logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ఉపాధి హామీ పనులు ఎక్కడ? అధికారుల నిర్లక్ష్యం,300 జాబ్ కార్డులు ఉన్నా పని లేదు… ప్రజల ఆగ్రహం శివంపేట్ మండలం దొంతి గ్రామంలో ఉపాధి సమస్య తీవ్రంగా మారింది. గ్రామంలో సుమారు 300 మంది వద్ద జాబ్ కార్డులు ఉన్నప్పటికీ, గత ఒక సంవత్సరం నుంచి పనులు ఇవ్వడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సిపిఎం నాయకులు యం. అడివయ్య, ఏ. మహేందర్ రెడ్డి ఉపాధి హామీ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

on 20 March
user_ASHOK VENGANI
ASHOK VENGANI
Court reporter శివంపేట, మెదక్, తెలంగాణ•
on 20 March
6b23281d-7d27-4de8-b287-0144683ac677

ఉపాధి హామీ పనులు ఎక్కడ? అధికారుల నిర్లక్ష్యం,300 జాబ్ కార్డులు ఉన్నా పని లేదు… ప్రజల ఆగ్రహం శివంపేట్ మండలం దొంతి గ్రామంలో ఉపాధి సమస్య తీవ్రంగా మారింది. గ్రామంలో సుమారు 300 మంది వద్ద జాబ్ కార్డులు ఉన్నప్పటికీ, గత ఒక సంవత్సరం నుంచి పనులు ఇవ్వడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సిపిఎం నాయకులు యం. అడివయ్య, ఏ. మహేందర్ రెడ్డి ఉపాధి హామీ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

More news from తెలంగాణ and nearby areas
  • Post by Tagore
    3
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    12 hrs ago
  • వికారాబాద్ : వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం చైర్పర్సన్ గడ్డం అనన్య అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి వైస్ చైర్పర్సన్ అర్ధ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 14 అంశాలతో కూడిన ఎజెండాను కౌన్సిల్ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా పురపాలక సంఘ పరిధిలో ఎక్కడ కూడా నీటి సరఫరా సమస్యలు లేకుండా చూడాలని వీధి దీపాల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలను సరిగా చేయాలని అధికారులకు ఆదేశించారు.
    1
    వికారాబాద్ : వికారాబాద్ మున్సిపల్ కార్యాలయంలో శనివారం చైర్పర్సన్ గడ్డం అనన్య అధ్యక్షతన మున్సిపల్ కమిషనర్ విక్రమసింహారెడ్డి వైస్ చైర్పర్సన్ అర్ధ సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 14 అంశాలతో కూడిన ఎజెండాను కౌన్సిల్ సభ్యులందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ వేసవికాలం దృష్ట్యా పురపాలక సంఘ పరిధిలో ఎక్కడ కూడా నీటి సరఫరా సమస్యలు లేకుండా చూడాలని వీధి దీపాల నిర్వహణ సక్రమంగా జరిగేలా చూడాలని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలను సరిగా చేయాలని అధికారులకు ఆదేశించారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    10 hrs ago
  • రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో తెలంగాణ ప్రభుత్వము చేపట్టిన “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 2026” లో భాగంగా 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కింద శనివారం (04-04-2026) అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజారక్షణ (ఫైర్) శాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఫైర్ సేఫ్టీ డ్రిల్ (Fire Safety Drill) ద్వారా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, అగ్నిప్రమాదాలను ఎలా నివారించాలి అనే విషయాలను ప్రాక్టికల్‌గా వివరించారు.ఆలయ ఈవో ఎల్. రమాదేవి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) సిబ్బందికి అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగ విధానం వంటి అంశాలను వివరించారు. ఫైర్ సిబ్బంది ఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి ప్రాక్టికల్‌గా ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై ప్రదర్శన నిర్వహించారు.దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు
    1
    రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం లో తెలంగాణ ప్రభుత్వము చేపట్టిన “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 2026” లో భాగంగా 99 రోజుల కార్యచరణ ప్రణాళిక కింద శనివారం (04-04-2026) అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ప్రజారక్షణ (ఫైర్) శాఖ ఆధ్వర్యంలో వేములవాడ ఫైర్ స్టేషన్ సిబ్బంది నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన ఫైర్ సేఫ్టీ డ్రిల్ (Fire Safety Drill) ద్వారా అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి, అగ్నిప్రమాదాలను ఎలా నివారించాలి అనే విషయాలను ప్రాక్టికల్‌గా వివరించారు.ఆలయ ఈవో ఎల్. రమాదేవి కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) సిబ్బందికి అగ్నిప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫైర్ ఎక్స్టింగ్విషర్ వినియోగ విధానం వంటి అంశాలను వివరించారు. ఫైర్ సిబ్బంది ఎస్పీఎఫ్ సిబ్బందితో కలిసి ప్రాక్టికల్‌గా ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై ప్రదర్శన నిర్వహించారు.దేవస్థానానికి వచ్చే భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఇటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఉపయోగకరమని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు
    user_Satheesh gangu
    Satheesh gangu
    జర్నలిస్ట్ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల, తెలంగాణ•
    12 hrs ago
  • పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యులు మల్లా రాజిరెడ్డి 46 ఏళ్ళ తర్వాత స్వస్థలానికి చేరారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో ఇటీవల అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసిన మల్లా రాజిరెడ్డి మంథనికి చేరుకుని కుటుంబసభ్యులు, బంధుమిత్రులను కలుసుకున్నారు. ఆత్మీయ పలకరింపులతో ఆనందంగా గడిపిన మల్లా రాజిరెడ్డి చాలాకాలం విప్లవోద్యమంలో పనిచేశానని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తే చట్టబద్దంగా సామాజిక సేవ చేస్తానని తెలిపారు. రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
    2
    పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యులు మల్లా రాజిరెడ్డి 46 ఏళ్ళ తర్వాత స్వస్థలానికి చేరారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో ఇటీవల అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసిన మల్లా రాజిరెడ్డి మంథనికి చేరుకుని కుటుంబసభ్యులు, బంధుమిత్రులను కలుసుకున్నారు. ఆత్మీయ పలకరింపులతో ఆనందంగా గడిపిన మల్లా రాజిరెడ్డి చాలాకాలం విప్లవోద్యమంలో పనిచేశానని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తే చట్టబద్దంగా సామాజిక సేవ చేస్తానని తెలిపారు.
రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    7 hrs ago
  • *పేకాట స్థావరంపై CCS టీం మెరుపుదాడి – నలుగురు అరెస్ట్* నేడు *గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS.,* గారి ఆదేశాల మేరకు CCS ఏసీపీ మస్తాన్ అలీ గారి ఆధ్వర్యంలో CCS సిబ్బంది పేకాట స్థావరంపై మెరుపుదాడి నిర్వహించారు. జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కలిగొట్ గ్రామ శివారులో నడుస్తున్న పేకాట స్థావరంపై నేడు దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి నాలుగు వాహనాలు, మూడు సెల్‌ఫోన్లు మరియు రూ.10,940 నగదు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వ్యక్తులను మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్ SHO గారికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
    1
    *పేకాట స్థావరంపై CCS టీం మెరుపుదాడి – నలుగురు అరెస్ట్*
నేడు *గౌరవనీయులు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, IPS.,* గారి ఆదేశాల మేరకు CCS ఏసీపీ మస్తాన్ అలీ గారి ఆధ్వర్యంలో CCS సిబ్బంది పేకాట స్థావరంపై మెరుపుదాడి నిర్వహించారు.
జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కలిగొట్ గ్రామ శివారులో నడుస్తున్న పేకాట స్థావరంపై నేడు దాడి చేసి నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి నాలుగు వాహనాలు, మూడు సెల్‌ఫోన్లు మరియు రూ.10,940 నగదు స్వాధీనం చేసుకున్నారు.
పట్టుబడిన వ్యక్తులను మరియు స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం జక్రాన్‌పల్లి పోలీస్ స్టేషన్ SHO గారికి అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.
    user_Anantoji Kalidas
    Anantoji Kalidas
    నిజామాబాద్ నార్త్, నిజామాబాద్, తెలంగాణ•
    10 hrs ago
  • శనివారం కామారెడ్డి జిల్లా మదనూరు మండలంలోని సుల్తాన్‌పేట గ్రామాన్ని బలమైన గాలులు, వడగళ్ల వాన తాకాయి. దీంతో వరి, మొక్కజొన్న, జొన్న, ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో మండల రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నష్టాన్ని పరిష్కరిస్తుందా?
    1
    శనివారం కామారెడ్డి జిల్లా మదనూరు మండలంలోని సుల్తాన్‌పేట గ్రామాన్ని బలమైన గాలులు, వడగళ్ల వాన తాకాయి. దీంతో వరి, మొక్కజొన్న, జొన్న, ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో మండల రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నష్టాన్ని పరిష్కరిస్తుందా?
    user_Dantulwar Sopan D
    Dantulwar Sopan D
    మద్నూర్, కామారెడ్డి, తెలంగాణ•
    8 hrs ago
  • కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం వజ్జపల్లి గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి శనివారం సర్పంచ్ రాధాబాయి శ్యామ్ రావు శంకుస్థాపన చేశారు. గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేస్తామన్నారు. సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మీబాయి APM ప్రసాద్ సీసీ భూమయ్య, ఉప సర్పంచ్ నర్సింలు తదితరులు ఉన్నారు.
