Shuru
Apke Nagar Ki App…
'డిజిటల్ అరెస్ట్' పేరుతో సైబర్ మోసం.. బాధిత దంపతులకు నగదు రికవరీ చేసిన పోలీసులు మహబూబాబాద్‌కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి దంపతులను "డిజిటల్ అరెస్ట్" పేరుతో బెదిరించి సైబర్ నేరగాళ్లు భారీ మొత్తంలో నగదును మోసగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి మోసపోయిన నగదును రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మహేదర్ రెడ్డి మాట్లాడుతూ, "డిజిటల్ అరెస్ట్" పేరుతో ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసే సైబర్ నేరగాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని హెచ్చరించారు. ఇలాంటి అనుమానాస్పద కాల్స్ వచ్చిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తే సైబర్ మోసాలను నివారించవచ్చని తెలిపారు.
M D Azizuddin
'డిజిటల్ అరెస్ట్' పేరుతో సైబర్ మోసం.. బాధిత దంపతులకు నగదు రికవరీ చేసిన పోలీసులు మహబూబాబాద్‌కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి దంపతులను "డిజిటల్ అరెస్ట్" పేరుతో బెదిరించి సైబర్ నేరగాళ్లు భారీ మొత్తంలో నగదును మోసగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి మోసపోయిన నగదును రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మహేదర్ రెడ్డి మాట్లాడుతూ, "డిజిటల్ అరెస్ట్" పేరుతో ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసే సైబర్ నేరగాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని హెచ్చరించారు. ఇలాంటి అనుమానాస్పద కాల్స్ వచ్చిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తే సైబర్ మోసాలను నివారించవచ్చని తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- అత్యాచారాలకు పాల్పడేవారిని సమర్థించేవాడి కంటే నీచమైన మనిషి మరొకడు ఉండదు : రాహుల్ గాంధీ అత్యాచారాలకు పాల్పడేవారిని సమర్థించేవాడి కంటే నీచమైన మనిషి మరొకడు ఉండడు. ప్రహ్లాద్ జోషి మన విద్యా వ్యవస్థకు, అందులోని ప్రతి విద్యార్థికి అవమానం. ఆయన ఇప్పుడు పర్యవేక్షిస్తున్న సంస్థలలో కోట్లాది మంది యువతులు చదువుకుంటున్నారు. భారతదేశ మహిళలు ప్రధాని మోదీ కొత్త విద్యాశాఖ మంత్రిని ఎన్నటికీ అంగీకరించరు.1
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బిఆర్ఎస్ కాళేశ్వరం బాట... నిరంతరం నీటిని ఎత్తిపోసి మల్లన్న సాగర్ వరకు ప్రాజెక్టులన్ని నింపాలని డిమాండ్ కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ మంత్రులు చేస్తున్న విమర్శలు వారి అజ్ఞానానికి నిదర్శనమని బిఆర్ఎస్ నేతలు మాజీమంత్రులు విమర్శించారు. ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేర్ కు నీళ్ళ ఎత్తిపోతలు బిఆర్ఎస్ ప్రభుత్వ ఘనతేనని స్పష్టం చేశారు. కాళేశ్వరం బాట' కార్యక్రమంలో భాగంగా మాజీఎంపీ బోయినిపల్లి వినోద్‌కుమార్ నేతృత్వంలో మాజీ మంత్రులు గంగుల కమలాకర్ కొప్పుల ఈశ్వర్ జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎల్ రమణ, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ తో కూడిన బిఆర్ఎస్ ప్రతినిధుల బృందం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించింది. ముందుగా ఎల్లంపల్లి బ్యాక్ వాటర్ ను కోటిలింగాల వద్ద పరిశీలించారు. గోదావరిఝలాలను తలపై చల్లుకు కోటిలింగాలలో కోటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. అజ్ఞానంతో మాట్లాడుతున్న కాంగ్రెస్ నేతలకు మంత్రులకు జ్ఞానోదయం కల్పించాలని