Banjara brothers and sisters. 🌿🙏
    user_SAI KIRAN TRP
    SAI KIRAN TRP
    కీసర, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    3 hrs ago
  • సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలలో పాల్గొన్న కేటీఆర్ సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు వారిని ఘనంగా స్వాగతించి శాలువాతో సన్మానించారు.
    1
    సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలలో పాల్గొన్న కేటీఆర్
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు వారిని ఘనంగా స్వాగతించి శాలువాతో సన్మానించారు.
    user_Sangareddy News
    Sangareddy News
    Local News Reporter Saidabad, Hyderabad•
    9 hrs ago
  • వైరా ద్వారకా నగర్ లో శ్రీ కృష్ణ బాల పోచమ్మ తల్లి దేవాలయంలో భక్తులు బోణాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు బోనాల వేడుక కార్యక్రమంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వైరా లో ఘనంగా బోనాల జాతర ఖమ్మం జిల్లా వైరా ద్వారకా నగర్ లో శ్రీ కృష్ణ బాల పోచమ్మ తల్లి దేవాలయంలో భక్తులు బోణాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు బోనాల వేడుక కార్యక్రమంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మున్సిపల్ చైర్మన్ DR కాపా చంద్రకళ అమ్మవారికి బోనమేత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్బంగా వైరా పట్టణం లో మహిళలు బోనాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ అషాడ మాసంలో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం శుభప్రధమని అన్నారు వైరా నియోజక వర్గ ప్రజలకు అమ్మవారి అశీసులు అందాలని కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ కాపా మురళీకృష్ణ , ఏఎంసీ చైర్మన్ బోళ్ల గంగారావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానికులు పాల్గొన్నారు
    1
    వైరా  ద్వారకా నగర్ లో శ్రీ కృష్ణ బాల పోచమ్మ తల్లి దేవాలయంలో భక్తులు బోణాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు బోనాల వేడుక కార్యక్రమంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్
వైరా లో ఘనంగా బోనాల జాతర 
ఖమ్మం జిల్లా వైరా  ద్వారకా నగర్ లో శ్రీ కృష్ణ బాల పోచమ్మ తల్లి దేవాలయంలో భక్తులు బోణాల జాతర వేడుకలు ఘనంగా నిర్వహించారు బోనాల వేడుక కార్యక్రమంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మున్సిపల్ చైర్మన్ DR కాపా చంద్రకళ అమ్మవారికి బోనమేత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్బంగా వైరా పట్టణం లో మహిళలు బోనాలతో భారీ ఊరేగింపు నిర్వహించారు ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మాట్లాడుతూ అషాడ మాసంలో పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించడం శుభప్రధమని అన్నారు వైరా నియోజక వర్గ ప్రజలకు అమ్మవారి అశీసులు అందాలని కోరారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు డాక్టర్ కాపా మురళీకృష్ణ , ఏఎంసీ చైర్మన్ బోళ్ల గంగారావు, పీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు,మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు స్థానికులు పాల్గొన్నారు
    user_Shekar Thaduri
    Shekar Thaduri
    ఎల్లందు, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    12 hrs ago
  • బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే: కేటీఆర్ హైదరాబాద్‌లో లష్కర్ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.1,800 కోట్లతో యాదాద్రి దేవాలయాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేశామని, హైదరాబాద్‌లోని అనేక దేవాలయాలకు కూడా నిధులు కేటాయించి అభివృద్ధి చేపట్టామని పేర్కొన్నారు. బోనాల పండుగకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన ప్రాధాన్యతను ఎవరూ విస్మరించలేరని ఆయన అన్నారు.
    1
    బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించింది బీఆర్ఎస్ ప్రభుత్వమే: కేటీఆర్
హైదరాబాద్‌లో లష్కర్ బోనాల సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడారు. బోనాలను రాష్ట్ర పండుగగా గుర్తించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని తెలిపారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.1,800 కోట్లతో యాదాద్రి దేవాలయాన్ని అత్యద్భుతంగా అభివృద్ధి చేశామని, హైదరాబాద్‌లోని అనేక దేవాలయాలకు కూడా నిధులు కేటాయించి అభివృద్ధి చేపట్టామని పేర్కొన్నారు. బోనాల పండుగకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన ప్రాధాన్యతను ఎవరూ విస్మరించలేరని ఆయన అన్నారు.
    user_Jeetender
    Jeetender
    Mobile Phone Accessory Shop సికింద్రాబాద్, హైదరాబాద్, తెలంగాణ•
    14 hrs ago
  • 'డిజిటల్ అరెస్ట్' పేరుతో సైబర్ మోసం.. బాధిత దంపతులకు నగదు రికవరీ చేసిన పోలీసులు మహబూబాబాద్‌కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి దంపతులను "డిజిటల్ అరెస్ట్" పేరుతో బెదిరించి సైబర్ నేరగాళ్లు భారీ మొత్తంలో నగదును మోసగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి మోసపోయిన నగదును రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మహేదర్ రెడ్డి మాట్లాడుతూ, "డిజిటల్ అరెస్ట్" పేరుతో ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసే సైబర్ నేరగాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని హెచ్చరించారు. ఇలాంటి అనుమానాస్పద కాల్స్ వచ్చిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తే సైబర్ మోసాలను నివారించవచ్చని తెలిపారు.
    1
    'డిజిటల్ అరెస్ట్' పేరుతో సైబర్ మోసం.. బాధిత దంపతులకు నగదు రికవరీ చేసిన పోలీసులు
మహబూబాబాద్‌కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి దంపతులను "డిజిటల్ అరెస్ట్" పేరుతో బెదిరించి సైబర్ నేరగాళ్లు భారీ మొత్తంలో నగదును మోసగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి మోసపోయిన నగదును రికవరీ చేసి బాధితులకు అందజేశారు.