    1
    కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం వజ్జపల్లి గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి శనివారం సర్పంచ్ రాధాబాయి శ్యామ్ రావు శంకుస్థాపన చేశారు. గ్రామంలో మహిళా సమైక్య భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మాణ పనులు త్వరలో పూర్తి చేస్తామన్నారు. సమాఖ్య అధ్యక్షురాలు లక్ష్మీబాయి APM ప్రసాద్ సీసీ భూమయ్య, ఉప సర్పంచ్ నర్సింలు తదితరులు ఉన్నారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    15 hrs ago
  • Post by Tagore
    1
    Post by Tagore
    user_Tagore
    Tagore
    Newspaper publisher యాదగిరిగుట్ట, యాదాద్రి భువనగిరి, తెలంగాణ•
    15 hrs ago
  • మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాలకు మానవత్వం ఉన్న ప్రతిఒక్కరు సాయం చేయాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస రెడ్డి కోరారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల ట్రస్టు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మేథో వికలాంగుల ప్రత్యేక పాఠశాల(మానసిక వికలాంగుల పాఠశాల) 36వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలలో విద్యార్థుల తరగతి గదులు, ఫిజియో థెరఫీ, స్పీచ్ థెరఫీ కేంద్రాలను, వొకేషనల్ గదులను, తయారీ వస్తువులను ఆయన పరిశీలించి మానసిక విద్యార్థులతో మాట్లాడి అభినందించారు. జన్యులోపంతో పుట్టిన పిల్లలను మనిషిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న యాజమాన్యాన్ని, సిబ్బందిని ఆయన అభినందిస్తూ ఇలాంటి పాఠశాలకు ప్రతీ ఒక్కరు తమవంతు సాయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఏమీ తెలియని పిల్లలని సమాజం బాధ్యతగా ఆదుకుని మోదో జ్ణానం కల్పించాలని కోరారు. ఇలాంటి సంస్థలు దేవాలయాలని ఆయన అభివర్ణించారు. ఇలాంటి పాఠశాల అభివృద్ది కోసం మాజీ ఎమ్మెల్యే, ట్రస్టు చైర్మన్ చాడ వెంకటరెడ్డి ప్రతినిత్యం ఆలోచిస్తున్నారని కొనియాడారు. తప్పకుండా తనవంతు సహాకారం అందిస్తూనే, రాబోవు రోజుల్లో సీఎంను సందర్శించాలని కోరనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మానసిక వికలాంగులైన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అతిథులను ట్రస్టు సభ్యులు సన్మానించి, జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ సీఈ సుమతి, కరీనంగర్ ఆర్డీవో మహేశ్వర్, ట్రస్టు ఫౌండర్ బి.వెంకటయ్య, ఇండస్ట్రీస్ జీఎం సాలమన్ రాజు, ఎస్టీయు ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యక్షుడు సదానంద గౌడ్, ట్రస్టు మెంబర్ గాజుల భగవాన్, జాప వెంకటరమణారెడ్డి, అశోక్ ముఖర్జీ, సత్యనారాయణ, ప్రిన్సిపాల్ సతీష్, ఏవో బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
    1
    మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాలకు మానవత్వం ఉన్న ప్రతిఒక్కరు సాయం చేయాలని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస రెడ్డి కోరారు.
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలోని జిల్లా స్వాతంత్ర్య సమరయోధుల ట్రస్టు ఆధ్వర్యంలో కొనసాగుతున్న మేథో వికలాంగుల ప్రత్యేక పాఠశాల(మానసిక వికలాంగుల పాఠశాల) 36వ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పాఠశాలలో విద్యార్థుల తరగతి గదులు, ఫిజియో థెరఫీ, స్పీచ్ థెరఫీ కేంద్రాలను, వొకేషనల్ గదులను, తయారీ వస్తువులను ఆయన పరిశీలించి మానసిక విద్యార్థులతో మాట్లాడి అభినందించారు. జన్యులోపంతో పుట్టిన పిల్లలను మనిషిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న యాజమాన్యాన్ని, సిబ్బందిని ఆయన అభినందిస్తూ ఇలాంటి పాఠశాలకు ప్రతీ ఒక్కరు తమవంతు సాయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఏమీ తెలియని పిల్లలని సమాజం బాధ్యతగా ఆదుకుని మోదో జ్ణానం కల్పించాలని కోరారు. ఇలాంటి సంస్థలు దేవాలయాలని ఆయన అభివర్ణించారు. ఇలాంటి పాఠశాల అభివృద్ది కోసం మాజీ ఎమ్మెల్యే, ట్రస్టు చైర్మన్ చాడ వెంకటరెడ్డి ప్రతినిత్యం ఆలోచిస్తున్నారని కొనియాడారు. తప్పకుండా తనవంతు సహాకారం అందిస్తూనే, రాబోవు రోజుల్లో సీఎంను సందర్శించాలని కోరనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా మానసిక వికలాంగులైన విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అతిథులను ట్రస్టు సభ్యులు సన్మానించి, జ్ఞాపికలను అందించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ సీఈ సుమతి, కరీనంగర్ ఆర్డీవో మహేశ్వర్, ట్రస్టు ఫౌండర్ బి.వెంకటయ్య, ఇండస్ట్రీస్ జీఎం సాలమన్ రాజు, ఎస్టీయు ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యక్షుడు సదానంద గౌడ్, ట్రస్టు మెంబర్ గాజుల భగవాన్, జాప వెంకటరమణారెడ్డి, అశోక్ ముఖర్జీ, సత్యనారాయణ, ప్రిన్సిపాల్ సతీష్, ఏవో బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
    user_K.V.REDDY
    K.V.REDDY
    చిగురుమామిడి, కరీంనగర్, తెలంగాణ•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.