భగవంతుని వేడుకున్నారు. అనంతరం లక్ష్మీపూర్ లోని గాయత్రి పంప్ హౌస్ ను సందర్శించారు. బాహుబలి మోటర్ల ద్వారా మిడ్ మానేర్ కు, ఎస్సారెస్పీ వరద కాలువకు గోదావరి జలాల ఎత్తిపోతలను పరిశీలించి కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం కాదనడానికి ఈ నీళ్ళే నిదర్శనమని చాటి చెప్పారు. తెలంగాణ సాగు, తాగునీటి అవసరాలను తీర్చేందుకు కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ఒక అద్భుత ప్రాజెక్టని, ఇది 'కూళేశ్వరం' కాదని.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ ప్రతీక అని స్పష్టం చేశారు. అసలు గ్రావిటీ అంటే ఏమిటో కూడా తెలియని మంత్రులు.. ప్రాజెక్టులపై ఇష్టానుసారంగా మాట్లాడడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. మేడిగడ్డ నుంచి గాయత్రి పంప్‌హౌజ్ వరకు గ్రావిటీ లేదంటూ కాంగ్రెస్ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కరువుకు కాంగ్రెస్ పాలనే కారణమని ఆరోపించిన బీఆర్‌ఎస్ నేతలు.. మోటార్లు నిరంతరం ఆన్ చేసి, ఉత్తర తెలంగాణలోని జలాశయాలన్నింటినీ నింపాలని డిమాండ్ చేశారు.2
- పుల్లారెడ్డి చెరువు కట్టపై వ్యర్థాల డంపింగ్............ సూర్యాపేట పట్టణంలోని పుల్లారెడ్డి చెరువు కట్ట మాంసాహార వ్యర్థాల డంపింగ్ కేంద్రంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చికెన్, మటన్ వ్యర్థాలను విచ్చలవిడిగా పడేయడంతో చెత్తకుప్పలు పేరుకుపోయి దుర్వాసన, దోమల బెడద పెరిగిందన్నారు. ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన వ్యర్థాలను వెంటనే తొలగించి, చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. హెచ్చరిక బోర్డులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను డిమాండ్ చేశారు.1
- రేపటి బీసీ ప్రభుత్వంలో ప్రైవేట్ విద్యా వ్యవస్థకు ముగింపు – టీఆర్పీ చీఫ్ తీన్మార్ మల్లన్న ప్రజలకు నాణ్యమైన, సమానమైన మరియు ఉచిత విద్యను అందించడం లక్ష్యంగా రాబోయే బీసీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురానున్నట్లు టీఆర్పీ చీఫ్ తెలిపారు. ప్రస్తుత ప్రైవేట్ విద్యా వ్యవస్థ కారణంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఆర్థిక భారం ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించే ప్రభుత్వ ఆధ్వర్యంలోని బలమైన విద్యా వ్యవస్థను నిర్మించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ దిశగా విద్యా రంగంలో తీసుకురావాల్సిన సంస్కరణలకు సంబంధించిన సమగ్ర డ్రాఫ్ట్‌ను ఇప్పటికే సిద్ధం చేసినట్లు వెల్లడించారు. బీసీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ డ్రాఫ్ట్‌ను అమలు చేసి, విద్యను వ్యాపారం కాకుండా ప్రతి విద్యార్థి హక్కుగా మార్చేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. విద్యలో అసమానతలను తొలగించి, ప్రభుత్వ విద్యాసంస్థలను అత్యున్నత ప్రమాణాలతో అభివృద్ధి చేయడం ద్వారా ప్రైవేట్ విద్యాసంస్థల అవసరం లేకుండా చేసే విధానాన్ని అమలు చేస్తామని టీఆర్పీ చీఫ్ తెలిపారు.1