ఈ సందర్భంగా సీఐ మహేదర్ రెడ్డి మాట్లాడుతూ, "డిజిటల్ అరెస్ట్" పేరుతో ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసే సైబర్ నేరగాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని హెచ్చరించారు. ఇలాంటి అనుమానాస్పద కాల్స్ వచ్చిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తే సైబర్ మోసాలను నివారించవచ్చని తెలిపారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    11 hrs ago
  • జర్నలిస్టుపై ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్టు చేసినా కూడా యజమాన్యులు ప్రశ్నించే దృష్టితో ఏర్పడింది :మాజీ మంత్రి కేటీఆర్ వాస్తవాలు చెప్తే చేదుగానే ఉంటాయి. మీడియా ఛానళ్లు ప్రభుత్వ చేతుల్లో బందీ అయ్యాయి. తెలంగాణలో ఓ కేంద్ర మంత్రి కొడుకు మైనర్ బాలికపై అఘాయిత్యం చేస్తే, వారం రోజుల వరకు మెయిన్‌స్ట్రీమ్ మీడియా చూపించకుండా ప్రభుత్వ పెద్దలు తొక్కిపెట్టారు. సోషల్ మీడియా లేకుంటే ఆ అమ్మాయికి న్యాయం జరిగేదే కాదు. జర్నలిస్టులపై ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్ట్ చేసినా కూడా యాజమాన్యాలు ప్రశ్నించలేని దుస్థితి ఏర్పడింది. – కేటీఆర్
    1
    జర్నలిస్టుపై ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్టు చేసినా కూడా యజమాన్యులు  ప్రశ్నించే దృష్టితో ఏర్పడింది :మాజీ మంత్రి కేటీఆర్ 
వాస్తవాలు చెప్తే చేదుగానే ఉంటాయి.
మీడియా ఛానళ్లు ప్రభుత్వ చేతుల్లో బందీ అయ్యాయి.
తెలంగాణలో ఓ కేంద్ర మంత్రి కొడుకు మైనర్ బాలికపై అఘాయిత్యం చేస్తే, వారం రోజుల వరకు మెయిన్‌స్ట్రీమ్ మీడియా చూపించకుండా ప్రభుత్వ పెద్దలు తొక్కిపెట్టారు.
సోషల్ మీడియా లేకుంటే ఆ అమ్మాయికి న్యాయం జరిగేదే కాదు.
జర్నలిస్టులపై ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్ట్ చేసినా కూడా యాజమాన్యాలు ప్రశ్నించలేని దుస్థితి ఏర్పడింది.
– కేటీఆర్
    user_Bachannapet, Jangoan, Telangan
    Bachannapet, Jangoan, Telangan
    Auditor బచ్చన్నపేట, జనగాం, తెలంగాణ•
    21 hrs ago
  • పొలంలో మహిళకు పాముకాటు – అప్రమత్తమైన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలింపు మహబూబాబాద్, శురు న్యూస్, ఆగస్టు 2: మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలంలోని సంక్రాం నాయక్ తండాకు చెందిన ఓ మహిళకు ఆదివారం పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా పాముకాటు వేసింది. ఆ సమయంలో పొలంలోనే ఉన్న స్థానికులు వెంటనే ఆమె పరిస్థితిని గుర్తించి అప్రమత్తంగా స్పందించారు. ఆలస్యం చేయకుండా తమ సొంత వాహనంలో ఆమెను మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చేశారు. వైద్యుల పర్యవేక్షణలో బాధిత మహిళకు చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వర్షాకాలంలో పొలాల్లో పని చేసే సమయంలో పాములు సంచరించే అవకాశం ఎక్కువగా ఉండటంతో రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పాముకాటు జరిగిన వెంటనే ఎలాంటి మూఢనమ్మకాలను ఆశ్రయించకుండా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స పొందాలని వారు సూచించారు. – నిమ్మనగంటి అనిల్ బాబు శురు న్యూస్, దోర్నకల్ రిపోర్టర్
    1
    పొలంలో మహిళకు పాముకాటు – అప్రమత్తమైన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలింపు
మహబూబాబాద్, శురు న్యూస్, ఆగస్టు 2: మహబూబాబాద్ జిల్లా సీరోల్ మండలంలోని సంక్రాం నాయక్ తండాకు చెందిన ఓ మహిళకు ఆదివారం పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా పాముకాటు వేసింది.
ఆ సమయంలో పొలంలోనే ఉన్న స్థానికులు వెంటనే ఆమె పరిస్థితిని గుర్తించి అప్రమత్తంగా స్పందించారు. ఆలస్యం చేయకుండా తమ సొంత వాహనంలో ఆమెను మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చేశారు.
వైద్యుల పర్యవేక్షణలో బాధిత మహిళకు చికిత్స కొనసాగుతోంది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
వర్షాకాలంలో పొలాల్లో పని చేసే సమయంలో పాములు సంచరించే అవకాశం ఎక్కువగా ఉండటంతో రైతులు, వ్యవసాయ కూలీలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. పాముకాటు జరిగిన వెంటనే ఎలాంటి మూఢనమ్మకాలను ఆశ్రయించకుండా సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స పొందాలని వారు సూచించారు.
– నిమ్మనగంటి అనిల్ బాబు
శురు న్యూస్, దోర్నకల్ రిపోర్టర్
    user_NIMMANAGANTI ANIL BABU
    NIMMANAGANTI ANIL BABU
    Local News Reporter డోర్నకల్, మహబూబాబాద్, తెలంగాణ•
    14 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.