- 'డిజిటల్ అరెస్ట్' పేరుతో సైబర్ మోసం.. బాధిత దంపతులకు నగదు రికవరీ చేసిన పోలీసులు మహబూబాబాద్‌కు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి దంపతులను "డిజిటల్ అరెస్ట్" పేరుతో బెదిరించి సైబర్ నేరగాళ్లు భారీ మొత్తంలో నగదును మోసగించారు. బాధితుల ఫిర్యాదు మేరకు వెంటనే స్పందించిన పోలీసులు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టి మోసపోయిన నగదును రికవరీ చేసి బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా సీఐ మహేదర్ రెడ్డి మాట్లాడుతూ, "డిజిటల్ అరెస్ట్" పేరుతో ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసే సైబర్ నేరగాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మవద్దని హెచ్చరించారు. ఇలాంటి అనుమానాస్పద కాల్స్ వచ్చిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తే సైబర్ మోసాలను నివారించవచ్చని తెలిపారు.1
- సికింద్రాబాద్ బోనాల్లో అమెరికా కాన్సుల్ జనరల్........... సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో అమెరికా కాన్సుల్ జనరల్ లారా ఈ. విలియమ్స్ పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆమెకు ఘన స్వాగతం పలికారు. లారా ఈ. విలియమ్స్ అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోనాల పండుగ ఆధ్యాత్మిక, సాంస్కృతిక విశిష్టతను మంత్రి వివరించారు. తెలంగాణ-అమెరికా మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్, ఆలయ అధికారులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు1
- జర్నలిస్టుపై ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్టు చేసినా కూడా యజమాన్యులు ప్రశ్నించే దృష్టితో ఏర్పడింది :మాజీ మంత్రి కేటీఆర్ వాస్తవాలు చెప్తే చేదుగానే ఉంటాయి. మీడియా ఛానళ్లు ప్రభుత్వ చేతుల్లో బందీ అయ్యాయి. తెలంగాణలో ఓ కేంద్ర మంత్రి కొడుకు మైనర్ బాలికపై అఘాయిత్యం చేస్తే, వారం రోజుల వరకు మెయిన్‌స్ట్రీమ్ మీడియా చూపించకుండా ప్రభుత్వ పెద్దలు తొక్కిపెట్టారు. సోషల్ మీడియా లేకుంటే ఆ అమ్మాయికి న్యాయం జరిగేదే కాదు. జర్నలిస్టులపై ప్రభుత్వం కేసులు పెట్టి అరెస్ట్ చేసినా కూడా యాజమాన్యాలు ప్రశ్నించలేని దుస్థితి ఏర్పడింది. – కేటీఆర్1
- ప్రాణాలు తీసిన ఫ్రెండ్ షిప్ డే టూర్..! రెండు కుటుంబాల్లో విషాదం..! సరదాగా కలుద్దాం అనుకున్న స్నేహితుల జీవితాల్లో కోలుకోలేనంత విషాదం నింపిన ఫ్రెండ్ షిప్ డే..! ఫ్రెండ్‌షిప్ డే నాడు తీవ్ర విషాదం వైజాగ్ బీచ్‌లో అలల తాకిడికి గల్లంతైన ఇద్దరు స్నేహితులు..! ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ముందే ప్లాన్ చేసుకున్న ఆరుగురు స్నేహితులు ఆదివారం ఉదయం బీచ్‌కు వచ్చారు..! ప్రాణాలు తీసిన ఫ్రెండ్ షిప్ డే టూర్..! రెండు కుటుంబాల్లో విషాదం..! సరదాగా కలుద్దాం అనుకున్న స్నేహితుల జీవితాల్లో కోలుకోలేనంత విషాదం నింపిన ఫ్రెండ్ షిప్ డే..! ఫ్రెండ్‌షిప్ డే నాడు తీవ్ర విషాదం వైజాగ్ బీచ్‌లో అలల తాకిడికి గల్లంతైన ఇద్దరు స్నేహితులు..! ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా ముందే ప్లాన్ చేసుకున్న ఆరుగురు స్నేహితులు ఆదివారం ఉదయం బీచ్‌కు వచ్చారు..! అక్కడ ఉన్న రాళ్లపై నిలబడి ఫొటోలు దిగుతుండగా, వారు నిలబడిన చోట ఒక్కసారిగా విరుచుకుపడిన నీటి కెరటం...అమాంతం వాళ్ళను సముద్రంలోకి ఈడ్చుకెళ్లింది..! అందరూ ఎలాగోలా ఒడ్డుకు చేరగా.. పెదజాలరిపేటకు చెందిన నీతు అనే యువతి నీటిలో కొట్టుకుపోయింది.. కాస్త దూరంగా కొట్టుకుపోతూ కనిపించిన నీతూ ను కాపాడాలనే ఆతృతతో సముద్రంలోకి వెళ్ళిన వెళ్ళిన రాము అనే యువకుడు కూడా తిరిగి బయటకు రాలేదు..! ఇద్దరు స్నేహితులు గల్లంతు కావడంతో తీవ్ర భయకంపితులైన మిగిలిన వారు వెంటనే పోలీసులకు సమాచారమివ్వడంతో... వారు గజ ఈతగాళ్లను పిలిపించారు.. సేఫ్టీ బోట్ల ద్వారా సముద్రంలోకి వెళ్లి గల్లంతైన యువతీ యువకుడి కోసం గాలింపు చేపట్టారు..! ....... ........1